మిర్యాలగూడ పట్టణంలో సాగుతున్న పెరుమాళ్ల ప్రణయ్ అంతిమయాత్ర (ఇన్‌సెట్‌లో) ప్రణయ్ భౌతికకాయం వద్ద కూర్చున్న అమృత, తల్లిదండ్రులు
మిర్యాలగూడ పట్టణం కన్నీటి సంద్రమైంది. పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కు ఆదివారం మిర్యాలగూడ పట్టణ ప్రజలు, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు అంతిమ వీడ్కోలు పలికారు. కుల దురహంకారానికి బలైన ‘బలి ప్రేమ’గా అభివర్ణించారు. వినోభానగర్ శ్మశానవాటికలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం 7.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.
మిర్యాలగూడ (నల్గొండ) : పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కి ఆదివారం మిర్యాలగూడ ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతిఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. మిర్యాలగూడలోని వినోభానగర్‌లోని ప్రణయ్ ఇంటి వద్ద నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల్లో నిర్వహించారు. యాత్రలో పాల్గొనడానికి మిర్యాలగూడ పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరా వును ఉరితీయాలని డిమాండ్ చేస్తూ నినదించారు.
అంతిమయాత్రలో పాల్గొన్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతీరాగ్యానాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్, వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, టీడీ పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాధినేని శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, దామరచర్ల జెడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నా యక్, పీసీసీ సభ్యుడు స్కైలాబానాయక్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవీఆర్ రెడ్డి, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముండ్లగిరి కాంతయ్య, నాయకులు తాళ్లపల్లి రవి, కేవీపీఎస్ నాయకులు రెమడాల పరుశురాములు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు దైద సత్యం, పోకల కిరణ్‌కుమార్, చిలుముల నర్సింహ, కె.వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
పాటలతో కళాకారుల కన్నీటి వీడ్కోలు
మిర్యాలగూడ అర్బన్ : ప్రణయ్ అంతిమయాత్ర సందర్భంగా భారత నాస్తిక సమాజ కళాకారుల ఆధ్వర్యంలో పాడి న పాటలు పలువురిని కంటనీరు పెట్టించాయి. కుల దురహంకారంతో మారుతీరావు కన్నకూతురి తాళి తెంపాడని, మారుతీరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం కళాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment