
అంబులెన్స్‌లో ఉన్న క్షతగాత్రుడు రాజేష్
అనంతపురం సెంట్రల్ : కత్తిపోట్లకు గురైన బాధితుడు తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఘటన శనివారం చోటు చేసుకుంది. రక్తమోడుతున్న అతన్ని డీఎస్పీ వెంకటరావు చొరవతో ఆస్పత్రికి తరలించారు. బాధితులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. యాడికి మండలం రాయలచెరువులో ఉదయం 7 గంటల సమయంలో శ్రీరామ్‌ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే రాజేష్ (35)పై హత్యాయత్నం జరిగింది. సొంత బావ (అక్క భర్త) రవిప్రసాద్, మరో వ్యక్తి ఈశ్వరయ్యతో కలిసి కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచేశారు. రక్తమోడుతున్న రాజేష్‌ను కుటుంబ సభ్యులు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం నేరుగా అంబులెన్స్‌లో ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. తన భర్తకు రక్షణ కల్పించా లని, యాడికి పోలీసులను వేడుకున్నా పట్టించు కోలేదని, క్షతగాత్రుడి భార్య భాగ్యలక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. అక్కడికి సకాలంలో చేరుకున్న అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్ వెంటనే హాస్పటల్‌కు డీఎస్పీ ఆదేశాలతో క్షతగాత్రుడిని కుటుంబ సభ్యు లు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment