సాక్షి, అమరావతి: సమీకృత బీఈడీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ తర్వాత నాలుగేళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేయవచ్చు. సాధారణంగా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్ల బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలి. దీనికి మొత్తం ఐదేళ్లు పడుతుంది. కొత్త విధానం వల్ల నాలుగేళ్లలోనే పూర్తి చేసే వీలుంది.
జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్సును జాతీయ స్థాయిలో పలు కళాశాలల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దేశ వ్యాప్తంగా 178 పట్టణాల్లో 13 మాధ్యమాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం అర్ధరాత్రి ఎన్‌టీఏ విడుదల చేసింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రెండు వర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
ఎన్టీఏ 2023–24 విద్యా సంవత్సరానికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మొత్తం 150 సీట్లలో ప్రవేశాలు కలి్పంచనున్నారు. ఆధునిక విద్యా బోధనకు అనుగుణంగా సమీకృత బీఈడీ కోర్సును ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించింది. విద్యార్థి మానసిక ధోరణి, ఆన్‌లైన్, డిజిటల్ విద్యా బోధనతో పాటు సరికొత్త మెలకువలతో ఎలా బోధించాలన్న అంశానికి ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్యమిస్తారు. తరగతి గదిలో పాఠాల కన్నా, అనుభవం ద్వారా నేర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు.
ప్రవేశ పరీక్ష ఇలా : ఇంటర్ ఉత్తీర్ణులు ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పన్నెండో తరగతి, ఇంటర్ సిలబస్‌లోంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 160 బహుళ ఐచి్ఛక ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ అప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19.7.2023
- డేటా కరెక్షన్‌కు చివరి తేదీ 20.7.2023
- పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్ పరీక్షకు మూడు రోజుల ముందు
- దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్‌సైట్లు: www.nta.ac.in, https://neet. samarth.ac.in/
ఇది కూడా చదవండి: గ్రీన్ ఎనర్జీకి స్టార్ రేటింగ్
Comments
Please login to add a commentAdd a comment