దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమంటూ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆరేపల్లి మోహన్ లు ఆరోపించారు.
వీణవంక (కరీంనగర్) : దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమంటూ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆరేపల్లి మోహన్ లు ఆరోపించారు. అత్యాచార ఘటనపై సోమవారం వారు మాట్లాడుతూ.. బాధితురాలి స్నేహితురాలు చేసిన ఫోన్ కాల్కు పోలీసులు స్పందించకపోవడంతోనే ఘోరం చోటుచేసుకుందని, పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి నాయిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్ఐ, సీఐ, డీఎస్పీలను సస్పెండ్ చేయాలని కోరారు.
కాగా బాధితురాలు ఈ రోజు ఎస్పీ జోయల్ డేవిస్ను కలిసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన ఎస్పీ న్యాయం జరిగేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు.