పొలంలో ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్ మృతి | Driver dies as tractor overturns | Sakshi
Sakshi News home page

పొలంలో ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్ మృతి

Published Tue, Jan 12 2016 3:01 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

Driver dies as tractor overturns

వీణవంక (కరీంనగర్) : పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పల్టీ కొట్టి డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన లడిగె రాము(30) మండలంలోని కొండపాక గ్రామానికి చెందిన ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం పొలం దున్నటానికి వెళ్లాడు. నాటుదుక్కి చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వెనక్కి పల్టీ కొట్టింది. ట్రాక్టర్‌పై ఉన్న రాము పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement