village peoples
-
‘ఉజ్వల’ ఫలాలు అందట్లేదు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంత పేద ప్రజలను ఎల్పీజీ సిలిండర్ల వాడకం వైపు మొగ్గేలా చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎమ్‌యూవై) కార్యక్రమ ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉజ్వల పథకం కింద ప్రజలను సిలిండర్లను కొనేలా చేయగలిగినా.. వాటిని పూర్తిగా వినియోగించేలా చేయడంలో యంత్రాంగం విఫలమైనట్లు తేలింది. పథకం కింద కేంద్రం పేద మహిళలకు సబ్సిడీతో ఎల్పీజీ సిలిండర్లిస్తో్తంది. పథకం ప్రారంభమైన తొలి 40 నెలల్లో 8 కోట్ల మందికి పైగా ఎల్పీజీ సిలిండర్లను తీసుకున్నట్లు అధ్యయ నం పేర్కొంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనంచేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కట్టె పొయ్యిలనే వాడుతున్నారనీ, వంటకు ఎల్పీజీని మాత్రమే వాడితేనే సత్ఫలితాలు అందుతాయని అభిప్రాయపడ్డారు. -
గ్రామాల్లో మంత్రి లోకేశ్ అనుచరుల వీడియోలు
ఆలమూరు (కొత్తపేట): డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్ము పేరిట గ్రామాల్లో కొంతమంది యువకులు శనివారం ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. వారిని ప్రశ్నిస్తే మంత్రి నారా లోకేశ్ అనుచరులమని, గ్రామాల్లో వీడియో తీసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పంపించారని చెబుతున్నారు. పెదపళ్ల, చింతలూరు గ్రామాల్లో వేర్వేరు వాహనాల్లో నలుగురు యువకులు వచ్చారు. పెదపళ్లలో మండల పరిషత్ ప్రత్యేక పాఠశాల ఆవరణ, చింతలూరులో శ్రీ నూకాంబికా ఆలయం ప్రవేశ మార్గం వద్ద వారు వీడియో తీశారు. ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలను అక్కడ మహిళల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారి వద్ద ఉన్న పుస్తకాల్లో టీడీపీకి చెందిన కొందరి నేతలు ఫొటోలు ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వారి ఫిర్యాదుతో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి నామాల శ్రీనివాస్ వారిని నిలదీస్తే పొంతన లేని సమాధానాలిచ్చారు. అమరావతికి చెందిన యువకుడు సందీప్ వీడియోలు తీయాలని పంపాడని ఆ యువకులు తెలిపారు. పెదపళ్లలో దొంగచాటుగా వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులను ఎంపీటీసీ ఏడిద మెహర్‌ప్రసాద్ అడ్డుకున్నారు. వారిపై మండల కోడ్ ఆఫ్ కాండక్టు (ఎంసీసీ) బృందానికి ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆ రెండు గ్రామాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వీడియోలు తీస్తున్న నలుగురు యువకులను ఎంపీడీఓ టీవీ సురేందర్‌రెడ్డి, ఎస్సై టి.క్రాంతికుమార్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే ఎంసీసీ బృందం సభ్యులు మాత్రం వీరి వద్ద పార్టీ జెండాలు లేకపోవడం వల్ల వెంటనే కేసులు నమోదు చేయలేమని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై వైఎస్సార్ సీపీ నేత శ్రీనివాస్ నియోజకవర్గ ఆర్ఓకు, ఎంసీసీ బృందానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయకుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మోరంపూడి వాసు, పెద్దింటి కాశీ, మార్గాని యేసు తదితరులు పాల్గొన్నారు. -
వెంకటాయపాలెంలో దాహం కేకలు
సాక్షి, వెంకటాయపాలెం(నూజివీడు): మండలంలోని వెంకటాయపాలెంలో ఓసీ ఏరియాలో మంచినీటి సమస్య నెలకొనడంతో స్థానికులు దాహం కేకలు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో మంచినీటి కష్టాలు మరింతగా పెరిగాయి. పంచాయతీ బోరుకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటర్ కాలిపోయి నెలరోజులు గడిచినప్పటికీ మరమ్మతులు చేయించలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. దీంతో స్థానికులు మంచినీళ్ల కోసం, వాడుకోవడానికి వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను ఎన్నిసార్లు పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ ప్రత్యేకాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దాదాపు 50 గృహాల వారికి నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఎస్సీ ఏరియాలో ఉన్న రక్షిత మంచినీటి ట్యాంక్ నుంచి నీళ్లు వస్తున్నప్పటికీ అరకొరగా మాత్రమే వస్తున్నాయని, ఆ నీరు తాగడానికి పనికిరావని మహిళలు పేర్కొంటున్నారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందుముందు తాము ఎదుర్కొనే ఇబ్బందులను ఇంకేమీ పట్టించుకుంటారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నెలరోజుల క్రితం మోటర్లో వైరింగ్ కాలిపోవడంతో మరమ్మతుల కోసమని తీసుకెళ్లారే గాని ఇంత వరకు తిరిగి ఏర్పాటు చేయకపోవడం దారుణం. మరమ్మతులు అయ్యే వరకు నీళ్లు లేకుండా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక పాలన అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి, ఎంపీడీవో సమస్యను పరిష్కరించలేకపోతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన బోరుకు మోటర్‌ను బిగించేలా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాగడానికి నీళ్లు లేవు నెలరోజుల నుంచి తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. మోటర్ కాలిపోయి నెలరోజులు అయినా ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. వేసవి వచ్చిన నేపథ్యంలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి – పూజారి సుజాత, వెంకటాయపాలెం అధికారులు పట్టించుకోవడం లేదు నెలరోజులుగా నీటి సమస్య ఉంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు గ్రామానికి వస్తున్నారో, రావడం లేదో కూడా తెలియడం లేదు. ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఉంటే గ్రామస్తులు ఎలా బతకాలో అధికారులే చెప్పాలి. – షేక్ ఆషా, వెంకటాయపాలెం -
నడవాలంటే నరకమే..
వీణవంక(హుజూరాబాద్): అడుగు తీసి అడుగు వేద్దామంటే కంకరరాళ్లు ఎక్కడ గుచ్చుకుంటాయోననే భయం... చీకటి పడితే రోడ్డు మధ్యనున్న విద్యుత్ స్తంభాలకు తాకుతామేమో అనే ఆందోళన... వాహనాలు వెళ్తుంటే అంతెత్తు లేస్తున్న దుమ్ము ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో గత ఆరు నెలలుగా వీణవంక – జమ్మికుంట రహదారిపై నడిచే వాహనదారులకు నకరం నిత్యం నరకం కనిపిస్తోంది. ప్రయాణికుల అష్టకష్టాలు.. వీణవంక–జమ్మికుంట ఫోర్‌లైన్ రోడ్డు పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా ఇంకా సా..గుతూనే ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారి వెంట వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రూ.33 కోట్లతో నిర్మాణం.. సంవత్సరం క్రితం వీణవంక–జమ్మికుంట మధ్య 12.5 కిలోమీటర్ల ఫోర్‌లైన్ రోడ్డు కోసం రూ.33 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ మొదట వల్భాపూర్–నర్సింగాపూర్ గ్రామాల మధ్య పనులు ప్రారంభించారు. ఆరు నెలల క్రితం కంకరపోసి వదిలేశారు. తర్వాత వల్భా పూర్ నుంచి జగ్గయ్యపల్లి మధ్య కొంతదూరం వరకు కంకరపోసి పోశారు. మిగతా మట్టిపోసి అంతటితో వదిలేశాడు. దీంతో వాహనదారులు దుమ్ముతో పాటు కంకరతో నరకయాతన పడుతున్నారు. కంకరపై వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు... పాత కల్వర్టుల స్థానంలో కొత్త కల్వర్టులు నిర్మించారు. రోడ్డు వెడల్పు కావడంతో రోడ్డును ఆనుకొని వ్యవసాయ బావులు ఉన్నాయి. ప్రమాదకర వ్యవసాయ బావుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. వల్భాపూర్– రంగమ్మపల్లి గ్రామాల మధ్య విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డంగా అతి ప్రమాదకరంగా ఉన్నాయి. రాత్రి సమయంలో స్తంభాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత శనివారం రాత్రి ఓ యువకుడు బైక్‌పై జమ్మికుంటకు వెళ్తుండగా చీకట్లో స్తంభాన్ని ఢీకొనడంతో గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దుమ్ము ధూళితో సతమతం.. జగ్గయ్యపల్లి– నర్సింగాపూర్ గ్రామాల మధ్య దుమ్ము విపరీతంగా లేస్తోంది. రోడ్డుపై నీటిని సక్రమంగా చల్లించకపోవడంతో దుమ్ములేచి ఇబ్బందులు పడుతున్నారు. ఈ రూట్లో నిత్యం ఆర్టీసీ బస్సులు 16 ట్రిప్పులు నడుస్తుంటాయి. వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. కంకర జారడం వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు వాహనాల టైర్లు త్వరగా చెడిపోతున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. బిల్లు మంజూరులో జాప్యం వల్లేనా? పోర్‌లైన్ రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు జరుగుతున్న పనులకు సకాలంలో బిల్లులు రావడం లేదని సమాచారం. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇంకా మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా.. పనులు అడుగు కూడా ముందుకు కదలకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే పనులు పూర్తి కావడానికి ఎంకాలం పడుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఆర్అండ్బీ ఏఈ స్వప్నను వివరణ కోరగా దుమ్ము లేవకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న స్తంభాల వద్ద రక్షణ చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు -
ఇన్నాళ్లకు గుర్తొచ్చామా సార్..?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పార్టీలోని వ్యతిరేకవర్గం పన్నాగమో... ప్రజల్లో నిక్షిప్తమైన ఆగ్రహమో తెలియదు గానీ... టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత తప్పడం లేదు. పూజలు చేసేందుకు వెళ్లిన అభ్యర్థిని ఒక గ్రామంలో నిలదీస్తే... యోగక్షేమాలు అడిగిన అభ్యర్థికి ఓ వృద్ధురాలి నుంచి వ్యతిరేకత ఎదురైంది. తాజాగా సోమవారం ఖానాపూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. జన్నారం మండలంలోని బాదంపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాఖానాయక్ను ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాలుగున్నరేళ్లలో ఒక్కసారైనా రాని ఎమ్మెల్యే ఇప్పుడెందుకు వచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా గ్రామానికి రావడంపై స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గ్రామస్తులతో గొంతుకలపడం గమనార్హం. చివరికి పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. చైతన్యమా... రాజకీయ ప్రోద్బలమా..? ముందస్తు ఎన్నికల్లో భాగంగా సెప్టెంబర్ 6న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచే నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో చెన్నూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు సీటివ్వలేదు. మిగతా చోట్ల సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. దీంతో చెన్నూర్‌తో పాటు మిగతా స్థానాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్లోనే వ్యతిరేకత మొదలైంది. చెన్నూర్‌లో అభ్యర్థి బాల్క సుమన్ ప్రచారాన్ని ప్రారంభించిన ఇందారంలో గట్టయ్య అనే ఓదెలు అభిమాని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఖానాపూర్‌లో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీని వీడారు. బోథ్‌లో ఎంపీ నగేష్ అంతర్గతంగా తనవంతు ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నారు. ముధోల్‌లో సిట్టింగ్ ఎమ్మేల్యేకు వ్యతిరేకంగా ఎస్.వేణుగోపాలచారి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. బెల్లంపల్లిలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు కంటిలో నలుసుగా మారారు. ఈ పరిణామాల క్రమంలో పార్టీ మారడాలు, సద్దుమణగడం వంటివి జరిగినట్లు కనిపిస్తున్నా... పోరు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజలు తిరుగుబాటు చేసే దృశ్యాలు కనిపిస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు కొట్టివేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, నేతల ప్రోద్బలంతోనే వ్యతిరేక సీన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. జైనథ్‌లో మంత్రి జోగు రామన్నకు తప్పని వ్యతిరేకత... ఇటీవల రాష్ట్ర మంత్రి జోగు రామన్నకు జైన£థ్ మండలంలో రెండుచోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సాంగ్వి, భోరజ్ గ్రామాల్లో మంత్రి ప్రచారానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... సాంగ్విలో మంత్రిని వ్యతిరేకించడం వెనుక రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్లోనే కొనసాగిన ఓ వ్యక్తి తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న కారణంతో మంత్రి రామన్నకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఇటీవల బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న ఆ వ్యక్తి ప్రోద్బలంతోనే సాంగ్విలో స్థానికులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే మండలంలోని భోరజ్‌లో మాత్రం ఒక దళిత బస్తీలో స్థానికులు మంత్రిని ప్రశ్నించడం గమనార్హం. మూడెకరాల ప్రభుత్వ భూమి, ఉపాధిహామీ ద్వారా నిర్మించే సీసీ రోడ్డు తమ బస్తీకి ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. భోరజ్‌లో ప్రజా చైతన్యం కొట్టొచ్చినట్లు కనిపించిది. బెల్లంపల్లి, బోథ్‌లలో... బెల్లంపల్లి మండలం పరిధిలోని చాకెపల్లి, బుదాగుర్ధు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామాలను ఇన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. బోథ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావు ప్రచారాన్ని తరచూ అడ్డుకోవడం జరుగుతోంది. ఇక్కడ గిరిజన తెగల్లోని రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా వైషమ్యాలు పెరగడం అనే అంశంతో పాటు రాజకీయ పరిణామాలు కూడా ఈ ఆందోళనల వెనుక ఉన్నట్లు సమాచారం. బోథ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని మార్చి తనకు అవకాశం ఇవ్వాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ గత కొంతకాలంగా అధిష్టానాన్ని కోరుతున్నారు. అయినా కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపూరావుకే సీటు ఇవ్వడం ఆయన వర్గీయులకు ఇబ్బందిగా మారింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నగేష్ వర్గీయులే కీలక స్థానాల్లో ఉండడంతో బాపూరావుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అయినా అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ వెళుతుండడం గమనార్హం. మిగతా పార్టీల అభ్యర్థులు ఖరారైతే... నెలరోజుల క్రితమే టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రస్తుతం వారే ప్రచారంలో అధికారికంగా పాల్గొంటున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం గమనిస్తున్నాం. త్వరలో కాంగ్రెస్ మహా కూటమి, బీజేపీ నుంచి ఖరారయ్యే అభ్యర్థుల విషయంలో ప్రజాక్షేత్రంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది ఆసక్తిగా మారింది. చెన్నూర్ మినహా టీఆర్ఎస్ అభ్యర్థులంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడంతో సహజంగడా ప్రజల్లో ఉండే అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునే దిశగా నేతలు పావులు కదుపుతున్నారని సమాచారం. ప్రస్తుతం పార్టీలో టికెట్టు ఆశించి భంగపడ్డ వారి ప్రోద్బలంతోనే టీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని నాయకులు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు, నాయకులు కూడా వీరినే ఫాలో అయితే పరిస్థితి ఏంటనేది టీఆర్ఎస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. -
గ్రామీణ వైద్యం.. గాలిలో దీపం
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు. గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుంది. అక్కడి ప్రజలే అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుంటే..వారికి ప్రాథమిక వైద్యం కూడా అందని ద్రాక్షగా మారితే అది సమాజాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జిల్లాలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో గ్రామీణ వైద్యం పడకేసింది. నిపుణులైన వైద్యులు లేకపోవడం, ఉన్న వైద్యుల్లోనూ కొందరు విధులకు సరిగా రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా సాధారణ వ్యాధులకు సైతం పల్లెజనం పట్టణ బాట పడుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఇందులో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 40 దాకా ఉన్నాయి. వీటితోపాటు వైద్య విధాన పరిషత్ పరిధిలో 20 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సామాజిక ఆరోగ్య కేంద్రాలు) పనిచేస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కలిసి 2,125 మంది దాకా పనిచేస్తున్నారు. పీహెచ్‌సీల్లో ప్రాథమిక వైద్యం, సీహెచ్‌సీల్లో సాధారణ వ్యాధులతోపాటు ప్రసవాలు, చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులకు వైద్యమూ అందించాల్సి ఉంది. గ్రామీణ ప్రజలు ముందుగా ఏదైనా జ్వరం వస్తే సమీపంలోని సబ్‌సెంటర్‌ను ఆశ్రయిస్తున్నారు. అక్కడ నర్సులు ఇచ్చే చికిత్సకు వ్యాధి స్పందించకపోతే పీహెచ్‌సీలకు వెళ్తారు. అక్కడ కూడా ఆరోగ్యం బాగు పడకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రెఫర్ చేస్తారు. ఇక్కడ కూడా బాగు కాకపోతే జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రులకు రోగులను వైద్యులు రెఫర్ చేస్తారు. సమయపాలన పాటించని వైద్యులు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఉండి చికిత్స అందించాలి. 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు, కొన్ని సీహెచ్‌సీల్లో నిరంతరం వైద్య సిబ్బంది ఉండి ఏ సమయంలోనైనా వచ్చే రోగులకు చికిత్స చేయాలి. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల్లో అధికారులు బయోమెట్రిక్ మిషన్‌ను ఏర్పాటు చేసి హాజరు పరిశీలిస్తున్నారు. దీనిని సీఎం డ్యాష్‌బోర్డుకు అనుసంధానం చేసి, ఏ రోజు, ఏ సమయంలో ఎంత మంది హాజరయ్యారో రికార్డు చేస్తారు. కానీ జిల్లాలో అ«ధికశాతం ఆసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రం, డివిజన్ కేంద్రాలకు దూరంగా ఉండే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ఈ పరిస్థితి మరీ అధికంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆసుపత్రికి వెళితే అధికశాతం వైద్యులు కనిపించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిపుణులైన వైద్యులు కరువు జిల్లాలోని 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 159 మెడికల్ ఆఫీసర్ పోస్టులుండగా అందులో 76 రెగ్యులర్, 59 కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారిలోనూ 8 మంది పీజీ వైద్యవిద్య కోసం వెళ్లగా, వారి స్థానంలో పక్క పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులను డిప్యుటేషన్‌పై వేస్తున్నారు. ఈ కారణంగా రెండుచోట్లా రోగులకు వైద్యం జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 8 డిప్యూటీ సివిల్ సర్జన్, 50 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 8 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 3, డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఒకటి మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం నాటి జనాభాకు అనుగుణంగా ఉన్న పోస్టులే ఇప్పటికీ ఉండటం, జనాభా పెరగడంతో పాటు ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్యా పెరగడం వల్ల ఉన్న వైద్యులపై అదనపు భారం పడుతోంది. కొన్ని కేంద్రాల్లో వైద్యులు సమయపాలనపాటించకపోవడంతో రోగులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. పెద్దాసుపత్రిపైనే పెద్దభారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను బోధనాసుపత్రిగా పరిగణిస్తారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో నయం కాని కేసులను మాత్రమే అక్కడి వైద్యులు ఈ ఆసుపత్రికి రెఫర్ చేయాలి. కానీ పలు రకాల కారణాల వల్ల అధిక శాతం రోగులు సాధారణ వ్యాధులకూ ఇదే ఆసుపత్రికి చికిత్స కోసం వస్తున్నారు. ఫలితంగా ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య 2,500ల నుంచి 3 వేలు దాటుతోంది. 1,050 పడకలు మంజూరైతే 1,500లకు పైగా రోగులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగా అదనంగా, అనధికారికంగా 700లకు పైగా పడకలను రోగుల కోసం అధికారులు వేయాల్సి వస్తోంది. మూడింతలు అధికంగా రోగులు వస్తున్నా దానికి అనుగుణంగా ఇక్కడి వైద్యులు, ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది సంఖ్యను ప్రభుత్వం పెంచడం లేదు. లద్దగిరిలో డాక్టర్లుండరు మా ఊరికి లద్దగిరి ఆసుపత్రి దగ్గరే. అయితే మా ఊరు ఆసుపత్రి పరిధిలోకి రాదని అక్కడి వైద్యులు చెబుతున్నారు. చికిత్స కోసం వెళితే సరిగ్గా చూడరు. ఈ కారణంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నాం. ఊళ్లోనే బాగా చూస్తే మాకు ఇంత దూరం వచ్చి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదు. –సురేష్, రేమడూరు మా ఆసుపత్రిలో సరిగ్గా చూడరు మా ఊళ్లో ఉన్న ధర్మాసుపత్రిలో సమయానికి డాక్టర్లుండరు. ఉన్నా మమ్ముల్ని సరిగ్గా చూడరు. నాకు కాళ్లనొప్పులు, ఆయాసం ఉంది. మా ఊళ్లో ఆసుపత్రికి వెళితే మందులు తక్కువగా ఇస్తారు. అందుకే దూరమైనా ఈ పెద్దాసుపత్రికి వస్తున్నా. నెలకోసారి వచ్చి డాక్టర్లకు చూపించుకుంటా. ఇక్కడి డాక్టర్లు నాకు నెలరోజులకు మందులు ఇస్తారు. ఊరి నుంచి ఆసుపత్రికి వచ్చిపోవాలంటే రూ.80 అవుతుంది. – పక్కీరమ్మ, సి.బెళగల్ -
మంత్రిని నిలదీసిన ప్రజలు
సాక్షి, కలసపాడు : గ్రామదర్శిని పేరుతో వైఎస్సార్ కడప కలసపాడులో టీడీపీ చేపట్టిన ప్రచారంలో ప్రజల నుంచి ఆందోళన వచ్చింది.మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ప్రజలు సమస్యలు లేవనెత్తారు.మండంలో భూ సమస్యలు పేరుకుపోయాయని వాటిని పరిష్కరించేందుకు తహసీల్దార్ చర్యలు తీసుకోవడంలేదని మంత్రికి తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే ఆన్లైన్ చేయడం లేదని, ఒకరి భూమిని మరొకరి పేరుతో ఆన్‌లైన్‌చేసి దానిని సవరించేందుకు వేల రూపాయలు గుంజుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రేషన్‌కార్డులు అర్హులకు అందిస్తున్నామని చెప్పగా మహిళలు లేచి ఎక్కడ ఇస్తున్నారని మంత్రి ఆదిని ప్రశ్నించారు. వెంటనే మంత్రి తహసిల్దార్‌ను పిలిచి సమాధానం చెప్పమని ఆదేశించారు. మీరు చేసే తప్పులకు మేం ప్రజలతో మాటలు పడాలా అంటూ తహసీల్దార్ రాజేంద్రపై ఆగ్రహంవ్యక్తంచేశారు.ఈ సందర్భంగా మంత్రి ఆది మాట్లాడుతూ వారం రోజుల్లో ఆన్లైన్ సమస్యలు పరిష్కరిం చకపోతే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అంతకుముందు చెత్త నుంచి సంపద చేసే కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ∙కలసపాడులో ప్రవహిస్తున్న తెలుగు గంగ ఎడమ ప్రధాన కాలువకు మాజీ మంత్రి బిజవేములు వీరారెడ్డి పేరును పెట్టారు. దీనిపై విమర్శలు Ðð వెళ్లువెత్తాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తెలుగుగంగ కాలువ త్వవించి గంగనీరు విడుదల చేస్తే ఆయన పేరు పెట్టకపోవడంపై పలువరు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మార్కెటు యార్డు చైర్మెన్ రంతు, టీడీపీ నాయకులు రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి తదిరులు పాల్గొన్నారు. -
రైతుబంధు చెక్కులు ఇప్పించాలి
ఖానాపూర్ : కడెం మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన తమ భూములను టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి చెర నుంచి కాపాడాలని గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఆదివారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సంబందిత నాయకుడు ఇదివరకు తమ భూములు పెద్ద సంఖ్యలో కబ్జాకు పాల్పడ్డాడని, సాగులో ఒక్కొక్కరికి ఐదెకరాలకు పైగా ఉన్నప్పటికీ ఒక్కో ఎకరంతో పట్టాలు వచ్చాయని అన్నారు. కబ్జాపోను మిగిలిన ఒక్కో ఎకరం భూమికి ప్రభుత్వం రైతుబంధు ద్వారా చెక్కులు ఇస్తే వాటిని కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. గ్రామ శివారులో గల జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం బోర్నపెల్లిలో ఉన్న తమ భూములకు ప్రభుత్వం నుంచి రైతుబంధు ద్వారా వచ్చిన చెక్కులను ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ విషయమై ఎంతటివారైనా సరే తాను సంబందిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెడ్మ గంగు, తోడసం గంగు, వెడ్మ లింగు, వెడ్మ దేవేందర్, ఆత్రం గంగు, లింబారావ్, బాదిరావ్, లింగు, మోహన్, జుగాదిరావ్, శ్రీను, జ్యోతిరాం, మారుతి, ఆనంద్, బుచ్చవ్వ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు మూఢ నమ్మకాలు వీడాలి
చెన్నూర్‌రూరల్ : మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు మూఢ నమ్మకాలను వీడా లని జైపూర్ ఏసీపీ సీతారాములు అన్నారు. మండలంలోని ఆస్నాద గ్రామంలో శనివారం రాత్రి కమిషనరేట్ పరిధిలో మూడ నమ్మకాలపై, రోడ్డు ప్రమాదాలపై, మద్యం తాగితే కలిగే నష్టాలు, ర్యాగింగ్, బాల్యవివాహలు, గల్ఫ్ మోసాలు, రైతుల అత్మహత్యలు వివిధ రకాల సమస్యల గురించి నాటకాల రూపంలో కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులకు సహకరించొద్దన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆన్నారు. యువత చెడు వ్యసనాల జోలికిపోవద్దన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా జేపీవో దృషికి తెస్తే పరిష్కరిస్తారన్నారు. గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను నిర్వహించొద్దని సూచించారు. చెన్నూర్ పట్టణ సీఐ కిశక్షర్, సర్పంచ్ కొల్లూరి బుచ్చమ్మ, లచ్చన్న, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానంతోనే అంతమొందించాడు
నిడమనూరు (నాగార్జునసాగర్) : ఎర్రబెల్లిలో పెదమాం రజనీకాంత్‌ను.. ముడి నాగయ్య అనుమానంతోనే హత్య చేశాడని మిర్యాలగూడ డీఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఎర్రబెల్లికి చెందిన ముడి నాగయ్య భార్య పార్వతమ్మకు గ్రామానికి చెందిన పెదమాం రజినీకాంత్‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు నాగయ్య అనుమానిస్తున్నాడు. ఈ విషయమై గతంలో ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో ఈ నెల 22న ఎర్రబెల్లికి చెందిన దాసరి వెంకన్న మొక్క తీర్చుకోవడానికి.. దామరచర్ల మండలం కల్లెపల్లి వెళ్లాడు. అక్కడికి ముడి నాగయ్య, పెదమాం రజినీకాంత్‌ను కూడా పిలిచాడు. అక్కడ రజినీకాంత్ ప్రవర్తన నచ్చని ముడి నాగయ్య తన భార్య పార్వతమ్మను కొట్టాడు. రజినీకాంత్‌ను పరోక్షంగా దూషించాడు. దీంతో ఆగ్రహించిన రజినీకాంత్ తనను నాగయ్య తిట్టాడని ఆరోపిస్తూ.. ఈ నెల 24న పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. తన కుటుంబాన్ని వేధిం చడమే కాకుండా.. తనను పంచాయితీకి పిలిచా డని.. ఆగ్రహించిన నాగయ్య రజినీకాంత్‌ను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. ఓ కత్తిని తన బొడ్లో దోపుకుని పంచాయితీ వద్దకు వెళ్లాడు. అక్కడి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. రజినీకాంత్ నాగయ్యపై దాడి చేశాడు. ఈక్రమంలో నాగయ్య వెంట తెచ్చుకున్న కత్తితో.. రజినీకాంత్ పొట్ట, పక్కటెముకల వద్ద పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన రజినీ కాంత్ అక్కడికక్కడే మృతిచెం దాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్పాప్తు చేశారు. నిందితుడు నాగయ్యను గురువారం రిమాండ్‌కు తరలించారు. పెద్ద మనుషులపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం రచ్చబండ వద్ద క్రిమినల్ పంచాయితీలు పరిష్కరించే పెద్దమనుషులపై కేసులు నమోదు చేస్తామని.. డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎర్రబెల్లికి చెంది న పెద్దమనుషులు మాతంగి భిక్షం, బరపటి దుర్గ య్య, వెంకన్నను గతంలో ఇలాంటి కారణంతోనే తహసీల్దార్ వద్ద రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేశామన్నారు. ముగ్గురిలో వెంకన్న తప్ప మిగిలిన ఇద్దరూ తిరిగి అదే రకంగా పంచాయితీలు చేసి హ త్య జరిగేందుకు కారణమయ్యారని.. అన్నారు. వా రు పెట్టిన పూచీకత్తు రూ.లక్ష చెల్లించాలని.. లేకుం టే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. భూ తగాదాలు, సివిల్ విషయాలు పెద్దమనుషులు పరిష్కరించవచ్చని.. క్రిమినల్ కేసులను రచ్చబండ వద్దకు లాగవద్దని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హాలియా సీఐ ధనుం జయ్గౌడ్, నిడమనూరు ఎస్ఐ యాదయ్య ఉన్నారు. -
జువ్వలపాలెం.. రణరంగం
కాళ్ల: కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం రణరంగాన్ని తలపించింది. గ్రామంలో నివాసాలకు ఆనుకుని చెరువు తవ్వకానికి వీలులేదంటూ స్థానికులు, సీపీఎం నాయకులు అడ్డుకునేందుకు బుధవారం ప్రయత్నించారు. అప్పటికే మోహరించిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్స్టేషన్లకు తరలించారు. ఉదయం నుంచి నరసాపురం డివిజన్ స్థాయిలోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, ప్రత్యేక విభాగాల పోలీసులు భారీగా మోహరించారు. కొందరు సీపీఎం నాయకులను ముందస్తుగా హౌ స్ అరెస్ట్‌లు చేసినట్టు తెలిసింది. విడతలవారీగా స్థానికులు, సీపీఎం నాయకులు చెరువుల వద్దకు చేరుకున్నారు. వీరికి పోలీసులు ఎదురుగా రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం నాయకుడు జేఎన్వీ గోపాలన్ స్థానికులతో వచ్చి చెరువు తవ్వకం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కోర్డు ఆదేశాల మేరకు చెరువు తవ్వకం అడ్డుకోవడం నేరమని న్యాయబద్ధంగా నడుచుకోవాలని రూరల్ సీఐ నాగరాజు ఉద్యమకారులతో చర్చిం చారు. అయినా స్థానికులు వీటిని పట్టిం చుకోకుండా నినాదాలు చేయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేం దుకు వారిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. ఈతరుణంలో జరిగిన తోపులాటలో ఓమహిళకు చేతికి గాయాలు కాగా మరో మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఆందోళనకారులను పోలీసులు డివిజన్ స్థాయిలోని పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. ఐద్వా నాయకురాలు క ల్యాణి, సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి నరసాపురం డీఎస్పీ ప్రభాకర్‌బాబు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కోర్టు ఆదేశాలను పరి శీలించారు. అనంతరం సీఐ నాగరాజు స్థానికులతో చర్చిం చారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని కోరారు. సా యంత్రం వరకు పోలీసుల మోహరింపు కొనసాగింది. సీపీఎం నాయకుల అరెస్ట్ దారుణం చెరువు తవ్వకం అడ్డుకోవడానికి వెళ్లిన సీపీఎం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌లు చేయడం దారుణ మని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. స్థానికులు, సీపీఎం నాయకులపై లాఠీచార్జి చేయడం దారుణమని ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. బ డుగు, బలహీనవర్గాల వారి కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇంతలా ఆందోళన చేస్తున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆక్వా మాఫియా పెచ్చుమీరిందని, ఆక్రమణ చెరువులను నియంత్రించడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందారని విమర్శించారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
పుట్టిన ఊరు రుణం తీర్చుకున్న శ్రీమంతుడు
-
ఆగిన పల్లె ప్రగతి
ఉదయగిరి, న్యూస్‌లైన్: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది పంచాయతీల్లో పాలన పరిస్థితి. ప్రత్యేకాధికారుల పాలనతో పల్లెల్లో సమస్యలు పేరుకుపోవడంతో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. సర్పంచ్‌లు అధికారం చేపట్టడంతో ఇక సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని గ్రామీణ ప్రజలు భావించారు. అయితే పరిస్థితి గతంలో కన్నా దారుణంగా తయారవడంతో జనం కష్టాలు పడుతున్నారు. జిల్లాలో 931 పంచాయతీలున్నాయి. వీటిలో 927 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 203 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానా ఇంకా విడుదల కాలేదు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించే ఉద్దేశంతో మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు, మైనర్ పంచాయతీలకు రూ.5 లక్షలు అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.15 లక్షలు, రూ.7 లక్షలుగా నిర్ణయించినా ఇంతవరకు విడుదల చేయలేదు. జిల్లాలోని ఆత్మకూరు డివిజన్లో 37, కావలిలో 32, నెల్లూరులో 53, గూడూరులో 38, నాయుడుపేటలో 37 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నిధులు మంజూరైతే ఏకగ్రీవ పంచాయతీల్లోనైనా అభివృద్ధి పనులు సజావుగా సాగే అవకాశముంది. నిధుల కోసం ఎదురుచూపులు పంచాయతీల్లో ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల నిధులతోనే పనులు చేయాల్సి ఉంటుంది. ఆర్థికసంఘం, తలసరి గ్రాంటు, ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజు, సీనరేజ్, పారిశుధ్యం నిధులు, ఇంటిపన్ను ద్వారా వచ్చే నిధులు పంచాయతీ ఖాతాల్లో జమవుతుంటాయి. ఈ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. రెండేళ్లనుంచి పాలకవర్గాలు లేకపోవడంతో 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ఈ నిధులే జిల్లాకు రూ.20 కోట్ల వరకు రావాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా విడుదల కాలేదు. పంచాయతీ ఖాతాలో చిల్లిగవ్వ లేకపోవడంతోఎక్కువ మంది సర్పంచ్‌లు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోవున్నారు. కొందరు సర్పంచ్‌లు మాత్రం సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులతో చేపడుతున్న పనులకు పాలకవర్గం సమావేశంలో ఆమోదం లభిస్తుందో, లేదోననే భయం కూడా సర్పంచ్‌లను వెంటాడుతోంది. సమస్యల తిష్ట నిధులు లేక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇటీవ ల తరచూ వర్షాలు కురుస్తుండటంతో వీధులన్నీ బురదమయమయ్యాయి. పారిశుధ్యం లోపించి వ్యాధులు ప్రబలుతున్నాయి. వీధిలైట్లు లేక పల్లెల్లో చీకట్లు కమ్ముకున్నాయి. విషపురుగుల భయంతో సాయంత్రమైతే ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. కళ్ల ముందే సమస్యలు తీవ్రంగా ఉన్నా సర్పంచ్‌లు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. సమ్మెలో అధికారులు: నూతన సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేయడంతో సీమాంధ్రలో ఉద్యమం హోరుగా సాగుతోంది. ఉద్యమంలో అటు ఉద్యోగులు, అధికారులు భాగస్వామ్యులు కావడంతో నిధుల విడుదలపై తీవ్ర ప్రభావం పడింది. ఖజానా ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతుండడంతో బిల్లుల ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. నిధులు విడుదల చేయాలి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వ నిధులు వెంటనే విడుదల చేయాలి. పంచాయతీల్లో పనులు చేసేందుకు పైసా కూడా నిధులు లేవు. గ్రామాల్లో పారిశుద్యం అధ్వానంగా మారింది. ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తే పనులు చేపట్టే అవకాశముంది. ఇమ్మానుయేలు, డక్కునూరు, వరికుంటపాడు మండలం పైసా లేదు రెండు నెలల క్రితం పదవీ బాధ్యతలు చేపట్టినా పనులు చేపట్టేందుకు పంచాయతీలో పైసా నిధులు కూడా లేవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ ఆగిపోయాయి. ప్రభుత్వం వెంటనే 13, 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు తలసరి గ్రాంటు విడుదల చేయాలి. అక్కి వెంకట సుబ్బారెడ్డి, క్రిష్ణంపల్లి సర్పంచ్ -
పెరిగిన ఎంపీటీసీ స్థానాలు
ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో గ్రామీణ ప్రాంత జనాభాకు అనుగుణంగా అదనంగా 55 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. గతం లో 528 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, పెరిగిన వాటితో మొత్తం స్థానాల సం ఖ్య 583కు చేరింది. జనాభా ప్రాతిపదికన నిర్వహించిన ఎంపీటీసీ స్థానా ల పునర్విభజనపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి(సీఈఓ) రాజారాం ఎంపీడీఓలకు సూచించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీ స్థానాలు పునర్విభజన చేసినట్లు ఆయన తెలి పారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణుల సంఖ్య 18 లక్షలు ఉండగా, జిల్లాలో 528 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. 2011 లెక్కల ప్రకారం 20 లక్షల 38 వేల 392 మందికి జనాభా చేరుకోగా అదనంగా 55 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయని సీఈఓ చెప్పారు. 3,500 మంది జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానాన్ని కేటాయించామన్నారు. ప్రతి మండలంలో ఒకటి నుం చి ఐదు చొప్పున ఎంపీటీసీ స్థానాలు పెరిగాయన్నా రు. నిజామాబాద్ రూరల్, బాన్సువాడ మండలాల్లో గరిష్టంగా ఐదు మండలాల చొప్పున పెరిగాయి. పెరి గిన వాటితో ప్రస్తుతం నిజామాబాద్ రూరల్‌లో అత్యధికంగా మొత్తం 29 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే జిల్లాలోని నందిపేట్, వేల్పూర్, సదాశివనగర్, ఎల్లారెడ్డి మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు పెరగలేదు. మండలాల వారీగా పెరిగిన ఎంపీటీసీ స్థానాల తో ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకున్న అధికారులు ఈ నెల 14న మండల కార్యాలయాల్లో ప్రద ర్శించాలని సీఈఓ సూచించారు. ఈ ముసాయిదాపై ఈ నెల 21 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని, పరిశీలన అనంతరం తుది జాబితాను తయారు చేసి తమకు పంపాలన్నారు. తుది జాబి తాను ఈ నెల 26 లేదా 27న మళ్లీ మండల కార్యాలయాల్లో ప్రదర్శించాలని పేర్కొన్నారు. పెరిగిన స్థానాలు ఆర్మూర్ 2 బాల్కొండ 1 ధర్పల్లి 1 భీమ్‌గల్ 2 డిచ్పల్లి 2 జక్రాన్‌పల్లి 1 కమ్మర్పల్లి 1 మాక్లూర్ 1 మోర్తాడ్ 1 నవీపేట్ 1 నిజామాబాద్ రూరల్ 5 సిరికొండ 2 బాన్సువాడ 5 బిచ్కుంద 2 బీర్కూర్ 1 బోధన్ 2 జుక్కల్ 2 కోటగిరి 1 మద్నూర్ 3 నిజాంసాగర్ 1 పిట్లం 3 రెంజల్ 1 వర్ని 2 ఎడపల్లి 1 భిక్కనూరు 1 దోమకొండ 1 గాంధారి 4 కామారెడ్డి 1 లింగంపేట్ 1 మాచారెడ్డి 1 నాగిరెడ్డిపేట్ 1 తాడ్వాయి 1