జువ్వలపాలెంలో గ్రామస్తులను వారిస్తున్న పోలీసులు
కాళ్ల: కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం రణరంగాన్ని తలపించింది. గ్రామంలో నివాసాలకు ఆనుకుని చెరువు తవ్వకానికి వీలులేదంటూ స్థానికులు, సీపీఎం నాయకులు అడ్డుకునేందుకు బుధవారం ప్రయత్నించారు. అప్పటికే మోహరించిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఉదయం నుంచి నరసాపురం డివిజన్ స్థాయిలోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, ప్రత్యేక విభాగాల పోలీసులు భారీగా మోహరించారు. కొందరు సీపీఎం నాయకులను ముందస్తుగా హౌ స్ అరెస్ట్‌లు చేసినట్టు తెలిసింది. విడతలవారీగా స్థానికులు, సీపీఎం నాయకులు చెరువుల వద్దకు చేరుకున్నారు. వీరికి పోలీసులు ఎదురుగా రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సీపీఎం నాయకుడు జేఎన్‌వీ గోపాలన్ స్థానికులతో వచ్చి చెరువు తవ్వకం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కోర్డు ఆదేశాల మేరకు చెరువు తవ్వకం అడ్డుకోవడం నేరమని న్యాయబద్ధంగా నడుచుకోవాలని రూరల్ సీఐ నాగరాజు ఉద్యమకారులతో చర్చిం చారు. అయినా స్థానికులు వీటిని పట్టిం చుకోకుండా నినాదాలు చేయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేం దుకు వారిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. ఈతరుణంలో జరిగిన తోపులాటలో ఓమహిళకు చేతికి గాయాలు కాగా మరో మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఆందోళనకారులను పోలీసులు డివిజన్ స్థాయిలోని పలు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఐద్వా నాయకురాలు క ల్యాణి, సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంఘటనా స్థలానికి నరసాపురం డీఎస్పీ ప్రభాకర్‌బాబు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కోర్టు ఆదేశాలను పరి శీలించారు. అనంతరం సీఐ నాగరాజు స్థానికులతో చర్చిం చారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని కోరారు. సా యంత్రం వరకు పోలీసుల మోహరింపు కొనసాగింది.
సీపీఎం నాయకుల అరెస్ట్ దారుణం
చెరువు తవ్వకం అడ్డుకోవడానికి వెళ్లిన సీపీఎం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌లు చేయడం దారుణ మని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. స్థానికులు, సీపీఎం నాయకులపై లాఠీచార్జి చేయడం దారుణమని ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. బ డుగు, బలహీనవర్గాల వారి కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇంతలా ఆందోళన చేస్తున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆక్వా మాఫియా పెచ్చుమీరిందని, ఆక్రమణ చెరువులను నియంత్రించడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందారని విమర్శించారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment