Dasoju Sravan
-
సీఎం రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రావణ్ ఫైర్
-
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం..‘సుప్రీం’ తుది తీర్పు అప్పుడే!
సాక్షి,ఢిల్లీ: గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల వ్యవహారంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్‌పై సోమవారం(డిసెంబర్ 9) విచారణ జరిగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం కేసు విచారించింది.తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు కోర్టు వాయిదా వేసింది. ఆ రోజు తుది వాదనలు వినడంతో పాటు ఫైనల్ ఆర్డర్ ఉంటుందని తెలిపింది. దాసోజు శ్రవణ్ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఈ కేసులో స్టే ఇచ్చినప్పటికీ, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ముకుల్ రోహిత్గి తీసుకువచ్చారు.కాగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌ను నామినేట్ చేసినప్పటికీ అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్ చీఫ్ కోదండరాం సహా ఇతరులను పెద్దల సభకు పంపించింది.దీంతో శ్రవణ్ తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు. -
‘గత ప్రభుత్వంపై వ్యతిరేకతతో తిరస్కరణ’.. దాసోజు శ్రవణ్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాలని మాజీ గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తన రాజకీయ భవిష్యత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని లేఖలో దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌గా ఉన్న తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే. చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా -
ఎమ్మెల్యే దానంతో బీడీలు అమ్మిస్తావా
-
గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం: ఎమ్మెల్సీ కవిత
-
కాంగ్రెస్ పెద్దలకు బహిరంగ లేఖ
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికీ, సీడబ్ల్యూసీ సభ్యు లకూ –తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలని మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలను సైతం వదిలి, హైదరాబాద్ నగరంలో నిర్వ హించాలని నిర్ణయించడం, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న కీలక నాయకులు సైతం ఈ సమావేశాలకు రావడం హర్షణీయం. మీరు పొలిటికల్ టూరిస్టులుగాకాకుండా, తెలంగాణ అభివృద్ధిపై అధ్యయనం చేయ డానికి వస్తున్న పరిశోధకులుగా, ఈ పర్యటనను ఒక స్టడీ టూర్‌గా సద్వినియోగపరుచుకోవాలని కోరుతూ ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ముందుగా మీరు ‘విశ్వనగరం’ హైదరాబాద్‌లోకి అడుగుపెడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నివసిస్తున్న సబ్బండ వర్గాల ప్రజలకూ, పరిశ్ర మలకూ సకల వసతులూ కల్పిస్తూ, విభిన్న జీవన శైలు లకు నిలయమైన హైదరాబాద్ కున్న ‘గంగా జమునా తెహజీబ్’ ప్రత్యేక వారసత్వ సంస్కృతిని కేసీఆర్ ఎలా కాపాడుతున్నారో గమనించండి. మంత్రి కేటీఆర్ సార థ్యంలో ఐటీ రంగం విప్లవాత్మకమైన ప్రగతి సాధిస్తూ దూసుకుపోతున్న తీరు పరిశీలించండి. మీ పర్యటనలో తెలంగాణ కొత్త సచివాలయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125 అడుగుల అతి పెద్ద విగ్ర హాన్ని చూసి తరించండి. తెలంగాణ అమరవీరులస్మృత్యర్థం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ప్రపంచ స్థాయి అమరవీరుల స్మారకకేంద్రాన్ని సందర్శించండి.మీ పర్యటనలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ‘మిషన్ కాకతీయ’లో భాగంగా చెరువులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిందో చూడండి. మీరు ‘మిషన్ భగీరథ’ ఘనత తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 24 వేల పల్లెలకు, 121 నగర ప్రాంతాలలో ఉన్న ప్రతి ఇంటికీ పైపు లైనులు ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తూ, ప్రజల దాహార్తిని తీరుస్తోంది ప్రభుత్వం. దాదాపు 80 వేల కోట్ల రూపాయలతో కేవలం 3–4 ఏళ్లలో రికార్డ్ స్థాయిలో నిర్మించిన అతి పెద్ద బహుళ దశల ఎత్తి పోతల పథకం ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ను సందర్శించండి. అంతే కాదు ఒక పక్క మీరు రాజకీయాలు చేస్తుంటే మరోపక్క కేసీఆర్ ‘పాలమూరు– రంగారెడ్డి’ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించి– 13 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి బీళ్లు పడ్డ భూములను కృష్ణా నదీ జలాలతో తడుపుతున్న విషయాన్ని గుర్తించండి. ‘రైతుబంధు’, రైతులకు బీమా, పంటరుణాల రద్దు, ఇన్పుట్ సబ్సిడీ, ‘ఉచిత విద్యుత్’ సరఫరా వంటి పథకాలు రైతులను ఎలా ఆదుకొంటున్నాయో తెలుసు కోండి.బీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకులా లను ఏర్పాటు చేసింది. ఆ విద్యాలయాలకు వెళ్ళండి. వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సాగే బోధనను గమనించండి. ‘కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ’, తెలంగాణ ‘గిరిజన సంక్షేమ గురుకులాల’నూ దర్శించండి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో పాటు, కొత్త జూని యర్ కళాశాలల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పన లాంటి కార్యక్రమాలని ప్రభుత్వం ఎంత నిబద్ధతతో చేపడుతుందో గ్రహించండి. ‘మన ఊరు– మనబడి’, ‘మన బస్తీ–మన బడి’ పథకంలో నిర్మించిన స్కూల్స్ ని సందర్శించండి. ‘కేసీఆర్ కిట్’, ‘బస్తీ దవాఖానాలు’, ‘తెలంగాణ డయాగ్నోస్టిక్స్’, ‘ఆరోగ్యశ్రీ’ ఇలాంటి అద్భుతమైన పథకాల అమలూ; 34 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సాధించిన గణనీయమైన వృద్ధిని అధ్యయనం చేయండి. తండాలు, గూడేల్ని పంచాయతీలుగా మార్చా లని ఎన్నో ఏళ్లనుంచి కోరుకుంటున్న గిరిజనుల కలని కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చింది. అత్యంత ప్రతిష్ఠా త్మకంగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం దళితుల జీవితాలు ఎంత అద్భుతంగా మార్చిందో మీరు తెలుసుకోవాలి. వ్యవసాయం తరువాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధి ఇస్తున్న వృత్తి చేనేత. నేతన్నల జీవితాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుత మైన మార్పుని పరిశీలించండి. దేశంలో ఎక్కడాలేని విధంగా గొల్ల, కురుమలకు వేలకోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ‘సబ్సిడీ గొర్రెల పంపిణీ’ పథకం, అదే విధంగా కోట్లకొద్దీ చేప పిల్లలను పంపిణి చేసి మత్స్యకారుల ఆదాయానికి తోడ్పడ్డ విషయం తెలుసుకోండి. అలాగే మీ పర్యటనలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ‘డబుల్ బెడ్ రూమ్’ ఇళ్ళని సందర్శించండి. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తున్న ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలు తెచ్చిన కల్యాణ కాంతులు చూడండి. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల గాథ గురించి చెప్పలంటే ఇంకా చాల విషయాలు ఉన్నాయి. మీ సీడబ్లు్యసీ సమావేశాల్లో తెలంగాణలో పదేళ్ళలో జరిగిన అభివృద్ధి దేశంలో అరవై ఏళ్లలో ఎందుకు జరగలేదో లోతుగా చర్చించండి. ఒక విశాల దృక్పథంతో ఆలో చించి, తెలంగాణ అభివృద్ధి సంక్షే మాన్ని మీ రాష్ట్రాలలో అమలు చేసి మీ ప్రాంతాల్లో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించండి. ఇట్లు మీ శ్రవణ్ వ్యాసకర్త బీఆర్ఎస్ నాయకుడు -
ఉద్యమ బిడ్డలంతా కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వీరికి కుండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వామిగౌడ్ వీరిచిత పోరాటం చేశారని కేటీఆర్ కొనియాడారు. దాసోజ్ శ్రవణ్ సెల్ఫేమేడ్ లీడర్ అని ప్రశంసించారు. టీఆర్ఎస్లో చేరిన అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతిబిడ్డ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కీసీఆర్ పిలుపుతోనే ఉద్యమంలో కసితో పనిచేశామని తెలిపారు. ఉద్యమ సమయంలో ఉద్యోగ గర్జన ప్రారంభమైంది ఈ రోజే(అక్టోబర్ 21) అని గుర్తు చేశారు. అదే తేదీన మళ్లీ టీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసమే తాను గతంలో బీజేపీలో చేరానని స్వామిగౌడ్ పేర్కొన్నారు. సమస్యలపై కేంద్రంలో పెద్దలకు చాలాసార్లు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. కానీ తాను బీజేపీలో చేరిన ఆశయం నెరవేరలేదని, అందుకే తిరిగి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. 8 ఏళ్ల తర్వాత తిరిగి టీఆర్ఎస్ గూటికే రావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ చేయి పట్టుకుని తెలంగాణ ఉద్యమ గొంతుకగా పనిచేశానని పేర్కొన్నారు. దేశానికే తలమానికంగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. బీజేపీలో కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులకే ప్రాధాన్యం ఉందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు ఆ పార్టీలో స్థానం లేదని విమర్శించారు. చదవండి: బీజేపీకి మరో షాక్.. స్వామిగౌడ్ రాజీనామా.. టీఆర్ఎస్లో చేరిక -
టీఆర్ఎస్ లో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్
-
నా సొంత ఇంటి చేరుకున్నాను.. బీజేపీలో చేరికపై దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని 12 వేల పల్లెల్లో ఒక్కో పల్లెలో 8 నుంచి 12 వరకు బెల్ట్‌షాపులను ఏర్పాటు చేసి తాగుబోతుల తెలంగాణగా మార్చేసిందని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ బెల్టుషాపుల ద్వారా రాష్ట్రాన్ని అనారోగ్య తెలంగాణగా మార్చి, ప్రజల రక్తాన్ని జలగలా పీల్చి ఖజానా నింపుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఇక్కడ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, పార్టీ సీనియర్ నేతలు మురళీధర్‌రావు, కామర్సు బాలసుబ్రహ్మణ్యం, భిక్షమయ్య గౌడ్ సమక్షంలో శ్రవణ్‌కు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్ ఛుగ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశానని, చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్తోనూ తనకు అనుబంధం ఉన్నందున, ఇప్పుడు సొంతింటికి వచ్చినట్లుగా ఉందన్నారు. సుమారు 1,500 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో అవినీతిరహితం, జవాబుదారీతనం, ప్రజాహితం పాలన అనే లక్ష్యాలకు టీఆర్ఎస్ తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నాయకులు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు. చీకోటి ప్రవీణ్ వంటి వారిని భుజాలపై ఎత్తుకొని ఊరేగుతున్న టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అధికార మారి్పడి జరగాల్సిన అవసరం ఉందని, సీఎం కేసీఆర్ గద్దె దిగాల్సిన చారిత్రక అవసరం ఉందని భావిస్తున్నామని అన్నారు. రూ.35 వేల కోట్లతో పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ. 1.50 లక్ష కోట్లకు పెంచి కాళేశ్వరం ప్రాజెక్టును కమీషనేశ్వర ప్రాజెక్టుగా మార్చారని ధ్వజమెత్తారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీని మారడంపై భట్టి విక్రమార్క ఆసక్తకర వ్యాఖ్యలు -
బీజేపీలో చేరిన దాసోజు శ్రావణ్
-
బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కమలం గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శ్రవణ్‌కు కషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కాగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు శ్రవణ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శనివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ తరుణ్ ఛుగ్‌తో ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వెదిరె శ్రీరాంలతో కలిసి దాసోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. -
ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది.. బీజేపీలోకి చేరికలపై తరుణ్ ఛుగ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నేడు బీజేపీ కండువా కప్పుకోనున్నారు. శనివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ తరుణ్ ఛుగ్‌తో ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వెదిరె శ్రీరాంలతో కలిసి దాసోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లాడారు. ‘బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేస్తాం. చేరికల విషయంలో చాలా పెద్ద జాబితా రెడీగా ఉంది. ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది. పార్టీలో ఎవరినైనా చేర్చుకుంటే పార్టీ అభివృద్ధి కోసమే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం నుంచి విముక్తి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్కు బీ టీంగా మారింది. భయపెట్టడం, ప్రలోభపెట్టడం అనేది కేసీఆర్ ఫార్ములా. ఇక బీజేపీని ఎవరూ ఆపలేరు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో బీజేపీ ఉనికిని చాటుకుంటోంది. ఇంటెలిజెన్స్ సర్వేలు సైతం టీఆర్ఎస్ వెనకబడిపోయిందని కేసీఆర్‌కు తెలియచేశాయి’అని అన్నారు. డబ్బులిచ్చే సంస్కృతి మాది కాదు.. ‘కాంట్రాక్టులు, డబ్బులిచ్చి పార్టీలో చేర్చుకొనే సంస్కృతి బీజేపీలో లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచి కాంట్రాక్టరే. కాంట్రాక్టులు, డబ్బులు ఇవ్వడం అనేది కాంగ్రెస్, టీఆర్ఎస్ సంస్కృతి. సోనియా, రాహుల్‌ను బండ బూతులు తిట్టినవాళ్లే కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయ్యారు. తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యులైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌లాంటి నాయకులు కాంగ్రెస్‌లో ఎందుకు ఇమడలేకపోతున్నారో మొదట ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే కానీ భాష హద్దుమీరితే ప్రజలు క్షమించరు. అనుకోకుండా మాట్లాడితే సరిదిద్దుకోవచ్చు.. కానీ కావాలని మాట్లాడితే మాత్రం తప్పు. కేసీఆర్ కుటుంబ పరిస్థితి చెల్లని రూపాయిలా మారిపోయింది’అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చదవండి: కేంద్ర సంస్థల నుంచి మీ కంపెనీలకు పనులు వచ్చాయా, లేదా? మీ నాటకం ప్రజలకు తెలిసిపోయింది -
పార్టీలో చేరికలపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అందరి చూపు బీజేపీ వైపే ఉందని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వంటి నాయకులూ కాషాయకండువా కప్పుకోనున్నట్లు చెప్పా రు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ, పార్టీలోకి వచ్చే వారందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. 21వ తేదీ నాటికి పలువురు రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వ్యాపారులతో పాటు ఇతర పార్టీల నాయకులు 10 నుంచి 15 మంది తమ పార్టీలో చేరనున్నారని వెల్లడించారు. హాస్టళ్లలో కనీస వసతులు లేవు.. బాసర ట్రిపుల్ఐటీ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారంతో పాటు కనీస వసతులు కల్పించడం లేదని ఈటల విమర్శించారు. ‘సీఎం మనుమడు ఏం తింటున్నారో అదే బువ్వ పెడుతున్నాం అనే మాటలు నిజమే అయితే .. నాలుగు రోజుల పాటు మీ మనుమడిని సంక్షేమ హాస్టల్‌కి పంపు.. అప్పుడు వారి బాధ మీకు తెలుస్తుంది’ అని అన్నారు. ఈ సమా వేశంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మునుగోడుపై ఫోకస్.. రివర్స్ గేర్‌లో ‘కారు’ రూట్ మార్చిన కేసీఆర్! -
టార్గెట్ రేవంత్.. మరోసారి తెరపైకి మాజీ ఎంపీ కుమారుడి టాపిక్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కల్లోలం రేపుతున్నాయి. దాదాపు ఏడాది నుంచి వివాదాలు, అలకలు, బుజ్జగింపులు, వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌లో.. ఎన్నికలు సమీపిస్తున్నా లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదంటూ పార్టీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూనే.. రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఉన్న నేతల నుంచీ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. మొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇప్పుడు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లు రేవంత్ టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రాణం పోయినా సరే కాంగ్రెస్‌లోనే ఉంటానంటూనే రేవంత్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచీ రేవంత్ వ్యవహరిస్తున్న తీరే దీనికి కారణమని అసంతృప్త నేతలు చెప్తున్నారు. వీరే కాకుండా ఇంకా ఎవరెవరు తెరపైకి వస్తారోనన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తీవ్ర ఆరోపణలతో.. రాజగోపాల్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ ఇద్దరూ కాంగ్రెస్‌ను వీడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పార్టీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని, రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బాగుపడదని శ్రవణ్ విమర్శించారు. ఏఐసీసీ నుంచి ఓ ఫ్రాంచైజీ తీసుకున్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి కూడా ఇంతకుముందే తీవ్ర ఆరోపణలు చేశారు. చేయకూడని పనులు చేసే రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తాను పనిచేయలేనని, జైలుకు వెళ్లొచ్చినవారి నేతృత్వంలో ఆత్మగౌరవాన్ని చంపుకొని కొనసాగలేనని వ్యాఖ్యానించారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితం అవుతుందని విమర్శించారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ తీరును తప్పుపట్టారు. తనతో సహా పాత కాంగ్రెస్ నాయకులను వెళ్లగొట్టేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని, అంతా వెళ్లిపోతే టీడీపీ వాళ్లను తెచ్చుకుని టికెట్లు ఇచ్చుకోవాలనేది రేవంత్ ఆలోచన అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే.. రేవంత్‌రెడ్డి గత ఏడాది జూలైలో టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. చాలా విషయాల్లో రేవంత్ ఏకపక్షంగా వెళుతుండటం వల్లే ఒక్కొక్కరుగా పార్టీ నేతలు బయటికి వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. టీపీసీసీ కార్యవర్గంలో నియమితులైన పలువురు సీనియర్లతో రేవంత్‌రెడ్డికి పొసగడం లేదనే విమర్శలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతల మధ్య సమన్వయం కుదరక.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చాలా కాలం క్రితమే రేవంత్‌తో విభేదించారు. ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌పై మహేశ్వర్‌రెడ్డి మాటల దాడి చేస్తూనే ఉన్నారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్లోనూ రేవంత్‌కు అభిప్రాయ భేదాలు ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడి తర్వాత కీలక హోదాలో ఉన్న తనను రేవంత్‌రెడ్డి కావాలనే పక్కన పెడుతున్నారన్న అభిప్రాయంతో మధుయాష్కీ ఉన్నారని పేర్కొంటున్నాయి. నిజామాబాద్ జిల్లా పార్టీ విషయంలో రేవంత్‌తో ఆయనకు సఖ్యత కుదరక అంటీ ముట్టనట్టే ఉంటున్నారు. కీలక నేతలు కూడా దూరం దూరంగా.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న నలుగురు నేతలు కూడా రేవంత్ వైఖరి పట్ల మనస్తాపం చెందిన సందర్భాలు ఉన్నాయి. టి.జగ్గారెడ్డి (సంగారెడ్డి), మహేశ్‌కుమార్‌గౌడ్ (నిజామాబాద్), అంజన్‌కుమార్ యాదవ్ (హైదరాబాద్), గీతారెడ్డి (మెదక్)లు పలు సందర్భాల్లో రేవంత్ వైఖరితో విభేదించిన ఘటనలు ఉన్నాయి. జగ్గారెడ్డి మొదటి నుంచీ బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మిగతా నాయకులు గుంభనంగా ఉంటున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలోని ఏకైక ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కూడా రేవంత్ ఇప్పటికీ సఖ్యత కుదుర్చుకోలేకపోయారని.. ఉత్తమ్, భట్టి, వీహెచ్ లాంటి సీనియర్లను కలుపుకొని పోయే అంశాన్నీ రేవంత్ పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. చేరికలు.. క్రమశిక్షణల విషయంలో.. కాంగ్రెస్‌లో కీలకమైన రెండు కమిటీల విషయంలో రేవంత్ ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఒకట్రెండు చేరికల ప్రతిపాదనలు వివాదానికి కారణమయ్యాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్, పాలమూరు జిల్లా జడ్చర్లకు చెందిన నేత ఎర్రశేఖర్ తదితరులు కాంగ్రెస్‌లో చేరే విషయంలో ఆయా జిల్లాల నాయకత్వాలు రేవంత్‌తో విభేదించాయి. తర్వాతా పలుచోట్ల ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లోకి ఎవరిని చేర్చుకోవాలనే అంశంలో సీనియర్లతో కమిటీ వేయాలని నిర్ణయించారు. తొలుత పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించాలనే ప్రతిపాదన చేసినా.. తర్వాత రేవంత్ చక్రం తిప్పి జానారెడ్డి పేరు ప్రకటించేలా చేశారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరిగింది. ఆ తర్వాత జానారెడ్డికి కూడా చెప్పకుండానే చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారనే విమర్శలున్నాయి. పార్టీలో ధిక్కార స్వరాలను నియంత్రించాలనే లక్ష్యంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా తన జిల్లాకు చెందిన నాయకుడు చిన్నారెడ్డిని రేవంత్ నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ శిబిరం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తేనే చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు ఇస్తారనే విమర్శలూ ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రేవంత్ విషయంగా అసంతృప్తులు పెరిగిపోతున్నారు. పార్టీ టికెట్ల ప్రకటన, పార్టీ పదవులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామకాల్లో జరుగుతున్న కసరత్తు, పార్టీ ప్రధాన కార్యదర్శుల నియామకంలో తాత్సారం, పార్టీ కమిటీల నియామకంలో ప్రాధాన్యత వంటి అంశాల్లో రేవంత్‌రెడ్డిపై చాలా మంది సీనియర్లు కినుకగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముందు అయినా ఇవన్నీ సర్దుకుంటాయా, మరింత ముదిరి పార్టీ పుట్టి మునుగుతుందా అంటూ గాంధీభవన్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: నయవంచకుడు రాజగోపాల్‌రెడ్డి.. నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి -
రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీలో అరాచకం పెరిగింది: దాసోజు శ్రవణ్
-
డబ్బు పంపకాల్లో గొడవతోనే ఉపఎన్నిక!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక పార్టీల పంచాయతీ కాదని.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవతోనే ఆ ఎన్నిక జరిగిందని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ వ్యాఖ్యానించారు. సీఎం సీటు, డబ్బు పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగానే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశం అనంతరం మధుయాష్కీగౌడ్, దాసోజు శ్రవణ్, మహేశ్‌కుమార్‌గౌడ్, మల్లు రవితో కలసి షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ పరాజయంపై పీఏసీ సమావేశంలో చర్చించామని చెప్పారు. ఓట్లెందుకు తగ్గాయి? అభ్యర్థి ఎంపికలో జాప్యం ఎందుకు జరిగిందనే అంశాలపై చర్చించామని.. ఓటమిపై సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇక నవంబర్ 14 నుంచి 21 వరకు నిర్వహించనున్న జనజాగరణ యాత్రలో ప్రతి జిల్లాలోని నాయకత్వం స్థానికంగా పాల్గొంటుందని.. రోజుకు 7 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదు, జనజాగరణ యాత్ర నిర్వహణ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో–ఆర్డినేటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి ఈ నెల 9, 10 తేదీల్లో మండల, జిల్లా, డివిజన్ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. బీజేపీతో అంటకాగేది ప్రాంతీయ పార్టీలే.. హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయన్న టీఆర్ఎస్ ఆరోపణలు సరికాదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ స్పష్టం చేశారు. గాడ్సేవాదంతో నడిచే బీజేపీతో గాంధేయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎప్పటికీ కలవదన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే.. ప్రాంతీయ పార్టీలే బీజేపీ, అమిత్‌షా, మోదీలతో అంటకాగుతున్నాయని, టీఆర్ఎస్ కూడా బీజేపీకి మడుగులొత్తుతోందని విమర్శించారు. తెలంగాణను ఎటు తీసుకెళ్తున్నారు? పేదోళ్ల రక్తతర్పణంతో వచ్చిన తెలంగాణను రాజకీయ వ్యాపార ప్రయోగశాలగా మార్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం పేరుతో బీజేపీ అభ్యర్థి రాజేం దర్ రూ.500 కోట్లు, అహంకారంతో టీఆర్ఎస్ నేతలు రూ.5,500 కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. డబ్బుల కోసం ఓటర్లు ధర్నాలు చేసే పరిస్థితిని సృష్టించాయని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీలుక్షుద్ర రాజకీయాలతో తెలంగాణను ఎటు తీసుకెళుతున్నాయో మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అర్థం చేసుకోవాలన్నారు. -
ఇది ‘ఆత్మగౌరవ’ జంగ్ సైరన్
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసంతో లక్షలాది విద్యా ర్థులు లాఠీలకు, తూటాలకు, భాష్ప వాయువులకు ఎదురొడ్డి, ఆఖరికి తమ జీవితాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కున్నారు. కానీ జీవితాలు బాగు పడతాయని కలలుగన్న విద్యార్థి నిరుద్యోగులకు, వారిని కన్న తల్లి దండ్రులకు ఈనాడు నిరాశే మిగిలింది. ఉద్యమకాలంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని నమ్మబలికిన కేసీఆర్, తెలం గాణ వచ్చినంక ఉద్యమ లక్ష్యాలను మరచి, విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాలపై నిర్దిష్టమైన పాలసీలు లేకుండా పాలిస్తు న్నారు. ‘అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏడున్నాయి? జనా భాలో రెండు శాతం కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమం’టూ నాలుగు కోట్ల సబ్బండవర్గాల సమున్నత పోరాటాన్ని, ఆశలను, ఆకాంక్షల్ని అపహాస్యం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ లక్ష్యం దారితప్పింది. లక్షలమంది విద్యార్థ్ధి, నిరుద్యోగుల బతు కులు నాశనం అయినాయి. అటు తల్లిదండ్రులకు మొఖం చూపించుకోలేక, ఉద్యోగ వయోపరిమితి పెరుగుతూ పెళ్లిళ్లు చేసు కోలేక, నిరాశానిస్పృహలకు లోనై తెలంగాణ నిరుద్యోగ యువత ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. ఉద్యోగం రాకపోవడంతో ఆత్మబలిదానం చేసుకొన్న కాక తీయ యూని వర్సిటీకి చెందిన సునీల్ నాయక్ మరణ వాంగ్మూలం వింటే కన్నీళ్లు ఆగవు... ‘నా చావుతోనైనా మన ఉద్యోగాలు మనకు రావాలి’ అంటూ నినదించిన ఆ గొంతు ఇంకా సజీవంగా మన గుండెల్లో మోగుతూనే ఉంది.. ఉద్యోగుల పీఆర్సీ కోసం వేసిన కమిటీ రాష్ట్ర ప్రభు త్వంలో ఉద్యోగ ఖాళీలు లక్షా 91 వేలు అని తేల్చింది. కానీ ప్రభుత్వం మాత్రం 56 వేల ఖాళీలే అని చెప్పి నిరుద్యోగు లను దగాచేస్తోంది. ఏడేళ్ళలో మొత్తం 85 వేల ఉద్యోగాలే భర్తీ చేసి లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీచేసినామని పచ్చి అబద్ధాలాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తా యని నమ్మి 2009 నుండి 2014 వరకు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వయోపరిమితి దాటిపోయి అన్నిరకాలుగా నష్టపోయారు. గత ఏడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 12 విశ్వ విద్యాలయాల్లో 2,500 పైచిలుకు బోధనా సిబ్బందిని, 12 వేల పైచిలుకు బోధనేతర సిబ్బందిని భర్తీ చేయకుండా విద్యార్థి ఉద్యమాలపై అనేక ఆంక్షలు పెట్టి పోలీసు అడ్డాలుగా మార్చారు. అంతేగాక రాష్ట్రంలో 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ విశ్వవిద్యా లయాలను నీరుగార్చేందుకు అనేక కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునే 4,500 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసి, వేలకొద్దీ టీచర్ల ఖాళీలను భర్తీచేయకుండా ప్రభుత్వ విద్యని సర్వనాశనం చేశారు. పదిజిల్లాలు ఉన్న పాత తెలంగాణ రాష్ట్రంలో 2014 నాటికే విభజన చట్టం ప్రకారం బడ్జెట్ శాంక్షన్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షల 70 వేల ఉద్యోగాలు ఉంటే, 33 జిల్లాల ప్రస్తుత కొత్త తెలంగాణలో ఎన్ని కొత్త ఉద్యో గాలు కల్పించాలి? 23 కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివి జన్లు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త కార్పొరేషన్లు ఏర్పర్చిన ప్రభుత్వం, కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా, ప్రభుత్వ ఉద్యోగులపై మరింత పనిభారం మోపుతోంది. స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ టీచర్ ఉద్యోగాలు సుమారు 25 వేలపైన ఖాళీలు భర్తీ చేయకుండా, ఈ ఏడేళ్ళలో కేవలం 2 సార్లు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ నిర్వహించి 5 లక్షలమంది పైచిలుకు నిరుద్యోగుల జీవితాలను సర్వనాశనం చేసింది. వైద్య ఆరోగ్యశాఖలో వివిధ అత్యవసర సర్వీసుకు చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు సుమారు 35 వేల ఖాళీలున్నాయి. కోవిడ్–19 తీవ్రంగా ఉన్న సందర్భంలో ఏకంగా 50 వేల ఉద్యోగాలు వైద్యశాఖలో వెంటనే భర్తీ చేస్తానని కేసీఆర్ చేసిన వాగ్దానం ఇంకా అమలుకాలేదు. న్యాయశాఖలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూనియర్ సివిల్ ఇతర న్యాయసిబ్బంది ఖాళీలు వేలల్లో ఉన్నాయి. పోలీసుశాఖలోనూ వేలాది పోస్టులు ఖాళీలు న్నాయి. ప్రభుత్వంలో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తజిల్లాల నేపథ్యంలో మరో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించి, మొత్తం 5 లక్షలమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగులను ఆదుకోవచ్చు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేయకుండా, మరోవైపు చాలా ఏళ్లుగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని 21,200 మంది సర్వశిక్షా అభియాన్; 16,400 విద్యా వలంటీర్లు; 7,651 మహాత్మాగాంధీ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్, 2,000 పంచాయతీ కార్యదర్శులు; 709 మిషన్ భగీరథ; 315 హార్టికల్చర్ డిపార్ట్మెంట్, 2,640 సోషల్ వెల్ఫేర్, ఆర్టీసీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 1,640 నర్సులు మొత్తంమీద దాదాపు 55 వేల మందిని ఉద్యోగా ల్లోంచి తీసివేసి, వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసి, భవిష్యత్తును నాశనం చేశారు. ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని జబ్బలు చరుచుకుంటున్నారు కేటీఆర్. కానీ పొరుగు రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్ మాదిరిగా స్థానికులకు రిజర్వేషన్లు కల్పించకపోవడం వలన, ప్రైవేట్ ఉద్యోగాలలో, ముఖ్యంగా ఐటీ రంగంలో తెలంగాణ స్థానిక విద్యార్థి నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. 2018 వరకు టీఎస్పీఎస్సీలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు దాదాపు 26 లక్షలమంది ఉన్నారు. ఈ రెండేళ్ల కాలంలో దాదాపు మరో 4 లక్షలమంది ఈ జాబితాలో చేరి ఉంటారని అంచనా. అయినా సరే కేసీఆర్‌కు నిరుద్యోగ సమస్యను పరిష్కరిం చాలనే సోయి లేకపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళుతెరిచి నిరుద్యోగు లను నిండా ముంచకుండా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. తెలం గాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల క్యాలెండర్‌ను రూపొందించి క్యాలెండర్లో పేర్కొన్న విధంగా ప్రతి సంవ త్సరం ఖాళీలు భర్తీచేయాలి. విద్యార్థి నిరుద్యోగుల హక్కుల సాధన కోసం, రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులను కూడగట్టుకొని మన విద్య కోసం, మన ఉద్యోగాల కోసం, మన స్వయం ఉపాధి కోసం, అన్నింటికీ మించి మన ఆత్మగౌరవం కోసం జంగ్ సైరన్ మోగిద్దాం. డా.శ్రవణ్ దాసోజు వ్యాసకర్త జాతీయ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ మొబైల్: 98850 39384 -
కేసీఆర్ కుటుంబ పాలనను విడిచిపెట్టే ప్రసక్తే లేదు: ఎంపీ అర్వింద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కంటే కూడా సిక్కిం ఎక్కువ అభివృద్ధిని సాధించిందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. చిన్న రాష్ట్రమైనా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోందంటూ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము సాధిస్తున్న పురోగతితో దేశాన్ని నడుపుతున్నామని, ఎన్నో అంశాల్లో ఆదర్శంగా నిలుస్తామని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు.. ఆదాయం కోసం ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీవెళ్లిన సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వంలోని ముఖ్యశాఖల మంత్రులు, తమ పార్టీ పెద్దలను కలిసి వచ్చినా.. టీఆర్ఎస్ను, కేసీఆర్ కుటుంబ పాలనను బీజేపీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. బీజేపీతో టీఆర్ఎస్కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు బాగా ఉంటే పదేపదే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చదవండి: ‘కోదండరాం బట్టలు చినిగిపోయేలా దాడి చేయడం దారుణం’ కోల్‌కతా కోర్టు తీర్పుతోనైనా స్పీకర్ కళ్లు తెరవాలి: దాసోజు సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పీకర్ వ్యవస్థకే చెంపపెట్టని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్ పేర్కొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరచి ఫిరాయింపు నిరోధక చట్టానికి వ్యతిరేకంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని చెప్పారు. ఈ మేరకు మంగళవారం శ్రావణ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. టీఎంసీ ఎమ్మెల్యే ముకుల్‌రాయ్ అనర్హత పిటిషన్‌పై అక్టోబర్ 7లోగా నిర్ణయం తీసుకోవాలని పశి్చమబెంగాల్ స్పీకర్‌కు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలిచ్చిందని ఆయన వివరించారు. ఆ తీర్పును గౌరవించి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. -
టీఆర్ఎస్ మంత్రులు కబ్జాకోరులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ మంత్రులు, నేతలు రాష్ట్రంలో కబ్జాకోరులుగా తయారయ్యారని, కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మింగేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌తో కలిసి ఆదివారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డి అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలను విడుదల చేశారు. గుండ్లపోచంపల్లి, జవహర్‌నగర్ భూములకు సంబంధించిన పత్రాలు, మల్లారెడ్డి కళాశాల గురించి న్యాక్ ఇచ్చిన నివేదికను మీడియాకు అందజేశారు. మల్లారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధారాలతో సహా ఆరోపణలు చేసినా సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. -
మీ రక్తం మాకొద్దు.. సీఎం కుర్చీ కావాలి
సాక్షి, హైదరాబాద్: దళితులకు సీఎం కేసీఆర్ రక్తం అవసరం లేదని, ఆయన కూర్చున్న సీఎం కుర్చీ కావాలని, ఆ కుర్చీ ఇస్తే తమను తామే అభివృద్ధి చేసుకుంటామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానిం చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు వారు రాసిన బహిరంగలేఖను శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. రాహుల్‌గాంధీకి టీఆర్ఎస్ నేతలు లేఖ రాయడం ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అన్నట్టే ఉందని ఆ లేఖలో తెలిపారు. ఏడేళ్లుగా దళితులకు టీఆర్ఎస్ చేసిన మోసంపై, ఆ పార్టీ నేతలు వాడిన భాషపై రాహుల్ గాంధీ సమక్షంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద ఈ ఏడేళ్లలో రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా, వాటిని ఖర్చు పెట్టకుండా దళితులకు ద్రోహం చేశారని, కేసీఆర్‌కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే ఏకకాలంలో వారి అభివృద్ధి కోసం రూ.65 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం రూ.10 వేల కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులను అక్కడి వ్యక్తులకే కట్టబెట్టి మిగిలిన నియోజకవర్గాల నాయకులను మోసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి రుణాల కోసం 9 లక్షల మంది దళితులు దరఖాస్తు చేసుకుంటే కేవలం లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, మిగిలిన వారికి రక్తం ధారబోయాల్సిన పనిలేదని, లోన్లు ఇస్తే చాలని ఎద్దేవా చేశారు. -
‘తెలంగాణ తాలిబన్’గా మారిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాలిబన్‌గా మారారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణను బిహార్‌గా మారుస్తున్నారని, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. దళితబంధు పేరుతో రాజకీయ డ్రామా మొదలుపెట్టారన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో దాసోజు విలేకరులతో మాట్లాడారు. ఏడేళ్లు దళితులను పట్టించుకోని సీఎం.. ఇప్పుడు రసమయి మొదలుకుని దళిత నేతలను, నాయకులను కౌగిలించుకుంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్‌లోని శాలపల్లిలో ప్రభుత్వ సభలో కౌశిక్‌రెడ్డి, గెల్లు శ్రీనివాసు ఏ అధికారంతో కూర్చున్నారని ద్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చిల్లరగా వ్యవహరించారని, ప్రభుత్వ సభలో తెరాస నాయకులు కూర్చుంటే అతనికి సోయి లేదా? అని దుయ్యబట్టారు. సోమేశ్‌కుమార్ బాధ్యత మరిచి ఓ వ్యక్తికి బానిసలా పనిచేస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన దండోరా సభను విజయవంతం చేయాలని కోరారు. -
ఏం మాకు కత్తులు దొరకవా.. మేం నాలుకలు కోయలేమా?
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధులుగా ఉన్న టీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు కత్తులు పట్టుకు తిరుగుతున్నట్లు అనిపిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యా ఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగడం సరైంది కాదన్నారు. నాలుకలు కోస్తామని టీఆర్ఎస్ నేతలు అంటు న్నారని, మాకు కత్తులు దొరకవా.. మేం నాలుకలు కోయలేమా? అని శ్రవణ్ ప్రశ్నించారు. -
‘మంత్రులు తలసాని, గంగులకు గుట్కా ఎక్కడి నుంచి వచ్చింది’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలు తింటున్న రాష్ట్ర మంత్రులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. నిర్లజ్జగా చట్టాన్ని ఉల్లంఘించి గుట్కా తింటున్న బ్యాచ్‌తో బంగారు తెలంగాణ సాధిస్తారా అని ఆయన ప్రశ్నించారు. గుట్కా తింటూ అడ్డంగా దొరికి పోయిన మంత్రులను తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకాని తీరుతో ఇప్పటికే హైదరాబాద్ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో సొగాకు, గుట్కాను నిషేధించారని, మరి అవి మంత్రులకు ఎలా దొరికాయో తెలియజేయాలని ధ్వజమెత్తారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ వెంటనే గుట్కా తిన్న మంత్రులపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎవరూ చూడకుండా రహస్యంగా చేతుల్లో ఏదో పదార్థాన్ని పంచుకుంటూ చాటుగా తినడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అది గుట్కా అని సోషల్ మీడియలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రులు గుట్కా తింటున్నారని ఆ వీడియోను దాసోజు శ్రవణ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణలో పొగాకు, గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా. మరి ఈ మంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు?బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా?’ అంటూ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. -
మంత్రి తలసానిపై దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తలసాని ఓ ఆకురౌడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పదో తరగతి ఫెయిల్ అయ్యి గల్లీల్లో తిరిగే ఆకు రౌడీ తలసాని. కేటీఆర్! నీకు చర్చకు వచ్చే దమ్ము లేదు కానీ, నీ ఆలుగడ్డల శ్రీనివాస్‌తో నన్ను తిట్టిస్తావా..?. ఉద్యోగాలు అడిగితే మేము గొట్టం గాళ్లం అయ్యామా..?. ఈ గొట్టం గాని కోసమే కేటీఆర్ నా ఇంటికి మూడు సార్లు వచ్చాడు.. టీఆర్ఎస్లో చేరు అని. తలసాని ఓ సన్నాసి. పదో తరగతి ఫెయిల్ అయినోడివి.. నీకు నిరుద్యోగుల బాధ ఎట్లా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన నువ్వు...టీఆర్ఎస్కి చెంచావి. పైసలిచ్చి టీఆర్ఎస్లో చేరిన నువ్వా.. నన్ను గొట్టం గాడు అనేది..? నీ లెక్క పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమకారుల పార్టీలో తలసాని లాంటి లఫంగిలు చేరారు. నేను గొట్టంగాన్నో.. కాదో కేసీఆర్‌ని అడుగు’’ అంటూ మండిపడ్డారు. చదవండి : ఆ విషయంలో కేటీఆర్ తండ్రిని మించిపోయాడు చిన్నారికి ఉపరాష్ట్రపతి అభినందనలు -
‘దుబ్బాక గెలుపు బీజేపీది కాదు రఘునందన్‌దే’
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉపఎన్నికలో ప్రజల ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ అహంకారానికి చరమగీతమని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాదాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉపఎన్నిక ఫలితం పై గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్- బీజేపీ లోపాయకారి ఒప్పందం జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. ‘దుబ్బాక ఫలితం కాంగ్రెస్ పార్టీని నిరాశ పరిచినప్పటికీ కూడా ఈ ఉపఎన్నిక ఓ గుణాత్మక మార్పుకు నాంది పలికింది. రాజకీయ మాయలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చు కానీ రానున్న ధర్మ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. ప్రజలు కోరుకున్న సామాజిక, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. దుబ్బాక ఫలితాలని లోతుగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెంపపెట్టు. ఆధిపత్య అహంకారంతో నిరంకుశంతో పోలీసులని, రెవెన్యు శాఖని, డబ్బుని అడ్డం పెట్టుకొని, అధికార మదంతో విర్రవీగుతున్న కేసీఆర్ కి కర్రకాల్చి వాత పెట్ట్టినట్లుగా దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పారు. తన ఇంట్లో కుక్క చచ్చిపోతే ఆ కుక్కపై వున్న ప్రేమ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ ప్రజలపై లేదు. వరద బురదలో అష్టకష్టాలు పడినవారి మీద లేదు. ఇలాంటి అహంకారి కేసీఆర్ కు దుబ్బాక ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. తమ ఓటుతో కేసీఆర్ అహంకారం దించారు. నిజాం నవాబ్ అప్పట్లో శిస్తులు వసూలు చేసి ప్రజల రక్తం తాగితే ఈ రోజు కేసీఆర్ ఎల్ ఆర్ఎస్ పేరుతో ప్రజల రక్తం తాగే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి : దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం) నిర్బంధ వ్యవసాయమని ప్రజలని నానా ఇబ్బందులు పెడుతున్నారు. మల్లన్న సాగర్ దగ్గర రైతుల భూములు దౌర్జన్యంగా గుంజుకున్న కేసీఆర్ కు ఆ రైతుల ఉసురు తగిలింది. కేసీఆర్ ఇకపై తన అహంకారాన్ని వీడి భూమిపైకి రావాలి. ప్రజల ఆలోచనకు అనుగుణంగా పని చేయాలి. పధకాలని ఎర వేసి ఓట్లు పట్టుకోవాలనే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనకు కూడా దుబ్బాక ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. సిద్ధిపేట, గజ్వేల్ లకు మాత్రమే వేల కోట్ల రూపాయిలు కేటాయించి దుబ్బాకని గాలికి వదిలేసిన కేసీఆర్ కు దుబ్బాక ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఈ ఫలితం కేసీఆర్, హరీష్ రావు కు చెంపదెబ్బ. దుబ్బాక ప్రజలు కసితో టీఆర్ఎస్ ప్రజలు ఓడించారు. కేసీఆర్ ఇకనైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారో గ్రహించి, ప్రజలు కోరుకున్న రీతిలో పరిపాలన చేయాలని' సూచించారు (చదవండి : దుబ్బాక ఫలితాలపై రాములమ్మ స్పందన) టీఆర్ఎస్- బీజేపీ కుట్ర కోణం వాస్తవానికి దుబ్బాక నియోజిక వర్గం కాంగ్రెస్ పోర్ట్ కాదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించిన నియోజిక వర్గం కాదు. అయినప్పటికీ గతంలో పార్లమెంట్ లో 20వేల ఓట్లు వస్తే ఈ ఎన్నికలో 22 వేల ఓట్లు వచ్చాయి. రెండు వేల ఓట్లు పెరిగాయి. దీనిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయనప్పటికీ ఇక్కడ ఓటర్లు కానీ మీడియా మిత్రులు కానీ అర్ధం చేసుకోవాల్సిన ఓ విషయం వుంది. టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షేర్ అయాయ్యి. ఇందులో ఆ రెండు పార్టీల కుట్ర కోణం ఉందనే అనుమానాలు వున్నాయి. రఘునందన్ రావు ప్రచారం మొదలుపెట్టినపుడు ఏమంత ప్రాభల్యం కనబరచలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా వుందనే వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణం నుండి ప్రజల ద్రుష్టిని మళ్లించేదుకు, రఘునందన్ రావుకి ప్రాభల్యం పెంచేటందుకు, కుట్ర కోణంలో ఆయన కార్లు ఆపడం, కార్ల టైర్లు కోయడం , టీఆర్ ఎస్ పార్టీని కొమ్ము కాస్తున్న మీడియా వర్గాలు , టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున దాన్ని చూపించడం, తర్వాత రఘునందన్ రావు మామ ఇంట్లో కి వెళ్లి డబ్బులు వున్నాయని దాడి చేయడం , దాన్ని మీడియాలో హైలెట్ చేసి చూపించడం .. ఇవన్నీ చూస్తుంటే రఘునందన్ రావు కి సానుభూతి పెంచడానికి టీఆర్ఎస్ పార్టీ ఏదైనా కుట్ర చేసిందా ? టీఆర్ఎస్ కి బీజేపీ లోపాయకారి ఒప్పందం ఉందా ?’అని దాసోజు శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు. ‘టీఆర్ఎస్ తన చర్యల ద్వారా రఘునందన్ కు సానుభూతి వచ్చేలా చేసింది. అందుకే ఈ విజయాన్ని బీజేపీ విజయం కాకుండా రఘునందన్ కు సానుభూతి వలన వచ్చిన విజయంగానే తాము భావిస్తున్నాం. ఇక్కడ మరో విషయం వుంది. టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష రావు ఇమేజ్ ని తగ్గించేందుకు కుట్ర జరిగిందా? అనే కోణం కూడా ఉంది. అయితే ఈ ఫలితంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఓటమి నిరాశ కలిగిస్తుంది. అయితే ఓటమే విజయానికి సోపానం. మేము యుద్దం చేసి ఓడిపోయాం’ అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. -
మేధావుల మౌనం అతి ప్రమాదకరం
మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యమ శక్తులు మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ గడ్డ పోరాటాలకు అడ్డా. ఇక్కడి మట్టి బిడ్డలకు ఆత్మ గౌరవం ఎక్కువ. ఇక్కడి మట్టికి, గాలికి, నీటికి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉంటుంది. దుర్మార్గంపై తిరుగుబాటు చేసే స్వభావం ఉంటుంది. సమ్మక్క సారక్కల దగ్గర నుండి రాణి రుద్రమ దాకా. నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా. సిరిసిల్ల జగిత్యాల ప్రజా ఉద్యమాల దగ్గర నుండి మలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా. ఇలా అనేక పోరాటాలను, ఉద్యమాలను నడిపిన చరిత్ర ఉంది తెలంగాణ గడ్డకు. తెలం గాణ రాష్ట్రం సాధించుకునే వరకు ఇక్కడి మేధావులు, కవులు, కళాకారులు, ప్రజాస్వామికవాదులు అందరూ సమాజంలో తమ తమ విద్యుక్తధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ బాధ్యతల నుండి చాలామంది వైదొలిగారు. ఎందుకు ఈ పరిణామం జరిగింది? దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనే చర్చ జరగాలి. పాలకులు చేసే తప్పులను ప్రశ్నించే దాశరథి, కాళోజి వారసులు ఇప్పుడు తెలంగాణలో లేరా! మాయమైపోయారా! రాజ్యం చేసే తప్పులపై గజ్జకట్టి డప్పుకొట్టి జన జాగృతికి నడుంబిగించిన ప్రజా కళాకారులు ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చారు? జనం గొంతు వినిపించే జయశంకర్ సార్ వారసులైన మేధావులు పదవులకు పెదవులు మూశారా. తెలంగాణ వస్తే హక్కులు వస్తాయి, సామాజిక న్యాయం జరుగుతుంది, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనుకుంటే ఉన్న హక్కులు పోతున్నాయి. ఉద్యమ వారసులు, మేధావులు, ప్రజాస్వామిక శక్తులు మౌన ముద్ర దాల్చారు. దీనికి కారణం ఏమిటి! కారకులు ఎవరు! తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు దగ్గరైన వీరు రాష్ట్రం ఏర్పడ్డాక పదవులకు ఆశపడ్డారా? పదవులు తీసుకుని సాధించుకున్న తెలంగాణను గాలికి వదిలేసి సొంత ప్రయోజనం చూసుకున్నారా? ప్రశ్నించేతత్వాన్ని, పోరాడే గుణాన్ని మొద్దుబార్చారా? తెలంగాణ సహజత్వాన్ని భ్రష్టుపట్టించారా? ఆత్మగౌరవాన్ని అటకెక్కించారా? ప్రజల వాయిస్ వినిపించే గొంతుకలను మూగనోము పట్టించారా? తెలంగాణ వస్తే ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇలా జరుగుతుంది అంటే ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడేవారు కాదేమో. యువకులు తమ నిండు ప్రాణాలను బలిదానం చేసేవారు కాదు. ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసేవారు కాదు. తెలంగాణ ఉద్యమ శక్తుల శక్తిని, మేధావులకున్న బలాన్ని, కవులు కళాకారుల ఆట, పాటలకున్న పవర్‌ను ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గుర్తించాడు. ఉద్యమ సమయంలో తనకు దగ్గరైన కవులను, కళాకారులను, మేధావులను ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరువాత వారిని తన వెంటనే తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వీరి ప్రభావం సమాజంలో ఎలా ఉంటుందో తెలుసు కనుక, వీరిని దూరం చేసుకుంటే ఏమి జరగబోతుందో కూడా ఊహించుకున్నాడు. అందుకే అధికారంలోకి రాగానే వీరందరిని తన కబంధ హస్తాలలో బంధించాడు. కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాడు. వారు బయటికి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేదికలు ఎక్కి ఆటపాటలు పాడకుండా కట్టడి చేశాడు.. అలాగే మేధావి వర్గానికి పదవులు ఇచ్చి పెదవులు మూయించాడు. ఉద్యమ వారసులందరినీ తన అదుపులో ఉంచుకున్నాడు. అందుకే వీవీ, సాయిబాబాల మీద కుట్ర కేసులు పెట్టి జైలుకు పంపినా. ప్రజాస్వామికవాదులను అరెస్ట్ చేసినా, ధర్నాచౌక్ ఎత్తేసి సభలు, సమావేశాలు పెట్టుకునే అవకాశం లేకుండా చేసినా ప్రశ్నించేవాడు ఉండడానికి వీలు లేదు, ఉద్యమాలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తుంటే తెలం గాణ సమాజం మౌనంగా రోదిస్తోంది. మేధావులారా మేల్కొనండి. తెలంగాణకున్న పోరాటాల వారసత్వాన్ని కాపాడుకుందాం. మేధావి మౌనం సమాజానికి మంచిది కాదు. దేశ వ్యాపితంగా అప్రజాస్వామిక శక్తులు విజృంభిస్తున్నాయి. విభజన రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే కుట్రలకు తెర లేపారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశమైన మన దేశాన్ని మధ్యయుగాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన పదవులకు ఆశపడి మీ పాత్రను విస్మరించకండి. రాజకీయాలకు అతీతంగా ఎటువంటి వివక్షత చూపించకుండా ప్రజల పక్షాన, సమాజ హితం కోరి మీరు చూపించే మార్గం పాలకులకు దశ, దిశ కావాలి. తెలంగాణ మట్టికి, గాలికి, నీటికి ఉన్న ప్రత్యేకతను కాపాడండి. పోరాటాల వారసత్వాన్ని కొనసాగించండి. డా. శ్రవణ్ దాసోజు వ్యాసకర్త జాతీయ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ -
తెలంగాణ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్ : ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రబీలో సాగైన పంటలు, ప్రభుత్వ కొనుగోళ్ల పరిస్థితిపై సీఎంకు లేఖలో వివరించారు. రైతులను ఆదుకునే విషయంలో తమ విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్-19 గడ్డు కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల మద్దతు ఇస్తామని తెలియజేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి.. 1. మే 7 వరకు లాక్డౌన్ పొడిగించిన మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కరోనాను మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ లాక్డౌన్ పొడిగింపు వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఛిద్రమయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా అన్నదాత అయిన రైతన్న మరీ ప్రమాదంలో పడ్డాడు. రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఉంది. 2. ఈ రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 53.68 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. రబీ సాధారణ విస్తీర్ణం 31. 58 లక్షల ఎకరాలు కాగా... ఈ సీజన్ లో 70 శాతం అదనంగా (మొత్తం 170 శాతం) విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వ్రభుత్యానికి నివేదిక ఇచ్చింది. ప్రధానంగా వరి 39.24 లక్షల ఎకరాలు మొక్కజొన్న 6.21 లక్షల ఎకరాలు, శనగ(బెంగాల్ గ్రామ్ ) 3.28 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.30 లక్షలఎకరాల విస్తీర్ణంలో సాగయ్యాయి . 3. రబీలో వరి సాధారణ విస్తీర్ణం 16.89 లక్షల ఎకరాలు కాగా... ఈ రబీలో 39.24 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఈసారి 132 శాతం ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగైంది . సగటున ఎకరానికి 28 క్వింటాళ్ల చొప్పున 11 కోట్ల క్వింటాళ్లు (1.10 కోట్ల టన్నుల) వరి ధాన్యం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. రైతు పండించిన ప్రతి గింజ కొంటామని, రాష్ట్రంలో 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయిలో ఆదివారం నాటికి 4,380 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకు 6.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల, ఏఎమ్మార్పీ కింద 1 లక్ష ఎకరాలు కలిపి 3.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైతే .. 3 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అయిన వరి ధాన్యం మొత్తాన్ని మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్ మిల్లర్లే కొనుగోలు చేశారు. మరో 80 వేల ఎకరాల్లో ఇంకా వరి కోతలు పూర్తికాలేదు. అంటే ప్రభుత్వం కొనేది తక్కువ, మిల్లర్లు కొనేది ఎక్కువ ఉంది. అదే క్రమంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న ధ్యానం కొనుగోలు చేయటం లేదు. కేవలం దొడ్డు రకాలనే కొంటున్నారు . 4. రబీ సీజన్ ధాన్యం నింపడానికి 20 కోట్ల గోనె సంచులు (గన్నీ బ్యాగులు) అవసరమని, పశ్చిమ బెంగాల్ నుంచి వాటిని తెప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాత గన్నీ బ్యాగులను కొనడానికి గతంలో రూ.16 ఉంటే, ఇప్పుడు రూ .18 కి పెంచారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం గన్నీ బ్యాగుల కొరత విపరీతంగా ఉంది. ప్యాడీ క్లీనర్లు, విన్నోవింగ్ ఫ్యాన్లు, తేమ యంత్రాలు కొరత ఉంది. 5. మొక్కజొన్నకు కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ . 1,760 గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 890 మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు రైతుల నుంచి టీఎస్-మార్క్ ఫెడ్ కొనుగోలు చేసింది. వాస్తవానికి ఫిబ్రవరి నుంచే మొక్కజొన్న హార్వెస్టింగ్ ప్రారంభం అయ్యింది. అప్పటికి ప్రభుత్వం సెంటర్లు ఏర్పాటు చేయకపోవటంతో రైతులు ప్రైవేటు ట్రేడర్లకు అమ్ముకున్నారు. ట్రేడర్లు ధర తగ్గించి రూ .1,300 నుంచి రూ .1,400 క్వింటాలు చొప్పున మక్కలు కొనుగోలు చేయటంతో రైతులు నష్టపోయారు. రెండు నెలలపాటు ఇలాగే జరిగింది. చివరకు లాక్డౌన్ సమయంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి మార్కెట్లు బంద్ కావటంతో మార్క్ ఫెడ్ సెంటర్లలోనే మక్కల కొనుగోళ్లు జరుగుతున్నాయి. రబీలో 6.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా.. ఎకరానికి 30 క్వింటాళ్ల చొప్పున 18.60 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతాయి. కాని ఇప్పటివరకు 1.30 లక్షల టన్నులే ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాబట్టి ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు పై ప్రత్యేక శ్రద్ద సారించాలి. 6. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 20 వేల, 300 ఎకరాలలో పసుపు పంటను సాగు చేశారు. లాక్డౌన్ వల్ల మార్కెట్లు బంద్ కావడంతో పసుపు అమ్ముకునే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌కు ముందు క్విటాల్‌కు 4500 రూపాయల నుంచి 4900 రూపాయల వరకు ప్రైవేట్ ట్రేడర్లు కొనుగులు చేసి రైతును నిలువునా దోచుకున్నారు. ఒక పక్క పసుపు పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. మరో పక్క కేంద్రం మద్దతు ధర ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కూడా ప్రకటించలేదు. క్వింటాలుకు రూ .15 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించి, మార్క్ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోళ్లు చేపట్టాలని రైతుల నుంచి డిమాండ్ ఉంది. 7. శనగ పంట కొనుగోలుకు రాష్ట్రంలో 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రకటించిన ధర రూ. 4,875 ఉంది. కేంద్రం ప్రభుత్వం కేవలం 47,600 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు 50 వేల మెట్రిక్ టన్నుల శనగలు రాష్ట్రంలో కొనుగోలు చేశారు. ఇంకో 27 వేల టన్నుల పర్మిషన్ అడిగారు. ఇంకా కేంద్రం నుంచి అనుమతి రాలేదు. రాష్టంలో రబీ సీజన్ లో 3.28 లక్షల ఎకరాల్లో రైతులు శనగ పంట సాగుచేశారు. మొత్తం శనగ పంటలను గిట్టుబాటు ధరలు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. 8. కందుల కొనుగోళ్లు రాష్ట్రంలో నిలిపి వేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్విటాలుకు రూ.5,600 కనీస మద్దతు ధరతో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేశారు. కందులను కూడా ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలి. 9. బత్తాయి, మామిడి లాంటి పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వం మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు లేదా మార్కెట్లో మంచి ధరలు ఉన్న ప్రాంతాల్లో రైతులు వారి ఉత్పత్తలను అమ్ముకునేలా సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా కూరగాయలు పండిస్తున్న రైతులను ఆదుకునేందుకు గ్రామాలలోనే కూరగాయలను ప్రభుత్వమే కొని నగరాలలో ఉన్న ప్రజలకు "మన ఊరు మన కూరగాయలు" పథకం మాదిరి అందజేయాలి. -
టీఆర్ఎస్, పోలీసుల కుట్ర ర్యాలీకి అనుమతి నిరాకరణపై దాసోజు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిష్ట పెరుగుతుందనే భయంతో టీఆర్ఎస్ పార్టీ, పోలీసులు కుట్రపూరితంగా ర్యాలీకి అనుమతి వ్వలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. గాంధీభవన్‌కి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, ప్రేమ్‌లాల్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. నగర సీపీని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఒకమాట అనగానే తలసాని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన తన నోటిని అదుపు లో పెట్టుకోవాలన్నారు. టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్త మ్ ఫోన్ చేస్తే సీపీ అమర్యాదకరంగా మాట్లాడారని తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకుని సభలో ఉత్తమ్ మాట్లాడారని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవ్యక్తిగా మారిన తలసాని స్పందించడం ఏంటన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను ఎవరూ తిట్టనంతగా తలసాని తిట్టారని, ఉద్యమం సందర్భంగా తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి అని విమర్శించారు. ఐపీఎస్‌లు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలని, కానీ వారు టీఆర్ఎస్కు గులాంలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. -
‘ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జనం రోగాలతో నానా కష్టాలు పడుతున్నారని, తక్షణమే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శనివారం వరంగల్ ఎంజీఎం వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న అనంతరం శ్రవణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి విషజ్వరాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2019–20 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ 1.82 లక్షల కోట్ల రూపాయలకు ప్రవేశపెట్టి అందులో వైద్య, ఆరోగ్య శాఖకు కేవలం రూ.5536 కోట్లు మాత్రమే కేటాయించారని, మొత్తం బడ్జెట్లో ఇది కేవలం మూడు శాతమేనని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల్లో సగటున వైద్య, ఆరోగ్య శాఖకు 4.8 శాతం చొప్పున బడ్జెట్ కేటాయించాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసిందని చెప్పడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ కమీషన్లు పొందేందుకే కాళేశ్వరం, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు కేటాయించారని శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక కేవలం కేసీఆర్ ఆయన కుటుంబసభ్యులు మాత్రమే లబ్ధి పొందారని, ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌కు చెందిన ఒక కుక్కకు ఆనారోగ్యం చేస్తే వైద్యం చేసిన తర్వాత చనిపోయిందంటూ బంజారాహిల్స్ పోలీసులు పశువైద్యుడిపై కేసు పెట్టినట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తను దాసోజు శ్రవణ్ ఉటంకించారు. అయితే గాంధీ ఆస్పత్రిలో డెంగీ కారణంగా ఒకేరోజు ఆరుగురు పిల్లలు మరణిస్తే ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడం సిగ్గుచేటని ఆయన నిప్పులు చెరిగారు. ఇందుకు బాధ్యులుగా కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం కొత్త అసెంబ్లీ, సచివాలయలు కట్టేందుకు ఉవ్విళ్లూరుతోందని విమర్శించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ మహానగరంలోనే ఇలాంటి దుస్థితి నెలకొని ఉందంటే గ్రామాల్లో ముఖ్యంగా గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు ఎంత తీవ్రంగా జఠిలంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునని దాసోజు శ్రవణ్ అన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో 20 రోజులకు ఒక్కసారి మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యాన్ని హెలికాఫ్టర్ ద్వారా సేవలు అందిస్తామని గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ గాలి మాటగానే మిగిలిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో జిల్లా కేంద్రాల్లో వెయ్యి పడకలు, మండల కేంద్రాల్లో వంద పడకల ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని శ్రవణ్ నిలదీశారు. అయిదున్నరేళ్లు గడిచినా ఆ హామీకి దిక్కు లేదని దుమ్మెత్తిపోశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని వెయ్యి పడకల స్థాయికి తీసుకువచ్చారని, ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఎంజీఎం ఆస్పత్రిని ఏమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తగిన నిధులు ఇవ్వకుండా ఆస్పత్రికే అనారోగ్యం వచ్చిందనేలా చేశారన్నారు. హైదరాబాద్‌లోని నీలోఫర్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్లు పనిచేయక గాంధీ ఆస్పత్రిలో ఒకే ఒక్క రోజులో 21 మంది రోగులు చనిపోయారని, ఇలాంటి ఘటనల తర్వాత కూడా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం దారుణవిషయమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా రూ.35 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్లాన్ చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ చేయించి దాని నిర్మాణ వ్యయ్యం 80 వేల కోట్ల రూపాయలకు పెంచి 18 లక్షల ఎకరాల్ని సాగు లక్ష్యంగా చేసి ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా దుర్వినియోగం చేస్తోందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రీడిజైన్ పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న కేసీఆర్ చర్యల్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ పాలన మొత్తంలో రూ.60 వేల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే అయిదున్నర సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆయన గణాంకాల్ని వివరించారు. కేవలం 60 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టేశారని డాక్టర్ శ్రవణ్ నిప్పులు చెరిగారు. వైద్య, ఆరోగ్యాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందని డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. -
టీ సర్కార్ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేస్తోంది
సాక్షి, హైదరాబాద్: ‘సమగ్ర వేదిక’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పౌరులకు సంబంధించిన వ్యక్తిగత డేటాను అధికారికంగా అనుసంధానం చేయడంపై దర్యాప్తు చేస్తామని కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రావణ్ దాసోజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వేదిక పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, గోప్యంగా ఉండాల్సిన వివరాల్ని సేకరించి రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించిందని, డేటా గోప్యత రక్షణ చట్టం-2017, ఐటీ యాక్ట్‌లనే కాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని సైతం ఉల్లంఘించిందని ఫిర్యాదు చేశారు. అధికారిక డేటాను రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని వారు ఆరోపించారు. గత నెల 5న హైదరాబాద్‌లో జరిగిన ఐసీఏఐ జాతీయ సదస్సులో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ’సిటిజెన్ 360’ పేరిట సేకరించిన వివరాలను తెలియజేయడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. వివిధ విభాగాల ద్వారా పౌరులకు సంబంధించిన ప్రైవేట్ డేటా సేకరించినట్లు జయేశ్ రంజన్ అంగీకరించారని వారు ఆరోపించారు. ‘జయేశ్ రంజన్ చేసిన ప్రకటన ద్వారా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా రహస్యంగా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని తేలింది. ప్రజల అనుమతి లేకుండా ఈ విధంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం చట్టాలను ఉల్లంఘించడమే’ అని శ్రవణ్ తెలిపారు. వ్యక్తుల వ్యక్తిగత, రహస్య డేటా సేకరణ చేయడం చట్టవ్యతిరేకమని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డాక్టర్ శ్రవణ్ కేంద్ర మంత్రిని కోరారు. ఏ ఏజెన్సీ ద్వారా ఈ డేటాను సేకరించారో వెల్లడించలేదని, ఆ ఏజెన్సీ దగ్గర డేటా గుట్టుగా ఉండదనే గ్యారెంటీ ఏముంటుందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యక్తిగత ఈమెయిల్స్, పాస్వర్డ్లు, మొదలైవన్నింటినీ, పౌరుల ప్రతి డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం సేకరించిందని స్పష్టం అవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పౌరుల సమాచారాన్ని గుట్టుగా సేకరించిన ప్రభుత్వం డేటాను ఎందుకు సేకరించిందో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఈ విధంగా చేయడం పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని, రాజ్యాంగం 14, 21 అధికరణాల కింద పౌరుల కల్పించిన హక్కులకు ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించిందని శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో ఐటి గ్రిడ్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయాన్ని డాక్టర్ శ్రవణ్ గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ’సేవామిత్ర’ అనే యాప్ పేరుతో రాజకీయ అవసరాల కోసం టీడీపీ డేటా సేకరించిందన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ‘సిటిజన్-360 ‘ని దుర్వినియోగం చేయట్లేదని గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ కేసులో నిందితులపై కేసులు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మాత్రం అదే తరహా నేరానికి పాల్పడి పౌరుల డేటాను చోర్యం చేస్తున్నట్లు అనుమానాలున్నాయియని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం విచారణ జరపాలని, లేకపోతే, తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని శ్రవణ్ విలేకరులతో తెలిపారు. -
‘బీజేపీ నుంచి ఆయనను సాగనంపండి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు క్రిమినల్ కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఆధారంగా ఆబిడ్స్ రోడ్డు పోలీసులు స్వామిపై కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ మాదక ద్రవ్యాలను వినియోగిస్తారని సుబ్రహ్మణ్యస్వామి రెచ్చగొట్టే విధంగా లేనిపోని వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకులు సోమవారం సుబ్రహ్మణ్యస్వామి దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి తీరును తప్పు పట్టారు. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా స్వామి వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ జాతీయతపై నిరాధార ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాల గురించి పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి పూర్తిగా భిన్నంగా బీజేపీ ఎంపీల ప్రవర్తన ఉందని, సుబ్రహ్మణ్యస్వామి చేసిన తాజా వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ నుంచి స్వామిని సస్పెండ్ చేయాలని డాక్టర్ దాసోజు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో శ్రవణ్‌తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఇతరులు పాల్గొన్నారు. అనంతరం మైనార్టీ సంక్షేమ విద్యా సంస్థలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 33 మంది విద్యార్థులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. -
‘ఐటీగ్రిడ్ మాదిరిగా కేసు నమోదు చేస్తారా’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను దెబ్బతీస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సమగ్ర వేదిక’పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత సమాచార వివరాల్ని 25 ప్రభుత్వ శాఖల నుంచి సేకరించి రూపొందించే సమగ్ర నివేదిక ఉద్దేశాలను వెల్లడించాలని అన్నారు. గాంధీ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల వ్యక్తిగత సమాచారం అందుబాటులో ఉంటుందని టీఎస్ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రజల ఫుట్‌ప్రింట్ కూడా లభిస్తుందన్న జయేశ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఐటీగ్రిడ్ మాదిరిగానే.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం చోరీ చేసిందని ఐటీగ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారని శ్రవణ్ గుర్తుచేశారు. ఈ కేసును తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టి గత ఎన్నికల్లో విమర్శలతో దుమ్మెత్తిపోశారని అన్నారు. మరి తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా కేసు పెడతారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాల్ని క్రోడీకరించి దుర్వినియోగానికి తెర తీసిందని మండిపడ్డారు. ప్రజల అనుమతి లేకుండా అధికారులు వారి వివరాల్ని క్రోడీకరించడం చట్ట విరుద్ధమన్నారు. వ్యక్తిగత సమాచారం వెల్లడవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఆధార్‌ను అన్ని పథకాలకు ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టే ఆదేశించిందని, పౌరుల ఫుట్‌ప్రింట్ కూడా తమవద్ద ఉంటుందని ఐటీ కార్యదర్శి అనడం ఆందోళన కలిగిస్తోందని శ్రవణ్ చెప్పారు. గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదన్న గ్యారెంటీ ఏమిటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సైబర్ సెక్యూరిటీ కిందకు వచ్చే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని, సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తామని తెలిపారు. -
‘పుండు మీద కారం చల్లుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. బడ్జెట్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడంలో టీఆర్ఎస్ ఎంపీలు ఘోరంగా విఫలమైయ్యారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కూడా సాధించలేకపోయారని మండిపడ్డారు. మిషన్ భగీరథ పథకానికి నిధులు, రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని డిమాండ్ చేయడంలో టీఆర్ఎస్ దారుణంగా విఫలమైందని శ్రవణ్ వ్యాఖ్యానించారు. రైతుల ఓట్లును కొనేందుకు ఆరువేల ఇస్తామని చెప్తూ.. పుండు మీద కారం చల్లుతున్నారని శ్రవణ్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాస్తోందని ఆయన ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల నోళ్లలో మన్ను కొట్టాయని ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోలేదని, ఆదాయపన్ను స్లాబులు మార్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని శ్రవణ్ అన్నారు. -
కులాల గణన తర్వాతే రిజర్వేషన్ అమలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాల గణన తర్వాతే రిజర్వేషన్లను అమలు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శిలకు లేఖలు రాశారు. బీసీ రిజర్వేషన్లను వర్గీకరించి దాని ప్రకారమే పంచాయతీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం 52% బీసీలు ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 22 లక్షల ఓట్లను తొలగించి క్షమాపణ చెప్పిన ఎన్నికల సంఘం జాబితా ఆధారంగా కులగణన చేపడితే సహించబోమన్నారు. బీసీఉపకులాల వెనుకబాటుతనం ఆధారంగానే కులగణన చేపట్టాలని గతంలో ప్రభుత్వాన్ని కోరితే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతోనే తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారమే కులాల వెనుకబాటుతనంపై అధ్యయనం చేసి శాస్త్రీయ విధానం ద్వారా బీసీకులాల గణన జరగాలని కోరారు. ఆదేశాలు బేఖాతర్ సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేయడం లేదని, హైకోర్టు ఉత్తర్వులను కేసీఆర్ ప్రభుత్వం బేఖాతర్ చేస్తోందని శ్రవణ్ ఆరోపించారు. హైకోర్టు తీర్పు గత జూన్ నెలలోనే ఇచ్చినప్పటికీ బీసీకులాల వెనుకబాటుతనానికి కారణాలు కనుక్కోకుండా ముందస్తు ఎన్నికల హడావుడిలో మునిగిపోయిందన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బీసీకులాలగణనను తూతూ మంత్రంగా చేపడుతున్నారని ఆరోపించారు. రెండోసారి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ బీసీలకు తగిన న్యాయం చేయాలని కోరారు. -
‘ఈవీఎంలపై డౌట్స్.. కేటీఆర్‌కు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్‌లు గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురైనట్టు ఆరోపించారు. కేటీఆర్‌కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. పొంతన లేని ఫలితాలు వచ్చాయి ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని దగ్గరుండి గమనించినట్టు తెలిపారు. ప్రచారం అప్పటికీ.. పోలింగ్ డే రోజుకి ఏ మాత్రం పొంతన లేని ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు అనుమానం ఉందన్నారు. 2009 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కేసీఆర్ అప్పట్లో చెప్పినట్టు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కవిత వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లతో పాటు ఫోన్ నంబర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందుకు కావాల్సిన ఆధారాలు తానే ఇస్తానని అన్నారు. కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్దమైతే వాస్తవాలను నిరూపిస్తానని తెలిపారు. 2014లో తాము ఓడిపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదని గుర్తుచేశారు. ఎగ్ న్యాక్ కంపెనీకి తెలంగాణ ప్రజల ఓట్లను పంపించి ట్యాప్ చేశారని ఆరోపించారు. రజత్ కుమార్‌కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పునాది లాంటివని అన్నారు. రాజ్యంగ బద్దమైన ఎన్నికలకు టీఆర్ఎస్ తూట్లు పొడించదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ పాలక వర్గానికి పాలేరులా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పు జరగలేదని సుప్రీం కోర్టు, హైకోర్టులలో చెప్పిన తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్.. 22 లక్షల ఓట్లను తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజత్ కుమార్‌కు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వారికి కావాల్సిన వారిని గెలిపించుకుని మిగతా వారిని ఓడించారని ఆరోపించారు. ఈవీఎంలు మోరాయించిన అధికారులు పట్టించుకోలేదని అన్నారు. కౌటింగ్ ఫామ్‌లో ఓ లెక్క.. చివరగా తమకిచ్చిన పేపర్లలో వేరే లెక్కలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన చోట జామర్లు పెట్టమంటే ఎన్నికల అధికారులు నిరాకరించారని తెలిపారు. తెలంగాణను అసెంబ్లీగా చేసుకుని పోరాడుతాం అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రజా క్షేత్రంలో ఫెయిల్ అయ్యామని కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటే తామే టీఆర్ఎస్కు అధికారం ఇచ్చే వాళ్లమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోల్ అయిన ఓట్ల కంటే 1056 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చిన్న తమ్ముడని.. ఆయన పేరు కేడీఆర్ అని విమర్శించారు. 19 ఈవీఎంలను రీ కౌంటింగ్ పెట్టాలని కోరిన ఎన్నికల అధికారులు వినలేదని తెలిపారు. ప్రజలు మా వైపు ఉన్నారని.. ఈవీఎంలు టీఆర్ఎస్ వైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారతదేశంలోనే అతి ఖరీదయిన ట్యాంపరింగ్ తెలంగాణ ఎన్నికల్లో జరిగిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని పేర్కొన్నారు. తెలంగాణను అసెంబ్లీలాగా చేసుకుని తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. -
ఆ ఇద్దరి ‘రూటు’ సెపరేటు...
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగర పోలీసు విభాగం బరిలో నిలిచిన కీలక పార్టీల అభ్యర్థులకు వ్యక్తిగత భద్రత అధికారులను (పీఎస్ఓ) కేటాయించింది. నగరంలోని 14 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారికి కొన్ని రోజుల క్రితమే పీఎస్‌ఓలను నియమించింది. అయితే ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గ బీజేపీ అభ్య ర్థిని షహజాది మాత్రం ఈ కేటాయింపుల్లో తమకంటూ ప్రత్యేకత కలిగి ఉన్నారు. తనకు గన్‌మెన్ వద్దంటూ తిప్పిపంపిన ఒకే ఒక్క అభ్యర్థి శ్రవణ్ కాగా... తొలిసారిగా అందరి కంటే ఎక్కువ భద్రత పొందిన అభ్యర్థినిగా షహజాది రికార్డుకు ఎక్కారు. గుర్తింపు పార్టీల అభ్యర్థులకే... ప్రతి ఎన్నికల సందర్భంలోనూ అనేక మంది పోటీ చేస్తుంటారు. ఈసారి విషయానికే వస్తే హైదరాబాద్ జిల్లాలో 313 మంది, మేడ్చల్‌లో 132 మంది, రంగారెడ్డిలో 127 మంది పోటీలో ఉన్నారు. ప్రతి అభ్యర్థి వెంట అనునిత్యం ఓ గన్‌మెన్ ఉండే లా 1+1 భద్రతకల్పిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే రాష్ట్ర అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేల సంఖ్యకు రెట్టింపునకు పైగా ఉన్నారు. ఈ 313 మందికి భద్ర త కల్పించాలంటే 626 మంది గన్మెన్లను కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేవలం గుర్తిం పు పార్టీల అభ్యర్థులకు మాత్రమే పీఎస్‌ఓలను కేటాయించాలనే నిబంధన పొందుపరిచారు. సిటీలో పోటీలో నిల్చున్న తాజా మాజీ ఎమ్మెల్యేలకు ఎలానూ భద్రత ఉంది.వీరితో పాటు పోటీ చేస్తున్న టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీ, ఎంఐఎం పార్టీల అభ్యర్థులకు గన్మెన్లను కేటాయించారు. ఆ ఇద్దరి ‘రూటు’ సెపరేటు... నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వెంటనే బరిలో ఉండే అభ్యర్థులు ఎవరన్నది ఖరారైంది. ఆపై ఈసీ రూపొందించిన జాబితా ప్రకారం పోటీలో ఉన్న గుర్తింపు పార్టీల అభ్యర్థులకు నగర పోలీసులు గన్మెన్లను కేటాయించారు. మిగిలిన అభ్యర్థుల వెంట వీరు కొనసాగుతున్నా... ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ మాత్రం తనకు ఈ భద్రత అవసరం లేదని భావించారు. ఈ నేపథ్యంలో తనకు పీఎస్ఓల కేటాయింపు వద్దని లిఖిత పూర్వకంగా లేఖ ఇస్తూ కేటాయించిన వారిని వెనక్కు పంపారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీలో నిలిచిన షహజాది మరో రికార్డు సొంతం చేసుకున్నారు. అక్కడ ప్రత్యేక పరిస్థితులు, ఆదిలోనే ఎదురైన అనుభవాల నేపథ్యంలో సిటీ పోలీసులు తొలుత ఆమెకు అనునిత్యం ఇద్దరు పీఎస్ఓలు వెంట ఉండేలా 2+2 భద్రత కల్పించారు. వీరిలో ఇద్దరు మహిళా పీఎస్ఓలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగాసమీక్షించి 1+1కు కుదించడానికి నిర్ణయంతీసుకున్నారు. ‘అవసరమైతే’ అభ్యర్థించాల్సిందే... అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఇతర అభ్యర్థుల్లో ఎవరైనా తమకు గన్మెన్ల అవసరం ఉందని భావిస్తే దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) లేదా నగర పోలీస్ కమిషనర్‌కు తన దరఖాస్తు సమర్పించాలి. అందులో తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని పరిస్థితులతో పాటు ఎందుకు పీఎస్‌ఓలను కోరుతున్నామో సవివరంగా పొందుపరచాలి. ఆర్ఓలకు చేరిన దరఖాస్తులు సైతం పోలీసుల వద్దకే వస్తాయి. దీన్నిఅన్ని కోణాల్లోనూ సమీక్షించే ప్రత్యేక కమిటీ భద్రత అవసరం అనుకున్న వారికి గన్మెన్లను కేటాయిస్తుంది. అయితే అనేక మంది అభ్యర్థులు ఈ తంతు ఎందుకు అనుకుంటున్నారో..! లేక పీఎస్ఓల ద్వారా తమ సమాచారం లీక్ అవుతుందని భావిస్తున్నారో కానీ అవసరం ఉన్నా దరఖాస్తు చేయట్లేదు. వీలున్నంత వరకు అభ్యర్థులు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని, వారికి సఫారీ డ్రెస్ వేసి తమ వెంట తిప్పుకుంటూ సంతృప్తిచెందుతున్నారు. -
ఉత్తమ్ 'సిక్స్ ప్యాక్'
దేశ రక్షణ కోసం యుద్ధ విమానాలు నడిపిన టీపీసీసీ చీఫ్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఇప్పుడు ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థులతో తలపడుతున్నారు. ప్రజాకర్షణ, వాక్పటిమ కలిగి రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఢీకొడుతున్న కాంగ్రెస్ బృందాన్ని ముందుండి నడిపిస్తున్న పైలెట్ ఈయన. అధికార పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. ‘ముందస్తు’ వ్యూహంతో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి మహా కూటమి పేరుతో ఎన్నికల రణానికి బయల్దేరిన ఈ మాజీ కెప్టెన్ ఆంతరంగిక బలమేంటి? అటు పార్టీని నడపడంలో, ఇటు ఎన్నికల తంత్రాలను పన్నడంలో వెన్నుదన్నుగా నిలుస్తున్నదెవరు? ఉత్తమ్ ‘సిక్స్‌ప్యాక్’ టీం పరిచయమిది.. పద్మావతిరెడ్డి ఆమె ఆర్కిటెక్ట్. వాస్తుకు అనుగుణంగా అందమైన ఇళ్లకు డిజైన్ వేసే వృత్తిలో ఉన్న ఆమె తన భర్తనూ అంతే బలంగా ‘డిజైన్’ చేయడంలో సఫలీకృతులయ్యారు. కష్టకాలంలో ఉత్తమ్ బలం ఆమె. రాజకీయంగా క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు ఉత్తమ్‌కు దిక్సూచిగా నిలుస్తారు. టీపీసీసీ చీఫ్ హోదాలో ఆయన బిజీగా ఉంటే నియోజకవర్గంలో అన్ని పనులు చక్కబెడుతుంటారు. ఉత్తమ్ తరఫున కేడర్ మంచిచెడ్డలు చూస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్కిటెక్ట్ మాత్రమే కాదు .. ఉత్తమ్‌ను రాజకీయంగా తీర్చిదిద్దిన పొలిటికల్ డిజైనర్ కూడా. గూడూరు నారాయణరెడ్డి టీపీసీసీ కోశాధికారి. ఈయన వెంట ఉంటే ఉత్తమ్‌కు సగం భారం తగ్గినట్టే. అధ్యక్షుని హోదాలో రాష్ట్ర పార్టీని నడిపించాల్సిన ఉత్తమ్ బాధ్యతల్లో సగం ఈయనే పంచుకుంటారు. కోశాధికారిగా పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నింటినీ చక్కబెడుతుంటారు. జాతీయ పార్టీ పక్షాన ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ముఖ్య నాయకుల అతిథి మర్యాదలు పర్యవేక్షిస్తారు. పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించడంలోనూ సాయపడతారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఉత్తమ్‌కు అండగా నిలుస్తారు. గూడూరు టీపీసీసీ కోశాధికారే కాదు... ఉత్తమ్ ఆంతరంగిక సహకారి. దాసోజు శ్రావణ్ రాజకీయ ప్రత్యర్థులపై ఉత్తమ్ ఎక్కుపెట్టే బాణం ఈయన. సాఫ్ట్వేర్ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శ్రావణ్ స్వతహాగా వాక్పటిమ ఉన్న నాయకుడు. ఏ అంశం మీదైనా పరిశోధన చేయడంలో దిట్ట. అందుకే అధికార పార్టీపై దాడికి శ్రావణ్‌ను ఎంచుకుంటారు ఉత్తమ్. అదీ..ప్రత్యక్షంగా లేదంటే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు, డాటా అనాలసిస్, సామాజిక మాధ్యమాల రూపంలో. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో నైపుణ్యం ఉన్న శ్రావణ్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార కార్యక్రమాల రూపకల్పనలో కీలకం. ఉత్తమ్ పార్టీ ప్లటూన్‌లో వాగ్బాణాలు సంధించే మాటల శతఘ్ని. సీజే శ్రీనివాస్ మాజీ ఉప ముఖ్యమంత్రి సి.జగన్నాథరావు కుమారుడు. పార్టీకి, ఉత్తమ్‌కు మధ్య వారధిగా పనిచేస్తారు. బూత్‌కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, శక్తియాప్ లాంటివి ఈయనే పర్యవేక్షిస్తారు. ఏఐసీసీ ఇచ్చే పార్టీ కార్యక్రమాలన్నింటినీ ఉత్తమ్ పక్షాన చక్కబెడతారీయన. డాటా అనాలిసిస్‌లోనూ తోడుగా ఉంటారు. పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల బయోడేటాలన్నీ క్రోడీకరించి ఉత్తమ్ పని సులువు చేశారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాల పరంగా ఉత్తమ్‌కు కొండంత బలం శ్రీనివాస్. హర్కర వేణుగోపాల్ ఏఐసీసీ ప్రొటోకాల్ ఇన్చార్జి. అధిష్టాన పెద్దల రాష్ట్ర పర్యటనల భారమంతా ఈయనదే. రాహుల్, సోనియాగాంధీ.. ఇంకా అగ్రనేతలు ఎవరు రాష్ట్రానికి వచ్చినా వారు బయలుదేరినప్పటి నుంచీ వెళ్లే వరకు వెన్నంటి ఉండి, ఏ లోటూ రాకుండా చూసుకుంటారు. జాతీయ నాయకులు బసచేసే హోటళ్లలో ఏర్పాట్లు, భోజన సదుపాయాలు, సెక్యూరిటీ వ్యవహారాలన్నీ ఉత్తమ్ తరపున చూసుకునేది ఈయనే. రాహుల్, సోనియాల ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఖరారులోనూ ఈయనే కీలకం. అధిష్టానానికి, ఉత్తమ్‌కు మధ్య వారధి. కప్పర హరిప్రసాదరావు టీపీసీసీ ప్రజాసంబంధాల అధికారి. మీడియాకు, ఉత్తమ్‌కు మధ్య సమన్వయం, పార్టీ ప్రచార కార్యక్రమాలు, పీసీసీ అధ్యక్షుడి కార్యక్రమాల కవరేజిలో హరిప్రసాద్ పాత్ర కీలకం. పార్టీ ప్రచారం విషయంలో అవసరమైన ఇన్పుట్స్ అన్నీ ఉత్తమ్‌కు అందిస్తారు. ప్రత్యర్థి పార్టీల ఆరోపణలను తిప్పికొట్టే విషయంలోనూ, పార్టీ లైన్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఉత్తమ్ స్క్రిప్ట్ ఈయనే. రాజకీయంగా కీలక సమయంలోనూ అవసరమైన సమాచారం ఇస్తుంటారు. ఉత్తమ్ మీడియా డ్రాఫ్ట్స్‌మెన్ ఈయన. ..:: మేకల కల్యాణ్ చక్రవర్తి -
ఈసీ వైఖరి రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కమిషన్ వైఖరి రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల కోడ్ యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతున్నా, అంతా తమ కనుసన్నల్లోనే జరుగుతోందన్న తరహాలో సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో చెప్పినా కూడా, చర్యలు తీసుకోవాల్సిన ఈసీ పొరపాట్లు చేస్తుండటం, కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపితే మళ్లీ వెనక్కు తగ్గడం పరిపాటిగా మారుతోందని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, సునీతా రావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పింక్ బ్యాలెట్ పేపర్లు ముద్రించవద్దని తాము గతంలోనే ఎన్నికల కమిషన్‌ను కోరామని, ఈ మేరకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశామని చెప్పారు. అయినా, మళ్లీ పింక్ బ్యాలెట్లు ముద్రిస్తామంటూ ఇటీవల సీఈవో రజత్‌కుమార్ ఇస్తున్న ప్రకటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం అధికారుల చర్యలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదని అర్ధమవుతోందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే బదులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచినట్టు ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేయవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. ఇంతమాత్రానికి ఎన్నికల పేరుతో ఈ ప్రహసనం ఎందుకని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో నూ పింక్ బ్యాలెట్ పేపర్లను అనుమతించబోమని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందన్నారు. -
‘ఆ టీవీ చానల్ చేసిన తప్పేంటి?’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ సింగ్ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. వినయ్ కుమార్ సింగ్‌కు ఎంత ధైర్యముంటే ఒక మీడియా సంస్థను కించపరుస్తూ ప్రకటన విడుదల చేస్తారంటూ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీడియా హౌస్‌ను సెక్స్ వర్కర్ అని అనటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా సంస్థను అనే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు. యధా రాజా తథా అధికారి అన్నవిధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రిపోర్టర్ని వంద అడుగుల లోతుకు పాతిపెడతా అన్నారని, ఈ రోజు జైళ్ల డీజీ మీడియా సంస్థను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘హెచ్‌ఎమ్‌టీవీ చేసిన తప్పేంటి?. చంచల్ గూడ జైల్ నుంచి పట్నాకు టేకును తరలించినందుకు స్టోరీ వేసింది. నువ్వు తప్పు చేయకుంటే హెచ్‌ఎమ్‌టీవీపై ఫిర్యాదు చెయ్యి.. లేదా ఇండియన్ జర్నలిస్టు యూనియన్‌కు, ప్రెస్ కౌన్సిల్ యూనియన్‌కు ఫిర్యాదు చెయ్యి, లేక కేసు పెట్టు. వినయ్ కుమార్ సింగ్ వ్యాఖ్యలు ఒక్క హెచ్‌ఎమ్‌టీవీపైనే చేసిన వ్యాఖ్యలుగా మేము భావించటం లేదు. అన్ని మీడియా సంస్థలను వినయ్ కుమార్ సింగ్ తిట్టినట్లే మేము భావిస్తున్నాం. డీజీపీ మహేందర్ రెడ్డి వెంటనే వినయ్ కుమార్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలి. వినయ్ కుమార్ సింగ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ‘ఎన్నికల సంఘానికి గులాబీ చీడ పట్టింది. రాష్ట్రంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగవని చెప్పడానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోలు సాక్ష్యం. మేము ఎంతగా మొత్తుకున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవటం లేదు. పోలింగ్ బూత్, బ్యాలెట్ పేపర్లకు గులాబీ రంగు కావాలని ఎన్నికల సంఘం ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల సంఘం ఇలా చేయటం కంటే గులాబీ పార్టీకే ఓటు వేయమని చెబితే మేలు కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియాపై అణచివేత ధోరణిలో వ్యవహరిస్తోంది. ఎన్నికల సంఘం గులాబీ పార్టీకి గులాంగా పనిచేస్తోంద’ని శ్రావణ్ ఆరోపించారు. -
‘కేసీఆర్ రైతు బంధు కాదు.. రాబందు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు! రైతు బంధు కాదని, రాబందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వటం లేదని, అందుకే కేసీఆర్.. ప్రజల తిరుగుబాటు నుంచి దృష్టి మరల్చేందుకు మరోసారి సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారని వ్యాఖ్యానించారు. అందువల్లే టీడీపీ, కాంగ్రెస్ పొత్తులపై మాట్లాడుతున్నారని అన్నారు. నాలుగున్నర ఏళ్లలో ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని మండిపడ్డారు. కేసీఆర్ నాలుగేళ్లుగా నిరుద్యోగులను మోసం చేసింది నిజం కాదా అని, ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగి ఉంటే.. ఈ నాలుగేళ్లు కేసీఆర్ ఏం చేశాడని ప్రశ్నించారాయన. కేసీఆర్ అందరిని బ్లాక్‌మేయిల్ చేస్తున్నారని అన్నారు. 21 లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ అర్హులు ఉంటే.. ఎంత మందికి కట్టించారో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వాళ్ళను మరోసారి కేసీఆర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆపద్ధర్మ సీఎం వ్యాఖ్యలను ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదని, ఈసీ సుమోటోగా తీసుకుని కేసులు పెట్టాలని కోరారు. -
ఏమిటీ తిట్ల దండకం?: దాసోజు శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో నాలుగున్నరేళ్ల పాలన గురించి చెప్పకుండా పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తిట్ల దండకానికి దిగడం ఏమిటని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నిలదీశారు. సోమవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరో అధికార ప్రతినిధి కిశాంక్ కలసి ఆయన మాట్లాడారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారంటూ దేశ తొలి ప్రధాని నెహ్రూపై కేసీఆర్ విమర్శలు గుప్పించారని, తద్వారా తెలం గాణ సెంటిమెంటును రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘పరిస్థితులనుబట్టి ఆంధ్ర, తెలంగాణను కలిపాం.. ఒకవేళ రెండు రాష్ట్రాల ప్రజలకు పొసగకపోతే విడిపోవచ్చు’ అని నె్రçహూ స్పష్టం చేశారని దాసోజు గుర్తుచేశా రు. అలాగే దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డిని దూషించడాన్ని కూడా తప్పుబట్టారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దు అనంతరం టీఆర్ఎస్ అధోగతి పాలవుతుందని గ్రహించి కేసీఆర్ అడ్డగోలుగా కాంగ్రెస్ నేతలపై మాటల దాడి చేస్తున్నారన్నా రు. ప్రజలకు హామీలివ్వడం, ఆ తర్వాత మాట మార్చడంలో కేసీఆర్ సిద్ధహస్తుడన్నారు. అపరి చితుడు, గజనీ చిత్రాల్లో పాత్రధారుల తరహాలో పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. -
‘కేసీఆర్‌కు జబ్బు చేసినట్టుంది’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా కేవలం కాంగ్రెస్ నాయకుల పైన దుర్మార్గంగా మాటల దాడి చేస్తున్న కేసీఆర్‌కు ఏదో మానసిక జబ్బు సోకిందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వాఖ్యానించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా బూతు పురాణం మాట్లాడడని అన్నారు. అహంకారంతో కళ్లుమూసుకుపోయిన కేసీఆర్ భారత రత్న నెహ్రు పైన కూడా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపారని పేర్కొంటూ కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల విలీన సమయంలో.. ఒకవేళ ప్రజలకు పొసగక పోతే ఆంధ్రప్రదేశ్ విడిపోవచ్చని నెహ్రూ చెప్పిన విషయాన్ని కేసీఆర్ ఎందుకు మరచిపోయాడని ఎద్దేవా చేశారు. పరిపాలన చేతకాక, ఇచ్చిన హామీలు నెరవేర్చక, ప్రజలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులపై అడ్డగోలుగా మాట్లాడుతున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో నాడు యువజన నాయకుడిగా ఎందుకు కొనసాగాడని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను ఎలా పెంచాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని గతంలో పేర్కొన్న కేసీఆర్.. ఇప్పుడు ‘తూ’ అంటున్నాడని విమర్శించారు. ‘నోటీ దూల ఉంటే మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నాయకులపై బూతు పురాణం మొదలు పెట్టు.. మా పార్టీ నాయకులపై నోరు పారేసుకుంటే మర్యాదగా ఉండదు’ అని శ్రవణ్ హెచ్చరించారు. వైఎస్సార్ సేవలు కనిపించడం లేదా.. రాష్ట్ర బడ్జెట్ 60వేల కోట్ల రూపాయలుగా ఉన్న రోజుల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని టీపీసీసీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ రోజు 2లక్షల రూపాయల రాష్ట్ర బడ్జెట్‌తో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి ఏ ఏపాటిదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 108,104, ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చినందుకా.. రింగ్ రోడ్డు వేయించినందుకా.. అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చినందుకా.. ట్రిపుల్ ఐటీ, ఆరోగ్యశ్రీ, లక్షల ఎకరాలకు నీళ్లు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినందుకా .. ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నావని కేసీఆర్‌ను దుయ్యబట్టారు. ‘ఓటర్ల నమోదులో జరిగిన అవకతవకలు కోసం ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. దొంగ ఓట్లను ఇంతవరకు సరిదిద్దలేదు. కంటోన్మెంట్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సాయన్న ఇద్దరు కూతుర్లలో ఒకరి ఓటు కంటోన్మెంట్లో.. మరొకరి ఓటు ముషీరాబాద్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోని ఓటర్ల జాబితా పరిస్థితికి ఇదే తార్కాణం’అని ఎద్దేవా చేశారు. -
టీఆర్ఎస్ పాలనలో హత్యల తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణగా రూపుదిద్దుతామని చెప్పిన టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం హత్యల తెలంగాణగా మారిందని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శిం చారు. విచ్చలవిడిగా నేరస్తులు కత్తులతో స్వైర విహా రం చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు నిస్తేజంగా వ్యవహరించడం దారుణమన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు గులాబీ పార్టీకి గులామ్‌లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్, అత్తాపూర్‌లో రమేశ్‌పై దాడులు చేసి చంపినా, ఎర్రగడ్డలో హత్యాయత్నాలు జరిగినా పోలీసుల యంత్రాంగం పసిగట్టే పరిస్థితిలో లేకపోవడం దారుణమన్నారు. నేషనల్ క్రైం బ్యూర్ ఆఫ్ రికార్డ్స్ నివేదిక ప్రకారం.. నేరాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలవడం సిగ్గుచేటన్నారు. నేరాలను పసిగట్టాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ.. ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యం చేయాలన్న దానిపై సీఎంకు సమాచారం చేరవేయడంలో నిమగ్నమైందన్నారు. సీఎం చేపట్టిన 11 సర్వేలకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకున్నారని దుయ్యబట్టారు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ రాజకీయ శిక్షణా తరగతులకు పోలీస్ బాస్ హాజరయ్యారని, ఒక రాజకీయ పార్టీ శిక్షణ కార్యక్రమంలో పోలీసు బాసులు ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మారుస్తున్నారని శ్రవణ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్, భిక్షమయ్యగౌడ్‌లపై అక్రమ కేసులు బనాయించారని.. ఇటు రేవంత్‌రెడ్డి, క్రిషాంక్ లాంటి నేతలను అదేవిధంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల లేఖలతో ఇష్టారాజ్యంగా పోలీసులను బదిలీలు చేశారని విమర్శించారు. ఇటీవల జరిగిన పోలీసు బదిలీలన్నీ రాజకీయ పోస్టింగ్‌లేనని.. తక్షణమే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని కేసీఆర్ చేతిలో బందీ అయిన పోలీస్ వ్యవస్థకు విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. -
‘వాళ్లు గులాబీ పార్టీకి గులాములుగా మారారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పోలీసులు అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాబేదార్లుగా మారారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు రాజ్యాంగానికి కాకుండా టీఆర్ఎస్కు రక్షణ ఉంటున్నారని ఆరోపించారు. గులాబీ పార్టీకి పోలీసులు గులాములుగా మారారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇంటెలిజెన్స్ విభాగం టీఆర్ఎస్ సర్వేలు చేయడానికే పరిమితమైందని అన్నారు. పోలీసులు కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు.తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో పోలీసులను ఏజెంట్లుగా పెట్టుకుని కేసీఆర్ గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తీరు చూస్తుంటే తెలంగాణలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. తక్షణమే ఎన్నికల కమిషన్ పోలీసులను తమ పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు జరపడంపై శ్రవణ్ స్పందించారు. రేవంత్ బలమైన నాయకుడని.. టీఆర్ఎస్ అతన్ని భయపెట్టడం ద్వారా కాంగ్రెస్ క్యాడర్‌ను భయపెట్టాలని చూస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీలు కుమ్మకై రేవంత్‌ను కేసులతో వేధిస్తున్నాయని ఆరోపించారు. -
‘ఏ అమరులు చెప్తే వారికి పదవులిచ్చారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన వారి గురించి మాట్లాడే నైతిక అర్హత టీఆర్ఎస్లో ఎవరికి లేదని కాంగ్రెస్ నాయకులు దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, మదన్‌మోహన్‌రావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు అమరుల పేరు చెబితే చనిపోయిన వారి ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. కేసీఆర్ నిరహార దీక్ష చేస్తే.. ఆత్మహత్య చేసుకుందామంటే హరీష్‌రావుకు అగ్గిపుల్ల కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ జాతి, నీతి లేని పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ అమరులు చెప్తే మహేందర్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకి మంత్రి పదవులిచ్చారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రౌడీల పార్టీ అని ఆరోపించారు. తెలంగాణ గౌరవాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు తాకట్టుపెట్టారని విమర్శించారు. విమర్శలు చేస్తే ఎన్నికలకు పోతామంటున్నారు.. అలాగైతే టీఆర్ఎస్ జీవితాంతం ఎన్నికలకు పోవాలని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటే మంచి.. కానీ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటే అనైతికమా అని ప్రశ్నించారు. 2009లో సీపీఎం, టీడీపీలతో టీఆర్ఎస్ పొత్తు ఎలా పెట్టుకుందని నిలదీశారు. తమది ప్రజల కూటమని.. దొంగల కూటమి కాదని తెలిపారు. తమ అధిష్టానం ఢిల్లీలో ఉందని.. మరి కేసీఆర్ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదని.. అందులో ఏ పేజీపైనైనా తాను చర్చకు సిద్దంగా ఉన్నట్టు వెల్లడించారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తామిచ్చిన తెలంగాణను పాలిస్తూ.. తామిచ్చిన మెట్రో ప్రారంభించి.. తామిచ్చిన ఇళ్లను ప్రారంభిస్తోందని విమర్శించారు. అమరుల కుటుంబాలను కాంగ్రెస్ పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన చేస్తుందని తెలిపారు. ఉద్యమ సమయంలో చేపట్టిన సాగర హారంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. అలీబాబా అరడజన్ దొంగల లెక్క తెలంగాణను టీఆర్ఎస్ దోచుకుంటుందని ఆయన ఆరోపించారు. మదన్మోహన్రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు కౌరవులైతే.. కాంగ్రెస్ నాయకులు పాండవులని అన్నారు. ఏం అభివృద్ధి చేశారని సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకెళతారని ప్రశ్నించారు. -
ప్రశ్నించడమే ‘ముందస్తు’కు కారణమైతే ఎలా?
ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ప్రశ్నించడం. అలా ప్రశ్నించడమే తప్పని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అంటున్నారు. అసెంబ్లీ రద్దును ప్రశ్నించినందుకే ప్రజలను, ప్రజాసంఘాలను ఆయన నిందిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెసే కారణమంటున్నారు. అసలు కారణం చెప్పడం లేదు. కేంద్రం, గవర్నర్, కేసీఆర్ కలిసి ముందస్తు ఎన్నికలకు తెర తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ పాత్ర అనుమానాస్పదంగానే ఉంది. రద్దుకు ముందు కేసీఆర్ బదిలీల ద్వారా నియమించుకున్న అధికారులు కూడా వారితో చేతులు కలిపితే తెలంగాణకు అపార నష్టం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు నవంబర్‌లో వస్తాయని అసెంబ్లీ రద్దు రోజే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన మాటలు నిజం కాకుండా ప్రజాస్వామిక వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం బలపడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అభిప్రాయాలు మార్చుకో వడం తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు నైజం. పెద్ద నోట్ల రద్దు సమ యంలో, జీఎస్టీ విష యంలో ఆయన మాట మార్చారు. ప్రజలకు మేలు చేస్తాయని చెబుతున్న జమిలి ఎన్నికలపై కూడా ఆయన మాటపై నిలబడలేదు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బీఎస్ చౌహాన్ రాసిన లేఖకు కేసీఆర్ జులై ఆరున జవాబిస్తూ జమిలి ఎన్నికలకు తాను అనుకూ లమని చెప్పారు. శాసనసభ, లోక్‌సభకు విడివిడిగా ఎన్నికల నిర్వహణ వల్ల నాలుగు నుంచి ఆరు నెలల కాలం అదనంగా వెచ్చించాల్సి వస్తోందని, జిల్లాల యంత్రాంగమంతా ఎన్నికల పనుల్లో మునిగి పోతుందని ముఖ్యమంత్రి తన లేఖలో చక్కగా వివ రించారు. జమిలి ఎన్నికలపై నిర్వహించిన సమావేశా నికి టీఆర్ఎస్ తరఫున హాజరైన ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కూడా తర్వాత జమిలి ఎన్నికలతో లాభాలుంటాయని, విడివిడిగా నిర్వహిస్తే నష్టాలుం టాయని మాట్లాడారు. అయితే, జమిలి ఎన్నికలపై తాను వెలిబుచ్చిన అభిప్రాయానికి వ్యతిరేకంగా సరిగ్గా రెండు నెలలకు సెప్టెంబర్ ఆరున కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయించారు. విడివిడిగా ఎన్నికలు జరిపితే రాష్ట్రానికి, ప్రజలకు, పార్టీలకు, అభ్యర్థులకు నష్టమని తన లేఖలో చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పరిస్థితి తీసుకొచ్చారు. ముందస్తు ఎన్నికల కారణంగా రాబోయే మూడు నెలల కాలం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సరిపోతుంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల సమయం పడుతుంది. తర్వాత వచ్చే ఆరు నెలల కాలంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల హడా వుడి ఉంటుంది. ఈ లెక్కన సుమారు ఏడాది కాలం జాతీయ, రాష్ట్ర ఎన్నికలకే సరిపోతుంది. ఈ సంవ త్సర కాలంలో ప్రభుత్వాధికారులు ఇతర పనులన్నీ వదిలేసి, యుద్ధప్రాతిపదికన జరిగే ఎన్నికల విధు ల్లోనే నిమగ్నమైపోవాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి అమలులోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అభివృద్ధి స్తంభించిపోతుంది. ప్రజా సంక్షే మంపై నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ప్రజా ధనం భారీగా ఖర్చవుతుంది. ఈ విషయాలన్నీ ఆప ద్ధర్మ సీఎంగా ఉన్న కేసీఆర్‌కు తెలుసని ఆయన లా కమిషన్‌కు రాసిన లేఖ చదివితే అర్థమవుతుంది. జమిలి ఎన్నికలు జనానికి మేలు చేస్తాయన్న తన అభిప్రాయం రెండు నెలలకే మార్చుకోవడానికి కారణాలేంటో కేసీఆరే చెప్పాలి. దాదాపు నాలుగైదు నెలలు ముందే వస్తున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా జరిగే నష్టాలకు తాను ఎందుకు ఆహ్వానం పలికా నన్న అంశంపై కేసీఆర్ వివరణ ఇచ్చి తీరాలి. జమిలి ఎన్నికలపై తన అభిప్రాయం ఎందుకు మారిందీ వివరించకుండా ముందస్తుకు తాను వెళ్లడానికి కారణం కాంగ్రెసేని కేసీఆర్ చెప్పడం ఆయన వక్ర రాజకీయ విధానానికి నిదర్శనం. తాను అసెంబ్లీని రద్దు చేయించబోతున్నాననే విషయంపై మీడియాకు లెక్కలేనన్ని లీకులు ఇచ్చారు. రద్దు ఎప్పుడు, ఎలా జరుగుతుందనే విషయంపై గంటలు, నిమిషాలవా రీగా మీడియాకు లోపాయికారిగా తెలిపి మరీ అసెం బ్లీని రద్దు చేశారు. ఈ పనికి ముందు ప్రగతి నివేదన పేరుతో తన బలప్రదర్శనకు ప్రయత్నించారు. ఇది విజయవంతం కాకున్నా తన కార్యక్రమంలో మాత్రం మార్పు లేకుండా శాసనసభను రద్దుచేయించారు. తన ప్రభుత్వాన్ని, అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి మాత్రం కారణం తాను కాదని, కాంగ్రెసేనని చెప్పడం కేసీఆర్‌కే చెల్లింది. కాంగ్రెస్ తాను ఏం చేసినా నిలదీస్తోందని, తన నిర్ణయాల వెనుక ఉండే నిజాల నీడల జాడలను వెతుకుతోందని, ఒక్క మాటలో చెప్పాలంటే అడుగ డుగునా తనను ప్రశ్నిస్తోందని కేసీఆర్ ఆక్రోశించారు. ఆయన మాటలే నిజమనుకున్నా, బాధ్యతగల ప్రతి పక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పే ముంది? నేడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నా, రేపటి ఎన్నికల తర్వాత ఆ స్థానంలోకి టీఆర్ఎస్ రావచ్చు. కాని, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా దాని ప్రధానమైన పని ప్రశ్నించడమే. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చు కోవడానికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌పై నింద లేస్తున్నారు. కేసీఆర్ స్వయంగా చెప్పిన విషయాలను బట్టి కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిన ఐదేళ్లలో తొలి ఆరు నెలల కాలం ఏమీ అర్థం కాని అయోమయస్థితిలో వృథాగా పోయింది. ముందస్తు రద్దు కారణంగా మరో పది నెలలు గడచిపోయాయి. ఈ లెక్కన ఐదు సంవత్సరాల్లో ఏడాదిన్నర కాలాన్ని ముఖ్యమంత్రి తన అసమర్ధత కారణంగా వృథా చేశారు. ఇప్పుడు లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకే సారి జరగని పరిస్థితిని సృష్టించడంతో భవిష్యత్తులో జరిగే ఎన్నికలు కూడా విడివిడిగా నిర్వహించక తప్పదు. జమిలి ఎన్నికలను పక్కన పెట్టి తాను విడిగా ఎన్నికలకు వెళ్లాలనుకునే పథకం వెనుక కుట్ర కోణం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార దుర్వి నియోగం చేసి, సానుకూల ఫలితాలు సాధించడం ఆయన ప్రధాన ఉద్దేశం. ఇందుకు అసెంబ్లీ రద్దు ప్రకటనకు ముందే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసిన రెండు పడకగదుల ఇళ్లు, మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలు అనే ప్రధాన హామీలను నెరవేర్చక పోయినా, మళ్లీ ఎలాగైనా అధికారం దక్కించుకోవా లని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అధికారుల పనితీరును బట్టి కాకుండా తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు జరిగాయి. శాసనసభ రద్దుకు మంత్రివర్గ తీర్మాన లేఖను గవర్నర్‌కు ఇచ్చిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు విషయంలో ఏం చేయాలనే అంశంపై గవర్నర్ కేంద్రాన్ని సంప్రదించలేదు. ఆప ద్ధర్మ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు బాధ్య తలు వెంటనే అప్పగించడం, సంబంధించిన ఉత్త ర్వులు మీడియాకు అందడం క్షణాల్లో జరిగిపో యాయి. ఎన్నికలు నవంబర్‌లో వస్తాయని అసెంబ్లీ రద్దు రోజే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన మాటలు నిజం కాకుండా ప్రజాస్వామిక వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం బలపడేలా చర్యలు తీసుకోవా ల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. వ్యాసకర్త టీపీసీసీ ప్రధాన కార్యదర్శి -దాసోజు శ్రావణ్ -
ముందస్తుపై సమాధానం చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని గతంలో చెప్పిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అర్ధంతరంగా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలపై జూలై 6న లా కమిషన్‌కు లేఖ రాసిన కేసీఆర్, సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు దిగారని, అందుకు కారణాలను చెప్పకుండా దాటవేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలతో కేసీఆర్‌కు భయం పట్టుకుందని, టీఆర్ఎస్కు ఓట్లు దక్కవన్న భయంతో తొమ్మిది నెలల ముందే ఎన్నికలకు పరుగులు పెడుతున్నారన్నారు. జమిలి ఎన్నికలకు నాలుగు నుంచి ఆర్నెళ్లలోపు ఎన్నికల కోడ్ ఉండగా, ప్రస్తుతం ఈ పరిస్థితి ఏడాదికి పెరిగిందన్నారు. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడి పురోగతి మందగిస్తుందన్నారు. తొమ్మిది నెలల ముందు ప్రభుత్వాన్ని రద్దుచేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఒక్కతాటిపైకి వచ్చి పరిస్థితిని ఎదుర్కోవాలన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయనే కుంటిసాకులతో ఆయన ముందస్తుకు పోతున్నానంటూ సరికొత్త డ్రామాకు తెరలేపారని శ్రవణ్ విమర్శించారు. పదినెలల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అవకాశమున్నప్పటికీ వారి ఆశలను వమ్ముచేయడమేగాక, త్యాగం చేసినట్లు నటిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి, రవళి తదితరులు పాల్గొన్నారు. -
నవీన్ మిట్టల్ మిలీనియం బ్రోకర్: దాసోజు శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాలేజీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఉపా ధ్యాయ, లెక్చరర్ల బది లీల్లో అనేక అవకతవ కలు జరిగాయని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మరో మారు ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బదిలీల్లో అవకతవకలను ఎత్తిచూపుతూ ముఖ్య మంత్రికి లేఖ రాస్తే, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తమ మీద దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. మిట్టల్ వేల కోట్ల అవినీతికి ఆద్యుడని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు అత నిపై ఎలాంటి చర్యల్లేవన్నారు. మిట్టల్ ఒక మిలీ నియం బ్రోకర్ అని ధ్వజమెత్తారు. మిట్టల్ అవి నీతిపరుడని, ఆయన తర్వాత వచ్చిన హైదరా బాద్ కలెక్టర్ గుల్జార్ చెప్పారని తెలిపారు. ఆన్ డ్యూటీలో పంపామని చెబుతున్న అంశంలో ఓపెన్ నోటిఫికేషన్ ఎందుకివ్వలేదని ప్రశ్నించా రు. వెబ్ కౌన్సెలింగ్‌లో ఇచ్చిన పోస్టింగులను తర్వాత ఎందుకు మార్చారని ప్రశ్నించారు. -
టీచర్స్ ట్రాన్స్ఫర్లలోనూ అవినీతి: దాసోజు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీచర్స్, లెక్చరర్స్ బదిలీల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు ఓ బహిరంగ లేఖరాశారు. విద్యాబుద్దులు నేర్పి సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన విద్యాశాఖలో కూడా అవినీతి జరగడం దారుణమన్నారు. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత కూడా భార్యాభర్తల కు సంబంధించిన అంతర్ జిల్లా బదిలీలకు అనుమతి ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. 2018 జూన్ 6 న మొదలుపెట్టి నెలరోజుల పాటు నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీలను వెబ్ కౌన్సెలింగ్‌తో విజయవంతంగా ముగించామని చెప్పుకుంటున్నారని, కానీ అంతర్జిల్లా బదిలీలకు అవకాశం ఇవ్వక పోవడం వెనుక ఉద్దేశాలేంటో అర్ధం కావడం లేదన్నారు. ‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యేలేదు’ అన్నట్లుగా ఓ వైపు ప్రభుత్వం జీవో విడుదలచేసినా విద్యాశాఖ ఎందుకు అంతర్జిల్లా బదిలీలను చేపట్ట లేకపోయిందో సమాధానం చెప్పాలని సీఎంను ప్రశ్నించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని మరిచిపోయారన్నారు. సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని ట్రాన్స్ ఫర్ చేస్తామని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారని ప్రశ్నించారు. నోటిపికేషన్ విడుదల చేయకుండా ఉద్యోగాలను భర్తీచేయకుండా గెస్ట్ లెక్చరర్ల పేరిట కళాశాలలను నడుపుతున్నారని, ఇలా పూర్తి స్ధాయి లెక్చరర్లు , ప్రిన్సిపాల్ లేకుండా ఇంచార్జీలతో కాలం వెళ్లదీస్తుంటే నాణ్యమైన విద్య ఎలా అందుతుందో చెప్పాలని నిలదీశారు. -
52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అసమర్థత కారణంగానే బీసీలకు రిజర్వేషన్లు దక్కటం లేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించటంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని కేసీఆర్ అనటం బట్ట కాల్చి మీదెయ్యటమేనని, ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని వెంటనే సవరించి బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. ‘నేను అన్యాయం చేస్తా కోర్టులు కూడా న్యాయం చెయ్యొద్దు అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. 1999లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే పెట్టడం ఎలా న్యాయం అవుతుంది? కుల గణన చేయకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? తెలంగాణలో 52 శాతం బీసీలు ఉన్నారని సమగ్ర సర్వేలో మీరే చెప్పి ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు చాలని ఎలా అంటారు? మిగిలిన 18 శాతం వారికి అక్కర్లేదా?’ అని శ్రవణ్ ప్రశ్నించారు. కోర్టులో మీ వ్యవహారాన్ని తప్పుబడుతున్న సందర్భంగానైనా కళ్లు తెరవాలని సూచించారు. సీఎం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత బీసీ సంఘాల మీద ఉందని అభిప్రాయపడ్డారు. 52 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతు ఉందని, ఇదే విషయాన్ని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనేక వేదికల మీద ప్రకటించారని తెలిపారు. కోర్టుకు కులాల వెనుకబాటుతనం గురించి సరిగా వివరిస్తే న్యాయం చేయెద్దని అంటారా అని ప్రశ్నించారు. బీసీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఉద్యమంలో.. రాష్ట్రం వస్తే అస్తిత్వం వస్తాదని పోరాడిన చిన్న చిన్న కులాలకు రిజర్వేషన్లు అక్కర్లేదా అని ప్రశ్నించారు. రాజకీయ అంటరానితనం అనుభవిస్తున్న తాను ఈ కేసు వేసినట్టు తెలిపారు. -
మేధావుల భాగస్వామ్యంతో మేనిఫెస్టో!
సాక్షి, హైదరాబాద్: దేశ సుస్థిర అభివృద్ధికి మేధావుల సహకారంతో 2019 ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో తయారుచేస్తుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. నిపుణుల సహకారంతోనే సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు సాధ్యమవుతాయని, ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా, వారి సూచనలు దేశాభివృద్ధికి ఎంతో సహకరిస్తాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో తయారీలో భాగంగా ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్స్ సింపోజియం జరిగింది. ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు శ్రవణ్ దాసోజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మేధావులు, పర్యావరణవేత్తలు హాజరై సలహాలు అందించారు. సింపోజియాలతో మంచి సలహాలు.. కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ భారత ప్రొఫెషనల్ కాంగ్రెస్ సమన్వయకర్త గీతారెడ్డి హాజరయ్యారు. సామాజిక న్యాయం, సుస్థిర అభివృద్ధి కోసం మేధోమథనం ఎంతో ఉపకరిస్తుందని ఆమె చెప్పారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సింపోజియాలు మంచి ఫలితాలిస్తున్నాయని, దేశ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దే మంచి సలహాలు వస్తున్నాయని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత కాపాడటం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. పర్యావరణాన్ని కాపాడలేకపోతే దేశవనరులను కాపాడలేమని అభిప్రాయపడ్డారు. సమస్యలపై చర్చ జరగట్లేదు.. సుస్థిర అభివృద్ధిలో రాజకీయ పార్టీల పాత్ర అనే అంశంపై జౌళి బోర్డు సభ్యుడు దొంతి నర్సింహారెడ్డి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలతో నిరంతర చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుందని చెప్పారు. దేశంలో ఉన్న అనేక సమస్యలపై చర్చ జరగట్లేదని, సగటు మనిషికి అవసరమయ్యే ప్రజాపంపిణీ నుంచి మంచినీటి సరఫరా వరకు ఎన్నో సమస్యలెదురవుతున్నా ఎలాంటి చర్చలు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్చలను రాజకీయ పార్టీలు పట్టించు కోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ సుబ్బారావు మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు మెరికల్లాంటి రాజకీయ నిర్వాహకులు కావాలని అన్నారు. ఎప్పటికప్పుడు కొత్త అంశాలను కలుపుకొని అభివృద్ధి లక్ష్యాలను చేరే ప్రణాళికలకు రూపకల్పన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పంట భూములున్నా నీళ్లులేక రైతులు సాగుచేయలేక పోతున్నారని ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయంలో విపరీతంగా రసాయనాల వాడకం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని, దీనిపై రాజకీయ పార్టీలు తమ విధానాలను రూపొందించుకోవాలని సూచించారు. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలివ్వాలని, ఇందుకు పోరాడుతున్నామని, ఇంటి నుంచి మొదలైన వివక్ష అడుగడుగునా కొనసాగడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలని లింగ సమానత్వం కోసం పోరాడుతున్న శ్రావ్యరెడ్డి అభిప్రాయపడ్డారు. చెప్పిందొకటి... చేస్తున్నదొకటి రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల అమలులో నిర్లక్ష్యం చూపడం దురదృష్టకరమని దాసోజు శ్రవణ్ అన్నారు. ఎన్నికల్లో ఓట్లేయించుకోవడం కోసం ప్రజాకర్షక మేనిఫెస్టోలు ప్రజల ముందుకు తెచ్చి ఓట్లు దండుకున్నాక, వాటిల్లోని అంశాలను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటి చెప్పి, అధికారంలోకి వచ్చాక ఇంకోటి చేశారని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, మేధావుల సలహాలు, సూచనలతో తెలంగాణ అభివృద్ధి నమూనాను తయారుచేసి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో సయ్యద్ అహ్మద్ అమీరుద్దీన్, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ సికింద్రాబాద్ అధ్యక్షుడు ఇర్ఫాన్ అజీజ్, ఉస్మానియా విశ్వవిద్యాలయ నాయకురాలు బాలలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, తులసీరావు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం’
సాక్షి, హైదరాబాద్ : చట్ట సభలు, గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తప్పుడు లెక్కలు చూపి పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మరింత అణిచివేసే ధోరణిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్దంగా అణగారిన వర్గాలకు న్యాయం చేసేలా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 52శాతం అని చెప్పి.. ఇప్పుడు 34శాతం అని తప్పుడు లెక్కలు చూపుతూ బీసీలకు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్నికులాల గణాంకాలను ఇంటింటికి తిరిగి మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఏ,బీ,సీ,డీ ఈ ప్రాతిపదికగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తే బీసీలకు అన్యాయం జరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారికంగా బీసీల రిజర్వేషన్ శాతాన్ని విడుదల చేయాలన్నారు. న్యాయం కోసమై బీసీ కులాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. -
అప్పుడూ ఎస్మా అనుంటే...
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఉద్యమ నేతగా చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాలికొదిలేసి, ఉద్యమాలు చేస్తే ఉద్యోగాలు తీసేస్తామనే స్థాయికి సీఎం కేసీఆర్ దిగజారారా అని ప్రశ్నించింది. ఆదివారం ఈ మేరకు కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. అప్పటి పాలకులు మీలాగే ఎస్మా, గిస్మా అని ఉంటే ఉద్యమం జరిగేదా, తెలంగాణ వచ్చేదా, అని ప్రశ్నించారు. ఆర్టీసీపై ఉమ్మ డి పాలకులు నిర్లక్ష్యం చేశారని ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు చెప్పిన మీరే.. ఇప్పుడు అదే దారిలో నడుస్తారా అని నిలదీశారు. దేశంలో ఒక్క మన ఆర్టీసీనే నష్టాల్లో లేదని, చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీలు నష్టాల్లోనే ఉన్నాయన్నారు. ఉచిత బస్సు పాస్‌ల రీయింబర్స్మెంట్, ఇంధన నష్టాలు, అప్పులపై వడ్డీలు ఆర్టీసీపై రుద్దుతున్నారని ఆరోపించారు. -
బీసీలకు అన్యాయం చేస్తున్నారు: దాసోజు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయ బద్ధమైన వాటా రావాలంటే బీసీ జనాభా గణన శాస్త్రీయంగా చేపట్టాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బీసీ సాధికారిక కమిటీ సభ్యుడు దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని లోపభూయిష్టంగా తయారు చేశారని, పరస్పర విరుద్ధ అంశాలను చట్టంలో పొందుపరిచారని ఆయన విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 15 రోజుల్లో జనాభా లెక్కలు చేపట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్నారని, 12 వేల పంచాయతీల్లో జనాభా గణనకు 15 రోజులు సమయం ఎలా సరిపోతుందని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అధికారికంగా తేలిన 52 శాతం ప్రకారం బీసీలకు పంచాయతీరాజ్ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తామంటే ఎస్మా ప్రయోగిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించడం రాజ్యాంగ విరుద్ధమని శ్రవణ్ అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. -
అధిక పన్నుల్లో మీరే ఆదర్శం: దాసోజు
సాక్షి, హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తులపై అత్యధిక పన్నులు వేసి ప్రజలను వేధించడంలో సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 120 డాలర్లు ఉన్నప్పుడు రూ.68, రూ.53 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు బ్యారెల్ ధర 79 డాలర్లకు తగ్గినప్పుడు రూ.84, రూ.74కు ఎందుకు పెరిగాయో చెప్పాలని నిలదీశారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని 22 రాష్ట్రాల కన్నా ఎక్కువ పన్ను విధిస్తున్న రాష్ట్రం తెలంగాణే అన్నారు. 16 నుంచి 18 శాతం వరకు ఇతర రాష్ట్రాల్లో పన్నులుంటే తెలంగాణలో పెట్రోల్‌పై 35.02 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్నులను విధించడం న్యాయమా అంటూ ప్రశ్నించారు. -
మోదీ, అమిత్ డైరెక్షన్లోనే కేసీఆర్ నాటకం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్షన్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ నాటకానికి తెరలేపారని పీసీసీ ముఖ్యఅధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తన అస మర్థ, అవినీతి, నియంత పాలనతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రజలను భ్రాంతికి గురి చేసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం దాసోజు పలువురు జాతీయ స్థాయి నేతలకు లేఖలు రాశారు. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నారంటూ తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, డీఎంకే నేత స్టాలిన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌లకు వేర్వేరుగా లేఖలు పంపారు. బీజేపీ వ్యతిరేక వర్గాలను వంచించి, విభజించి తద్వారా కాంగ్రెస్‌కు నష్టం కలిగించడం ద్వారా మోదీని తిరిగి గద్దెనెక్కించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడగకముందే బీజేపీ అభ్యర్థులకు కేసీఆర్ మద్దతు తెలిపారని, నోట్లరద్దును స్వాగతించారని, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే అది చర్చకు రాకుండా పార్లమెంట్‌ను అడ్డుకున్నారని వివరించారు. పార్టీ ఫిరాయింపులు, అవినీతితో కేసీఆర్ అణచివేత పాలన సాగిస్తున్నారని, అటువంటి కేసీఆర్ మాటలను విశ్వసించి ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. -
మంత్రిపై చర్యలేవి; ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాసోజు
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. మంత్రి ప్రైవేటు భూములను కొనుగోలు చేసి.. ప్రభుత్వానికి ఎక్కువ ధరకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గతంలో మీడియాలో వచ్చిన వార్తలను ఆయన గుర్తుచేశారు. ఇది జరిగి మూడు రోజులైనా.. సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని శ్రవణ్ విమర్శించారు. సాక్ష్యాలతో సహా మాట్లాడినా మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ నిలదీశారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చాలని చూస్తోందని ఆరోపించారు. ఈవిషయాన్ని చీఫ్ విజిలెన్స్ ఆఫ్ ఇండియా, లోకాయుక్త దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సైదు రెడ్డికి హుజూర్ నగర్ సీటు.. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి డబ్బులు అన్న చందాన క్విడ్‌ప్రో కో జరుగుతోందని ఆరోపించారు. అన్ని అంశాలపై ట్విటర్లో స్పందించే మంత్రి కేటీఆర్, జగదీశ్‌రెడ్డి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. -
ఇసుక మాఫియాదే రాజ్యం
సాక్షి, హైదరాబాద్: కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో రూ.30 కోట్ల విలువైన ఇసుక అక్రమ రవాణాకు గురైందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్టులో 7 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపి, నది వరకు రోడ్డు వేశారని, దీని ద్వారానే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై మైనింగ్ మంత్రి కేటీఆర్‌కు కళ్ళు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. సినీ పరిణామాలపై టాస్క్‌ఫోర్స్: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: సినిమా పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం జోక్యం చేసుకుని టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమలో జరుగుతున్నది ఆరోగ్యకరమైన పరిణా మం కాదని, మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. డ్రగ్స్ కేసు ఎంత వరకు వచ్చిందో ప్రభుత్వానికి కూడా తెలియదని పేర్కొన్నారు. మంత్రి తలసాని కాంగ్రెస్ పార్టీని తిట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. -
‘కాగ్’ నివేదికపై చర్చకు సిద్ధమేనా?
సాక్షి, హైదరాబాద్: ‘కాగ్’నివేదికతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ బండా రం బయటపడిందని, దీనిపై టీఆర్ఎస్ నాయ కులకు దమ్ముంటే అమరవీరుల స్మారకస్థూపం వద్ద బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చెప్పిన అంశాలు కాగ్ నివేదికతో నిజమని తేలిందన్నారు. దేశంలోనే అప్పులను ఆదాయంగా చూపిన సన్నాసి ప్రభుత్వం కేసీఆర్‌దేని మండిపడ్డారు. లెక్కల్లో తప్పులు, అవకతవకలు కారణంగా చాలామంది జైళ్లలో ఉన్నారని, సీఎం కేసీఆర్‌కూ ఇదే వర్తిస్తుందని శ్రవణ్ హెచ్చరించారు. ఐపీసీ సెక్షన్ 409 ప్రకారం కేసీఆర్‌కు జీవిత ఖైదు శిక్ష పడుతుందన్నారు. ఎవరైనా అభివృద్ధి కోసం అప్పులు చేస్తారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కమీషన్ల కోసం చేసిందని విమర్శించారు. దీనిపై త్వరలోనే నీతిæఆయోగ్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. -
‘గన్మెన్లను తొలగించడం దారుణం’
సాక్షి, హైదరాబాద్ : నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గన్మెన్లను తొలగించడం దారుణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డిని టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు బోడెపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారని, ఇప్పుడు ఆయనకు ఏమైన అయితే ప్రభుత్వానిదే బాధ్యత వహించాలన్నారు. కోమటిరెడ్డికి ప్రాణ హాని ఉందని గతంలోనే ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఇలాంటి కక్ష్యపూరిత నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వపు నీతిమాలిన చర్య అసెంబ్లీలో జరిగిన సంఘటనలో కేవలం కోమటిరెడ్డి విసిరిన విజువల్స్ మాత్రమే చూపిస్తున్నారని, స్వామిగౌడ్‌కి తాకిన విజువల్స్‌ని చూపించడంలేదని శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వపు దిక్కుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ నీతిమాలిన చర్యతోనే అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. న్యాయంగా వీడియో ఫుటేజ్‌లను ఇస్తామని చెప్పిన ప్రకాశ్ రెడ్డిని ప్రభుత్వం అవమానించిదన్నారు. కేసీఆర్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం న్యాయంగానే సస్పెండ్ చేస్తే సాల్వే వంటి అత్యంత ఖరీదైన అడ్వకేట్ ఎందుకని ప్రశ్నించారు. బీసీలు అయినా మధుసూదనాచారి, స్వామిగౌడ్‌లను పావులుగా మార్చుకొని ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. -
కేటీఆర్ కోసమే థర్డ్‌ఫ్రంట్ డ్రామా
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు కేటీఆర్‌ను రాజకీయ వారసుడిగా చేసేందుకే సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ డ్రామా కు తెరలేపారని టీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపిం చారు. కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయాలనే ఎత్తుగడలో భాగమే థర్డ్‌ఫ్రంట్ అని విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రం ట్ ఏర్పాటు నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకోవడం వెనుక కేటీఆర్ రాజకీయ భవిష్యత్తే కీలకమని ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు ఉనికి ఉండబోదని, ఎవరూ గుర్తించే స్థాయిలో కూడా ఆయన రాజకీయ ఎత్తుగడలు లేవని, నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు వత్తాసుపలికి ఇప్పుడు ఒక్కసారిగా విమర్శలు చేస్తే మద్దతు ఇచ్చేయడానికి ప్రజలేమీ అమాయకులు కాదని అభిప్రాయపడ్డారు. -
సోషల్ మీడియా దాడులు.. కాంగ్రెస్‌లో కలకలం!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో కొందరు ‘సోషల్ మీడియా’గేమ్ ఆడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలో, మరెవరో అన్న దానిపై స్పష్టత లేదుగానీ.. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా ‘మైండ్ గేమ్’ఆడుతున్నారు. కొద్దిరోజుల కింద రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రాబబుల్స్ జాబితా అంటూ సోషల్ మీడియాలో ఓ జాబితా చక్కర్లు కొడితే.. తాజాగా పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ట్వీటర్ ఖాతా పేరిట పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి కలకలం సృష్టించారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. మొన్న జాబితా.. నేడు ఫిరాయింపు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న కొందరు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. గత సోమవారం వాట్సాప్‌లో రెండు పేజీలతో కూడిన ఓ జాబితా వైరల్ అయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రాబబుల్స్ అంటూ 60 అసెంబ్లీ స్థానాలకు 66 మంది పేర్లను ఆ జాబితాలో పెట్టారు. ఇందులో చనిపోయిన వారి పేర్లు, కనీసం పరిగణనలో కూడా లేని పేర్లు ఉన్నాయి. అయినా ఆయా స్థానాల్లో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. నాయకుల్లో కంగారు మొదలైంది. దీంతో ఆ జాబితాకు, పార్టీకి సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ హడావుడి ముగిసిందో లేదో మరో వివాదాస్పద పోస్టు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్‌లో రెడ్ల ఆధిపత్యం నడుస్తోందంటూ.. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, బీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌కుమార్ పేరిట ట్వీటర్లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ‘కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రెడ్ల ఆధిపత్యంలో ఇమడలేక పార్టీ వీడాలని నిర్ణయించుకున్నా..’’అని ఆ పోస్టులో ఉండడంతో.. శ్రవణ్ నిర్ఘాంతపోయారు. తనకు సంబంధం లేకుండా, తన పేరిట ట్వీటర్లో చేసిన ఈ పోస్టింగ్‌పై ఆయన పోలీసులను ఆశ్రయించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌తో కలసి సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మొత్తంగా వరుసగా జరుగుతున్న ‘సోషల్ మీడియా’దాడులతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ హస్తముందంటున్న కాంగ్రెస్ అయితే వివాదాస్పద పోస్టింగుల వెనుక అధికార టీఆర్ఎస్ హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కుట్ర రాజకీయాలు చేస్తూ తప్పు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. కానీ ఈ నకిలీ జాబితాలు, పోస్టింగుల వెనుక ఎవరున్నారనేది పోలీసులే తేల్చాల్సి ఉంది. టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు: శ్రవణ్ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన దాసోజు శ్రవణ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇప్పుడే ఎదుగుతున్న బీసీ నాయకుడినైన తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జయశంకర్ అడుగు జాడల్లో, మారోజు వీరన్న సిద్ధాంతాలతో ముందుకు వెళుతున్న తన ఉద్యమ స్ఫూర్తిని ఈ చిల్లర ప్రచారాలు ఆపలేవన్నారు. ఇలాంటి తప్పుడు విధానాలకు తెలంగాణ సమాజం పట్టం కట్టదన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గ్రహించాలని వ్యాఖ్యానించారు. -
కువైట్‌లో తెలంగాణవాసుల అవస్థలు!
సాక్షి, హైదరాబాద్: గల్ఫ దేశమైన కువైట్‌లో తెలంగాణవాసులు యాభైవేల మందికిపైగా నానా ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ తెలిపారు. ఆ దేశ రాయబార కార్యాలయం వద్ద వారు పడిగాపులు పడుతూ.. స్వదేశం వచ్చేందుకు.. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి.. వారికి సాయం చేయాలని డిమాండ్ చేశారు. కువైట్‌కు ప్రత్యేక బృందాన్ని పంపి.. అక్కడి తెలంగాణ వారిని ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. వారికి ప్రభుత్వమే ఉపాధి.. పునరావాసం కల్పించాలన్నారు. ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసుల గురించి టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. మంత్రుల గల్ఫ్ పర్యటనలు జల్సాలకు .. బతుకమ్మ సంబరాలకే పరిమితమవుతున్నాయని దుయ్యబట్టారు. ఎందుకు ప్రభుత్వం ఎన్నారై పాలసీ రూపొందించడంలో జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో గల్ఫ్ బాధితుల కోసం సంక్షేమ చట్టాన్ని రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం వెయ్యి కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయాలని, గల్ఫ్ వెళ్లే వారికి బ్యాంక్స్ నుంచి ఋణం ఇప్పించాలని అభ్యర్థించారు. గల్ఫ్ కార్మికుల కోసం సర్కార్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. పీసీసీ నుంచి ఒక బృందం బాధితులకు సాయం అందించేందుకు గల్ఫ్ వెళ్ళనుందని, గల్ఫ్ బాధితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశామని తెలిపారు. -
గొంతు నొక్కడమే: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని వేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం 506, 507 సెక్షన్లను సవరిస్తూ నిర్ణయం తీసుకుందని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను హరించే హక్కు సీఎం కేసీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. కోర్టు అనుమతి లేకుండానే విచారించి, జైలులో పెట్టే హక్కును పోలీసులకు ఇవ్వడం అంటే, పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాయడమే నన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసులు పెట్టడానికి, జైలులో పెట్టడానికే ఈ చట్ట సవరణ ఉపయోగపడుతుందన్నారు. అన్యాయాలను అరికట్టడానికి, అవినీతిని నిర్మూలించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలని కోరారు. ప్రజా స్వామ్యంపై సీఎం కేసీఆర్‌కు విశ్వాసం లేదని చెప్పారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కోర్టు ముందు నిలబడవని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో నిలదీస్తామని శ్రవణ్ అన్నారు. -
సీఎం తోటమాలి.. ఆ హక్కు లేదు!
సాక్షి, హైదరాబాద్: పరుష పదజాలం ఉపయోగించిన వారిపై కేసులు నమోదుచేసేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు తీరుపై టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. ఐపీసీ సెక్షన్లు 506, 507ను క్రిమినల్, నాన్ బెయిలబుల్ కేసులగా మార్పు చెయ్యడం నియంతృత్వ చర్యనని విమర్శించారు. సోషల్ మీడియాను నియంత్రించాలనుకోవడం కేసీఆర్ తుగ్లక్ చర్య, దూరహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. శాశ్వత వ్యవస్థలను చెడగొట్టే హక్కు తోటమాలిగా ఉండే సీఎంకు లేదని, సీఎం ఎవరైనా.. వస్తారు పోతారు.. ఎవరో తలకు మాసిన వారు ఇచ్చిన న్యాయ సలహా ఇదని విమర్శించారు. ఈ విషయంలో మరోసారి న్యాయవ్యవస్థ నుంచి మొట్టికాయలు తప్పవని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారానే నిర్భయ చట్టం వచ్చిందని, తెలంగాణ ఉద్యమానికి అండ దండ లభించిందని గుర్తుచేశారు. మీడియాను బెదిరించి ప్రభుత్వ వ్యతిరేక వార్తలను నిలవరించినట్టే.. సామాజిక మాధ్యమాల మీద సీఎం పడ్డారని విమర్శించారు. నాడు ఉద్యమంలో సోషల్ మీడియా పాత్ర భేష్ అని పేర్కొన్న సీఎం.. ఇప్పుడు దాన్నే నియంత్రించాలనుకోవడం దారుణమన్నారు. ‘ధర్నా చౌక్ ఉండొద్దు.. నిరసన హక్కు ఉండొద్దు అంటున్నారు. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం ఉందా, లేక కల్వకుంట్ల రాజ్యాంగం ఉందా? ఈ ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడుతాం. తెలంగాణ ను పోలీస్ రాజ్యంగా మారుస్తారా? మీరు మాట్లాడిన భాష ఎలా ఉంది? దానికి సమాధానం ఏమిటి, మీ ఎమ్మెల్యేలు బెదిరింపుల మాట ఏమిటి? మీ మీద ఎన్నిసార్లు ఎన్ని కేసులు పెట్టాలి? ఆర్టీసీ ఉద్యోగి సంజీవ్ ఏం తప్పు చేశాడని తొలగించారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అడగటం తప్పా’ అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. -
అవినీతి లేకుంటే లోక్‌పాల్ బిల్లు తెస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అవినీతి లేదని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, అదే నిజమైతే కర్ణాటక తరహాలో రాష్ట్రంలో లోక్‌పాల్ బిల్లును తీసుకురాగలరా అని పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నీతివంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్, పచ్చి అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తమ అవినీతిని, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్నారని ఆరోపించారు. ధర్నా చౌక్ లేకుండా చేయడమేకాక, ప్రజాస్వామిక నిరసనలకు అవకాశం లేకుండా నియంతృత్వ ధోరణిని కనబరుస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రూ.60 వేల కోట్ల అప్పులుంటే గడిచిన మూడేళ్లలోనే రూ.90 వేలకోట్లు అప్పు చేశారన్నారు. తెలుగుతల్లి లేదని చెప్పిన కేసీఆర్, అదే తెలుగు భాష కోసం రూ.200 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో ఉంటున్న సీమాంధ్ర పెట్టుబడిదారులకు సన్మానాలు చేస్తున్నారని విమర్శించారు. అలాగే ఉద్యమ కాలంలో కబ్జాకోరులుగా ఉన్న సినిమా నిర్మాతలు, నటులు తెలంగాణ రాష్ట్రంలో సన్మానాలు చేయించుకుంటున్నారని అన్నారు. -
తెలుగు ఉత్సవాలా? తెలంగాణ ఉత్సవాలా?
సాక్షి, హైదరాబాద్: తెలుగుతల్లి, తెలంగాణ తల్లి వేర్వేరు అని మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సభలు తెలంగాణ సభలా, తెలుగు సభలా అనేది చెప్పాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలుగుతల్లి లేదని, తెలంగాణ ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే తెలుగుతల్లి ఏం చేసిందని ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. పుంటికూర–గోంగూర, ఆనపకాయ–సొరకాయ వేర్వేరు అని, తెలుగుతల్లి, తెలంగాణ తల్లి కూడా వేర్వేరు అంటూ మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నాడని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. తెలుగు మహాసభలను బహిష్కరించాలని అప్పుడు చెప్పిన కేసీఆర్, ఇప్పుడు నిర్వహిస్తున్నందుకు ముందుగా తెలంగాణ తల్లికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఊరూరా పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏం చేద్దామో చెప్పాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’గీతం ఉంటుందా అని ప్రశ్నించారు. గద్దర్, అందెశ్రీ, విమలక్క, గోరటి వెంకన్న పాటలు ఉంటాయా అని ప్రశ్నించారు. వీళ్లంతా గజ్జెలుకట్టి ఆడిపాడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. -
‘మెట్రో’ చార్జీలు తగ్గించాలి: దాసోజు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టారని, మెరుగైన రవాణా సౌకర్యం కోసం మెట్రో రైలు తీసుకొచ్చారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. వేగవంతమైన ప్రయాణం, తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగాలన్నదే మెట్రో లక్ష్యమని, మెట్రో చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వీటితో పేద ప్రజలు, చిరు వ్యాపారం చేసేవాళ్లు, సగటు ఉద్యోగి ప్రయాణించలేరన్నారు. గాంధీ భవన్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో మెట్రో రైలు చార్జీలు పెంచడంతో మూడున్నర లక్షల మంది ప్రయాణికులు దూరమయ్యారని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది పేదలే కాబట్టి, వెంటనే మెట్రో ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే మెట్రో ధరలపై కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు. మెట్రో ఆలస్యానికి కారణం టీఆర్ఎస్ పార్టీ అని, రూ. 4 వేల కోట్ల భారం పెరిగేందుకు కారణమైందని ఆరోపించారు. పెరిగిన వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని, ప్రజలపై భారం వేయొద్దని సూచించారు. మొత్తం రూ.14 వేల కోట్లలో టీఆర్ఎస్ సర్కార్ మూడేళ్లలో మెట్రోకు కేటాయించింది రూ.370 కోట్లు మాత్రమేనన్నారు. మిగిలిన నిధులు కాంగ్రెస్ హయాంలోనే విడుదల చేశారని పేర్కొన్నారు. మెట్రో ప్రారంభానికి బీజేపీ నాయకులను ప్రధాని మోదీ పక్కన కూర్చోబెట్టారని, కానీ, మేయర్ పేరు మాత్రం శిలఫలకంపై కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు. మంత్రివర్గంలో మహిళలు లేకుండా ప్రభుత్వాన్ని మూడేళ్లు నడిపిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. -
'సింగరేణి’లో టీఆర్ఎస్కు ఓటమి భయం
-
సింగరేణి’లో టీఆర్ఎస్కు ఓటమి భయం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఓడిపోతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భయం పట్టుకుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్ అన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ 58 వేల మంది కార్మికులున్న సింగరేణి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కార్మిక నాయకులను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో సమ్మెకాలానికి వేతనాలు ఇస్తామని, ఓపెన్ కాస్టులు లేకుండా చేస్తామని, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, మెడికల్ కాలేజీ ఇస్తామని, ఆస్తిపన్ను రద్దు చేస్తామని, తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలను ఇచ్చినట్టే ఇచ్చి ఎంపీ కవిత అనుచరునితో కేసు వేయించారని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులను కార్మికులు తరిమితరిమి కొడుతున్నారని, దీనికి భయపడిన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారని శ్రవణ్ అన్నారు. లిక్కర్, డబ్బు, మేక పిల్లలను పంచుతూ కార్మికులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతున్నదని, సింగరేణి ఎం.డి. శ్రీధర్ టీఆర్ఎస్తో కుమ్మక్కై దొంగలెక్కలతో ముంచుతున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపితే అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు. -
'ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది'
హైదరాబాద్: సిరిసిల్లలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పర్యటనతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందని తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రావణ్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దొంగ ఇసుక వ్యాపారం చేసేవాళ్లకి కూడా పౌరుషం ఉంటే ఎట్లా అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా.. ఉద్యమ సమయంలో మీరు దాడులు చేసినప్పుడు ఆంధ్ర పాలకులు మిమ్మల్ని ఇలానే కొట్టారా అని సూటిగా అడిగారు. కేటీఆర్ దమ్ముంటే రాజీనామా చేయాలని ఆయనకు డిపాజిట్ వస్తే ముక్కును నేలకు రాస్తానని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆంధ్ర పోలీసులు ఇలా చెయ్యలేదని అన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడం దారుణం: గీతారెడ్డి టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం దారుణమని మాజీ మంత్రి జె. గీతారెడ్డి అన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా అపాల్సింది పోయి ఇలా చెయ్యడం సబబేనా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తోందా, దళితులు అంటే ఇంత చిన్న చూపా సూటిగా అడిగారు. కేటీఆర్‌కు ఇది తగునా, ఇలాంటి వాటిపై స్పందించలేరా.. మానవత్వం లేని ఇలాంటి సంఘటనలు కనీసం ఖండించలేరా అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హత ఇంకా కేటీఆర్‌కు రాలేదని అన్నారు. మాజీ స్పీకర్ మీరాకుమార్ సిరిసిల్ల పర్యటన విజయవంతం అయిందన్నారు. అంత పెద్ద నాయకురాలు స్వయంగా జైల్లో ఉన్న వారిని, బాధితులను పరమర్శించించారని.. అలాంటి వ్యక్తితో అబద్దాలు చెప్పించామని టీఆర్ఎస్ నాయకులు అనడం దారుణమన్నారు. -
'గడీల పాలన - తాకట్టులో తెలంగాణ' పుస్తకావిష్కరణ
లండన్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో టీపీసీసీ తయారుచేసిన పీపుల్స్ ఛార్జ్ షీట్ పుస్తకాన్ని లండన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రసమితి పాలనలో సామాన్యులు పడుతున్న అవస్థలు, వివిధ రంగాల్లో అడ్డగోలు వ్యవహారాలపై రాసిన 'గడీల పాలన -తాకట్టులో తెలంగాణ' పుస్తకాన్ని శ్రవణ్ ఆవిష్కరించారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. అమరుల బలిదానాల సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఒంటెద్దు పోకడలకు పోకుండా, ఓట్లు సీట్లు ఆలోచన లేకుండా ప్రజల కోసం పనిచేయాలని సీఎం కేసీఆర్‌కి సూచించారు. అడ్వైజరీ మెంబర్లు డోకుర్ పవన్ కుమార్, ఓరుగంటి కమలాకర్ రావు, యూకే కన్వీనర్ గంప వేణుగోపాల్ తదితరులు ప్రసంగించి ప్రభుత్వ పని తీరుపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు రంగుల సుధాకర్ గౌడ్, రామ్మోహన్ రెడ్డి, రాకేష్ బిక్కుమండ్ల, అచ్యుత రెడ్డి, సత్య ప్రకాష్ , రాజేశ్వేర్ రెడ్డి, దేవులపల్లి శ్రీనివాస్, మధు గట్ట, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు ‘మహా’ దుర్దినం: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తును తగ్గించుకుని మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒప్పం దం చేసుకుందని, ఇది రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తుందని శాసనమండలిలో కాంగ్రెస్‌పక్ష నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. మాజీమంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే బి.భిక్షమయ్యగౌడ్‌తో కలసి ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఒప్పందం పేరుతో మహా దగా, తీరని ద్రోహం చేశారని, ఈ రోజు తెలంగాణకు దుర్దినమని పేర్కొన్నారు. 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడానికి 2012లోనే అప్పటి మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చౌహాన్‌తో సమైక్య రాష్ర్టంలో ఒప్పందం జరిగిందన్నారు. ఇప్పుడా ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడానికి ఒప్పందం చేసుకున్నారని, దీనివల్ల సుమారు 70 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని, ఇది తెలంగాణకు తీరని నష్టమని అన్నారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. శ్రవణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి ద్రోహం చేసి సంబరాలు జరుపుకుంటారా.. అని ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38 వేల కోట్లు ఉండగా, అదనంగా రూ.50 వేల కోట్లు పెంచారని, కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. -
కేసీఆర్ ఒప్పందం.. మహా దగా, మహా మోసం
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కుదుర్చుకున్న ప్రస్తుత ఒప్పందాల్లో కొత్తదనం లేదని టీకాంగ్రెస్ విమర్శించింది. ఒప్పందాల అంశంపై టీకాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్, అప్పటి మహారాష్ట్ర సీఎం మధ్య కుదిరిన ఒప్పందమే ఇది అని చెప్పారు. అయితే తుమ్మడిహట్టి వద్ద ప్రాణహితపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టాలని గత ఒప్పందం కాగా, కేసీఆర్ ఒప్పందంలో ఆ ఎత్తును 4 మీటర్లకు తగ్గించడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కేసీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం మహా దగా, మహా మోసం అని, తెలంగాణను ముంచే ఒప్పందం అంటూ వారు మండిపడ్డారు. ఒక ఎకరం ఆయకట్టు పెరగకుండా ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మాత్రం రూ.50 వేల కోట్లు పెంచారని, అందుకే ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి చీకటి రోజు అని, మహారాష్ట్రకు మేలు జరిగేలా తెలంగాణకు నష్టం జరిగేలా ఒప్పందం కుదిరిందంటూ టీకాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
హోం మంత్రి రాజీనామా చేయాలి: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: మహిళలకు భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లా వీణవంక ఘటనకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఈ కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు. -
'పోలీసుల వైఫల్యమే కారణం'
వీణవంక (కరీంనగర్) : దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమంటూ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆరేపల్లి మోహన్ లు ఆరోపించారు. అత్యాచార ఘటనపై సోమవారం వారు మాట్లాడుతూ.. బాధితురాలి స్నేహితురాలు చేసిన ఫోన్ కాల్‌కు పోలీసులు స్పందించకపోవడంతోనే ఘోరం చోటుచేసుకుందని, పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి నాయిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్ఐ, సీఐ, డీఎస్పీలను సస్పెండ్ చేయాలని కోరారు. కాగా బాధితురాలు ఈ రోజు ఎస్పీ జోయల్ డేవిస్‌ను కలిసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన ఎస్పీ న్యాయం జరిగేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు. -
రాజ్యాంగాన్ని కాలరాస్తున్న కేసీఆర్
టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్సైట్లో పెట్టకుండా చీకట్లో పెడుతూ రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ కాలరాస్తున్నారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. పార్టీ నేతలు మహేశ్‌కుమార్ గౌడ్, గోసుల శ్రీనివాస్‌తో కలసి గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనలో, తీసుకుంటున్న నిర్ణయాలలో పారదర్శకత లేకుండా చేస్తున్నారని అన్నారు. సమాచారహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్సైట్లో పెడుతున్నారనీ, అలాంటిది ఆ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడం వెనుక భారీ కుట్ర, రహస్య ఎజెండా దాగి ఉందని శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుంటే దాని పరిరక్షకుడైన గవర్నరు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మేడారం జాతరలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిపై దాడి పోలీసుల దాష్టీకానికి పరాకాష్ట అని ఈ సందర్భంగా శ్రవణ్ విమర్శించారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్
కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారు నోటా బటన్, ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎన్నికల అవకతవకలపై ఈసీ దృష్టికి తీసుకెళ్తాం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయని కాంగ్రెస్ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్లడంతో పాటు న్యాయస్థానాల్లోనూ ఫిర్యాదు చేస్తామన్నారు. గాంధీభవన్‌లో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డితో కలసి ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఎన్నికల నిఘా సంస్థ నేత వీవీ రావ్ రుజువు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఓటింగ్ యంత్రాలకు ప్రింటింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే బిహార్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్లను అమర్చారు’ అని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రిటింగ్ మిషన్లను ఎందుకు అమర్చలేదని, అలాగే ఈవీఎంలలో నోటా బటన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో ఎన్నికల ప్రధానాధికారి, సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కైనట్లు తెలుస్తోందని ఆరోపించారు. 2010 ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పెట్టాలంటూ టీఆర్ఎస్ నేత ఎస్.నిరంజన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అప్పట్లో ఈసీ సమర్థించకపోతే ఒక్కో నియోజకవర్గంలో 100 మంది చేత నామినేషన్ దాఖలు చేయించారని శ్రావణ్ చెప్పారు. జాంబాగ్‌లో తమ పార్టీ అభ్యర్థి విక్రమ్‌గౌడ్ కుటుంబ సభ్యుల ఓట్లు ఒక పోలింగ్‌బూత్ పరిధిలో 125 ఓట్లు ఉంటే కేవలం 20 ఓట్లు మాత్రమే పోలయ్యాయన్నారు. 142వ డివిజన్ అడ్డగుట్టలో ఒక పోలింగ్ కేంద్రంలో 556 ఓట్లు పోలైతే... లెక్కింపులో 992 ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ట్యాంపరింగ్ జరిగిందనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలన్నారు. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్కు వంద సీట్లు, తమ మిత్రపక్షం ఎంఐఎంకు 45 సీట్లు వస్తాయని కచ్చితంగా ఎలా చెప్పగలిగారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ సోమవారం గాంధీభవన్‌కు రావాలని కోరారు. డివిజన్ వారీగా పోలైన ఓట్లపై సమీక్ష జరిపి తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని శ్రావణ్ చెప్పారు. -
రేపు గాంధీభవన్‌లో గ్రేటర్ కాంగ్రెస్ అభ్యర్థుల సమావేశం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ మిషన్‌లో ట్యాంపరింగ్ జరిగిందని తెలంగాణా పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్కు 100 డివిజన్లు గెలుస్తుందని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పదే పదే ఎలా చెప్పారని వారు ప్రశ్నించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. నోటా ఆప్షన్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారనేది తమకు అనుమానంగా ఉందని చెప్పారు. బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈవీఎంలకు ప్రింటర్ అమర్చాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ క్యాడర్ బలంగా ఉన్న చోట్ల కూడా టీఆర్ఎస్ గెలుపు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మండిపడ్డారు. కొన్ని డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులకు వారి సొంత ఓట్లే రాకపోవడం ఈవీఎంలో అవకతవకలు జరిగాయనడానికి నిదర్శనమని తెలిపారు. రేపు గాంధీభవన్‌లో జీహెచ్ఎంసీ కాంగ్రెస్ అభ్యర్థుల సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశంలో డివిజన్ల వారిగా ఈవీఎంల అవకతవకలపై అభ్యర్థుల అభిప్రాయాలు సేకరిస్తామని దాసోజు శ్రవణ్, బండా కార్తీక రెడ్డి స్పష్టం చేశారు. -
'ఆ అసంతృప్తే టీఆర్ఎస్ను ముంచేస్తుంది'