TS EDCET 2021: Notification, Exam Dates, Apply Online, Eligibility, Syllabus, Fee Details - Sakshi
Sakshi News home page

టీచర్‌ కొలువుకు మార్గం.. ఎడ్‌సెట్‌-2021 ముఖ్య సమాచారం

Published Mon, Apr 26 2021 11:40 AM | Last Updated on Mon, Apr 26 2021 4:55 PM

TS EDCET 2021 Notification Full Details Here - Sakshi

స్కూల్‌ టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించాలనుకునే యువతకు చక్కటి మార్గం.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ). ఇందులో ప్రవేశం కోసం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ ఎడ్‌సెట్‌–2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్‌ హాజరయ్యే ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. టీఎస్‌ ఎడ్‌సెట్‌–2021 నోటిఫికేషన్‌ వివరాలు, అర్హతలు,పరీక్ష విధానంపై ప్రత్యేక కథనం.. 

తెలంగాణ రాష్ట్రంలోని కళాశాలల్లో అందిస్తున్న రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష.. టీఎస్‌ ఎడ్‌సెట్‌–2021. ఎడ్‌సెట్‌కు గతేడాది సుమారు 31 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది రెట్టింపు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీ ర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఇంజనీరింగ్‌ అభ్యర్థులు సైతం బీఈడీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు.  

అర్హతలు

  • ఆన్‌లైన్‌లో జరిగే ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం కొన్ని అర్హతలను నిర్దేశించింది. జూలై1 నాటికి 19ఏళ్లు నిండి, ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ..బీఏ,బీకామ్,బీఎస్సీ, బీఎస్సీ–హోమ్‌సైన్స్,బీసీఏ,బీబీఏం,బీఏ–ఓరియంటల్‌ లాంగ్వేజెస్,బీబీఏ లేదా మాస్టర్‌ డిగ్రీలో కనీసం 50శాతం మార్కులు తప్పనిసరి. బీటెక్‌/బీఈలో 50 శాతం మార్కులు సాధించినవారు సైతం బీఈడీ కోర్సుల్లో చేరేందుకు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్‌ కేటగిరీ అభ్యర్థులైన ఎస్సీ/ఎస్టీ/ బీసీలతోపాటు ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు ఉన్న వారు 40శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. అర్హత కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు సైతం ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఎంబీబీఎస్‌/బీఎస్సీ(ఏజీ)/బీవీఎస్సీ/ బీహెచ్‌ఎంటీ/ బీఫార్మసీ/ఎల్‌ఎల్‌బీ వంటి కోర్సుల అభ్యర్థులు బీఈడీలో చేరేందుకు అర్హులు కాదు. 
  • గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సు చదవకుండా.. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు బీఈడీలో ప్రవేశం పొందేందుకు అనర్హులు. 

మెథడాలజీ–అర్హతలు
మ్యాథమెటిక్స్‌: బీఏ/బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఈ/బీటెక్‌/బీసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివినవారు అర్హులు.
ఫిజికల్‌ సైన్స్‌: బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి అనుబంధ సైన్స్‌ సబ్జెక్టులు చదివినవారు, ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఈ సబ్జెక్టులు చదివి ఇంజనీరింగ్‌/బీసీఏ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.  
బయోలాజికల్‌ సైన్స్‌: బీఎస్సీ/బీఎస్సీ హోమ్‌ సైన్స్‌/బీసీఏ చేసినవారు ఇంటర్మీడియట్‌ స్థాయిలో బోటనీ, జువాలజీ అనుబంధ సబ్జెక్టులు చదివినవారు అర్హులు. 
 సోషల్‌ సైన్సెస్‌: బీఏలో సోషల్‌ సైన్స్, బీకామ్‌/బీబీఎం/బీబీఏ/బీసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ స్థాయిలో సోషల్‌ సబ్జెక్టులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఇంగ్లిష్‌: బీఏ స్పెషల్‌ ఇంగ్లిష్‌/ఇంగ్లిష్‌ లిటరేచర్‌/ఎంఏ ఇంగ్లిష్‌ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌: బీఏ తెలుగు/హిందీ/ మరాఠి/ఉర్దూ/అరబిక్‌/సంస్కృతం సబ్జెక్టులు చదివినవారు, ఈ సబ్జెక్టులతో బీఏ లిటరేచర్‌ చేసినవారు అర్హులు. 

ఎడ్‌సెట్‌ సిలబస్‌

  • టీఎస్‌ ఎడ్‌సెట్‌–2021  పరీక్ష మొత్తం 150 మార్కులకు–150 ప్రశ్నలకు జరుగుతుంది. 
  • సబ్జెక్టు/కంటెంట్‌ 60 ప్రశ్నలు(మ్యాథ్స్‌–20, సైన్స్‌–20, సోషల్‌–20),టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలు, జనరల్‌ ఇంగ్లిష్‌ 20 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ఇష్యూస్‌ 30 ప్రశ్నలు, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఎంట్రన్స్‌ సిలబస్‌.. ఆయా సబ్జెక్టుల్లో తెలంగాణలో హైస్కూల్‌ స్థాయిలో పదోతరగతి వరకు ఉన్న సిలబస్‌ ఆధారంగా ఉంటుంది. దీంతోపాటు జనరల్‌ ఇంగ్లిష్, టీచింగ్‌ అప్టిట్యూడ్, మెథడాలజీపైనా ప్రశ్నలు అడుగుతారు. 

సబ్జెక్టులు–సిలబస్‌ అంశాలు
మ్యాథమెటిక్స్‌: నంబర్‌ సిస్టమ్, కమర్షియల్‌ మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా, జ్యామితి, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి.  
సైన్స్‌(ఫిజికల్‌/బయాలజీ): ఆహారం, జీవరా శులు, జీవ ప్రక్రియలు, జీవ వైవిధ్యం, కాలు ష్యం, పదార్థం, కాంతి, విద్యుత్‌ –అయస్కాంతత్వం, హీట్, ధ్వని, చలనం,  వాతావరణం, కోల్‌ అండ్‌ పెట్రోల్, స్టార్స్‌ అండ్‌ సోలార్‌ సిస్టం, మెటలర్జీ, రసాయన చర్యలు.
సోషల్‌ స్టడీస్‌: జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్‌ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌: ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు, టీచింగ్‌ లెర్నింగ్‌ ప్రాసెస్, క్లాస్‌ రూమ్‌ అర్థం చేసుకోవడానికి సంబంధించినవి. టీచర్‌–విద్యార్థి సంబంధానికి ప్రత్యేక రిఫరెన్స్, మేనేజ్‌మెంట్‌ అండ్‌ మెంటారింగ్‌.
జనరల్‌ ఇంగ్లిష్‌: రీడింగ్‌ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్‌ దోషాలు, పదజాలం, పదబంధం రీప్లేస్‌మెంట్, ఎర్రర్‌ డిటెక్షన్‌ అండ్‌ వర్డ్‌ అసోసియేషన్‌. 
జనరల్‌ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్‌ ఇష్యూస్‌: కరెంట్‌ అఫైర్స్‌(ఇండియా అండ్‌ ఇంటర్నే షనల్‌), వర్తమాన విద్యా సంబంధ అంశాలు. 
కంప్యూటర్‌ అవేర్‌నెస్‌: కంప్యూటర్‌–ఇంటర్నెట్, మెమొరీ, నెట్‌వర్కింగ్‌ అండ్‌ ఫండమెంటల్స్‌.

టీఎస్‌ ఎడ్‌సెట్‌ 2021 ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తులకు చివరి తేది: ఆలస్య రుసుం లేకుండా జూన్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుంతో జూన్‌ 25 వరకు, రూ.500 ఆలస్య రుసంతో జూలై 5 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో జూలై 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌:  ఆగస్టు 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎంట్రన్స్‌ టెస్ట్‌: 2021 ఆగస్టు 24, 25 తేదీల్లో టీఎస్‌ఎడ్‌సెట్‌ జరుగుతుంది. పరీక్ష ఇంగ్లిష్‌/తెలుగు, ఇంగ్లిష్‌/ఉర్దూ రెండు భాషల్లో ఉంటుంది. 
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.650, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ అభ్యర్థులకు రూ.450 చెల్లించాలి. 
వివరాలు, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం వెబ్‌సైట్‌: https://edcet.tsche.ac.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement