బిగుస్తున్న ఉచ్చు | Osmania test section officials Serious Giriraj PG College | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఉచ్చు

Published Tue, Jun 10 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

బిగుస్తున్న ఉచ్చు

బిగుస్తున్న ఉచ్చు

 నిజామాబాద్ అర్బన్ : గిరిరాజ్ పీజీ కళాశాల సప్లిమెంటరీ జవాబు పత్రాల మాయంపై ఉస్మానియా పరీక్ష విభాగం అధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. ఏకంగా 69 మంది విద్యార్థుల జవాబు పత్రాలను గల్లంతు కావడంపై కళాశాల అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేది పరిశీలిస్తున్నారు.

ఈనెల 6న జరిగిన పీజీ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, గణితం జవాబు పత్రాలు అదే రోజు రైల్వేస్టేషన్‌లో నుంచి రైల్‌లో ఉస్మానియా వర్శిటీకి తీసుకెళుతుండగా గల్లంతయ్యాయి. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ లింబాగౌడ్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులు గడుస్తున్న నేటికి జవాబు పత్రాల ఆచుకీ లభించ లేదు. ఈ జవాబు పత్రాల మాయంపై ప్రిన్సిపాల్ ఉస్మానియా యూనివర్శిటీ పరీక్షల విభాగం అధికారులకు సమాచారం అందించారు. వీరు ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు.

 కళాశాల అధికారులపై చర్యలు...
 జవాబు పత్రాల గల్లంతుపై అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఓయూ అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ మేరకు పరీక్ష విభాగం అధికారి భిక్షమయ్య ఈ సంఘటనపై పూర్తిస్థాయి సమాచారం సేకరించి, నిబంధనల ప్రకారం పీజీ కళాశాల అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఓయూ వీసీ వద్ద అనుమతి తీసుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్, కో-ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పీజీ సప్లిమెంటరీ పరీక్షలు ముగియడం, చివరి రోజు జవాబు పత్రాలు మాయమవడంపై వీరు సీరియస్‌గానే స్పందించారు.

మళ్లీ పరీక్షలు నిర్వహించడానికి కష్టతరం కావడంతో, వీరు జవాబు పత్రాలు దొరకకపోతే ఏమిచేయాలన్నదానిపై పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా జవాబు పత్రాలను రికార్డు అసిస్టెంట్‌తో పంపించడంపై వీరు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం పరీక్షల చీఫ్ సూపరిం డెంట్, కో-ఆర్డినేటర్ జవాబుపత్రాలను అందజేయా ల్సి ఉంటుంది. కాని గిరిరాజ్ కళాశాల అధికారులు 4వ తరగతి ఉద్యోగిని పంపిచారు. దీంతో నిబంధనలను అతిక్రమించి వ్యవహరించారని ఓయూ అధికారులు గుర్తించారు. కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని ఓయూ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా పీజీ కళాశాల నుంచి కొన్నేళ్లుగా జవాబు పత్రాలను ఎవరెవరు తీసుకువచ్చారు. నిబంధనలు పాటించారా అనే నిబంధనలు పరిశీలిస్తున్నారు.

విచారణ జరిపించాలి..
పీజీ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాలు గల్లంతుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, బాధ్యులైన చర్యలు తీసుకోవాలని బీఎస్‌ఎఫ్ , టీజీవీపీ ఒక ప్రకటనలో డిమాండ్ చే శాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే మేలు జరుగుతుందని  శ్రీకాంత్ , జైపాల్ డిమాండ్ చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.  

విద్యార్థులకు న్యాయం చేయాలి
పీజీ సప్లిమెంటరీ జవాబు పత్రాల గల్లంతుపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. దీనిపై బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుతో కళాశాల అధికారులు ఆటలాడుకుంటున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు అధికారులు వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.
 -పంచరెడ్డి చరణ్, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement