సాక్షి, కరీంనగర్ : జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అత్యంత కిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో ప్రణయ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన దళిత అమ్మాయి 8ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. గతకొంత కాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రణయ్‌పై అర్థరాత్రి ఆయన ఇంటివద్దనే దాడి చేశారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి అంబేద్కర్ భవన్ వద్ద నరికి చంపారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుకున్న సీపీ కమలాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులతో పాటు గ్రామస్తులు భావిస్తున్నారు. (అప్పు తీర్చలేక బాలిక అప్పగింత)
8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు..
దళితుడైన ప్రణయ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ప్రేమ వ్యవహారంతోనే హత్య చేసినట్లు భావిస్తూ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. త్వరలో నిందితులను గుర్తించి పట్టుకుంటామని ప్రకటించారు. ప్రణయ్ హత్య పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేపింది. మరోవైపు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే రాత్రి సయమంలో అమ్మాయి ఫోన్ చేస్తేనే ప్రణయ్ బయటకు వెళ్లాడని, ఆమెతో మాట్లాడుతుండగా యువతి సోదరుడు అనిల్ కర్రలతో దాడి చేయడంతో చనిపోయినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ప్రణయ్ మృతదేహాన్ని అంబేద్కర్ భవన్ వద్ద పడేసినట్లు తెలిపారు. అమ్మాయి అబ్బాయి 8 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారని, వారి ప్రేమ వ్యవహారం అమ్మాయి కుటుంబ సభ్యులందరికీ తెలుసునని తెలిపారు. అమ్మాయి సోదరుడు అనీల్ ఒక్కరికి మాత్రమే నచ్చకపోవడంతో పలుమార్లు గొడవ జరిగినట్లు తెలిపారు. పోలీసులు ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రేమ వ్యవహారం: ప్రణయ్ దారుణ హత్య
Published Tue, Oct 20 2020 10:05 AM | Last Updated on Tue, Oct 20 2020 12:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment