బీఈడీ కళాశాలలో వివాహిత ఆత్మహత్య | Suicide in BED College | Sakshi
Sakshi News home page

బీఈడీ కళాశాలలో వివాహిత ఆత్మహత్య

Jun 17 2017 11:06 PM | Updated on Nov 9 2018 4:36 PM

బీఈడీ కళాశాలలో వివాహిత ఆత్మహత్య - Sakshi

బీఈడీ కళాశాలలో వివాహిత ఆత్మహత్య

అమడగూరు మండలం కంచరవాండ్లపల్లికి చెందిన కిష్టప్ప భార్య జూటూరు కళావతి(26 పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లి సమీపంలోని విజ్ఙాన్‌ బీఈడీ కళాశాలలో శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ధనుంజయ తెలిపారు. పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ బీఈడీ కళాశాలలో చేరి స్వీపర్లుగా పని చేసుకుంటూ జీవనం సాగించేవారన్నారు.

పుట్టపర్తి అర్బన్‌ :

వారికి ఒక కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారన్నారు. అయితే కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న కళావతి జీవితంపై విరక్తితో ఫ్యాన్‌కు ఉరేసుకుని అఘాయిత్యానికి ఒడిగట్టిందని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement