బతకాలని ఉంది
♦ బీఎడ్ పట్టభద్రురాలి ఆక్రందన
♦ రెండు కిడ్నీలు పాడై దాతల కోసం ఎదురుచూపు
ఒంగోలు సెంట్రల్: బీఎడ్ పూర్తి చేసింది. మంచి ఉపాధ్యాయురాలిగా జీవనం సాగించాలనుకుంది. తను ఒకటి తలిస్తే విధి ఇంకొకటి శాసించింది. రెండు కిడ్నీలు పాడైపోరుు చావుతో పోరాడుతూ దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చినా మార్పిడి కోసం రూ.10 లక్షలకు పైగా వైద్య ఖర్చులు అవుతాయని తెలియడంతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటోందామె. ఒంగోలుకు చెందిన పి.రాజ్యం (36)కు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈమె ఓ ప్రరుువేటు పాఠశాలలో ఉపాధ్యారుునిగా, భర్త ఓ లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
వీరికి ఓ కుమార్తె పుట్టింది. ఈ ఆనందం ఎంతో కాలం నిలువ లేదు. గత రెండు సంవత్సరాల క్రితం ప్రరుువేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తుండగానే విపరీతమైన నీరసంతో పడిపోగా ఆసుపత్రిలో చేర్చారు. అప్పట్లో ఉన్నత చికిత్స కోసం నెల్లూరు వెళ్లమని సూచించడంతో రెండు కిడ్నీలు పాడైపోయాయని నిర్ధారించారు. ఏమీ చేయలేని నిస్సహాయత. పైగా వెంటనే డయూలసిస్ చేయాలని సూచించడంతో ఆ చికిత్స చేరుుంచుకుంటూ ఇతర మందులు వాడుతోంది.
కోడలు బాధ చూడలేక తన అత్త కిడ్నీని దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇందుకు దాదాపు రూ.10 లక్షలకుపైగా ఖర్చవుతందని వైద్యులు చెప్పడంతో వీరి కష్టాలు మళ్లీ మొదటికి వచ్చారుు. కిడ్నీ మార్పిడికి అవసరమైన నగదును మానవతా దృక్పధంతో దాతలు సమకూర్చితేగానీ ఆరోగ్యం కుదుట పడదు. త్వరితగతిన ఈ శస్త్ర చికిత్స చేపట్టకపోతే మిగిలిన అవయవాలు పాడైపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్పందించే హృదయూలు 88975-51930 అనే నెంబరుకు ఫోన్ చేసి సాయం చేయాలని ఆ కుటుంబం అర్థిస్తోంది.