నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల | dsc notification releases | Sakshi
Sakshi News home page

నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Published Thu, Nov 20 2014 9:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.  ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పాత పద్ధతిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో బీఈడీ అభ్యర్థులకు నిరాశ మాత్రం తప్పడం లేదు. ఈ తాజా నోటిఫికేషన్ తో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు కానున్నారు.

 

బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ రాత పరీక్షలకు అర్హత కల్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చినా.. ఇప్పడు మాత్రం పాత పద్ధతిలోనే నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమైంది. దీంతో ఐదు లక్షలకు పైగా బీఈడీ అభ్యర్థులు తీవ్రనిరాశకు లోనుకానున్నారు. వారికి ఎస్జీటీ పోస్టులకు అర్హత ఇదిలా ఉండగా టెట్ కు, డీఎస్సీకి ఒకేసారి రాతపరీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement