175 మంది సర్టిఫికెట్ల పరిశీలన
మెదక్ మున్సిపాలిటీ: ఎంసెట్ 2014 కౌన్సెలింగ్ గురువారం పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైంది. మొదటి రోజు ఎంసెట్ ఎంట్రెన్స్‌లో 1వ ర్యాంకు 25 వేల ర్యాంకు సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలించారు. జిల్లాలో మెదక్ తో పాటు ఈ సారి సిద్దిపేటలో కూడా కౌన్సెలింగ్ నిర్వహించడంతో విద్యార్థులు పెద్దగా హాజరు కాలేదు. మెదటి రోజు మొత్తం 86 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్ వెంకటరాంరెడ్డి తెలిపారు.
ఈ నెల 16న 25 వేల 1వ ర్యాంకు నుండి 50 వేల ర్యాంకు వరకు సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పా టు రెండు జతల జిరాక్స్ పత్రాలు తీసుకుని కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు. సిబ్బంది భవాని, కాశీనాథ్, సత్యనారాయణ, రమాదేవి, మహ్మాద్ భాన్, హమ్మద్ హుస్సేన్, టి. జయరాజ్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నంగునూరు: నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 89 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా అధికారులు సర్టిఫికెట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, ఎంసెట్ కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ సీహెచ్. నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. తమ కళాశాలలో మొట్టమొదటి సారిగా విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకొనేందుకు ఏర్పాటు చేశామన్నారు. మొదటి రోజు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించామన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని, 20 నుంచి 25 వరకు వరుసగా ఆరు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
ఈ నెల 26న ఒకటో ర్యాంక్ నుంచి లక్ష వరకు, 27న లక్షా ఒకటి నుంచి ర్యాంక్ ముగిసే వరకు విద్యార్థులు వెబ్ ద్వారా ఆప్షన్లు మార్చుకోవచ్చన్నారు. ఏ కళాశాలలో సీటు అలాట్‌మెంట్ అయిందో ఈ నెల 30న విద్యార్థులకు సెల్‌ఫోన్ ద్వారా తెలియజేస్తామన్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు తమ సెల్‌ఫోన్‌లను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు.
ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్
Published Fri, Aug 15 2014 12:18 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement