కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలో సరాసరి 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల సాధారణ వర్షపాతం 114.0 మి.మీ.కాగా, ఇప్పటివరకు 23.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కడపలో 25.4. మిల్లీమీటర్లు, వల్లూరులో 24.4, చెన్నూరులో 18.8, ఖాజీపేటలో 38, కమలాపురంలో 30.2, ఎర్రగుంట్లలో 14.8, బద్వేలులో 14.2, గోపవరంలో 18, బి.మఠంలో 17.8, సిద్దవటంలో 12.5, అట్లూరులో 20.6, ఒంటిమిట్టలో 11.2, జమ్మలమడుగులో 10.6, ప్రొద్దుటూరులో 1.4, చాపాడులో 40.0, దువ్వూరులో 16.8, మైదుకూరులో 39.2, రాజుపాలెంలో 12.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మూయిస్తున్నారు. జిల్లాలోని 8 ఆర్టీసీ డిపోల్లో 840 బస్సులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 70 లక్షల రూపాయల ఆదాయం ఆర్టీసీకి వస్తోంది. 8రోజులుగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ఆర్టీసీకి 5.60 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అలాగే ప్రొద్దుటూరుతో పాటు జిల్లాలో రోజుకు 10 కోట్ల రూపాయల మేర బంగారు వ్యాపారం జరిగేది. ఉద్యమం కారణంగా 80 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే ఆయిల్ మిల్లులు, ధాన్యంతో పాటు అన్ని రకాల మిల్లుల ద్వారా రోజుకు 15 కోట్ల వ్యాపారం సాగేది.
ఇవన్నీ నిలిచిపోవడంతో 120 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపార సముదాయాల దాకా రోజుకు 18 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. ఇవి కూడా పూర్తిగా బంద్ కావడంతో 144 కోట్ల నష్టం సంభవించింది. అలాగే రోజుకు లక్షలీటర్ల పెట్రోలు, రెండు లక్షల లీటర్ల డీజిల్ వినియోగమయ్యేది. ఎనిమిదిరోజుల బంద్‌లో నాలుగురోజులు పెట్రోలు బంక్‌లు మూసేశారు. తద్వారా 5.96 కోట్ల నష్టం వాటిల్లింది.
బ్యాంకుల్లో నిలిచిపోయిన రూ. 640 కోట్ల లావాదేవీలు:
జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో రోజుకు 80 కోట్ల లావాదేవీలు సాగేవి. ఉద్యమం కారణంగా 8 రోజులుగా బ్యాంకులు మూతపడటంతో 640 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. వీటితో పాటు ఏటీఎంలు కూడా అధిక సంఖ్యలో మూతపడ్డాయి. 31వ తేదీ నుంచి ఉద్యమం నడుస్తుండటం, నెలలో మొదటివారం కావడంతో జీతాలు తీసుకునేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దెతో పాటు ఇతర ఖర్చులకు ఇక్కట్లు తప్పడం లేదు. శుక్రవారం రంజూన్ పండుగ ఉండటంతో ముస్లిం సోదరులకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకూడదనే ఉద్దేశంతో బుధ, గురు వారాల్లో సాయంత్రం వేళల్లో వ్యాపార దుకాణాలు తెరిచేందుకు జేఏసీ నేతలు అనుమతిచ్చారు.
జిల్లాలో ఓ మోస్తరు వర్షం
Published Thu, Aug 8 2013 4:27 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement