
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాలేజీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఉపా ధ్యాయ, లెక్చరర్ల బది లీల్లో అనేక అవకతవ కలు జరిగాయని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మరో మారు ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బదిలీల్లో అవకతవకలను ఎత్తిచూపుతూ ముఖ్య మంత్రికి లేఖ రాస్తే, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తమ మీద దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు.
మిట్టల్ వేల కోట్ల అవినీతికి ఆద్యుడని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు అత నిపై ఎలాంటి చర్యల్లేవన్నారు. మిట్టల్ ఒక మిలీ నియం బ్రోకర్ అని ధ్వజమెత్తారు. మిట్టల్ అవి నీతిపరుడని, ఆయన తర్వాత వచ్చిన హైదరా బాద్ కలెక్టర్ గుల్జార్ చెప్పారని తెలిపారు. ఆన్ డ్యూటీలో పంపామని చెబుతున్న అంశంలో ఓపెన్ నోటిఫికేషన్ ఎందుకివ్వలేదని ప్రశ్నించా రు. వెబ్ కౌన్సెలింగ్‌లో ఇచ్చిన పోస్టింగులను తర్వాత ఎందుకు మార్చారని ప్రశ్నించారు.