కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాస్
నిడమనూరు (నాగార్జునసాగర్) : ఎర్రబెల్లిలో పెదమాం రజనీకాంత్‌ను.. ముడి నాగయ్య అనుమానంతోనే హత్య చేశాడని మిర్యాలగూడ డీఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఎర్రబెల్లికి చెందిన ముడి నాగయ్య భార్య పార్వతమ్మకు గ్రామానికి చెందిన పెదమాం రజినీకాంత్‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు నాగయ్య అనుమానిస్తున్నాడు. ఈ విషయమై గతంలో ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో ఈ నెల 22న ఎర్రబెల్లికి చెందిన దాసరి వెంకన్న మొక్క తీర్చుకోవడానికి.. దామరచర్ల మండలం కల్లెపల్లి వెళ్లాడు. అక్కడికి ముడి నాగయ్య, పెదమాం రజినీకాంత్‌ను కూడా పిలిచాడు. అక్కడ రజినీకాంత్ ప్రవర్తన నచ్చని ముడి నాగయ్య తన భార్య పార్వతమ్మను కొట్టాడు. రజినీకాంత్‌ను పరోక్షంగా దూషించాడు. దీంతో ఆగ్రహించిన రజినీకాంత్ తనను నాగయ్య తిట్టాడని ఆరోపిస్తూ.. ఈ నెల 24న పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. తన కుటుంబాన్ని వేధిం చడమే కాకుండా.. తనను పంచాయితీకి పిలిచా డని.. ఆగ్రహించిన నాగయ్య రజినీకాంత్‌ను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. ఓ కత్తిని తన బొడ్లో దోపుకుని పంచాయితీ వద్దకు వెళ్లాడు. అక్కడి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. రజినీకాంత్ నాగయ్యపై దాడి చేశాడు. ఈక్రమంలో నాగయ్య వెంట తెచ్చుకున్న కత్తితో.. రజినీకాంత్ పొట్ట, పక్కటెముకల వద్ద పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన రజినీ కాంత్ అక్కడికక్కడే మృతిచెం దాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్పాప్తు చేశారు. నిందితుడు నాగయ్యను గురువారం రిమాండ్‌కు తరలించారు.
పెద్ద మనుషులపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం
రచ్చబండ వద్ద క్రిమినల్ పంచాయితీలు పరిష్కరించే పెద్దమనుషులపై కేసులు నమోదు చేస్తామని.. డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎర్రబెల్లికి చెంది న పెద్దమనుషులు మాతంగి భిక్షం, బరపటి దుర్గ య్య, వెంకన్నను గతంలో ఇలాంటి కారణంతోనే తహసీల్దార్ వద్ద రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేశామన్నారు. ముగ్గురిలో వెంకన్న తప్ప మిగిలిన ఇద్దరూ తిరిగి అదే రకంగా పంచాయితీలు చేసి హ త్య జరిగేందుకు కారణమయ్యారని.. అన్నారు. వా రు పెట్టిన పూచీకత్తు రూ.లక్ష చెల్లించాలని.. లేకుం టే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. భూ తగాదాలు, సివిల్ విషయాలు పెద్దమనుషులు పరిష్కరించవచ్చని.. క్రిమినల్ కేసులను రచ్చబండ వద్దకు లాగవద్దని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హాలియా సీఐ ధనుం జయ్‌గౌడ్, నిడమనూరు ఎస్‌ఐ యాదయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment