'పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోస్తా..' | Man held for allegedly threatening woman | Sakshi
Sakshi News home page

'పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోస్తా..'

Published Sat, Mar 5 2016 6:21 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

Man held for allegedly threatening woman

వీణవంక (కరీంనగర్ జిల్లా) : తనను పెళ్లి చేసుకోకపోతే ముఖంపై యాసిడ్ పోసి చంపేస్తానని 19 ఏళ్ల యువతిని బెదిరించిన యువకుడిపై వీణవంక పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన అనిల్‌ రెడ్డి(22) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు. తనను కాకుండా వేరొకరిని చేసుకుంటే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement