మోహనరావు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేస్తున్న మంత్రి సురేష్
జరుగుమల్లి: ఆపదలో ఉన్నవారిని ఆదుకునే క్రమంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరోమారు రుజువయింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎడ్లూరపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ బత్తిన మోహనరావు (53) బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురై అనేక ఆస్పత్రులకు తిరిగి దాదాపు రూ. 30 లక్షల వరకు ఖర్చుచేశారు. అయినా ఫలితం లేక గతేడాది నవంబర్‌లో మరణించారు. ధుఃఖంలో ఉన్న మోహనరావు కుటుంబానికి స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పార్టీలకు అతీతంగా అండగా నిలిచారు. స్థానిక నాయకులు చుండి శ్రీనివాసరావు, చుండూరి సురేష్ ఈ విషయాన్ని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 8 లక్షలు మంజూరు చేయించారు. ఈ నెల 19న మోహనరావు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.
మానవత్వంతో ఆదుకున్నారు
మా పెదనాన్న గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనారోగ్యానికి గురవడంతో పలు ఆస్పత్రులకు తిప్పి మా శక్తికి మించి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశాం. అయినా ఆయన మాకు దక్కలేదు. ఆ సమయంలో స్థానిక నాయకులు, మంత్రి సురేష్ పార్టీలు చూడకుండా మానవత్వంతో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.8 లక్షలు మంజూరు చేయించి ఇచ్చారు. – బత్తిన శరత్‌బాబు, మృతుని తమ్ముని కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment