ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో గ్రామీణ ప్రాంత జనాభాకు అనుగుణంగా అదనంగా 55 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. గతం లో 528 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, పెరిగిన వాటితో మొత్తం స్థానాల సం ఖ్య 583కు చేరింది. జనాభా ప్రాతిపదికన నిర్వహించిన ఎంపీటీసీ స్థానా ల పునర్విభజనపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి(సీఈఓ) రాజారాం ఎంపీడీఓలకు సూచించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీ స్థానాలు పునర్విభజన చేసినట్లు ఆయన తెలి పారు.
మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణుల సంఖ్య 18 లక్షలు ఉండగా, జిల్లాలో 528 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. 2011 లెక్కల ప్రకారం 20 లక్షల 38 వేల 392 మందికి జనాభా చేరుకోగా అదనంగా 55 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయని సీఈఓ చెప్పారు. 3,500 మంది జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానాన్ని కేటాయించామన్నారు. ప్రతి మండలంలో ఒకటి నుం చి ఐదు చొప్పున ఎంపీటీసీ స్థానాలు పెరిగాయన్నా రు. నిజామాబాద్ రూరల్, బాన్సువాడ మండలాల్లో గరిష్టంగా ఐదు మండలాల చొప్పున పెరిగాయి. పెరి గిన వాటితో ప్రస్తుతం నిజామాబాద్ రూరల్‌లో అత్యధికంగా మొత్తం 29 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే జిల్లాలోని నందిపేట్, వేల్పూర్, సదాశివనగర్, ఎల్లారెడ్డి మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు పెరగలేదు.
మండలాల వారీగా పెరిగిన ఎంపీటీసీ స్థానాల తో ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకున్న అధికారులు ఈ నెల 14న మండల కార్యాలయాల్లో ప్రద ర్శించాలని సీఈఓ సూచించారు. ఈ ముసాయిదాపై ఈ నెల 21 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని, పరిశీలన అనంతరం తుది జాబితాను తయారు చేసి తమకు పంపాలన్నారు. తుది జాబి తాను ఈ నెల 26 లేదా 27న మళ్లీ మండల కార్యాలయాల్లో ప్రదర్శించాలని పేర్కొన్నారు.
పెరిగిన స్థానాలు
ఆర్మూర్ 2
బాల్కొండ 1
ధర్పల్లి 1
భీమ్‌గల్ 2
డిచ్‌పల్లి 2
జక్రాన్‌పల్లి 1
కమ్మర్‌పల్లి 1
మాక్లూర్ 1
మోర్తాడ్ 1
నవీపేట్ 1
నిజామాబాద్ రూరల్ 5
సిరికొండ 2
బాన్సువాడ 5
బిచ్కుంద 2
బీర్కూర్ 1
బోధన్ 2
జుక్కల్ 2
కోటగిరి 1
మద్నూర్ 3
నిజాంసాగర్ 1
పిట్లం 3
రెంజల్ 1
వర్ని 2
ఎడపల్లి 1
భిక్కనూరు 1
దోమకొండ 1
గాంధారి 4
కామారెడ్డి 1
లింగంపేట్ 1
మాచారెడ్డి 1
నాగిరెడ్డిపేట్ 1
తాడ్వాయి 1
పెరిగిన ఎంపీటీసీ స్థానాలు
Published Wed, Aug 7 2013 3:46 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement