mudder
-
సంచలన వీడియో: శివాని తెలివితేటలకు పోలీసులు షాక్
-
హయత్ నగర్ హత్యకేసులో సంచలన విషయాలు..!
-
అబార్షన్.. కిరాయి హత్యే: పోప్ ఫ్రాన్సిస్
వాటికన్ సిటీ: గర్భవిచ్చిత్తి అంటే కిరాయి హత్యతో సమానమని పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. అబార్షన్‌కు పాల్పడటమంటే కిరాయి హంతకుడి సాయంతో ఒకరిని అంతం చేయడమేనని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. బుధవారం వాటికన్ సిటీలో ప్రార్థనల సందర్భంగా భక్తులనుద్దేశించి ప్రసంగం సందర్భంగా పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధాలు, స్వార్ధంతో చేసే దారుణాలు, అబార్షన్లు ఇలాంటివన్నీ ఓకే తరహావి. అభంశుభం తెలియని ఓ పసి ప్రాణాన్ని చంపేస్తున్న అబార్షన్‌ను ఎలా మనం శాస్త్రీయమైన విధానంగా చెప్పగలం? ఏ ప్రాతిపదికన సమాజంలో, మానవీయతలో అబార్షన్‌కు చోటివ్వగలం? ’ అని పోప్ ప్రశ్నించారు. అర్జెంటీనాలో అబార్షన్‌ను చట్టబద్ధంచేస్తూ తెస్తున్న ఓ బిల్లును సైతం పోప్ ఇటీవల తీవ్రంగా వ్యతిరేకించారు. -
ప్రణయ్..ఇక సెలవ్
మిర్యాలగూడ పట్టణం కన్నీటి సంద్రమైంది. పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కు ఆదివారం మిర్యాలగూడ పట్టణ ప్రజలు, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు అంతిమ వీడ్కోలు పలికారు. కుల దురహంకారానికి బలైన ‘బలి ప్రేమ’గా అభివర్ణించారు. వినోభానగర్ శ్మశానవాటికలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం 7.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. మిర్యాలగూడ (నల్గొండ) : పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కి ఆదివారం మిర్యాలగూడ ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతిఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. మిర్యాలగూడలోని వినోభానగర్‌లోని ప్రణయ్ ఇంటి వద్ద నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల్లో నిర్వహించారు. యాత్రలో పాల్గొనడానికి మిర్యాలగూడ పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరా వును ఉరితీయాలని డిమాండ్ చేస్తూ నినదించారు. అంతిమయాత్రలో పాల్గొన్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతీరాగ్యానాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్, వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, టీడీ పీ నియోజకవర్గ ఇన్చార్జ్ సాధినేని శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, దామరచర్ల జెడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కేతావత్ శంకర్నా యక్, పీసీసీ సభ్యుడు స్కైలాబానాయక్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవీఆర్ రెడ్డి, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముండ్లగిరి కాంతయ్య, నాయకులు తాళ్లపల్లి రవి, కేవీపీఎస్ నాయకులు రెమడాల పరుశురాములు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు దైద సత్యం, పోకల కిరణ్‌కుమార్, చిలుముల నర్సింహ, కె.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పాటలతో కళాకారుల కన్నీటి వీడ్కోలు మిర్యాలగూడ అర్బన్ : ప్రణయ్ అంతిమయాత్ర సందర్భంగా భారత నాస్తిక సమాజ కళాకారుల ఆధ్వర్యంలో పాడి న పాటలు పలువురిని కంటనీరు పెట్టించాయి. కుల దురహంకారంతో మారుతీరావు కన్నకూతురి తాళి తెంపాడని, మారుతీరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం కళాకారులు పాల్గొన్నారు. -
భర్త మృతదేహాన్ని చూసి బోరుమన్న అమృత
సాక్షి, నల్గొండ : పరువు హత్యకు గురైన ప్రణయ్ మృతదేహాన్ని చూసి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన భర్త విగతజీవిలా మారిపోవడాన్ని చూసిన అమృత బోరుమంది. అమృతను ఆస్పత్రి నుంచి పోలీసులు ప్రణయ్ మృతదేహం వద్దకు తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అమృత.. కలకాలం నిండు జీవితాన్ని పంచుకోవాలనుకున్న భర్త ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తోంది. కాగా, ప్రణయ్ సోదరుడు ఉక్రెయిన్ నుంచి ఉదయం 11గంటకు మిర్యాలగూడ చేరుకోనున్నారు. అనంతరం ప్రణయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. దీంతో మారుతిరావు ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమృత తండ్రి ప్రస్థానం ఎలా మొదలైందంటే? ప్లీజ్.. ప్రణయ్ దగ్గరికి తీసుకువెళ్లండి నయీం గ్యాంగ్‌తో బెదిరించారు -
అమృత తండ్రి ప్రస్థానం ఎలా మొదలైందంటే?
మిర్యాలగూడ(నల్గొండ) : మిర్యాలగూడలో సంచలనం కలిగించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యలో ప్రధాన నిందితుడు మారుతీరావుది మొదటి నుంచి నేర చరిత్రగా చెప్పవచ్చు. సొంత కూతురు ప్రేమ వివాహం చేసుకుంటేనే పరువు హత్య చేయించిన అతనికి సెటిల్మెంట్లు, దందాలు, కబ్జాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ నాయకుల పలుకుబడితో అధికారులను సైతం తన బుట్టలో వేసుకుని ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం. 25 ఏళ్ల క్రితం మిర్యాలగూడ పట్టణంలో ఒక్క చిన్న స్కూటర్‌పై తిరిగే అతను అనతికాలంలోనే కోట్ల రూపాయలకు అధిపతిగా చెలామణి అయ్యాడు. తనతోపాటు తన తమ్ముడు శ్రవణ్‌తో కలిసి కిరోసిన్ దందా నిర్వహించిన మారుతీరావు భూ కబ్జాదారుడిగా అవతారమెత్తి కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ కబ్జాల సమయంలో సుపారీ గ్యాంగ్‌లతో సంబంధాలు పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. 25ఏళ్ల క్రితమే మిర్యాలగూడ పట్టణంలో ఓ లాడ్జిలో నీలి చిత్రాలు తీస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో తిరునగరు శ్రవణ్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో పాటు మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పాగా వేసి తన పేరున మార్పిడి చేసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. 20 ఏళ్ల క్రితం మిర్యాలగూడ తహసీల్దార్‌గా పనిచేసిన ఓ రిటైర్డ్ అధికారి అండ దండలతో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇటీవల మిర్యాలగూడ పట్టణ సమీపంలో 626 సర్వే నంబర్లో ఉన్న భూమిని ఆక్రమించుకున్నట్లుగా షెడ్యూల్డ్ కులాల వారు ఆందోళనలు నిర్వహించగా మారుతీరావు చేతిలో ఉన్న 20 కుంటల భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది. అదే విధంగా సర్వే నంబర్ 716, 756 లలో కూడా ప్రభుత్వ భూములను బినామీల పేరుతో కబ్జాలు చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అదేవిధంగా చింతపల్లిలో రోడ్డు పక్కన, అద్దంకి – నార్కట్‌పల్లి రోడ్డు వెంట మరికొంత భూమి ఉండగా దానిలో ఒక గది నిర్మించి సొంతం చేసుకున్నట్లు తెలి సింది. మిర్యాలగూడలోని కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ ఏరియాలో మున్సిపాలిటీకి సంబంధించిన నాలుగు దుకాణాలు ఖాళీ చేయించి వెనుక వైపున ఉన్న తన ఖాళీ స్థలంలో సొంత భవనం నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా మున్సి పాలిటీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ అండదండలు ఆయనకు మొదటి నుంచి కూడా అధికార పార్టీ అండదండలు ఉండేవి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయా నాయకులతో మంచి సంబంధాలను పెట్టుకునేవారు. ఎ లాంటి వివాదాలు వచ్చినా వారి అండదండలతో ఆస్తులు సంపాదించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాడు. ఆయన దందాలకు పార్టీ పెద్దల అండదండలు ఉంటాయని భావించి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలో చేరడం ఆయన నైజం. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఇటీవల తనకంటూ ఒక వర్గం ఉండాలని కొంతమందిని కూడగట్టాడు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కోదాడ : హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోదాడ పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌కు చెందిన బర్మావత్ లక్ష్మి ఏప్రిల్ 5న దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. అదే గ్రామానికి చెందిన అజ్మీరా అశోక్‌నే చెడు అలవాలట్లకు బానిసగా మారి చోరీలకు పాల్పడుతున్నాడు. బాలాజీనగర్‌కు చెందిన సీతరాంసింగ్ కుటుంబ సభ్యులు ఈ నెల మొదటివారంలో ఊరికి వెళ్లారని తెలుసుకుని దొంగతనానికి వచ్చాడు. కాని ఇంటి యజమానురాలు లక్ష్మి ఇంట్లోనే ఉండడంతో తన పేరు బయట పెడుతుందని అక్కడ ఉన్న బ్లేడుతో గొంతు కోశాడు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు బిరువా తాళం తీసి చిందరవందర చేశాడు. కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించి ఇంటిలో రక్తపు మరకలను హత్య జరిగిన మరుసటి రోజే కుటుంబ సభ్యులు ఇతనిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణలో అశోక్ నిందితుడిగా తేలడంతో అరెస్ట్ చేసినట్టు సీఐ వివరించారు. రహస్యం ఎందుకో..? హత్య జరిగిన రోజు ఇంటి వద్ద తచ్చాడడమే కాకుండా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంట్లో రక్తపుమరకలను కడగడంతో అతనిపై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చెయ్యడంతో పోలీసులు ఏప్రిల్ 6న అజ్మీరా అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నాటి నుంచి విచారణ చేస్తునే ఉన్నారు. కేసును ఛేదించడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, కొంత మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని చెపుతూ వచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 9–30 గంటలకు వాట్సప్‌లో హత్య కేసు నిందితుడు అజ్మీరా అశోక్ అని, సీతారాంసింగ్ ఇంటిలో దొంగతనానికి వచ్చి, అడ్డు వచ్చిన లక్ష్మిని దారుణంగా హత్య చేశాడని, అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కోదాడ పట్టణ సీఐ పేరుతో ఓ పోస్టు పెట్టారు. దీన్ని కొంత మంది గమనించగా మరికొంత మంది చూడలేదు. సంచలనం కలిగించిన ఈ హత్య కేసులో నిందితుడిని అంత రహస్యంగా రిమాండ్ చేయాల్సిన అవసరం ఏమోచ్చిందన్న ప్రశ్న పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చిన్న చిన్న దొంగలను పట్టు కున్నప్పుడు సమావేశాలు పెట్టి, ఫొటోలు తీసి వెల్లడించే పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకు ఇలా చేశారనేది అంతుచిక్కిని ప్రశ్న. దీనికి పోలీసులు మాత్రం సమయం లేక పోవడం వల్ల అలా చేశామని, దీనిలో ఇతరత్ర కారణాలు ఏమీ లేవని అంటుండడం కొసమెరుపు. ఆద్యంతం హైడ్రామానే.. అశోక్ అరెస్ట్ ఆద్యంతం హైడ్రామాగానే సాగింది. పోలీసులు నిందితుడిని హత్య జరిగిన రోజునే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొదట నిందితుడు నేరాన్ని ఒప్పుకోకపోవడంతో పోలీసులు 15 రోజులుగా వివిధ కోణాల్లో విచారణ చేసి చివరకు అతడే నిందితుడిగా తేల్చారు. అజ్మీరా అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అతడే నిందితుడని పలువురు భావిస్తున్న విషయానిన ‘సాక్షి’ ఈ నెల 7న ‘పోలీసుల అదుపులో నిందితుడు’ శీర్షికన కధనం ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. -
‘పరిటాల సునీతానే.. ఆయన చావుకు కారణం’
ఆత్మకూరు : ‘మంత్రి పరిటాల సునీత అధికార దాహానికి అంతు లేకుండా పోతోంది. భూ దాహంతో రైతుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. రైతు కేశవ్‌నాయక్ చావుకు మంత్రి సునీతే కారణం’ అంటూ వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. కేశవనాయక్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ముట్టడించారు. కార్యక్రమానికి సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ నాయకులు మద్ధతు పలికారు. మండలాలు పంచుకుని.. రాప్తాడు నియోజకవర్గంలోని ఒక్కొ మండలానికి ఇన్చార్జ్గా తన బంధువులను నియమించి మంత్రి సునీత పెత్తందారి పాలన సాగిస్తున్నారని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా అధికారులు ముందుగా మంత్రి గడప తొక్కాల్సి వస్తోందన్నారు. ఇన్పుట్ సబ్సిడీని మంత్రి సోదరుడు బాలాజీ చెప్పిన వారికే స్థానిక వ్యవసాయాధికారి పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఎంపీడీవో ఆదినారాయణ పచ్చ చొక్కా వేసుకున్న అధికార పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. సర్పంచ్‌లను కీలుబొమ్మలను చేసి ఆడిస్తున్నారన్నారు. టీడీపీలో చేరకపోతే చెక్ పవర్ రద్దు చేస్తామంటూ సాక్షాత్తూ ఓ అధికారి చెప్పడం సిగ్టుచేటన్నారు. అన్యాయాలపై పోలీసులు సైతం కళ్లు మూసుకున్నారన్నారు. అన్యాయాలపై ప్రజలు తిరగబడితే మంత్రి సునీతనే కాదు ఎవరూ కాపాడలేరంటూ బాలాజీకి హితవు పలికారు. నాలుగేళ్ల పాలనలో అక్రమాల పుట్ట నాలుగేళ్ల పాలనలో నియోజకవర్గంలో మంత్రి సునీత అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లుగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులు అడ్డుకున్నారన్నారు. వై.కొత్తపల్లిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను డి.నారాయణస్వామి చేస్తున్నాడని గుర్తు చేశారు. ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఈ పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కుర్లపల్లి వద్ద దళితులకు ఇచ్చిన భూమిని మంత్రి బంధువు లాగేసుకుని కంకర మిషన్ వేసి, సిద్ధరాంపురం వద్ద అనధికారికంగా గుట్టలను ఆన్లైన్లో వారి పేరుపై చేసుకున్నారన్నారు. పుట్టపర్తి వద్ద బైపాస్ నిర్మాణానికి ఎకరాకు రూ.23 లక్షలు ఇస్తుండగా ఆత్మకూరు వద్ద మాత్రం ఎకరాకు రూ.5 లక్షల ఇచ్చి అన్నదాతల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా తాము చేస్తున్నది అక్రమమని అధికారులు గుర్తించి, ప్రజలకు న్యాయం చేకూర్చకపోతే మండలంలో ఏ ఒక్క ప్రభుత్వాధికారిని తిరగబోనివ్వమని హెచ్చరించారు. రూ. 20 లక్షలు పరిహారం ఇవ్వండి ఆత్మహత్య చేసుకున్న రైతు కేశవనాయక్ కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారంతో పాటు ఐదు ఎకరాల పొలాన్ని ఇవ్వాలని ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన విషయం ముందుగానే తెలుసుకున్న తహసీల్దార్ మంగళవారం విధులకు రాలేదు. దీంతో ఆర్డీవో మలోలాతో ప్రకాష్‌రెడ్డి, సీపీఎం నేతలు నేరుగా ఫోన్లో మాట్లాడారు. అక్రమంగా భూమిని మరొకరి పేరుపై చేసిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్‌పై విచారణ జరిపి తహసీల్దార్‌పై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రాజారాం, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ముమ్మాటికీ ఇది హత్యే అధికారుల చేతిలో రూ. వెయ్యి పెడితే రాత్రికి రాత్రి ఒకరి పేరుమీద ఉన్న పొలాన్ని మరొకరి పేరు మీద మార్చేస్తున్నారు. ఇలా చేసే కేశవ్‌నాయక్ ప్రాణాన్ని బలిగొన్నారు. ఆయన భార్యబిడ్డల్ని రోడ్డన పడేశారు. ఇది ముమ్మాటికీ అధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేసిన హత్యే. ఆత్మహత్యతో ఈ అన్యాయం వెలుగు చూసింది. ఇలాంటి అన్యాయాలు ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి. బాధిత రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటూ పోతే శవాల గుట్టలు తేలుతాయి. ప్రభుత్వ కార్యాలయాలు టీడీపీ నాయకుల జాగీరు కాదు. నియంతృత్వ పాలన రాప్తాడు నియోజకవర్గంలో నియంతృత్వ పాలన సాగుతోంది, ఇంకా ఈ ప్రాంత ప్రజలకు స్వాతంత్య్రం రాలేదు. రామగిరి మండలంలో ఏవైనా కార్యక్రమాలకు వెళ్తే మంత్రి పరిటాల సునీత.. టీడీపీ గుండాలతో దాడులను ప్రోత్సహిస్తారు. అంటే మంత్రి సొంత మండలానికి వెళ్లాలంటే వీసాలు, పాస్‌పోర్టులు లాంటివి తీసుకెళ్లాలా? వీరి అక్రమాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇటీవల కనగానపల్లిలో ఓ రెవెన్యూ అధికారిని చెప్పుతో కొట్టారంటే ఇంత కన్నా అన్యాయం ఏముంటుంది? వైఎస్సార్ సీపీలో చేరిన ఎంపీపీని బెదిరించి, బలవంతంగా టీడీపీని వీడకుండా చేశారు. ప్రజలు ఐక్యమత్యంతో ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలి. -
కత్తిపోట్లతో ఎస్పీ ఆఫీసుకు.
అనంతపురం సెంట్రల్ : కత్తిపోట్లకు గురైన బాధితుడు తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఘటన శనివారం చోటు చేసుకుంది. రక్తమోడుతున్న అతన్ని డీఎస్పీ వెంకటరావు చొరవతో ఆస్పత్రికి తరలించారు. బాధితులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. యాడికి మండలం రాయలచెరువులో ఉదయం 7 గంటల సమయంలో శ్రీరామ్‌ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే రాజేష్ (35)పై హత్యాయత్నం జరిగింది. సొంత బావ (అక్క భర్త) రవిప్రసాద్, మరో వ్యక్తి ఈశ్వరయ్యతో కలిసి కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచేశారు. రక్తమోడుతున్న రాజేష్‌ను కుటుంబ సభ్యులు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం నేరుగా అంబులెన్స్‌లో ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. తన భర్తకు రక్షణ కల్పించా లని, యాడికి పోలీసులను వేడుకున్నా పట్టించు కోలేదని, క్షతగాత్రుడి భార్య భాగ్యలక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. అక్కడికి సకాలంలో చేరుకున్న అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్ వెంటనే హాస్పటల్‌కు డీఎస్పీ ఆదేశాలతో క్షతగాత్రుడిని కుటుంబ సభ్యు లు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్..?
కోదాడ : మూడు రోజుల క్రితం పట్టణంలోని బాలాజీనగర్‌లో పట్టపగలు దారుణ హత్యకు గురైన గిరిజన మహిళ బర్మావత్ లక్ష్మీబాయి (46) కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసును పట్టణ పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన రోజున కుటుంబ సభ్యులు లక్ష్మీబాయి పెద్ద కుమారుడి కొడుకును చూడడానికి 10 గంటల సమయంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెళ్లారు. అంతకు ముందు మూడు రోజులు కోడలు వద్దే లక్ష్మీబాయి ఉంది. తాను ఇంటి వద్దే ఉంటానని, బారసాల కూడా కాదు కాబట్టి మీరు వెళ్లి రమ్మని లక్ష్మీబాయి చెప్పింది. దీంతో ముగ్గురు కొడుకులు ఇద్దరు కోడళ్లు, ఆమె భర్త సీతరాంసింగ్ నేలకొండపల్లి వెళ్లారు. 12 గంటల సమయంలో రెండో కుమారుడు సందీప్ తల్లికి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడిన వారు 12–30 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. గొంతు చుట్టూ చీర చుట్టి ఉండడంతో కుటుంబ సభ్యులు గాయాన్ని గమనించలేదు. కళ్లు తిరిగి పడిపోవడంతో తలకు దెబ్బ తగిలిందెమోనని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిందితుడు అతడేనా..? లక్ష్మీబాయిని వైద్యశాలకు తీసుకెళుతున్న సమయంలో బాలాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తమ ఇంటి ముందు తచ్చాడుతూ కనిపించాడని, కం గారులో అతని గురించి తాము పట్టించుకోలేదని లక్ష్మీబాయి రెండో కుమారుడు సందీప్ అంటున్నారు. ఆస్పత్రికి వెళుతుండగా పలుమార్లు సదరు వ్యక్తి సందీప్‌కు ఫోన్ చేసి ఇల్లు శుభ్రం చేస్తానని చెప్పాడు. మొదట వద్దు అన్న సందీప్ సదరు వ్యక్తి పలుమార్లు ఫోన్ చేయడంతో చివరకు విసుగులో నీ ఇష్టం అని అనడంతో సదరు వ్యక్తి వెంటనే ఇంటిలోని రక్తపు మరకలను శుభ్రం చేశాడు. ఇదంతా కేవలం 15 నిమిషాల్లోనే సదరు వ్యక్తి చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతను వారి బంధువు కూడా కాదు. అతను ఎందుకు వచ్చాడు? ఎందుకు ఇంటిని శుభ్రం చేస్తానన్నాడు? అన్న విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అంతే కాకుండా వైద్యశాలకు ఫోన్ చేశానని, వైద్యులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో పాటు ఆమెకు ఎలా ఉంది అంటూ ఆరా తీయడం కూడా అతనిపై ఉన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. ఈ విషయాలన్ని సందీప్ ఫోన్లో రికార్డు అయ్యాయి. ఇపుడు ఇవే కేసుకు బలమైన ఆధారాలుగా మారనున్నాయి. ఇంటిని కుటుంబ సభ్యులే శుభ్రం చేయించినట్లు అందరిని నమ్మించాడు. తనపై అనుమానం రాకుండా ఉండడానికే తప్పు దోవపట్టించాడేమోనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పోలీసులు కూడా ఒకటి రెండు రోజుల్లోనే కేసును ఛేదిస్తామని చెపుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం : శ్రీనివాసరెడ్డి, సీఐ లక్ష్మీబాయి హత్య కేసును సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అన్ని కోణాల నుంచి విచారణ చేస్తున్నాం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం. విషాదం నుంచి కోలుకోని కుటుంబ సభ్యులు : అప్పటి వరకు తమ కళ్ల ముందు తిరిగిన తల్లి, ఊరు వెళ్లి రండి చేపల కూర వండి పెడతానని చెప్పి తమను సాగనంపిన రెండు గంటల లోపే దారుణహత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులో విషాదంలో మునిగిపోయారు. మూడు రోజులుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తునే ఉన్నారు.తమ తల్లి ఎన్నో కష్టాలు పడి చదివించిందని ఆమె కృషి వల్లే తాము ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డామని లక్ష్మీబాయి ముగ్గురు కుమారులు రోదిస్తూ చెపుతున్న తీరు పలువురిని కంట తడిపెట్టిస్తోంది. లక్ష్మీబాయి భర్త సీతరాంసింగ్ కూడా పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ఎదురుగా సన్నిధానం ఏర్పాటు చేసి మాలదారులకు ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించేవాడు. లక్ష్మీబాయి కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే ది. పట్టణంలోని ఎవ్వరితో విభేదాలు లేని వీరి కుటుంబానికి చెందిన మహిళను హత్య చేయాల్సిన అవసరం ఎవ్వరికి ఉందో అర్థం కావడం లేదని గ్రామస్తులు అంటున్నారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
అనుమానమే పెనుభూతమై..
గద్వాల క్రైం : అన్యోన్యంగా ఉంటున్న కాపురంలో అనుమానం పెనుభూతమైంది.. భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు.. పెద్దల సమక్షంలో పంచాయతీలు.. ఈ నేపథ్యంలో భార్యను పురుగు మందు తాగి చనిపోవాలని పురమాయించి.. ఆపై గొంతు నులిమి హత్య చేసి పారిపోయిన భర్త.. పదిరోజుల తర్వాత నేరం అంగీకరిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన శుక్రవారం గద్వాలలో చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెంటకటేశ్వర్లు తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. మేనమామ కూతురితో వివాహం.. మండలంలోని కాకులారం గ్రామానికి చెందిన బోయ లక్ష్మన్న అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురైన యశోదమ్మ(40)ను గత 27 ఏళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. అయితే వివాహం అయినప్పటి నుంచి భార్యపై భర్త అనుమానం వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకునేవి. అయితే గత నెల 29న అర్ధరాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో లక్ష్మన్న ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి చనిపోమని హెచ్చరించాడు. దీంతో క్షణికావేశానికి లోనైన యశోదమ్మ పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో కుమారులు, బంధువులు వచ్చి తనను నిలదీస్తారనే ఆందోళనతో గొంతు నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో ఉన్న పిల్లలకు, బంధువులకు పురుగు మందు తాగిందని త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పి అక్కడి నుంచి కనిపించకుండాపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గద్వాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా.. యశోదమ్మ తండ్రి శివన్న తన కూతురు పురుగు మందు తాగి చనిపోలేదని అనుమానం వ్యక్తం చేస్తూ గద్వాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా గొంతు నులిమి హత్య చేసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో గత పదిరోజుల నుంచి లక్ష్మన్న కోసం గాలించగా ఆచూకీ లభించలేదు. అయితే భార్యను చంపి తాను తప్పించుకుని తిరగడం సాధ్యం కాదని భావించిన లక్ష్మన్న శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నేరుగా గద్వాల సీఐ కార్యాలయానికి వచ్చి యశోదమ్మను హత్య చేసినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు. దీంతో లక్ష్మన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులున్నారు. -
తండ్రిని చంపిన తనయుడు
వర్ధన్నపేట : తండ్రిపై కక్ష పెంచుకున్న తనయుడు తండ్రితో ఘర్షణకు దిగి తలపై రాయితో కొట్టి చంపిన సంఘటన గురువారం రాత్రి కడారిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెం గ్రామానికి చెందిన మంద అయిలయ్య(60)కు ముగ్గురు కుమారులున్నారు. వీరిలో చిన్నవాడైన దేవేందర్ కన్న తండ్రిపై కక్ష పెంచుకుని గురువారం రాత్రి తండ్రితో ఘర్షణకు దిగాడు. దీంతో దేవేందర్ తల్లి అమృతమ్మ తండ్రి కొడుకులను ఎంత సముదాయించిన వినక పోవడంతో పొరుగువారిని తీసుకు వచ్చి నచ్చ చెప్పించి గొడవ సద్దు మణిగేలా చూడడానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దేవేందర్ బండరాయితో దాడి చేయడంతో తల ఛిద్రమై రక్తపు మడుగులో కొట్టు మట్టాడుతూ విగతజీవుడిగా మారాడు. కుమారుడు దేవేందర్‌కు తండ్రి స్థానికంగా రుణం రూ.50 వేలు ఇప్పించాడు. వాటిని తీర్చమని తండ్రి కోరగా భూమి పంపకం చేస్తేనే రుణం చెల్లిస్తానని మొండికేయడంతో భూమిని సైతం పంచి ఇచ్చాడు. అప్పు ఇచ్చిన వారు తండ్రిపై ఒత్తిడి తెస్తుండడంతో గత వారం రోజులుగా తండ్రీ కొడుకులు ఘర్షణ పడుతున్నారు. గురువారం సైతం ఘర్షణ పెరిగి కుమారుడు దేవేందర్ తండ్రిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి మృతి చెందిన విషయాన్ని గ్రహించిన దేవేందర్ సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ సమాచారం అందుకున్న వర్దన్నపేట ఎస్సై ఉపేందర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానంతోనే అంతమొందించాడు
నిడమనూరు (నాగార్జునసాగర్) : ఎర్రబెల్లిలో పెదమాం రజనీకాంత్‌ను.. ముడి నాగయ్య అనుమానంతోనే హత్య చేశాడని మిర్యాలగూడ డీఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఎర్రబెల్లికి చెందిన ముడి నాగయ్య భార్య పార్వతమ్మకు గ్రామానికి చెందిన పెదమాం రజినీకాంత్‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు నాగయ్య అనుమానిస్తున్నాడు. ఈ విషయమై గతంలో ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో ఈ నెల 22న ఎర్రబెల్లికి చెందిన దాసరి వెంకన్న మొక్క తీర్చుకోవడానికి.. దామరచర్ల మండలం కల్లెపల్లి వెళ్లాడు. అక్కడికి ముడి నాగయ్య, పెదమాం రజినీకాంత్‌ను కూడా పిలిచాడు. అక్కడ రజినీకాంత్ ప్రవర్తన నచ్చని ముడి నాగయ్య తన భార్య పార్వతమ్మను కొట్టాడు. రజినీకాంత్‌ను పరోక్షంగా దూషించాడు. దీంతో ఆగ్రహించిన రజినీకాంత్ తనను నాగయ్య తిట్టాడని ఆరోపిస్తూ.. ఈ నెల 24న పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. తన కుటుంబాన్ని వేధిం చడమే కాకుండా.. తనను పంచాయితీకి పిలిచా డని.. ఆగ్రహించిన నాగయ్య రజినీకాంత్‌ను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. ఓ కత్తిని తన బొడ్లో దోపుకుని పంచాయితీ వద్దకు వెళ్లాడు. అక్కడి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. రజినీకాంత్ నాగయ్యపై దాడి చేశాడు. ఈక్రమంలో నాగయ్య వెంట తెచ్చుకున్న కత్తితో.. రజినీకాంత్ పొట్ట, పక్కటెముకల వద్ద పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన రజినీ కాంత్ అక్కడికక్కడే మృతిచెం దాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్పాప్తు చేశారు. నిందితుడు నాగయ్యను గురువారం రిమాండ్‌కు తరలించారు. పెద్ద మనుషులపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం రచ్చబండ వద్ద క్రిమినల్ పంచాయితీలు పరిష్కరించే పెద్దమనుషులపై కేసులు నమోదు చేస్తామని.. డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎర్రబెల్లికి చెంది న పెద్దమనుషులు మాతంగి భిక్షం, బరపటి దుర్గ య్య, వెంకన్నను గతంలో ఇలాంటి కారణంతోనే తహసీల్దార్ వద్ద రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేశామన్నారు. ముగ్గురిలో వెంకన్న తప్ప మిగిలిన ఇద్దరూ తిరిగి అదే రకంగా పంచాయితీలు చేసి హ త్య జరిగేందుకు కారణమయ్యారని.. అన్నారు. వా రు పెట్టిన పూచీకత్తు రూ.లక్ష చెల్లించాలని.. లేకుం టే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. భూ తగాదాలు, సివిల్ విషయాలు పెద్దమనుషులు పరిష్కరించవచ్చని.. క్రిమినల్ కేసులను రచ్చబండ వద్దకు లాగవద్దని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హాలియా సీఐ ధనుం జయ్గౌడ్, నిడమనూరు ఎస్ఐ యాదయ్య ఉన్నారు. -
యువతి దారుణ హత్య
-
అన్నను హత్య చేసిన తమ్ముడు
అరకులోయ: భూ తగాదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఏకంగా అన్ననే ఓ వ్యక్తి బుధవారం హత్య చేశాడు. అరకులోయ సీఐ సింహాద్రి నాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అరకులోయ మండలం మాడగడ పంచాయతీ పరిధిలోని మంజగుడలో నలుగురు అన్నదమ్ములు నివసిస్తున్నారు. వీరిలో రెండో వాడైన సమర్థి మదన్‌సుందర్(40), మూడో వాడైన జలంధర్‌కు మధ్య పొలం గట్టు విషయవై గొడవ జరిగింది. తన పొలం గట్టులో కొంతభాగాన్ని కలుపుకొని అన్న మదన్‌సుందర్ నాట్లు వేసుకున్నాడని జలందర్ గొవడకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. జలందర్ పారతో మెడపై నరకడంతో మదన్‌సుందర్ అక్కడికక్కడే మతి చెందాడు. మతుడి భార్య రాధ చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, నింది తుడు పరారీ ఉన్నాడని సీఐ తెలి పారు. మత దేహాన్ని పోస్టుమార్టం పరీక్షల అరకులోయ ఏరి యా ఆస్పత్రికి తరలించారు.