‘ఢీ’ఎస్సీ
* ‘టెర్ట్’కు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ ఉద్యోగార్థులు
* ప్రణాళికాబద్ధమైన సాధనతో విజయుం సాధ్యవుంటున్న నిపుణులు
* కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్న అభ్యర్థులు
చిత్తూరు(ఎడ్యుకేషన్): రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలోని వేలాదివుంది బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు తమ కల నెరవేర్చుకునేందుకు తుదిపోరుకు సన్నద్ధవువుతున్నారు. ఈసారి టెట్, డీఎస్సీ రెండు పరీక్షలను కలిపి టెర్ట్(టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) పేరిట సిలబస్‌ను సైతం సమ్మిళితం చేసి ఒకే పరీక్షను నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. 2012 డీఎస్సీ సిల బస్‌నే ఇవ్వడంతో హైస్కూల్‌స్థారుు వరకు పాత పాఠ్యపుస్తకాల కోసం అభ్యర్థులు శోధిస్తున్నారు.
జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 221 ఉండగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు 1,194 పోస్టులున్నారుు. లాంగ్వేజ్ పండిట్లు 182 ఉండగా, తొమ్మిది పీఈటీ పోస్టులు ఉన్నారుు. ఎస్‌జీటీ పోస్టులకు కేవలం డీఎడ్ అభ్యర్థులు వూత్రమే అర్హులుగా ప్రకటించడంతో బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే కుస్తీ పడుతున్నారు.
టెట్ రద్దు చేయుడంతో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన ప్రతి అభ్యర్థీ డీఎస్సీ (టెర్ట్) రాసే అవకాశం ఉంది. ఈసారి దరఖాస్తులు రికార్డుస్థాయిలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయు పోస్టులు ఉండడంతో ఇతర జిల్లాల అభ్యర్థులు సైతం నాన్‌లోకల్ కేటగిరీ కింద ఇక్కడ దరఖాస్తు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓపెన్ కేటగిరీలో 20 శాతం నాన్‌లోకల్ అభ్యర్థులు పోటీపడే వెసులుబాటు ఉండడంతో ముఖ్యంగా పోస్టులు తక్కువగా ఉన్న వైఎస్సార్, విజయునగరం, కృష్ణా, విజయునగరం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు తదితర జిల్లాలకు చెందిన అభ్యర్థులు వున జిల్లావారితో పోటీ పడనున్నారు.
తెలుగు అభ్యర్థులకు అన్యాయుం
తెలుగు బోధనలో ఏవూత్రం ఉపయోగంలేని సబ్జెక్టులకు అధిక వూర్కులు కేటారుుంచి తెలుగు సబ్జెక్టుకు తక్కువ వూర్కులు కేటారుుం చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. స్కూల్ అసిస్టెంట్లకు ఈసారి సిలబస్ కొద్దిగా క్లిష్టతరంగా ఇచ్చారు. పాఠ్యపుస్తకాల్లోని కవి కాలాదులతోపాటు విషయు అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగుభాష సాహిత్యచరిత్ర (వెలవుల తివ్మున్న) తెలుగుభాష సాహిత్య సమీక్ష (ద్వానాశాస్త్రి, నాగయ్యు), ప్రశ్నోత్తర కైముది(తెలుగు అకాడమీ) పుస్తకాలు అధికవూర్కులు సాధించేందుకు తోడ్పడతాయి. -యువశ్రీ మురళి,తెలుగు భాషా పండితులు, గోవర్థనపురం, వరదయ్యుపాళెం
భూగోళం, చరిత్రపై శ్రద్ధ చూపాలి
సోషల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు భూగోళ శాస్త్రం, చరి త్ర అంశాలపై ప్రధానంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భూగోళ శాస్త్రంలో వ్యూప్‌కు అనుసంధానంగా ప్రిపేర్ కావాలి. చరిత్ర విషయూనికొస్తే కాలానుగుణంగా రాజవంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ప్రతి ప్రశ్నకూ తార్కిక పద్ధతిలో ఆలోచించి సవూధానాలు గుర్తించాలి. - సురేష్‌బాబు,సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, శ్రీకాళహస్తి
ప్రతి మార్కూ కీలకం
ఉపాధ్యాయు ఉద్యోగానికి పోటీ తీవ్రతరమైం ది. పరీక్షలో ప్రతి వూర్కూ కీలకం కానుంది. దీంతో మిగిలి ఉన్న కాలాన్ని విభజించుకుని అవగాహనతో కూడిన ప్రిపరేషన్‌తో సత్ఫలితాలు సాధించవ చ్చు. అకాడమీ పుస్తకాలను చదవడం ద్వారా అధిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
- నల్లందుల గుణశేఖర్‌రెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రాక్టీస్ పేపర్లు సాధన చేయూలి
ఉపాధ్యాయు పరీక్ష డీఎస్సీకి పోటీ తీవ్రంగా ఉంటుంది. సివిల్స్ స్థారుులో ప్రిపేర్ కావాలి. తక్కువ కాల వ్యవధిలో అధిక ప్రశ్నలకు సవూధానాలు రాయూలి. వీలైనన్ని ఎక్కువ పేపర్లను సాధన చేయూలి. విషయూంశాలపై జ్ఞానంతోపాటు అవగాహన పెంపొందించుకోవాలి. గతంలో అడిగిన ప్రశ్నల సరళిని పరిశీలించాలి. ఇతర వ్యాపకాలను తగ్గించి ఏకాగ్రతతో సాధన చేస్తే విజేతలుగా నిలవచ్చు.
- కె.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు
పోటీ చూసి ఆందోళన వద్దు
డీఎస్సీకి పోటీ తీవ్రంగా ఉంటుంది. పోస్టును సాధించడం అనే లక్ష్యం తప్ప వునస్సులో వేరే ఆలోచనవద్దు. నాలుగు నెలల కాలవ్యవధి పరీక్షకు ఉండడంతో సవుయూన్ని ఏవూత్రం వృథా చేయుకుండా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకతను పాటిస్తాం. అనవసర విషయూలను వదిలిపెట్టి సిలబస్ ను అనుసరించి ప్రిపరేషన్ సాగాలి.
- శామూయల్, ఇన్‌చార్జి డీఈవో, చిత్తూరు