pranai
-
నాకౌట్ దశకు సింధు, లక్ష్య సేన్, ప్రణయ్
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగాల్లో భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ నాకౌట్ దశకు అర్హత సాధించారు. తద్వారా పతకం గెలిచే ఆశలను సజీవంగా నిలబెట్టుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎమ్’ రెండో లీగ్ మ్యాచ్‌లో సింధు 21–5, 21–10తో క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)పై అలవోకగా గెలిచింది.33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సింధు గ్రూప్ ‘ఎమ్’ విజేతగా అవతరించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత రెండో ర్యాంకర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించి గ్రూప్ ‘ఎల్’ టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 50 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 21–12తో క్రిస్టీపై గెలిచాడు. రెండో గేమ్‌లో స్కోరు 19–12 వద్ద ఉన్నపుడు ఇద్దరి మధ్య 50 షాట్ల ర్యాలీ జరిగింది. చివరకు క్రిస్టీ కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో పాయింట్ లక్ష్య సేన్‌కు లభించింది. ఆ తర్వాత లక్ష్య సేన్ మరో పాయింట్ నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. గ్రూప్ ‘కె’ టాపర్‌గా భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ ప్రణయ్ 16–21, 21–11, 21–12తో ఫట్ లె డక్ (వియత్నాం)పై నెగ్గాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌తో ప్రణయ్ తలపడతాడు. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ఆర్చరీ పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్): ప్రవీణŠ జాధవ్ X వెన్‌చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి). పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).షూటింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్): స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి). మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).గోల్ఫ్ పురుషుల వ్యక్తిగత ఫైనల్స్: గగన్‌జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).బాక్సింగ్ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్: నిఖత్ జరీన్ X యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).సెయిలింగ్పురుషుల డింగీ తొలి రెండు రేసులు: విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). మహిళల డింగీ తొలి రెండు రేసులు: నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)హాకీభారత్ X బెల్జియం (గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్: (మధ్యాహ్నం గం. 12:00 నుంచి). పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్: సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి X చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి). మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి). -
సింధు, ప్రణయ్ ముందుకు...
సింగపూర్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–12, 22–20తో ప్రపంచ 21వ ర్యాంకర్ లినె హొమార్క్ జార్స్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21–9, 18–21, 21–9తో జూలియన్ కరాగి (బెల్జియం)పై గెలుపొందారు. భారత్‌కే చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లు లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. లక్ష్య సేన్ 13–21, 21–16, 13–21తో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోగా... కొడాయ్ నరోకా (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను 14–21తో కోల్పోయి రెండో గేమ్‌లో 3–11తో వెనుకబడ్డాడు. ఈ దశలో మోకాలి గాయంతో శ్రీకాంత్ వైదొలిగాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు; కెంటా నిషిమోటో (జపాన్)తో ప్రణయ్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో సింధు 5–11తో, ప్రణయ్ 2–3తో వెనుకబడి ఉన్నారు. అశ్విని–తనీషా జోడీ ఓటమి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. పొలీనా బురోవా–యెవెనియా (ఉక్రెయిన్) జంటతో జరిగిన మ్యాచ్‌లో అశ్విని–తనీషా ద్వయం 21–18, 19–21, 19–21తో ఓడిపోయింది. పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 21–7, 21–14తో చెంగ్ యు పె–సన్ యు సింగ్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో బేక్ హా నా–లీ సో హీ (దక్షిణ కొరియా)లతో గాయత్రి–ట్రెసా పోటీపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 18–21, 19–21తో గో సూన్ హువాట్–లాయ్ షెవోన్ జేమీ (మలేసియా) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. -
శ్రమించి గెలిచిన సింధు, ప్రణయ్
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్‌షిప్ సింగిల్స్ విభాగంలో భారత స్టార్స్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ మాత్రమే బరిలో మిగిలారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 64 నిమిషాల్లో 18–21, 21–14, 21–19తో ప్రపంచ 33వ ర్యాంకర్ గో జిన్ వె (మలేసియా)పై... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 90 నిమిషాల్లో 17–21, 23–21, 23–21తో ప్రపంచ 16వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)పై గెలుపొందారు. గతంలో గ్వాంగ్ జుతో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ నాలుగో ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన ప్రణయ్ రెండో గేమ్‌లో, మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మాళవిక (భారత్) 18–21, 19–21తో సిమ్ యు జిన్ (కొరియా) చేతిలో, ఆకర్షి కశ్యప్ 10–21, 11–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్ 19–21, 15–21తో టాప్ సీడ్ షి యుకీ (చైనా) చేతిలో, కిడాంబి శ్రీకాంత్ 14–21, 13–21తో రెండో సీడ్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో, ప్రియాన్షు 9–21, 13–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 2–21, 12–21తో లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
ప్రణయ్ ప్రతాపం.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు
దశాబ్దకాలంగా భారత అగ్రశ్రేణి షట్లర్‌గా కొనసాగుతున్న హెచ్ఎస్ ప్రణయ్ ఎట్టకేలకు విశ్వవేదికపై తన సత్తా చాటుకున్నాడు. అత్యంత ప్రతిభావంతుడైనప్పటికీ నిలకడలేమితో ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం తొలిసారి ప్రణయ్ మెడలో పడనుంది. 2021, 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగి పతకానికి చేరువై దూరమైన ఈ కేరళ స్టార్ మూడో ప్రయత్నంలో మాత్రం అసాధారణ ఆటతీరుతో సక్సెస్ సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్, యూరోపియన్ చాంపియన్ అయిన డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్ను అతని సొంతగడ్డపైనే ఓడించి ప్రణయ్ తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్ చేరిన ప్రణయ్ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మరో అద్భుతం చేశాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–15, 21–16తో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) తో ప్రణయ్ ఆడతాడు. అక్సెల్సన్తో 68 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను చేజార్చుకున్నా నిరాశపడకుండా పట్టుదలతో ఆడి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి ముందంజ వేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న మెగా ఈవెంట్లో ప్రణయ్ ధాటికి అక్సెల్సన్కు అనూహ్య పరాజయం తప్పలేదు. తొలి గేమ్ కోల్పోయిన ప్రణయ్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, మరో కోచ్ గురుసాయిదత్ సూచనలతో తన వ్యూహం మార్చుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ, అడపాదడపా కళ్లు చెదిరే స్మాష్‌లతో ప్రణయ్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అనవసర తప్పిదాలు చేసేలా చేశాడు. రెండో గేమ్‌లో స్కోరు 13–10 వద్ద ప్రణయ్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. మూడో గేమ్‌లోనూ ప్రణయ్ దూకుడు కొనసాగిస్తూ అక్సెల్సన్పై ఒత్తిడి పెంచాడు. స్కోరు 7–6 వద్ద ప్రణయ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–6తో ముందంజ వేశాడు. ఆ తర్వాత అక్సెల్సన్ తేరుకునే ప్రయత్నం చేసినా ప్రణయ్ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడుతూ విజయం అందుకున్నాడు. సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి పురుషుల డబుల్స్ విభాగం నుంచి ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 18–21, 19–21తో ప్రపంచ 11వ ర్యాంక్ జంట కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్ముసెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. ఇప్పటిదాకా 14 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు గెలిచిన పతకాల సంఖ్య. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు), సైనా నెహ్వాల్ (1 రజతం, 1 కాంస్యం), పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే (1 కాంస్యం), సాయిప్రణీత్ (1 కాంస్యం), కిడాంబి శ్రీకాంత్ (1 రజతం), లక్ష్య సేన్ (1 కాంస్యం), గుత్తా జ్వాల–అశి్వని పొన్నప్ప (1 కాంస్యం), సాత్విక్–చిరాగ్ శెట్టి (1 కాంస్యం) ఈ జాబితాలో ఉన్నారు. ప్రణయ్ సెమీస్‌లో ఓడితే కాంస్య పతకం దక్కుతుంది. ఫైనల్ చేరి గెలిస్తే స్వర్ణ పతకం, ఓడితే రజత పతకం లభిస్తుంది. 2011 నుంచి ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకాలు సాధిస్తుండటం విశేషం. -
ప్రణయ్, శ్రీకాంత్, లక్ష్య సేన్లపై భారత్ ఆశలు
కొపెన్ హాగెన్ (డెన్మార్క్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్లపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేటి నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో భారత ఆటగాళ్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. మహిళల విభాగంలో మాజీ చాంపియన్ పీవీ సింధుకు తొలి రౌండ్లో బై లభించింది. మాజీ ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్), తుయ్ లిన్ గుయెన్ (వియత్నాం) మధ్య తొలి రౌండ్ విజేతతో 2019 ప్రపంచ చాంపియన్ సింధు రెండో రౌండ్లో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్‌కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. మొదటి రౌండ్లోనే అతను 14వ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)ను ఎదుర్కొంటాడు. 11వ సీడ్ లక్ష్య సేన్...జార్జెస్ జులియన్ పాల్ (మారిషస్)తో, 9వ సీడ్ ప్రణయ్... కెల్లే కొల్జనెన్ (ఫిన్లాండ్)తో పోటీపడతారు. పురుషుల డబుల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకింగ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఈసారి స్వర్ణంపై కన్నేసింది. గత ఏడాది జరిగిన ఈ టోర్నీలో మేటి డబుల్స్ జోడీ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మహిళల డబుల్స్‌లో 15వ సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటకు తొలి రౌండ్లో బై లభించింది. సిన్సినాటి ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్తో జొకోవిచ్ ‘ఢీ’ కెరీర్లో 39వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించేందుకు సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్... కెరీర్లో ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గేందుకు స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ అమీతుమీ తేల్చుకోనున్నారు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరుగుతున్న సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో వీరిద్దరూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో అల్కరాజ్ 2–6, 7–6 (7/4), 6–3తో హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించగా... జొకోవిచ్ 7–6 (7/5), 7–5తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను ఓడించాడు. ఈ క్రమంలో 36 ఏళ్ల జొకోవిచ్ ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన పెద్ద వయసు్కడిగా గుర్తింపు పొందాడు. అల్కరాజ్తో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 1–2తో వెనుకంజలో ఉన్నాడు. -
ప్రణయ్ ఆత్మహత్య.. సంచలన విషయాలు
అనంతపురం క్రైం: కెనాడాలో ‘అనంత’ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. సహజీవనం చేస్తోన్న యువతి తనను నయవంచన చేయడంతో తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే... నార్పల మండలం గడ్డంనాగేపల్లికి చెందిన పి.నారాయణస్వామి, పి.వాణి దంపతులు అనంతపురంలోని కోవూరునగర్‌లో నివాసముంటున్నారు. వీరి కుమారుడు పుచ్చకాయల ప్రణయ్ (29) కెనాడలోని విక్టోరియాలో డిజిటల్ విభాగంలో పని చేస్తున్నాడు. కృష్ణా జిల్లా ఘంటసాల ప్రాంతానికి చెందిన దేవిప్రసాద్ ముప్పాల, వాణి ముప్పాల దంపతుల కూతురు సాయి అఖిల ముప్పాల. వీరు హైదరాబాద్ హఫ్సీగూడలో నివాసముంటున్నారు. ఈ ఏడాది జనవరిలో అఖిల ముప్పాలతో ప్రణయ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా, ఆ తర్వాత డేటింగ్ (సహజీవనం) వరకు వెళ్లింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కెనాడాలో మ్యారేజ్ లైసెన్స్ తీసుకుని ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబర్ 7 వరకు విక్టోరియాలోని అవేబరీ అవే ప్రాంతంలో సహజీవనం చేశారు. యూఎస్‌లో హెచ్1 వీసా రాగానే అఖిల ముప్పాల ప్రణయ్‌ను నయవంచన చేసి వెళ్లిపోయింది. మరికొందరితో ప్రేమాయణం అఖిల హైదరాబాద్ మల్లారెడ్డి కళాశాలలో ఫార్మసీ పూర్తి చేసి 2013–14లో యూఎస్‌కు వెళ్లింది. 2018లో అనిరుధ్ తెటాలి అనే వ్యక్తితో కలిసి ఒకటే చోట ఉంది. యూఎస్‌లో ఉన్నప్పుడు మహేష్, ఆశిక్, తదితరులతో కూడా అఖిలకు పరిచయం ఉంది. మూడేళ్లు గడిచినా హెచ్1 వీసా రాకపోవడంతో 2020 జనవరి ప్రారంభంలో ప్రణయ్ ఉంటున్న విక్టోరియాకు వచ్చింది. సిగరెట్, బాయ్‌ఫ్రెండ్ వద్దన్నందుకు.. సిగరెట్ తాగితే ఆరోగ్యం చెడిపోతుందని, పాత బాయ్ఫ్రెండ్లతో చాట్ చేయకూడదని అఖిలపై ప్రణయ్ కోప్పడ్డాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ కలసిమెలసి ఉన్నారు. ఈ క్రమంలో హెచ్1 వీసా ప్రీమియం కన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఛాన్స్‌గా తీసుకున్న అఖిల ఈ ఏడాది అక్టోబర్ 7న ప్రణయ్‌కు చెప్పకుండా వెళ్లిపోయింది. వీరిద్దరి సహజీవనం ఇరు కుటుంబాలకు తెలుసు. అఖిల చేసిన నయవంచనను తల్లి వాణి(అఖిల తల్లి)కి చెప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. చివరకు ప్రణయ్‌పై కేసు పెడతామని అఖిల తల్లి బెదిరించింది. ఈ క్రమంలో అఖిల, ఆమె తల్లి ప్రణయ్ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశారు. 14న ఆత్మహత్య.. అఖిల చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన ప్రణయ్ ఈ నెల 14న విక్టోరియాలో నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు తన బాధను వ్యక్తం చేస్తూ వీడియో తీశాడు. ప్రణయ్ మరణవార్త తెలియగానే అనంతపురం నాల్గవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు కోవూర్‌నగర్‌లోని ఇంటికి వెళ్లి అతడి కుటుంబీకులతో మాట్లాడారు. -
వర్మ ‘మర్డర్’కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టివేసింది. గతంలో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరువు కోసం అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించారు. ఇదే కథాంశంగా సినిమాను తెరకెక్కించాలని రామ్ గోపాల్‌వర్మ నిర్ణయించుకున్నారు. తమ అనుమతి లేకుండా రామ్‌గోపాల్‌వర్మ సినిమాను తీస్తున్నారంటూ అమృత కోర్టును ఆశ్రయించింది. అమృత మొదట నల్గొండ కోర్టును ఆశ్రయించగా చిత్ర విడుదలను నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై వర్మ హైకోర్టును ఆశ్రయించగా సినిమాలో ప్రణయ్, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని షరతు విధించింది. వారి పేర్లు వాడబోమని చిత్ర యూనిట్ హామీ ఇవ్వడంతో ఇక ఏ అడ్డంకులు లేకుండా విడుదల కానుంది. అనంతరం రామ్‌గోపాల్‌వర్మ ట్విటర్ వేదికగా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. మర్డర్ చిత్రం తెరకెక్కడం వెనుక ఉన్న మా మంచి ఉద్దేశాన్ని కోర్టు అర్థం చేసుకుంది. అన్ని విషయాలను కోర్టు ఆర్డర్ వచ్చిన తరువాత వెల్లడిస్తాను అంటూ వర్మ ట్వీట్ చేశారు. VERY HAPPY to inform that our good intentions of making the film MURDER has been rightly understood by the honourable COURT ..Details will be given once the order is with us ..THANKING EVERYONE 🙏🙏🙏💐💐💐 pic.twitter.com/lmdD4mOWVd — Ram Gopal Varma (@RGVzoomin) November 6, 2020 ఇదిలావుండగా రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న మరో చిత్రం దిశ ఎన్కౌంటర్. ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్నారని వాటిని తొలగించాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పకే ఈ చిత్రం విడుదలను ఆపివేయాలని నిందితులు కుటుంబ సభ్యులు సుప్రీం జ్యుడీషియల్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరో మారు హైకోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. ఈ నెల 26న దిశ ఎన్కౌంటర్ చిత్రం విడుదల కానుంది. చదవండి: ‘ఇది దిశ బయోపిక్ కాదు.. నిజాలు చెప్తున్నాం’ -
ప్రేమ వ్యవహారం: ప్రణయ్ దారుణ హత్య
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అత్యంత కిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో ప్రణయ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన దళిత అమ్మాయి 8ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. గతకొంత కాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రణయ్‌పై అర్థరాత్రి ఆయన ఇంటివద్దనే దాడి చేశారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి అంబేద్కర్ భవన్ వద్ద నరికి చంపారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుకున్న సీపీ కమలాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులతో పాటు గ్రామస్తులు భావిస్తున్నారు. (అప్పు తీర్చలేక బాలిక అప్పగింత) 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. దళితుడైన ప్రణయ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ప్రేమ వ్యవహారంతోనే హత్య చేసినట్లు భావిస్తూ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. త్వరలో నిందితులను గుర్తించి పట్టుకుంటామని ప్రకటించారు. ప్రణయ్ హత్య పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేపింది. మరోవైపు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే రాత్రి సయమంలో అమ్మాయి ఫోన్ చేస్తేనే ప్రణయ్ బయటకు వెళ్లాడని, ఆమెతో మాట్లాడుతుండగా యువతి సోదరుడు అనిల్ కర్రలతో దాడి చేయడంతో చనిపోయినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ప్రణయ్ మృతదేహాన్ని అంబేద్కర్ భవన్ వద్ద పడేసినట్లు తెలిపారు. అమ్మాయి అబ్బాయి 8 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారని, వారి ప్రేమ వ్యవహారం అమ్మాయి కుటుంబ సభ్యులందరికీ తెలుసునని తెలిపారు. అమ్మాయి సోదరుడు అనీల్ ఒక్కరికి మాత్రమే నచ్చకపోవడంతో పలుమార్లు గొడవ జరిగినట్లు తెలిపారు. పోలీసులు ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
ప్రణయ్ హత్యకేసు : రక్షణ కోరుతున్న ప్రేమజంటలు
సాక్షి, విజయవాడ: మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసుతో మరికొన్ని ప్రేమ జంటలు భయాందోళనలకు గురవుతున్నాయి. తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కులాంతర వివాహం చేసుకున్నందుకు మూడు నెలలుగా తమ బంధువులు వేధిస్తున్నారని మీడియా ముందు నవదంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా గూడురుకు చెందిన బండి శివదీప్తి రెడ్డి, కడపకు చెందిన మురహురి విజయ్ కుమార్‌లు జులై 26న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తర్వాత అమ్మాయి బంధువులు భర్తను వదిలి రావాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తన బంధువులు పోలీస్ శాఖలో ఉన్నత పదవుల్లో ఉండటంతో విజయ్‌కు ప్రాణహాని ఉందని దీప్తి రెడ్డి మీడియాకు చెప్పారు. ఏలూరులో ప్రేమ జంటకు బెదిరింపులు తాడేపల్లి గూడెంకు చెందిన సంపత్ కుమార్, గుంటూరు జిల్లా నడింపేట మండలం చేబ్రోలుకు చెందిన నహ్రీన్‌లకు ఏలూరులో బౌద్ద ప్రచార ట్రస్ట్‌లో మంగళవారం మతాంతర వివాహం జరిగింది. అయితే నహ్రీన్ తండ్రి తన కూతురిని పంపకపోతే అంతు చూస్తామంటూ యువకుడి బంధువులను బెదిరించారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రేమ జంటకు ఆశ్రయం కల్పించి మహిళా పోలీస్‌స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. -
ఇలా ఆలోచిస్తారు అని ఎప్పుడు అనుకోలేదు: అమృత
-
న్యాయం కొసం
-
ప్రణయ్ హత్య : కౌసల్య శంకర్ ఏమన్నారు?
సాక్షి,హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకున్న దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ (24) ఘోరమైన హత్యలాంటిదే తమిళనాడులో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడు శంకర్ (22) హత్య. ప్రణయ్ హత్య జరిగిన వెంటనే కౌసల్య, శంకర్ల విషాద గాథ అందరి మదిలో మెదిలింది. కేవలం తమ అమ్మాయి కౌసల్యను కులాంతర వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో శంకర్‌ను కౌసల్య తండ్రి కిరాయి హంతకుల ద్వారా అతిదారుణంగా పట్టపగలే నరికి చంపించిన వైనం అప్పట్లో కలకలం రేపింది. 2016 మార్చిలో తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అచ్చం ప్రణయ్ హత్య తరహాలోనే, మాటువేసి వెనుకనుండి దాడిచేసి పట్టపగలే నడిరోడ్డులో కత్తులతో నరికి చంపారు. ఈ హత్య కూడా సీసీ టీవీలో రికార్డు అయింది. ప్రణయ్ హత్యోదంతాన్ని తెలుసుకున్న కౌసల్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలపై ఇలాంటి భయానక హత్యలకు చరమగీతం పాడాలంటే కుల వ్యవస్థ మొత్తం నాశనం కావాలని కౌసల్య పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక మహిళ మరొక కులంలోని వ్యక్తిని వివాహం చేసుకుంటే కులం నాశనమవుతుందని భావిస్తారు. ప్రత్యేకంగా, అబ్బాయి అణచివేత కులానికి చెందిన వాడైతే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. తమ కుమార్తె గర్భంలో మరొక కులానికి చెందిన శిశువు ఎలా ఉంటుందని రగిలిపోతారు. భారతీయ సమాజం మొత్తం కులతత్వ సమాజం. కులతత్వం ఉన్నంతకాలం ఈ భయంకరమైన కుల నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే ప్రభుత్వాలు చొరవ తీసుకుని కులతత్వాన్ని సమూలంగా నాశనం చేసే మార్గాన్ని కనుగొంటే తప్ప, వీటికి అడ్డుకట్ట పడదని ఆమె చెప్పింది. హింస నుండి మహిళలను కాపాడడానికి చట్టాలున్నాయి కాబట్టే కొంతమేరకు పోరాడగలుగుతున్నాం. కానీ పరువు హత్యలపై ఇప్పటికీ ఎలాంటి చట్టాలు లేవు. ఇలాంటి పటిష్టమైన చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకు రావాల్సి ఉంది. కఠినచట్టాలు, రక్షణ లేకుండా , కేవలం నోటిమాటలతో ఈ హత్యల్ని ఆపలేం. ఇలాంటి వివాహాలు తప్పు కాదని చెప్పే చట్టాలు రావడంతోపాటు ఆయా జంటలకు ప్రోత్సాహన్నందించాలని కౌశల్య ఆకాంక్షించారు. మా తరువాత చాలా జంటల్ని కులం పొట్టన పెట్టుకుంది. మహిళలను శిశువులను తయారుచేసే యంత్రాలుగానే సమాజం చూస్తోంది. కేవలం కులాన్ని కాపాడే దేవతలుగా మాత్రమే మహిళల్ని గౌరవిస్తున్నారని కౌశల్య ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తమ తల్లిదండ్రులకు ఇష్టంలేకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు పోలీస్ స్టేషన్ల నుంచి సరైన మద్దతు లభించడం లేదన్నారు. వారికిష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు అంటూ ఆ జంటను విడదీయడానికి ప్రయత్నిస్తారు. పోలీసులు ఇలా ఎందుకు చేయాలి? చట్ట ప్రకారం, న్యాయం వైపు వారు ఎందుకు వుండరు? పోలీసులు హింసనుంచి ప్రజలను రక్షించాలని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఏ ఆఫీసర్ అలా చేయడం లేదని కౌశల్య ఆరోపించారు. పెరియార్, అంబేద్కర్ చెప్పినట్టుగా మహిళల విముక్తి లేకుండా కులవ్యవస్థ నిర్మూలన సాధ్యం కాదు. ఈ రోజుల్లో కులాలు ఎక్కుడున్నాయని అందరూ అంటారు. కానీ, ప్రతిరోజూ అనుభవిస్తున్న వారికి మాత్రమే ఆ వివిక్ష తాలూకు బాధేంటో తెలుసునని కౌశల్య వ్యాఖ్యానించారు. కాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త కన్నవాళ్ల చేతుల్లోనే దారుణంగా హత్య కావడంపై కౌసల్య న్యాయపోరాటం చేసారు. నేరస్తులకు ఉరిశిక్షపడేదాకా మొక్కవోని ధైర్యంతో పోరాడారు. ప్రస్తుతం కులనిర్మూలన కోసం పోరాటం చేస్తున్నారు.. మరోవైపు కౌశల్య తరహాలోనే అమృత ప్రణయ్ కూడా కులనిర్మూలనకోసం ఉద్యమిస్తానని చెప్పడం గమనార్హం. -
ప్రణయ్..ఇక సెలవ్
మిర్యాలగూడ పట్టణం కన్నీటి సంద్రమైంది. పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కు ఆదివారం మిర్యాలగూడ పట్టణ ప్రజలు, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు అంతిమ వీడ్కోలు పలికారు. కుల దురహంకారానికి బలైన ‘బలి ప్రేమ’గా అభివర్ణించారు. వినోభానగర్ శ్మశానవాటికలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం 7.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. మిర్యాలగూడ (నల్గొండ) : పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కి ఆదివారం మిర్యాలగూడ ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతిఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. మిర్యాలగూడలోని వినోభానగర్‌లోని ప్రణయ్ ఇంటి వద్ద నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల్లో నిర్వహించారు. యాత్రలో పాల్గొనడానికి మిర్యాలగూడ పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరా వును ఉరితీయాలని డిమాండ్ చేస్తూ నినదించారు. అంతిమయాత్రలో పాల్గొన్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతీరాగ్యానాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్, వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, టీడీ పీ నియోజకవర్గ ఇన్చార్జ్ సాధినేని శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, దామరచర్ల జెడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కేతావత్ శంకర్నా యక్, పీసీసీ సభ్యుడు స్కైలాబానాయక్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవీఆర్ రెడ్డి, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముండ్లగిరి కాంతయ్య, నాయకులు తాళ్లపల్లి రవి, కేవీపీఎస్ నాయకులు రెమడాల పరుశురాములు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు దైద సత్యం, పోకల కిరణ్‌కుమార్, చిలుముల నర్సింహ, కె.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పాటలతో కళాకారుల కన్నీటి వీడ్కోలు మిర్యాలగూడ అర్బన్ : ప్రణయ్ అంతిమయాత్ర సందర్భంగా భారత నాస్తిక సమాజ కళాకారుల ఆధ్వర్యంలో పాడి న పాటలు పలువురిని కంటనీరు పెట్టించాయి. కుల దురహంకారంతో మారుతీరావు కన్నకూతురి తాళి తెంపాడని, మారుతీరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం కళాకారులు పాల్గొన్నారు. -
ప్రణయ్‌ను చంపి.. పెంచుకున్న పరువేంటి?
పరువును చూసుకుని పిల్లలు ప్రేమించరు. ‘పరువు తీసే’ ప్రేమను పెద్దలు క్షమించరు. ప్రేమకు, పరువుకు మధ్య తీరని ఘర్షణ ఇది! తరతరాల సంఘర్షణ ఇది. పెద్దలూ ఒకప్పటి పిల్లలే కదా. ఈ నిజాన్ని గుర్తుకు తెచ్చుకుంటే.. ప్రేమ నేరం అవదు. పరువు గుర్తుకే రాదు. ‘‘అమృత వర్షిణి ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆ అమ్మాయి బాధ చూడలేకపోతున్నాం! దేవుడా.. ఇంత దారుణమా? కన్నబిడ్డల సంతోషం, సుఖం కంటే కావల్సిందేముంది? వాళ్లు ఆనందంగా కనపడుతున్నప్పుడు ‘‘కలకాలం ఇలాగే ఉండనీ’’ అని ఆశీర్వదించాలి. అంత పెద్ద మనసు లేకపోతే.. నోటికి అంత మంచి మాట రాకపోతే.. దూరంగా ఉండిపోవాలి. అంతేకాని ఉసురు తీస్తారా?’’ ఇలాగే బాధపడ్తారు.. ఆలోచిస్తారు స్పందించే గుణమున్న మనుషులైతే! (ప్రణయ్ – అమృత (ఫైల్‌ఫొటో) ) పిల్లలు ఎందుకు బలి కావాలి? అమృత వర్షిణి పెద్ద కులం (?) అమ్మాయి. ప్రణయ్.. తక్కువ కులం (?) అబ్బాయి. ఆ అమ్మాయి వాళ్లు బాగా డబ్బున్నవాళ్లు. ఈ అబ్బాయి వాళ్లదీ సౌకర్యవంతమైన జీవనశైలిలో ఉన్న కుటుంబమే. అబ్బాయి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. కెనడా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు కూడా. అయితే ఇవేవీ అమ్మాయి తల్లిదండ్రులకు కనిపించలేదు. ‘తక్కువ కులం’ అన్నదొక్కటే భూతద్దంలో కనిపించింది. అదీ పరువు అనే వృత్తంలో తిరుగుతూ! అదే వాళ్ల మెదడులోనూ గింగిరాలు కొట్టింది. అందుకే అదను కాచి కన్న బిడ్డ ఆనందాన్ని మింగేశారు. బిడ్డ భవిష్యత్తును మరిచి.. విచక్షణను కోల్పోయి అనాగరికంగా ప్రవర్తించారు. పైగా దాన్ని సమర్థించుకుంటున్నారు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కన్నా సమాజం పెంచిన కులం, పరువే ముఖ్యమని చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మావలోకనం చేసుకుందాం తప్పు ఎవరిదో? అమృత వర్షిణికి కలిగించిన దుఃఖం, బాధ, వేదనలో మన పాలు ఎంత ఉందో? ప్రణయ్‌ను పోగొట్టుకున్న తల్లి శోకానికీ మనమెంత బాధ్యులమో? కులాన్ని సృష్టించి ఆ నియమంలో బతికితేనే పరువు అనే భ్రమకు రూపమిచ్చే పిచ్చి ప్రయత్నం చేస్తూ అదే నిజమని నమ్మే మనుషులతో సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది చిరంజీవిగా వర్థిల్లడానికి పిల్లల్ని బలిపెడుతూ వస్తున్నాం. ఇంకెన్ని? ఇంకెంత కాలం? మొన్ననే.. ఆగస్ట్ 23న అబ్దుల్లాపూర్‌మెట్‌లో విజయలక్ష్మిని సొంత తల్లిదండ్రులే హత్య చేశారు. అమ్మాయికి 27 ఏళ్లు. తాము ఉండే వాడకట్టులోనే ఉంటున్న సురేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. భద్రాచలంలో కాపురం పెట్టారు. సంతోషంగానే ఉంటున్నారు. ఒక బాబు కూడా పుట్టాడు. మూడేళ్లవాడయ్యాడు. ఆ అమ్మాయి మళ్లీ గర్భందాల్చింది. ఏడు నెలలు. ఈలోపు అత్తగారు పోయారని తెలిసి భర్త, పిల్లాడితో కలిసి నాలుగేళ్ల తర్వాత ఆ ఊళ్లోకి అడుగుపెట్టింది. కూతురు వచ్చిన విషయం తెలుసుకొని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు ఆమె రాను మొర్రో అని అంటున్నా వినకుండా. తర్వాత ఆ అమ్మాయి అదే ఇంట్లో శవమై కనిపించింది. కూతురి పెళ్లయి నాలుగేళ్లు గడిచినా వాళ్ల కోపం పోలేదు. ఓ బిడ్డను, ఇంకో బిడ్డను కడుపులో మోస్తున్నా ఆ తల్లి మీద దయ రాలేదు. పరువు కోసం కన్న పేగును కోసేసుకున్నారు. 2017లో.. మార్చి నెలలో తెలంగాణ, పెద్దపల్లికి చెందిన మంథని మధుకర్ అనే దళిత యువకుడిని, అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని, అమ్మాయి తరపు బంధువులు అతనిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ సంఘటన తర్వాత అదే యేడు యాదాద్రి జిల్లాకు చెందిన నరేష్, స్వప్నలూ చనిపోయారు. స్వప్న పెద్ద కులస్తురాలు. వాళ్లకన్నా తక్కువ కులానికి చెందిన నరేష్‌ను ప్రేమించి, పెళ్లిచేసుకుందనే కోపంతో స్వప్న తండ్రి ఓ పథకం ప్రకారం ముందు నరేష్‌ను హత్య చేయించాడు. తర్వాత స్వప్న పుట్టింట్లోనే.. బాత్రూమ్లో ఉరేసుకుని శవంగా కనిపించింది. అయితే పెళ్లయ్యాక ఈ జంట షోలాపూర్‌లో కాపురముంటుంటే.. స్వప్నను ముందు ఇంటికి తెచ్చి.. తర్వాత నరేష్‌ను హత్య చేయించారు. పెద్దల పట్టింపు, మూర్ఖపు పట్టుదలలు పిల్లలను హత్యచేశాయి. హత్య చేయడం పరువా?! : సుప్రీం కోర్టు ఇవి యేడాది కిందటివి. అంతకుముందూ హానర్ కిల్లింగ్స్ ఉన్నాయి. ఉత్తర భారతదేశానికే పరిమితం అనుకున్న పరువు హత్యలు మనకూ వ్యాపించాయి అంటు వ్యాధిలా. 2014 చివర నుంచి 2017 దాకా అంటే ఆ రెండున్నరేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 17 పరువు హత్యలు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా కులాంతర వివాహానికి సంబంధించినవే. 2014– 2015 నేషనల్ క్రైమ్‌రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం హానర్ కిల్లింగ్స్‌లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లే ఉన్నాయి. అంతకంతకూ పెరుగుతున్న వీటి సంఖ్యను చూసి అదిరిపడ్డ సుప్రీంకోర్టు 2006లో ‘‘ హత్య చేయడంలో పరువు ఎక్కడుంది? హేయంగా, దారుణంగా, ఘోరంగా, అమానుషంగా చేసే ఈ హత్యల వెనక రాక్షసత్వం, భూస్వామ్య ఆధిపత్య మనస్తత్వం తప్ప ఇంకోటి లేదు. ఇలాంటి చర్యలకు ఒడిగట్టేవాళ్లు కఠిన శిక్షకు అర్హులు’’ అంటూ తీర్పునిచ్చింది. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమే అంతటి తీర్పునిచ్చినా భయపడట్లేదు. పరువు హత్యలు ఆగలేదు. అంటే అర్థమైంది కదా.. కులం ఎంత బలమైందో. అది పెంచి పోషిస్తున్న పరువు ఎంతటికి తెగిస్తుందో? లేనిది వచ్చిందా? ఉంటే పెరిగిందా? ఒకమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడానికి మనసులు కలవాలి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉండాలి. ఎన్ని కష్టాలొచ్చినా కలిసి బతకగలమనే ధైర్యం ఉండాలి. బ్యాలెన్స్ చేసుకోగల సత్తా ఉండాలి. వీటిల్లో కులం ప్రాధాన్యం ఎక్కడ ఉంది? దాని ప్రస్తావన ఎందుకు? కాపురానికి కులం అక్కర్లేనప్పుడు దాన్ని అంటుకుని ఉన్న పరువు గురించి ఎందుకు అంత గింజుకులాట? అమృత విషయంలోనే వాళ్ల నాన్న మారుతీరావును తీసుకుంటే.. ప్రణయ్‌ను చంపకముందు వరకు మారుతీరావు ఎవరో మిర్యాలగూడలో కొంతమందికి తప్ప తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇతర ప్రాంతాల వారికెవరికీ తెలియదు. అమృత, ప్రణయ్‌లు పెళ్లి చేసుకున్నాక కూడా కొంతమంది ఎవరైనా మాట్లాడుకుని ఉంటారేమో కాని అదేమాటతో మొన్నటి వరకూ ఆ ఎవరూ రామకోటి రాసి ఉండరు. ఎవరూ పట్టించుకోని, ఎవరి ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో లేని, నిలబడని మారుతీరావుకు పరువు ఎక్కడినుంచి వచ్చింది? ప్రాణం తీసేంతగా ఎందుకు పగను పెంచింది? ప్రణయ్‌ను చంపి ఆయన పెంచుకున్న పరువేంటి? అసలు కులమంటే ఏంటి? మానవత్వాన్ని మించిందా? అమృత ప్రశ్న కూడా ఇదే! దేశమంతా అభిమానులున్న రజనీకాంత్, జగపతిబాబు, సల్మాన్‌ఖాన్ లాంటి ఎందరో సెలబ్రిటీలే కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా తమ పిల్లలకు వాళ్లు కోరుకున్న వ్యక్తులతో మూడుముళ్లు వేయిస్తుంటే వాడకట్టులో పట్టుమని పదిమందికి తెలియని మనకెందుకు ఇంత పరువు, ప్రతిష్టల పెనుగులాట? పిల్లలనే చంపుకునేంత మూర్ఖపుబాట? పిల్లలకు పెద్దల నుంచి మేమున్నామనే భరోసా కావాలి. భయపడితే వెన్నుతట్టి గుండెల్లో దాచుకోవాల్సినవాళ్లం.. పిల్లలను భయపెట్టి పొట్టలో పొడుస్తున్నాం. రేప్పొద్దున మన పిల్లలు మనల్ని నమ్మకుండా చేసుకుంటున్నాం. పెద్దలూ ఆలోచించండి. – సరస్వతి రమ ఏ తప్పు చేశారనీ... ఈ పిల్లలు ఏ తప్పు చేశారనీ వాళ్లకు ఈ శిక్ష? ‘‘కులమేంటి? మానవత్వం కంటే ఎక్కువా? కులం కోసం మా నాన్న చేసిన పనేంటి?’’ అని ఆమృత ప్రశ్నిస్తోంది. రానురాను కులం, మతం అంతరించాలి కాని ఇప్పుడవే ప్రధానంగా మారుతున్నాయి. ఈ ధోరణి పోవాలి. – భండారు విజయ, ప్రరవే జాతీయ సమన్వయకర్త -
తనను చంపేస్తారని తెలిసికూడా...!
-
ప్రణయ్ లైఫ్ పోయింది కానీ.. : అమృత
సాక్షి, నల్గొండ : పరువు కోసం తన భర్తను హత్య చేయించిన తండ్రి స్టేటస్ పోయిందని, అదే సమయంలో ప్రేమ కోసం ప్రాణ త్యాగం చేసినందుకు ప్రణయ్ వ్యాల్యూ ఎంతో పెరిగిందని భార్య అమృత వర్షిణి పేర్కొంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘పరువు పిచ్చి, కుల పిచ్చి ఉన్నవాళ్లకు మానవత్వం ఉండదు. అలాంటి వాళ్లను క్షమించి వదిలేస్తారని నేను అనుకోవటం లేదు. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేయటానికి.. ముఖ్యంగా ప్రణయ్ ఆశయమైన క్యాస్టిజంపై పోరాటం చేయటానికి నేను స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రణయ్ నన్ను స్ట్రాంగ్‌గా ఉండమని చెబుతూ ఉండేవాడు. తనను చంపేస్తారని తెలిసికూడా.. కొద్దిరోజులైనా నీతో కలిసి ఉండొచ్చు కదా! అని అన్నాడు. తనెప్పుడు డేరింగ్‌గానే ఉండేవాడు. ప్రణయ్ లాగే ఉందామనుకుంటున్నాను. అత్తగారింట్లోనే ఉండాలని డిసైడ్ అయ్యాను. ప్రణయ్ బేబీకి జన్మనిచ్చి తనలో ప్రణయ్‌ని చూసుకుంటాను. మిర్యాలగూడ సెంటర్లో ప్రణయ్ విగ్రహం పెట్టాలి. ఎవరెవరివో పెడుతున్నారు. చనిపోతానని తెలిసి కూడా ప్రేమ కోసం తన ప్రాణాలు వదిలాడు. ఒక వేళ ప్రణయ్ గాయాలతో బయటపడి బతికుంటే నా గురించే ఆలోచించేవాడ’’ని తెలిపింది. -
భర్త మృతదేహాన్ని చూసి బోరుమన్న అమృత
సాక్షి, నల్గొండ : పరువు హత్యకు గురైన ప్రణయ్ మృతదేహాన్ని చూసి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన భర్త విగతజీవిలా మారిపోవడాన్ని చూసిన అమృత బోరుమంది. అమృతను ఆస్పత్రి నుంచి పోలీసులు ప్రణయ్ మృతదేహం వద్దకు తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అమృత.. కలకాలం నిండు జీవితాన్ని పంచుకోవాలనుకున్న భర్త ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తోంది. కాగా, ప్రణయ్ సోదరుడు ఉక్రెయిన్ నుంచి ఉదయం 11గంటకు మిర్యాలగూడ చేరుకోనున్నారు. అనంతరం ప్రణయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. దీంతో మారుతిరావు ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమృత తండ్రి ప్రస్థానం ఎలా మొదలైందంటే? ప్లీజ్.. ప్రణయ్ దగ్గరికి తీసుకువెళ్లండి నయీం గ్యాంగ్‌తో బెదిరించారు -
అమృత తండ్రి ప్రస్థానం ఎలా మొదలైందంటే?
మిర్యాలగూడ(నల్గొండ) : మిర్యాలగూడలో సంచలనం కలిగించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యలో ప్రధాన నిందితుడు మారుతీరావుది మొదటి నుంచి నేర చరిత్రగా చెప్పవచ్చు. సొంత కూతురు ప్రేమ వివాహం చేసుకుంటేనే పరువు హత్య చేయించిన అతనికి సెటిల్మెంట్లు, దందాలు, కబ్జాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ నాయకుల పలుకుబడితో అధికారులను సైతం తన బుట్టలో వేసుకుని ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం. 25 ఏళ్ల క్రితం మిర్యాలగూడ పట్టణంలో ఒక్క చిన్న స్కూటర్‌పై తిరిగే అతను అనతికాలంలోనే కోట్ల రూపాయలకు అధిపతిగా చెలామణి అయ్యాడు. తనతోపాటు తన తమ్ముడు శ్రవణ్‌తో కలిసి కిరోసిన్ దందా నిర్వహించిన మారుతీరావు భూ కబ్జాదారుడిగా అవతారమెత్తి కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ కబ్జాల సమయంలో సుపారీ గ్యాంగ్‌లతో సంబంధాలు పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. 25ఏళ్ల క్రితమే మిర్యాలగూడ పట్టణంలో ఓ లాడ్జిలో నీలి చిత్రాలు తీస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో తిరునగరు శ్రవణ్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో పాటు మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పాగా వేసి తన పేరున మార్పిడి చేసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. 20 ఏళ్ల క్రితం మిర్యాలగూడ తహసీల్దార్‌గా పనిచేసిన ఓ రిటైర్డ్ అధికారి అండ దండలతో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇటీవల మిర్యాలగూడ పట్టణ సమీపంలో 626 సర్వే నంబర్లో ఉన్న భూమిని ఆక్రమించుకున్నట్లుగా షెడ్యూల్డ్ కులాల వారు ఆందోళనలు నిర్వహించగా మారుతీరావు చేతిలో ఉన్న 20 కుంటల భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది. అదే విధంగా సర్వే నంబర్ 716, 756 లలో కూడా ప్రభుత్వ భూములను బినామీల పేరుతో కబ్జాలు చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అదేవిధంగా చింతపల్లిలో రోడ్డు పక్కన, అద్దంకి – నార్కట్‌పల్లి రోడ్డు వెంట మరికొంత భూమి ఉండగా దానిలో ఒక గది నిర్మించి సొంతం చేసుకున్నట్లు తెలి సింది. మిర్యాలగూడలోని కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ ఏరియాలో మున్సిపాలిటీకి సంబంధించిన నాలుగు దుకాణాలు ఖాళీ చేయించి వెనుక వైపున ఉన్న తన ఖాళీ స్థలంలో సొంత భవనం నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా మున్సి పాలిటీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ అండదండలు ఆయనకు మొదటి నుంచి కూడా అధికార పార్టీ అండదండలు ఉండేవి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయా నాయకులతో మంచి సంబంధాలను పెట్టుకునేవారు. ఎ లాంటి వివాదాలు వచ్చినా వారి అండదండలతో ఆస్తులు సంపాదించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాడు. ఆయన దందాలకు పార్టీ పెద్దల అండదండలు ఉంటాయని భావించి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలో చేరడం ఆయన నైజం. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఇటీవల తనకంటూ ఒక వర్గం ఉండాలని కొంతమందిని కూడగట్టాడు. -
ఆ వీడియోకే ఎక్కువ హిట్స్: అమృత తండ్రి బెదిరింపు
సాక్షి, మిర్యాలగూడ : అమృత ప్రణయ్‌ల ప్రణయ గాథ విషాదం పలువుర్ని కలచివేస్తోంది. పథకం ప్రకారం అమృత తండ్రి, ఆమె బాబాయి కలిసి ఆమె భర్తను అత్యంత పాశవికంగా హత్య చేయించడం కలకలం రేపింది. పరువు కోసం పగబట్టిన తండ్రి అనుక్షణం నిఘాపెట్టి, చివరికి అన్నంత పనిచేశాడు. ప్రేమిస్తే తప్పా.. అంటూ ఆసుపత్రిలో గుండెలవిసేలా రోదిస్తున్న అమృత వర్షిణి వేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ హత్యకేసులో అనేక కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫేస్బుక్లో అమృత పోస్ట్ చేసిన వీడియోనే హత్యకు ఉసిగొల్పి ఉంటుందని ప్రణయ్ బంధువు ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెళ్లి తరువాత అమృత ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె తండ్రి మారుతీరావు నీ పెళ్లి వీడియో కంటే.. ప్రణయ్‌ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయంటూ అమృతను హెచ్చరించాడని ఆమె ఆరోపించారు. మొదట తాము కూడా పెళ్లికి నిరాకరించామని, అయితే ప్రణయ్ లేకపోతే చచ్చిపోతానని అమృత స్పష్టం చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నామని ప్రణయ్ కుటుంబ సభ్యులు చెప్పారు. అలాగే అమృత తల్లికాబోతోందని తెలిసి ఆగస్ట్ 17న రిసెప్షన్ నిర్వహించినట్టు తెలిపారు. తాము భయపడినట్టుగానే ఎంతో ధైర్యవంతుడైన తమ కొడుకుని పొట్టనపెట్టుకున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు. డబ్బు, రాజకీయ పలుకుబడితో కిరాయి హంతకులతో ఈ పని చేయించారని ఆరోపించారు. అగ్రకుల అహంకారంతో పథకం ప్రకారం నమ్మించి, గొంతుకోసారని కులసంఘాలు ఆరోపిస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్న కారణంగా ఈ హత్యకు పాల్పడ్డారని మండిపడుతున్నాయి. -
మిర్యాలగూడలో పరువు హత్య
సాక్షి, మిర్యాలగూడ: వారు పెద్దలను ఎదిరించారు.. నిండు నూరేళ్లూ కలసి ఉండాలనే ఆశతో పట్టుబట్టి కులాంతర వివాహం చేసుకున్నారు. అమ్మాయి తండ్రి బడా రియల్టర్ కాగా.. అబ్బాయిది సామాన్య కుటుంబం. అప్పటికే.. ఎన్నిసార్లు బెదిరించినా, కేసులు పెట్టినా తమ కూతురు అబ్బాయి వైపే ఉండటాన్ని అమ్మాయి కుటుంబం తట్టుకోలేక పోయింది. కూతురుతో ప్రేమ, ఆప్యాయతలను నటిస్తూనే.. కిరాయి హంతకులను మాట్లాడుకున్నారు. కన్న కూతురు తాళి తెంపేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నడిబొడ్డున పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఈ హత్యకు ‘పరువు’కోసం పాకులాడిన ఓ తండ్రి దుర్మార్గమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వైశ్య కుటుంబానికి చెందిన అమృత, షెడ్యూల్డ్ కులానికి చెందిన ప్రణయ్‌ని వివాహం చేసుకోవడంతో అమృత తండ్రి తిరునగరు మారుతీరావు కక్షపెంచుకుని ఈ హత్య చేయించారని పోలీసులు భావిస్తున్నారు. నిత్యం జన సంచారం ఉండే జ్యోతి ఆసుపత్రి వద్ద పెరుమాళ్ల ప్రణయ్ (24) హత్యతో పట్టణం ఉలిక్కిపడింది. ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం.. మిర్యాలగూడ ఎల్ఐసీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతది వినోభానగర్. వారి ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన ప్రణయ్ (24) ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. కాగా పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్, రియల్టర్ తిరునగరు మారుతీరావు కూతురు అమృతను ఈ ఏడాది జనవరి 31న ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసు కున్నాడు. కులాలు వేరు కావడంతో అమృత తండ్రి మారుతీరావు వారి వివాహాన్ని వ్యతిరేకించాడు. వారు ఇద్దరూ వివాహం చేసుకున్న తర్వాత ప్రణయ్ ఇంట్లోనే ఉంటున్నారు. కాగా పట్టణంలోని పలువురు ప్రముఖులతో కలసి తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు ప్రయత్నాలు చేసినా ఆమె ఒప్పుకోలేదు. ఆ సమయంలోనే ప్రణయ్, అమృత జిల్లా ఎస్పీని కలసి రక్షణ కల్పించాలని కోరారు. నెల రోజుల క్రితం ప్రణయ్, అమృతలకు రిసెప్షన్ ఏర్పాటు చేసినా అమ్మాయి తల్లిదండ్రులు వెళ్లలేదు. రిసెప్షన్ తర్వాత అమృత తండ్రి మరింత కక్ష పెంచుకున్నాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరాయి హంతకులతో ప్రణయ్‌ని హత్య చేయడానికి సుపారీ ఇచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అమృత గర్భవతి కావడంతో ప్రణయ్, అమృతలు మధ్యాహ్నం 12 గంటలకు జ్యోతి హాస్పిటల్‌కు పరీక్షల నిమిత్తం వచ్చారు. పరీక్షలు పూర్తయిన తర్వాత 1.30కు ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా వెనుకనుంచి వచ్చిన హంతకుడు మటన్ షాపులో వినియోగించే కత్తితో ప్రణయ్ మెడపై నరికాడు. వెంటనే మరొక వేటు వేయడంతో ప్రణయ్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందాడు. హంతకుడు కత్తిని సమీపంలోనే పడవేసి పరారయ్యాడు. కాగా, వివాహమైన 2 నెలల తర్వాత నుంచి తన హత్యకు కుట్ర జరుగుతోందన్న అనుమానంతో ప్రణయ్ అప్రమత్తంగా ఉంటున్నాడు. ఇటీవల అమృతతో వారి తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడటం ప్రారంభించారు. నమ్మించి తమ కొడుకును హత్య చేయించారని ప్రణయ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్, డీఎస్పీ పి.శ్రీనివాస్, ఆర్డీఓ జగన్నాథరావు, తహసీల్దార్ కృష్ణారెడ్డి పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి నిందితుడు వెళ్లిన ప్రదేశాలను తెలుసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశం నుంచి డాగ్‌స్క్వాడ్ చర్చిరోడ్డు మీదుగా రెడ్డికాలనీ, అక్కడి నుంచి ఇండస్ ఇండ్ బ్యాంకు మీదుగా గాంధీ విగ్ర హం రోడ్డు వరకు, అటు నుంచి సాగర్‌రోడ్డు మీదుగా బైపాస్‌రోడ్డు వరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీ స్వాధీనం: ప్రణయ్ హత్య జరిగిన చోట జ్యోతి హాస్పిటల్ సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి హాస్పిటల్ నుంచి ప్రణయ్, అమృతతో పాటు మరో యువతి బయటకు వస్తుండగా వెనుక నుంచి కత్తి పట్టుకొని వచ్చిన వ్యక్తి హత్య చేస్తున్న దృశ్యం నమోదైన ఫుటేజీని రంగనా«థ్ పరిశీలించారు. పరువు హత్యగానే..: ఎస్పీ రంగనాథ్ షెడ్యూల్డ్ కులానికి చెందిన ప్రణయ్ హత్య వెనుక అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, ఆమె బాబాయి తిరునగరు శ్రవణ్‌లు ఉన్నట్లు అనుమానిస్తున్నామని, దీనిని పరువు హత్యగానే భావిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనా«థ్ చెప్పారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఏరియా ఆస్పత్రి మార్చురీలో ఉన్న ప్రణయ్ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రణయ్ హత్య ప్రొఫెషనల్ కిల్లర్స్ చేత చేయించినట్లు అనుమానాలున్నాయని చెప్పారు. మారుతీరావు తన కూతురు ఒక ఎస్సీ యువకుడిని వివాహం చేసుకున్నందుకు కక్ష పెంచుకొని ఈ హత్య చేయించినట్లు తెలుస్తోందన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. దళిత సంఘాలు, బంధువుల ఆందోళన ధన బలంతోనే మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్‌ని హత్యచేయించాడంటూ దళిత సంఘాలు డీఎస్పీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టాయి. ప్రణయ్ స్నేహితులు, కుటుంబీకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎస్పీ రంగనాథ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రణయ్‌కు ప్రాణహాని ఉందని గతంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని అన్నారు. ఈ నేపథ్యంలో యువతి తండ్రి మారుతీరావును సైతం హెచ్చరించామన్నారు. మారుతీరావే హత్య చేయించాడు: హతుడి తల్లిదండ్రులు తమ కుమారుడిని తిరునగరు మారుతీరావే హత్య చేయించాడని ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత ఆరోపించారు. తమ కొడుకుకు ప్రాణహాని ఉందని పెళ్లైన కొత్త లోనే ఐజీకి ఫిర్యాదు చేశామని.. పోలీసులు కూడా ఇవాళ తమ కొడుకుని కాపాడలేకపోయారని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ పెళ్లి వద్దంటూ ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి ఇష్టపడి రావడంతో హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారని, అక్కడే కొంతకాలం కాపురం చేశారని, అక్కడ కూడా అమ్మాయి తండ్రి మారుతీరావు మనుషులు ఆరా తీయడంతో అక్కడ ఇల్లు ఖాళీచేసి మిర్యాలగూడకు మకాం మార్చారన్నారు. తమ కుమారుడు అమృతను ప్రేమ వివాహం చేసుకున్న నాటి నుంచి మారుతీరావు తమ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడన్నారు. ఇంతకు ముందే హత్య చేయాలని పథకం పన్నారని, అనుమానం వచ్చి అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నామని అన్నారు. అయితే కాపు కాసి కిరాయి హంతకులతో హత్య చేయించాడని ఆరోపించారు. మారుతీరావును కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరారీలో నిందితులు ప్రణయ్ హత్యకేసులో పరారీలో ఉన్న ఏ–1 నిందితుడు తిరునగరు మారుతీరావు, ఏ–2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రంగనాథ్ కోరారు. హత్య చేసిన గుర్తుతెలియని దుండగుల్ని పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టామన్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందచేస్తామని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, సాధ్యమైనంత త్వరలో వారిని పట్టుకుంటామని చెప్పారు. హంతకుడు వాడిన కత్తి -
భార్యకళ్లముందే.. భర్త దారుణ హత్య
-
ప్రేమవివాహం.. భార్య కళ్లముందే దారుణం
సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే జ్యోతి హాస్పటల్ సమీపంలో పట్టపగలే వినోభానగర్ కు చెందిన పెరుమళ్ల ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. 6 నెలల కిందే ప్రణయ్‌కు అమృత అనే యువతితో ప్రేమవివాహం జరిగింది. అమె గర్భవతి కావడంతో స్థానిక గైనకాలజిస్టు దగ్గర చెక్అప్ కోసం శుక్రవారం తీసుకువచ్చాడు. అయితే భార్యను డాక్టర్‌కు చూపించిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఓ వ్యక్తి వెనకవైపు నుంచి వచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను తన కళ్లెదుటే దారుణంగా నరికి చంపటంతో అమృత షాక్‌కు గురైంది. దాడి ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయింది. అమృతని ప్రణయ్ ప్రేమవివాహం చేసుకోవడం యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో, వారిద్దరూ ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవలే రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిపారు. అమృత తండ్రి మారుతీ రావు మిర్యాలగూడలో పేరుమోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రేమ వివాహమే యువకుడి హత్యకు కారణమని భావించిన మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. జిల్లా ఎస్పీ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్తితి సమీక్షించారు. త్వరలోనే నిందితులని పట్టుకుంటామన్నారు. ప్రణయ్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రణయ్ నాదం
సెమీస్‌లో ప్రణయ్, శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ జకర్తా : ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో భారత ప్లేయర్లు హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌ల సంచలన ఆటతీరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌ల్లో ఇరువురు తమ ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్‌కు చేరుకున్నారు. తొలుత జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్, ప్రణయ్ 21–18, 16–21, 21–19తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)పై సంచలన విజయం నమోదు చేశాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ కీలకదశలో సత్తాచాటాడు. తొలిగేమ్ ఆరంభంలో 8–5తో ముందంజ వేసిన ప్రణయ్.. అదే జోరులో 11–7తో ఆధిక్యం ప్రదర్శించాడు. అనంతరం చైనీస్ ప్లేయర్ పుంజుకోవడంతో 18–15తో ప్రణయ్ ఆధిక్యం తగ్గింది. ఈదశలో వరుస పాయింట్లు సాధించిన భారత్ ప్లేయర్ తొలిగేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండోగేమ్ ఆరంభంలో ఇరువురు హోరాహోరీగా పోరాడడంతో చాలాసార్లు స్కోర్లు సమమయ్యాయి. అయితే ఈదశలో తన అనుభవన్నాంత రంగరించిన చెన్ గేమ్‌ను తన సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడోగేమ్ ఆరంభంలో 1–4తో వెనుకంజలో నిలిచిన ప్రణయ్.. నెమ్మదిగా స్కోరును సమం చేశాడు. 17–17తో మ్యాచ్ సమంగా ఉన్నప్పుడు కీలకదశలో పాయింట్లు సాధించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. మరో క్వార్టర్స్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్, శ్రీకాంత్ 21–15, 21–14తో ప్రపంచ 19వ ర్యాంకర్ జు వీ వాంగ్ (చైనీస్‌తైపీ)పై అలవోకగా గెలుపొందాడు. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీ.. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. సెమీస్‌లో అన్‌సీడేడ్ కజుమస సకాయ్ (జపాన్)తో ప్రణయ్.. ప్రపంచ నం.1, రెండోసీడ్ సన్ వాన్ హో (దక్షిణకొరియా)తో శ్రీకాంత్ తలపడనున్నాడు. ఈరోజు మ్యాచ్ చాలా కఠినంగా సాగింది. మెరుగైన ప్రదర్శన చేస్తానని భావించా. మంచి ఫిట్నెస్తో ఈ మ్యాచ్‌లో తుదివరకు ఆడగలిగాను. ఇండియా ఓపెన్, ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీల తర్వాత నా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించా. నూతన కొచ్ ముల్యో హండోయో ఆధ్వర్యంలో కఠోర శిక్షణ తీసుకున్నా. – ప్రణయ్