Veenavanka
-
‘నీకు ఏం కాదు శీను.. ధైర్యంగా ఉండు’.. అంతలోనే!
సాకక్షి, హుజూరాబాద్: గుండెనొప్పితో విలవిల్లాడుతున్న యువకుడికి తన స్నేహితుడు నోటితో శ్వాస అందించాడు.. బతికిచ్చుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. చికిత్స అందేలోపు యువకుడు మృతిచెందాడు. ఈ విషాద ఘటన వీణవంక మండలం ఘన్ముక్కులలో జరిగింది. గ్రామస్తుల వివరాలు.. గ్రామానికి చెందిన బడిమే శ్రీనివాస్(38) ఎలక్ట్రీషియన్. గురువారం తన వ్యవసాయ క్షేత్రంలోని విద్యుత్ మోటార్‌ను మరమ్మతు చేసేందుకు తండ్రి కొమురయ్యతో కలిసి వెళ్లాడు. మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా చాతిలో నొప్పి వచ్చింది. ఏదో జరుగుతుందని గ్రహించి స్థానిక వైద్యున్ని ఆశ్రయించాడు. అప్పటికే పరిస్థితి విషమిస్తుండడంతో శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఎండీ షఫీకి సమాచారం అందించాడు. వెంటనే అతడు కారులో జమ్మికుంట ఆసుపత్రికి తరలిస్తుండగా ఎఫ్‌సీఐ గోదాం వద్దకు చేరుకోగానే కారులో శ్రీనివాస్ కుప్పకూలాడు. నోటితో శ్వాస అందించినా.. శ్రీనివాస్‌కు చాతి నొప్పి తీవ్రం కావడంతో అప్రమత్తమైన షఫీ వెంటనే కారును నిలిపివేసి కాపాడే ప్రయత్నం చేశాడు. చాతిపై ఒత్తాడు. నోటితో 2 నిమిషాల పాటు శ్వాస అందించాడు. తన స్నేహితుడు కళ్ల ముందే విలవిల్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు. ‘నీకు ఏం కాదు ధైర్యంగా ఉండు శీను.. నీవు బతుకుతావు’ అంటూ రోదించాడు. బతికించాలంటూ అక్కడికి చేరుకున్న జనాన్ని బతిమిలాడాడు. 108 వాహనం చేరుకోవడంతో వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శ్రీనివాస్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బతుకుతాడనుకున్న కానీ ఇంత దారుణం జరుగుతదని అనుకోలేదని షఫీ కన్నీరుమున్నీరయ్యాడు. మృతుడికి భార్య కోమల, కూతురు, కుమారుడు ఉన్నారు. చదవండి: ‘దొంగ కానిస్టేబుల్’ ఈశ్వర్.. డబ్బు ‘తీసుకోవడం’తోనే గుట్టు వీడింది! మూడేళ్లుగా వాకింగ్ చేసినా.. శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి రోజూ ఉదయం వాకింగ్ చేసేవాడు. ఘన్ముక్కుల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిష్టంపేట వరకు వెళ్లి వచ్చేవాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడేవాడని శ్రీనివాస్ స్నేహితులు తెలిపారు. -
ఆపరేషన్ తారుమారు.. మాకే ఎందుకు కడుపు‘కోత’?
సాక్షి, వీణవంక(కరీంనగర్): తమ కుటుంబంలోకి కవల పిల్లలు రాబోతున్నారని తెలిసి, ఇంటిల్లిపాది ఆనందపడ్డారు.. కుటుంబసభ్యులు ఆ గర్భిణికి పౌష్టికాహారం అందిస్తూ కంటికిరెప్పలా చూసుకున్నారు.. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు.. ఆమెకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 9 నెలల తర్వాత జరగాల్సిన ఆపరేషన్ 7వ నెలలో జరగడంతో పాప మృతిచెందింది.. బాబు అతి తక్కువ బరువుతో పుట్టి, తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాడు.. దీంతో బాధిత కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమకు కడుపుకోత మిగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వారిని ‘సాక్షి’ పలకరించగా కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాలిలా ఉన్నాయి.. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి నరోత్తంరెడ్డి–మాలతిలకు రెండేళ్ల కిందట వివాహమైంది. మాలతి గర్భం దాల్చడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది. తర్వాత స్కానింగ్‌లో కవల పిల్ల లు అని వైద్యులు చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆమెకు ఆహారం మొదలు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. ఈ క్రమంలో మాలతికి 7వ నెలలో జూన్ 16న కడుపునొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు 21 వరకు అబ్జర్వేషన్లో ఉంచారు. చదవండి: టీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారు: ఈటల రాజేందర్ అదేరోజు మరో గర్భిణికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. కానీ నిర్లక్ష్యంతో మాలతి పొట్ట కోశారు. బాధితురాలు తాను ఆపరేషన్ కోసం రాలేదని మొత్తుకుంది. దీంతో అలర్ట్ అయిన వైద్యులు కేస్‌షీట్లు పరిశీలించారు. వేరొకరికి చేయాల్సిన ఆపరేషన్ ఈమెకు చేశామని తెలుసుకొని వెంటనే కుట్లు వేసి, తమ పర్యవేక్షణలోనే ఉంచారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు జూన్ 25న డీఎంహెచ్‌వోకు, పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అనంతరం మాలతి పరిస్థితి విషమంగా ఉండటంతో అదే నెల 26న ఆపరేషన్ చేయగా పాప మృతిచెందింది. బాబు కేవలం 1,300 గ్రాముల బరువుతో పుట్టాడు. కలెక్టర్‌కు ఫిర్యాదుతో విచారణ మాలతికి ఆపరేషన్ తారుమారు ఘటనపై వైద్యాధికారులు స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసి, చేతులు దులుపుకున్నారు. అయితే తగిన న్యాయం జరగకపోవడంతో బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. కానీ విచారణ చేపడుతున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మాలతి భర్త నరోత్తం రెడ్డి ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పుడు బాబుకు నీలోఫర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. కానీ వైద్యాధికారులు ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారికి అనారోగ్య సమస్యలు కవలల్లో ఒకరు మృతి చెందగా బాబు పుట్టినప్పటి నుంచి రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కావడం లేదని బాధిత కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మాలతి కుటుంబానికి కడుపుకోత మిగిలిందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. మరో మహిళకు జరగకూడదు వైద్యుల నిర్లక్ష్యం వల్ల నాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాప చనిపోయింది. పుట్టిన బాబు ఆరోగ్యంగా లేడు. అధికారులు నీలోఫర్‌లో చూపిస్తామని చెప్పారు. ఇంతవరకు చూపించలేదు. మాతా శిశు కేంద్రంలో మంగళవారం విచారణ జరిపారని తెలిసింది. మాకు సమాచారం లేదు. నాకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదు. – మాలతి, బాధితురాలు -
గిట్లెట్లాయే: జితేందర్ వర్సెస్ హరీశ్.. రెండు సార్లు పైచేయి ఒకరిదే
సాక్షి, కరీంనగర్: బీజేపీ తరఫున మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ తరఫున మంత్రి హరీశ్‌రావు గతంలో దుబ్బాక ఉప ఎన్నికకు.. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇన్‌చార్జీలుగా వ్యవహరించారు. అన్నీ తామై వ్యవహరించిన ఆ ఇద్దరు నేతల్లో జితేందర్దే పైచేయి అయ్యింది. వాస్తవానికి దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ, జితేందర్ తన వ్యూహాలతో చక్రం తిప్పారు. దీంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అనూహ్యంగా విజయం సాధించారు. దీంతో తొలిసారిగా మంత్రి హరీశ్‌రావుకు భంగపాటు ఎదురైంది. ఇప్పుడు హుజూరాబాద్‌లో సైతం ఈటల రాజేందర్ విజయం సాధించడంలో జితేందర్ మరోసారి హరీశ్‌పై పైచేయి సాధించారు. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే గిట్లెట్లాయే.. హుజూరాబాద్: ఉప ఎన్నిక ఉత్కంఠకు మంగళవారంతో తెరపడింది. 90 శాతం మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో ఉన్నా.. చివరికి ప్రజలు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే పట్టం కట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో బీజేపీకి 191ఓట్ల ఆధిక్యం రావడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో దాదాపు ప్రజాప్రతినిధులకు చుక్కెదురైంది. చదవండి: Huzurabad Bypoll Result: కారుకు బ్రేకులేసిన అంశాలివే.. వీణవంకలో.. వీణవంక మండలం ఎలబాక గ్రామంలో బీజేపీకి 417 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇదే గ్రామంలో టీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీ మాడ వనమాల–సాదవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మవురం విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్ కొత్తిరెడ్డి కాంతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు టీఆర్ఎస్ నుంచి ఇన్‌చార్జీలుగా వ్యవహరించినా కనీస ఓట్లు రాబట్టలేకపోయారు. అలాగే ఎంపీపీ ముసిపట్ల రేణుక స్వగ్రామం దేశాయిపల్లిలో టీఆర్ఎస్ ఘోర ఓటిమి పాలయింది. హుజూరాబాద్‌లో.. ఎంపీపీ ఇరుమల్ల రాణి సొంత గ్రామం చెల్పూర్లో 86 ఓట్లు, జెడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి స్వగ్రామం కందుగులలో బీజేపీకి 467 ఓట్ల మెజార్టీ వచ్చింది. రాజాపల్లిలోపీఏసీఎస్ చైర్మన్ శ్యాసుందర్‌రెడ్డి పరిధిలో టీఆర్ఎస్ 36 ఓట్లతో లీడింగ్ సాధించింది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక వార్డులో 36, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వార్డులో బీజేపీకి 33 ఓట్ల మెజార్టీ వచ్చింది. జమ్మికుంటలో.. జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ స్వగ్రామం ఇల్లందకుంటలో బీజేపీకి 265 ఓట్లు, జెడ్పీటీసీ శ్రీరాం శ్యామ్ స్వగ్రామం ఆబాది జమ్మికుంటలో 28 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇల్లందకుంట ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పింగిళి రమేశ్ స్వగ్రామం విలాసాగర్లో, లక్ష్మాజిపల్లి సింగిల్ విండో చైర్మన్ ఉప్పుల తిరుపతిరెడ్డి, జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత ఇలాఖాల్లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ప్రముఖ నేతలైన పాడి కౌశిక్‌రెడ్డి (వీణవంక 884) కెప్టెన్ లక్ష్మీకాంతరావు గ్రామాల్లో (సింగాపూర్ 133) టీఆర్ఎస్కు ఆధిక్యం దక్కింది. -
హుజూరాబాద్‌లో దళితబంధు సర్వే పూర్తి.. ఎంత మందికంటే
హుజూరాబాద్ రూరల్: దళితబంధు సర్వే గురువారంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ముగిసింది. ఆగస్టు 27 నుంచి ఏడురోజుల పాటు ఐదు మండలాల్లో అధికారులు ఇంటింటా తిరుగుతూ.. సర్వే నిర్వహించారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వివరాలు సేకరించారు. 17,166 కుటుంబాలకుగానూ.. 16,370 కుటుంబాల వివరాలు యాప్‌లో అప్లోడ్ చేశారు. మరో 2,775 కుటుంబాలకు సంబంధించి దరఖాస్తులు నింపారు. సర్వేలో నియోజకవర్గంలో మొత్తంగా 18,619 దళిత కుటుంబాలు ఉన్నట్లు తేల్చారు. హుజూరాబాద్ పట్టణంలో 1,794 కుటుంబాల వివరాలు యాప్‌లో నమోదు చేశారు. మరో 611కుటుంబాలకు సంబంధించి దరఖాస్తులు నింపారు. హుజూరాబాద్ మండలంలోని 19 పంచాయతీల్లో 3,387 కుటుంబాల వివరాలు ఆప్‌లోడ్ చేశారు. మరో 295 కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జమ్మికుంట మున్సిపాలిటీలో 2,313 కుటుంబాలను పొందుపర్చారు. 446 కుటుంబాలవి దరఖాస్తులు స్వీకరించారు. జమ్మికుంట రూరల్ పరిధిలో 2,428 కుటుంబాలను గుర్తించగా 464 దరఖాస్తులను స్వీకరించారు. ఇల్లందకుంట మండలంలో 2,951కుటుంబాలను ఆప్లోడ్చేశారు. వీణవంక మండలంలో 3,497 కుటుంబాల వివరాలు యాప్‌లో, 955 దరఖాస్తులను నేరుగా స్వీకరించారు. చదవండి: ‘సోనీ క్షమించు! నీకు ఏం చేయలేకపోయా’ కన్నీటితో భర్త చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
హుజురాబాద్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: హరీశ్ రావు
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో గురువారం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ అమ్మకానికి రూపమైతే టీఆర్ఎస్ నమ్మకానికి రూపమని పేర్కొన్నారు. రైళ్లు, రోడ్లు అమ్మితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. ప్రజలు బాగుపడాలా ? ఈటల రాజేందర్ బాగుపడాలా? ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ‘మీ సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దాం. వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తా. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సంజయ్ ఇక్కడి వాళ్లా… అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చావు నోట్లో తలపెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్. 24 గంటల కరెంటు ఇస్తామంటే కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇవాళ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. కాళేశ్వరం పూర్తవుతదా అన్నారు. రైతులు వద్దనే రీతిలో నీళ్లు వస్తున్నాయి. నీటి తీరువా రద్దు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం’ అని తెలిపారు. చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు? -
టీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు ఖరారు, ఉద్యమకారుడికే చాన్స్?
సాక్షి, హుజూరాబాద్: భూ కబ్జా ఆరోపణలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.. తదుపరి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఈటల ప్రచారంలో ఉండగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు స్పష్టత లేదు. టీఆర్ఎస్ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర నేతలు తీవ్రంగా శ్రమిస్తున్న అభ్యర్థి విషయం ఇంకా తేలలేదు. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ అభ్యర్థి రేసులో పలువురు నాయకులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. చివరికి వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ నాయకుడు, విద్యార్థినేత, తెలంగాణ ఉద్యమకారుడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు గుర్తింపు ఉంది. ఈటల రాజేందర్ బీసీ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్తుండటంతో కేసీఆర్ సైతం బీసీ నాయకుడినే బరిలో నిలిపి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేసులో పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరిన వీణవంక గ్రామానికి చెందిన పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్ తరఫున రేసులో ఉన్నారని ప్రచారం జరిగినా.. ఆయనకు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు మంత్రి వర్గం సిఫారుసు చేసింది. దీంతో బీసీ వర్గం నుంచే అభ్యర్థిని బరిలో దింపుతారని స్పష్టమైంది. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎల్.రమణ, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు పురుషోత్తంరెడ్డి (రిటైర్డ్ కలెక్టర్), ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి మాలతి, టీఆర్ఎస్ నేత పొనగంటి మల్లయ్య పేర్లు కూడా ప్రధానంగా వినిపించాయి. కానీ.. అధిష్టానం శ్రీనివాస్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజల్లో తన ఉద్యమ స్వరాన్ని వినిపిస్తున్నారు. గెల్లుకు ఉద్యమకారుడిగా గుర్తింపు.. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యనభ్యసించిన గెల్లు.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బొంతు రామ్మోహన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్‌తో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. జైలు జీవితం కూడా గడిపారు. మానుకోట సంఘటనలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈటల రాజేందర్ తరచూ బీసీ నాయకుడినని, ఉద్యమకారుడినని ప్రజల్లో నినాదం వినిపిస్తుండటంతో ఆయనకు చెక్ పెట్టాలంటే యాదవ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ అయితేనే మంచిదనే అభిప్రాయం సర్వేల ద్వారా తేలినట్లు సమాచారం. అందుకే సీఎం కేసీఆర్ ఆయన పేరునే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలిసింది. అంతేకాదు.. శ్రీనివాస్ కేటీఆర్‌కు కూడా అత్యంత సన్నిహితుడిగా పేరుంది. 16న ప్రకటించే చాన్స్..? ఈ నెల 16న హుజూరాబాద్‌లోని శాలపల్లిలో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దళితబంధు ప్రారంభ వేదికలోనే టీఆర్ఎస్ అభ్యర్థి పేరును ప్రకటించే చాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లక్ష మందితో సభ ఏర్పాట్లు చే -
హుజూరాబాద్‌లో దెబ్బకొడితే.. కేసీఆర్‌కు దిమ్మతిరగాలి
సాక్షి, వీణవంక: ‘నేను చిన్నవాడినైతే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడు. హుజూరాబాద్‌లో దెబ్బకొడితే కేసీఆర్‌కు దిమ్మతిరగాలి’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాదీవెన యాత్రలో భాగంగా 12వ రోజు వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో పాదయాత్ర ప్రారంభమైంది. అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఈటలకు ఘన స్వాగతం పలికారు. పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాలలో ఆయన మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలను గంజిలెక్క తీసిన వ్యక్తి కేసీఆర్ అని, తాను రాజీనామా చేయడం వల్ల పెన్షన్లు, రేషన్‌కార్డులు, గొర్లు, దళిత బంధు వస్తున్నాయని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో దళిత బిడ్డలకు పెడుతున్నం భోజనానికి కూడా పైసలు ఇవ్వకపోవడంతోనే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. ‘ఇప్పుడు దళితబంధు అన్నడు.. తర్వాత బీసీల బంధ్ అంటడు.. ఎన్నికలు అయిన తర్వాత అన్నీ బంద్ అంటడు’ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నియోజకవర్గంలో పనులు చేయడానికి చేతకాదు కానీ ఇక్కడకు వచ్చి అన్నీ ఇస్తామంటున్నారని మండిపడ్డారు. బీజేపీలో చేరికలు పోతిరెడ్డిపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, మడుగూరి సమ్మిరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, జయశ్రీ తదితరులు ఉన్నారు. ఈటలకు స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు -
మాజీ మంత్రి ఈటలకు తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజాదీవెన పాదయాత్రకు బ్రేక్ పడింది. జ్వరంతో పాటు ఆక్సిజన్ స్థాయి, బీపీ తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. ప్రత్యేక వైద్యుల పరీక్షల తర్వాత హుజూరాబాద్‌లోని కార్యాలయానికి తరలించారు. ఈటల కోలుకునే వరకు యాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాదీవెన యాత్రలో భాగంగా వీణవంక మండ లం పోతిరెడ్డిపల్లికి శుక్రవారం చేరుకున్నారు. అక్కడి నుంచి కొండపాక చేరకుని సభలో మాట్లాడిన అనంతరం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న ప్రత్యేక బస్సులో వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ 90/60, షుగర్ 265 ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆక్సిజన్ స్థాయి లు 94లోపు ఉండటంతో ప్రాథమిక వైద్యం అందించారు. ర్యాపిడ్ టెస్టు చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించగా, జ్వరం తగ్గింది. ముందుగా హైదరాబాద్ నిమ్స్‌కు ఈటలను తరలిస్తారని ప్రకటించగా, అందుకు ఆయన ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో రాత్రి 7.30 గంటలకు హుజూరాబాద్‌లోని తన కార్యాలయానికి తరలించారు. ఈ నెల 19న కమలాపూర్ మండలంలో యాత్ర ప్రారంభించగా, 222 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. హిమ్మత్‌నగర్ వరకు కొనసాగించిన జమున.. కొండపాకలో నిలిచిన పాదయాత్రను ఈటల సతీమణి జమునారెడ్డి హిమ్మత్‌నగర్ వరకు కొనసాగించారు. ప్రజలు ఈటల కోసం ఎదురు చూస్తున్నారనే ఉద్దేశంతో ఆమె యాత్రను చేపట్టారు. కాగా, అస్వస్థతకు గురైన ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫోన్లో పరామర్శించారు. -
భారీ మద్దతు: మేమంతా ‘ఈటల’ వెంటే..
హుజూరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్‌ను సీఎం కేసిఆర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం సరికాదని, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఈటల వెంటే ఉన్నారని, తాము కూడా ఈటల రాజేందర్ వెంటనే ఉంటామని హనుమాన్ దేవస్థాన కమిటీ చైర్మన్ ఆకుల సదానందం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్‌గౌడ్, ఎంపటి సుధీర్ అన్నారు. మంగళవారం సాయిరూప కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేసిన ఘనత ఈటలకే దక్కుతుందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పోతుల సంజీవ్, రాపర్తి శివ, బీఆర్‌గౌడ్, గోసు్కల చందు, కొలుగూరి దేవయ్య, గూడూరి మహేందర్‌రెడ్డి, మురాద్‌హుస్సేన్, రాజ్‌కుమార్, సందీప్ పాల్గొన్నారు. ఈటల వర్గీయుల సంబరాలు వీణవంక: మండలంలోని ఎల్భాకలో ఈటల రాజేందర్ వర్గీయులు సోమవారం రాత్రి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సర్పంచ్ కొత్తిరెడ్డి కాంతారెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాల మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంపై మండిపడ్డారు. నిన్నటి వరకు ఈటలకు మద్దతు పలికి తెల్లవారేసరికి టీఆర్ఎస్కు జై కొట్టారని పేర్కొన్నారు. గ్రామస్తులంతా ఈటలకే మద్దతు తెలుపుతున్నారని, ఇక గ్రామానికి పట్టిన పీడ పోయిందని టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈటల వర్గీయులు రాజారాం, మాడ గౌతమ్‌రెడ్డి, రాజ్‌కుమార్ యాదవ్, రాజు, పొన్నాల అనిల్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
గులాబీకి ‘ఈటల’ ముల్లు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గులాబీ పార్టీకి ఓనర్లమని నినదించి తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రకంపనలు పుట్టించిన నాటి నుంచి జిల్లాకు చెందిన మంత్రి ఈటల రాజేందర్ తనదైన పంథాను వీడడం లేదు. పార్టీ అగ్ర నాయకత్వంపై ఉన్న అసంతృప్తిని తన వ్యాఖ్యల ద్వారా వెల్లడిస్తున్న ఆయన పార్టీలో చర్చనీయాంశంగా మారారు. తాజాగా వీణవంకలో మాట్లాడుతూ ‘కల్యాణలక్ష్మి, పెన్షన్లు, రేషన్‌కార్డులు పేదరిక నిర్మూలనకు పరిష్కారం కాదు’ అని ప్రభుత్వ పథకాలపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించి పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా మారారు. ఈ నేపథ్యంలో సోమవారం శాసనసభ కార్యక్రమాలు ముగిసిన తరువాత రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు మంత్రి ఈటలను తన కారులో తీసుకెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేటీఆర్, ఈటల పలు అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. వీరు ఏయే అంశాలపై వీరు చర్చించారనేది తెలియకపోయినా ఈటల వ్యాఖ్యలను అధిష్టానం కొంచెం సీరియస్‌గానే తీసుకున్నట్లు అర్థమవుతోంది. రైతు నేతగా మరోసారి కీలక వ్యాఖ్యలు ‘నేను మంత్రిగా ఉండొచ్చు.. లేకపోవచ్చు.. రైతు ఉద్యమం ఎక్కడ ఉన్నా నా మద్దతు ఉంటుంది. రైతుబంధు పథకం మంచిదే కానీ... ఇన్‌కంటాక్స్ కట్టే వాళ్లకు, రియల్ ఎస్టేట్ భూములకు, వ్యవసాయం చెయ్యని గుట్టలకు, లీజుకిచ్చే భూములకు రైతుబంధు ఇవ్వొద్దు అని వీణవంక మండలం రైతులు కోరుతున్నారు. ఢిల్లీలో రైతులు చేసే ఉద్యమానికి మద్దతుగా నిలుస్తా’ అని గత జనవరి ఆఖరులో, ఫిబ్రవరి మొదటి వారంలో హుజూరాబాద్‌లో రైతువేదికల ప్రారంభోత్సవాల సందర్భంగా పార్టీ విధానాలకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకంలోని లోపాలను వీణవంక సభలో రైతుల మాటలుగా వ్యాఖ్యానించడం, రైతు చట్టాలపై వ్యతిరేక ఆందోళనలను పార్టీ వ్యూహాత్మకంగా పక్కన బెట్టగా, అదే సమయంలో ఈటల ఆ చట్టాలలోని లోపాలు, రైతుల ఆందోళనలను పాలకుల తీరును తూర్పారపట్టారు. అదే సమయంలో ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా తగిన సమయం కేటాయించలేక పోతున్నందున త్వరలోనే కేటీఆర్ సీఎం కావచ్చు’ అని వ్యాఖ్యానించి కొత్త చర్చకు దారితీశారు. దాంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ‘ముఖ్యమంత్రిగా కేటీఆర్ సమర్థుడు’ అనే పల్లవి ఎత్తుకోవడం, స్వయంగా కేసీఆర్ ఆ వివాదానికి తెరదించడం జరిగిపోయాయి. కేసీఆర్‌తో సమావేశం తరువాత కొంతకాలం ‘కామ్’గా ఉన్న ఈటల మరోసారి వీణవంకలో చేసిన వ్యాఖ్యానాలు కొత్త చర్చకు దారితీశాయి. పార్టీ, జెండా కాదు మనిషిని గుర్తు పెట్టుకోమన్న ఈటల ‘పరిగె ఏరుకుంటే రాదు... పంట పండితే వస్తది’ అనే సామెతను ఊటంకిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, రేషన్‌కార్డులను పరిగెలతో పోల్చడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చని, నేను ఇబ్బంది పడ్డా, గాయపడినా మనసును మార్చుకోనని బరువైన వ్యాఖ్యలు చేయడంలో గల కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. ఒకవైపు రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన హుషారులో పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటుంటే, ఈటల తనలోని అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడం వెనుక గల మతలబు ఏంటని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా కేటీఆర్‌తో ప్రగతిభవన్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసిన ఈటల ‘గాయపడ్డ’ మనసును మార్చుకుంటాడో లేదో వేచి చూడాలి. అసంతృప్తి సెగలు 2018 నుంచే 2018లో రెండోసారి తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచే మంత్రి ఈటల రాజేందర్లో అసంతృప్తి సెగలు మొదలయినట్లు తెలుస్తోంది. అప్పటి మంత్రివర్గ కూర్పులో ఈటల పేరును తొలుత చేర్చలేదని, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన అప్పటి ఎంపీ సూచనల మేరకు చివరి నిమిషంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆరుసార్లు గెలిచి, బీసీ నేతగా గుర్తింపు పొందిన తనకు అవమానం జరిగిందని ఈటల ‘గాయపడ్డట్టు’ ఆయన పలు సందర్భాల్లో మాట్లాడిన తీరుతో అర్థమైంది. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ ఓడిపోవడం, జిల్లాకు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి దక్కడం తదితర కారణాలతో ఆయనకు, పార్టీ అధిష్టానానికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చదవండి: ఇది మారాలి.. మీరు మార్చాలి: వైఎస్ షర్మిల -
ప్రేమ వ్యవహారం: ప్రణయ్ దారుణ హత్య
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అత్యంత కిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో ప్రణయ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన దళిత అమ్మాయి 8ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. గతకొంత కాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రణయ్‌పై అర్థరాత్రి ఆయన ఇంటివద్దనే దాడి చేశారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి అంబేద్కర్ భవన్ వద్ద నరికి చంపారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుకున్న సీపీ కమలాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులతో పాటు గ్రామస్తులు భావిస్తున్నారు. (అప్పు తీర్చలేక బాలిక అప్పగింత) 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. దళితుడైన ప్రణయ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ప్రేమ వ్యవహారంతోనే హత్య చేసినట్లు భావిస్తూ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. త్వరలో నిందితులను గుర్తించి పట్టుకుంటామని ప్రకటించారు. ప్రణయ్ హత్య పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేపింది. మరోవైపు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే రాత్రి సయమంలో అమ్మాయి ఫోన్ చేస్తేనే ప్రణయ్ బయటకు వెళ్లాడని, ఆమెతో మాట్లాడుతుండగా యువతి సోదరుడు అనిల్ కర్రలతో దాడి చేయడంతో చనిపోయినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ప్రణయ్ మృతదేహాన్ని అంబేద్కర్ భవన్ వద్ద పడేసినట్లు తెలిపారు. అమ్మాయి అబ్బాయి 8 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారని, వారి ప్రేమ వ్యవహారం అమ్మాయి కుటుంబ సభ్యులందరికీ తెలుసునని తెలిపారు. అమ్మాయి సోదరుడు అనీల్ ఒక్కరికి మాత్రమే నచ్చకపోవడంతో పలుమార్లు గొడవ జరిగినట్లు తెలిపారు. పోలీసులు ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
భౌతిక దూరం పాటించని టీఆర్ఎస్ నాయకుడిపై కేసు
సాక్షి, వీణవంక(హుజురాబాద్): మక్కల కొనుగోలు ప్రారంభోత్సవంలో భౌతిక దూరం పాటించలేదని, అక్రమంగా కేసు పెట్టారని మనోవేదనకు గురవుతూ వీణవంక మండలం హిమత్‌నగర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గెల్లు మల్లయ్య తన ఇంటిలో మౌన దీక్షకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా ఇందులో వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విషయం కలెక్టర్ శశాంక దృష్టికి వెళ్లడంతో భౌతిక దూరం పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో బెన్ షాలోమ్‌ను ఆదేశించారు. (బిజినెస్ మీటింగ్ కోసం వెళ్లి...చిక్కుల్లో) అయితే సింగిల్ విండో డైరెక్టర్ గెల్లు మల్లయ్యపైనే కేసు నమోదు చేసి మిగతావారిపై కేసులు పెట్టకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత వ్యవసాయాధికారి భౌతిక దూరంపై అవగాహన కల్పించాలని, కానీ తనపై ఏఓ పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఈ విషయం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని వాపోయాడు. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో తనతోపాటు ఉన్న మిగతావారిపై కేసులు పెట్టకుండా కేవలం తనపైనే కేసు పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళతానని, న్యాయం జరిగే వరకు మౌన దీక్షలో ఉంటానని స్పష్టం చేశారు. -
మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
వీణవంక : మానేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానిక పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని చల్లూరు మానేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న అదే గ్రామానికి చెందిన మూడు ఇసుక ట్రాక్టర్లను సాయంత్రం పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై దామోదర్‌రెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
‘వీణవంక’ నిందితులకు బెయిల్ నిరాకరణ
► ఇద్దరు నిందితుల పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, చల్లూరుకు చెందిన ఓ దళిత యువతిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో నిందితులకు హైకోర్టు శుక్రవారం బెయిల్ నిరాకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులు ముద్దం అంజయ్య అలియాస్ అంజన్న, ముద్దం రాకేష్‌లు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దాని ప్రభావం దర్యాప్తుపై ఉంటుందన్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
తల్లి అంత్యక్రియలకు వెళ్తూ..
వీణవంక: తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్తున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలాయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాడి రవికిరణ్ అనే వ్యక్తి తల్లి పద్మజ(70) మృతిచెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడానికి కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు పై ఓ వ్యక్తి అడ్డు రావడంతో.. అతన్ని కాపాడే క్రమంలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. -
చల్లూరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి ప్రభుత్వ సాయం
వీణవంక (కరీంనగర్) : వీణవంక మండలం చల్లూరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. తొలి విడతగా సోమవారం రూ.90 వేలు ఆమెకు అందజేశారు అధికారులు. కానిస్టేబుల్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ఓ యువతిపై అక్కడే శిక్షణ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు గత నెలలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. -
'పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోస్తా..'
వీణవంక (కరీంనగర్ జిల్లా) : తనను పెళ్లి చేసుకోకపోతే ముఖంపై యాసిడ్ పోసి చంపేస్తానని 19 ఏళ్ల యువతిని బెదిరించిన యువకుడిపై వీణవంక పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి(22) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు. తనను కాకుండా వేరొకరిని చేసుకుంటే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వీణవంకలో రైతుల ఆందోళన
వీణవంక : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో శుక్రవారం రైతులు ధర్నాకు దిగారు. వీఎన్ఆర్ సీడ్ కంపెనీ సరఫరా చేసిన మొక్కజొన్న విత్తనాలతో మోసం పోయామని ఆందోళనకు దిగారు. కంపెనీ ప్రతినిధులు విత్తనాలు సరఫరా చేసేటప్పుడు ఎకరానికి 20 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెప్పారని, కానీ తీరా చూస్తే 5 క్వింటాళ్లే దిగుబడి వచ్చిందని వా పోయారు. కంపెనీ తమకు న్యాయం చేయాలని 150 మంది రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక వ్యవసాయాధికారి హరిత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
వీణవంక బాధితురాలికి పరామర్శ
కరీంనగర్: వీణవంక మండలం చల్లూరులో గ్యాంగ్‌రేప్‌కు గురైన బాధితురాలిని బుధవారం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పరామర్శిచారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ.. ఈ ఘటనపై మహిళా కమిషన్‌కు ఈ నెల 5న ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఓ దళిత యువతిపై ముగ్గురు యువకులు పైశాచికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన సృష్టించిన విషయం తెలిసిందే. -
'ఆమె చదువుకయ్యే ఖర్చు భరిస్తాం'
వీణవంక (కరీంనగర్) : చల్లూరులో గ్యాంగ్ రేప్‌కు గురైన బాధితురాలి ఉన్నత చదులకయ్యే ఖర్చు వైఎస్సార్సీపీ భరిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం వీణవంకలో బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలితో మాట్లాడి ఆమెకు మనో ధైర్యాన్ని కలిగించారు. ఆమె న్యాయ పోరాటానికి వైఎస్సార్సీపీ తోడుంటుందని భరోసా ఇచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆమె ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును వైఎస్సార్సీపీ భరిస్తుందని సింగిరెడ్డి హామీ ఇచ్చారు. -
'నిర్లక్ష్యంగా ఉంటే వారిపైనా చర్యలు తప్పవు'
కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువతి అత్యాచార ఘటనలో పోలీసుల నిర్లక్షం ఉంటే వారిపైనా కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ స్ఫష్టం చేశారు. బాధితురాలు సోమవారం ఎస్పీని కలిసిన నేపధ్యంలో న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం వారి పదో తరగతి సర్టిఫికెట్లను పరిశీలించి వయసు నిర్థారణ చేశామని, నిందితుల్లో ఒకరికి17 సంవత్సరాల 9నెలలు, మరొకరికి 17ఏళ్ల 7నెలలుగా తేలిందన్నారు. వయసు నిర్థారణకై పదో తరగతి మెమోతోపాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. విచారణకు స్పెషల్ టీంను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఛార్జిషీటు దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్షం ఉందని తేలితే వారికి కూడా చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
'పోలీసుల వైఫల్యమే కారణం'
వీణవంక (కరీంనగర్) : దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమంటూ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆరేపల్లి మోహన్ లు ఆరోపించారు. అత్యాచార ఘటనపై సోమవారం వారు మాట్లాడుతూ.. బాధితురాలి స్నేహితురాలు చేసిన ఫోన్ కాల్‌కు పోలీసులు స్పందించకపోవడంతోనే ఘోరం చోటుచేసుకుందని, పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి నాయిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్ఐ, సీఐ, డీఎస్పీలను సస్పెండ్ చేయాలని కోరారు. కాగా బాధితురాలు ఈ రోజు ఎస్పీ జోయల్ డేవిస్‌ను కలిసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన ఎస్పీ న్యాయం జరిగేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు. -
కేసును నీరుగార్చే కుట్ర
♦ పోలీసులు పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారా? ♦ అంజి మైనరంటూ చేసిన ప్రకటనపై అనుమానాలు ♦ అతడు వివాహితుడు.. భార్య నిండు గర్భవతి ♦ బాధితురాలు కోచింగ్ సెంటర్ విద్యార్థి కాదనడంపైనా చర్చ ♦ యువతి మాటలకు, పోలీసుల వివరణకు పొంతన లేని వైనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళిత యువతిపై సామూహిక అత్యాచారం కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారా? తమపై మచ్చ పడకుండా ఉండేందుకు కేసును పక్కదారి పట్టిస్తున్నారా..? ఈ నెల 10న బాధితురాలు అత్యాచారానికి గురయ్యే సందర్భంలో ఆమె స్నేహితురాలు వెంటనే సమాచారమిచ్చినా పోలీసులు స్పందించలేదా..? జరుగుతున్న పరిణామాలు, బాధితులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే ఇవన్నీ నిజమేననే అనుమానం కలుగుతోంది. ఆదివారం హుజూరాబాద్ డీఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాలకు, బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు చెప్పిన మాటలకూ పొంతన కుదరడం లేదు. డీఎస్పీ వెల్లడించిన అంశాల్లో మూడు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తున్నాయి. అవేమిటంటే... వారు పోలీసు శిక్షణ పొందడం లేదట బాధితురాలు, అత్యాచారానికి పాల్పడిన యువకులు వీణవంక పోలీసుల ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీస్ ఉద్యోగాల శిక్షణా కేంద్రం అభ్యర్థులు కాదని డీఎస్పీ పేర్కొన్నారు. తన స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు మాత్రమే అక్కడికి వచ్చేవారన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను బాధితురాలు తీవ్రంగా ఖండించారు. వీణవంక పోలీసులు నిర్వహించే కోచింగ్ సెంటర్‌కు తాను రెగ్యులర్‌గా వెళ్లేదానని చెబుతూ సంబంధిత దరఖాస్తు పత్రాన్ని మీడియాకు చూపించారు. 10న ఘటన.. 24న ఫిర్యాదు? ఈ నెల 10న అత్యాచారం జరిగితే 24న ఫిర్యాదు చేశారని డీఎస్పీ వెల్లడించారు. ఫిర్యాదు చేసిన నిందితులను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించామన్నారు. దీన్ని కూడా బాధితురాలు తప్పుపట్టారు. తనను కోచింగ్ సెంటర్ నుంచి బలవంతంగా తీసుకెళ్లే సమయంలోనే తన స్నేహితురాలు వీణవంక పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారని తెలిపింది. అంజి విద్యార్హత పత్రాలు మాయం! నిందితుల్లో రాకేశ్, అంజి అలియాస్ అంజయ్య మైనర్లని డీఎస్పీ తెలిపారు. వారిని జువైనల్ హోంకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అంజి వివాహితుడు. ఆయన భార్య లావణ్య నిండు గర్భవతి. ఇంటర్ పూర్తి చేశాక మధ్యలో మూడేళ్లపాటు చదువు మానేశాడని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల మళ్లీ జమ్మికుంటలో డిగ్రీలో చేరాడని పేర్కొన్నారు. స్థానికులు చెబుతున్న దాన్ని బట్టి అంజికి 21 ఏళ్లకుపైనే ఉంటాయని తెలుస్తోంది. అంజి వాస్తవ వయసును అంచనా వేసేందుకు మీడియా ఆయన విద్యార్హత పత్రాల కోసం అన్వేషించగా.. పోలీసులు వాటిని తీసుకెళ్లారని తెలిసింది. మరోవైపు వీణవంక ఎస్ఐ కిరణ్‌పై గతంలో పలు ఆరోపణలున్నాయి. కిరణ్‌పై చల్లూరు గ్రామస్తులు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. కిరణ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదివారం పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఈటలను అడ్డుకున్న గ్రామస్తులు చల్లూరులో బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి ఈటలను గ్రామస్తులు అడ్డుకున్నారు. డీఎస్పీ, సీఐ, ఎసై ్సలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, పోలీసులపై వస్తున్న విమర్శలపైనా విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. షీ టీంలను హైదరాబాద్‌కే పరిమితం కాకుండా మండలాలకు విస్తరించేలా చర్యలు చేపడతామన్నారు. -
ముగ్గురిలో ఇద్దరు మైనర్లు
♦ వారందరిపై నిర్భయ కేసు పెట్టాం: డీఎస్పీ ♦ ఆ యువతి పోలీసు ఉచిత శిక్షణకు ఎంపిక కాలేదు ♦ స్నేహితురాలితో అప్పుడప్పుడు మాత్రమే వస్తుండేది సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్/వీణవంక: దళిత యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ కీచకులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకుల్లో ఇద్దరు మైనర్లని ప్రకటించారు. వీరిద్దరిని జువైనల్ హోంకు తరలించిన పోలీసులు ప్రధాన నిందితుడైన శ్రీనివాస్‌ను కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఆదివారం హుజూరాబాద్ డీఎస్పీ రవీందర్‌రెడ్డి మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఆ మెసేజ్ ఆమె బంధువు చూడడంతో చెప్పింది చల్లూరు గ్రామానికి చెందిన యువతి వీణవంక పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ఉచిత శిక్షణ శిబిరానికి ఎంపికైన అభ్యర్థిని కాదు. తన స్నేహితురాలితో అప్పుడప్పుడు మాత్రమే హజరయ్యేది. గతంలోనే యువతికి ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్‌తో పరిచయం ఉంది. ఈ నెల 10న కోచింగ్ సెంటర్ నుంచి శ్రీనివాస్ యువతిని తీసుకుని శంకరపట్నం మండలంలోని కాచాపూర్ గుట్ట సమీపంలోని ఓ పాడుబడిన షెడ్డులోకి తీసుకెళ్లి తన స్నేహితులైన ముద్దం రాకేష్, ముద్దం అంజయ్యలతో కలసి యువతిపై అత్యాచారం చేశారు. ఈ అత్యాచార దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ క్రమంలో సదరు యువతి ఈ సంఘటన జరిగిన రోజు బంధువుల ఇంటికి వెళ్లింది. జరిగిన ఘటనను అప్పటికి ఎవరికీ చెప్పలేదు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితుల్లో ఒకరు యువతి సెల్‌ఫోన్‌కు మెసేజ్ చేశారు. ‘‘మా కోరిక తీర్చాలి. లేకుంటే అత్యాచార దృశ్యాలను ఇంటర్నెట్లో పెడుతాం’’అని అందులో బెదిరించాడు. ఈ మెసేజ్‌ను యువతి బంధువు చూసి అడగ్గా అప్పుడు ఆమె.. జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో బంధువులంతా ఈ నెల 24న రాత్రి యువతితో ఆ యువకుల సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయించి చల్లూరు రావాలని పిలిపించారు. తొలుత శ్రీనివాస్, అంజయ్య రాగా...వారిని చితకబాదారు. వారి ద్వారా మరో నిందితుడైన రాకేశ్‌కు ఫోన్ చేసి రప్పించి అతనిపై దాడి చేశారు. అనంతరం వీణవంక ఎస్సై కిరణ్‌కు ఫోన్ చేశారు. వెంటనే కిరణ్ చల్లూరు వెళ్లి బంధువుల చేతిలో గాయపడిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులపై 376-డి నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చికిత్స కోసం వరంగల్ తరలించారు. కాగా, కేసులో ఏ 2గా ఉన్న అంజయ్య, ఏ3గా ఉన్న రాకేశ్‌లు మైనర్లు కావడంతో కరీంనగర్‌లోని జువైనల్ హోంకు తరలించారు. -
ఆ రాక్షసులను చంపేయండి.. లేదంటే నేనే చంపుతా!
► నరకం అనుభవించా.. నా బాధ అర్థం కావట్లేదా? ► పోలీసులు లంచం తీసుకుని నిందితులను ► కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ► నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నప్పుడు ► నా స్నేహితురాలు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు ► కీచకులను ఎన్కౌంటర్ చేయాలి: యువతి తల్లిదండ్రులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్/వీణవంక ‘‘నా బాధ అర్థం కావడం లేదా..? నే ను నరకయాతన అనుభవించా. అదంతా టీవీల్లో చూశారు. ఆ రాక్షసులను పోలీసులు వెంటనే చంపేయాలి.. వారు ఆ పని చేయకుంటే నేనే చంపేస్తా. ఈ భూమ్మీద వాళ్లకు బతికే హక్కు లేదు...’’ కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరులో కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి ఆక్రోశమిది! పోలీస్ కావాలన్న ఆశతో కోచింగ్‌కు వెళ్లానని, కానీ అక్కడే తన బతుకు నాశనమవుతుందని ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు లంచాలు తీసుకొని ఆ కామాంధులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. బాధితురాలు ఆదివారం తన ఆవేదనను ‘సాక్షి’తో పంచుకుంది. తనపై అఘాయిత్యం చేసేందుకు బలవంతంగా తీసుకెళుతున్న సమయంలోనే తన స్నేహితురాలు పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చిందని, అయినా వారు పట్టించుకోలేదని తెలిపింది. ‘‘ఈ నెల 10న వాళ్లు నన్ను బలవంతంగా తీసుకెళ్లిండ్రు. ఆ సమయంలో నా ఫ్రెండ్ వీణవంక ఎస్సైకి ఫోన్ చేసినా పట్టించుకోలేదు. కనీస స్పందన కూడా లేదు. వాళ్ల దగ్గర లంచాలు తీసుకుని కాపాడుతున్నారు. అసలు ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఒక అమ్మాయికి రక్షించకపోతే పోలీసులు ఇంకేం చేస్తారు’’ అని ఆమె నిలదీసింది. కీచకులను ఎన్కౌంటర్ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేశారు. నిందితుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. కొడుకును ప్రయోజకుడిని చేసేందుకు కూలీ పనులు చేసి చదివిస్తే ఇంతటి కిరాతకానికి పాల్పడతాడని ఊహించలేదని ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ తల్లి సమ్మక్క రోదించింది. తన భర్త మంచివాడేనని, స్నేహితుల వల్లే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడని మరో నిందితుడు అంజయ్య భార్య లావణ్య వాపోయింది. మరోవైపు ఈ దారుణంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా, పౌరహక్కుల, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. నా బిడ్డ కలలు కూలిపోయినయ్: బాధితురాలి తల్లిదండ్రులు సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలు. బాధితురాలు పెద్ద కుమార్తె. పోలీస్ కావాలని ఎన్నో కలలు కన్న తన బిడ్డ జీవితం నాశనమైందని ఆమె తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ‘‘నా బిడ్డ పోలీస్ కావాలని కలలు కన్నది. రోజూ కోచింగ్ సెంటర్‌కు వెళ్లేది. ఇవాళ నా బిడ్డ కలలన్నీ కూలిపోయినయ్. నా బిడ్డకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏ చర్యా తీసుకోలేదు. మూడు రోజులపాటు స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. అమ్మాయిని తీసుకెళ్లి ఫిర్యాదు చేయించినా వినలేదు. పైగా లేడీ కానిస్టేబుల్‌తో రకరకాల ప్రశ్నలు అడిగించారు. ఎస్సై, సీఐ మాటలతో ఘోరంగా హింసించిండ్రు. ఏమని చెప్పుకోలేని పరిస్థితి. నా బిడ్డలాంటోళ్లు బయట చాలామంది ఉన్నారు. వాళ్లు బలికావొద్దంటే ఆ రాక్షసులను ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. వీళ్లను వదిలేస్తే నా బిడ్డలాంటోళ్లు ఎందరో బలైపోతరు. ఇప్పుడు మేం బయటకు వెళ్లాలంటేనే కష్టంగా ఉంది. ఆమె బతుకు నాశనమైంది. కనీసం ప్రభుత్వమైనా నా బిడ్డను ఆదుకోవాలి’’ అని కన్నీరుమున్నీరయ్యారు. క్షమించరాని పని చేశాడు: సమ్మక్క, నిందితుడు గొట్టె శ్రీనివాస్ తల్లి నా కొడుకు క్షమించరాని పనిచేశాడు. ప్రయోజకుడు అవుతాడని కూలీ పనులు చేసి చదివిస్తే బీటెక్ మధ్యలో మానేశాడు. వీణవంక మండలంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం శిక్షణకు వెళ్తుంటే సంతోషించాం. కానీ ఇలా చేస్తాడనుకోలేదు స్నేహితుల వల్లే..: లావణ్య, నిందితుడు అంజి భార్య కానిస్టేబుల్ ఉద్యోగం కోసం వీణవంక పోలీసులు ఏర్పాటు చేసిన శిక్షణకు నా భర్త అంజి రోజు వెళ్లే వాడు. మా చిన్న మామ కొడుకు రాకేశ్, అంజి జమ్మికుంటలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నారు. ఆముదాపల్లెకు చెందిన శ్రీనివాస్ స్నేహంతోనే నా భర్తకు చెడ్డ పేరు వచ్చింది. ఆడపిల్లపై వీరు చేసిన ఈ పని క్షమించరానిది . ఈ సంఘటనలో నా భర్త ఉన్నాడంటే నమ్మలేక పోతున్నాను. ఆ బాధితురాలు నా చెల్లెలు లాంటిది. నిండు గర్భవతిని అయిన నన్ను చూసి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టాలి. లేకుంటే ఆత్మహత్యే నాకు శరణ్యం.