nidamanuru
-
ఆరుగురి జీవితాలను కమ్మేసిన పొగమంచు
నిడమనూరు: మృత్యువు దారికాచి వెంటపడినట్టు పొగ మంచు ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదంలో బలితీసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడి వద్దకు వస్తున్న కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. పొగ మంచుకు అతివేగం, నిర్లక్ష్యం తోడై ఆరు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నల్ల గొండ జిల్లా నిడమనూరు మండలంలో ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదాలు జరిగాయి. బైక్‌పై స్వగ్రామానికి వస్తూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండా ఆవాస గ్రామమైన మల్లెవానికుంట తండాకు చెందిన రమావత్ శివనాయక్ (19) ఏపీలోని గుంటూరులో వేడుకల్లో డీజే సిస్టమ్, పూల అలంకరణ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు మండలంలోని వేంపాడు స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న బల్గూరి సైదులు (55)ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వేంపాడుకు చెందిన బల్గూరి సైదులు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. శివనాయక్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడి వద్దకు వస్తూ.. శివనాయక్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసి హైదరాబాద్‌లో ఉంటున్న తండ్రి రమావత్ ప్రభాకర్, బంధువులతో కలసి టాటా ఏస్ వాహనంలో మిర్యాలగూడకు బయలుదేరారు. వాహనంలో శివనాయక్ తండ్రి ప్రభాకర్, మేనమామ మూడావత్ పాలేఖ, రమావత్ వినోద్‌తోపాటు పెదనాన్న రమావత్ గనియా (43), బావ దుమావత్ నాగరాజు(25), మేనత్త రమావత్ బుజ్జి (44), డ్రైవర్ రమావత్ పాండు (42) ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వారి వాహనం నిడమనూరు మండలంలోని 3వ నంబర్ కెనాల్ సమీపంలో ప్రయాణిస్తోంది. అదే సమయంలో ఏపీలోని జగ్గయ్యపేట నుంచి కర్నాటకలోని మంగళూరుకు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది. శివనాయక్ బైక్ ప్రమాదం జరిగిన కిలోమీటరు దూరంలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. నలుగురు అక్కడిక్కడే మృతి.. ట్యాంకర్, టాటా ఏస్ ఢీకొన్న ప్రమాదంలో రమావత్ బుజ్జి, రమావత్ పాండు, గనియాలతోపాటు ఏపీలోని దొర్నాలకు చెందిన దుమావత్ నాగరాజు అక్కడిక్కడే మృతి చెందారు. రమావత్ ప్రభాకర్, రమావత్ వినోద్, మూడావత్ పాలేఖకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి, తర్వాత స్థానికంగా ఉన్న వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురి మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్‌ను నడుపుతున్న క్లీనర్.. ఈ రెండు ప్రమాదాలకు పొగ మంచు, అతి వేగంతోపాటు నిర్లక్ష్యంగా నడపడం కూడా కారణమని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను డ్రైవర్ శ్రీను కాకుండా క్లీనర్ జయప్రకాశ్ నడుపుతున్నట్టు తేల్చారు. బైక్ ఘటనలో మృతిచెందిన బల్గూరి సైదులు కుమారుడు బల్గూరి వెంకన్న ఫిర్యాదు మేరకు ఒక కేసు.. ట్యాంకర్, టాటా ఏస్‌ను ఢీకొన్న ప్రమాదంలో మృతుడు గనియా భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గోపాల్‌రావు తెలిపారు. -
AP: ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్పోకెన్ ఇంగ్లిష్’ క్లాసులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడేలా విద్యాశాఖ మరో ముందడుగు వేసింది. 26 జిల్లాల్లో తొలి దశలో భాగంగా జిల్లాకు 5 హైస్కూళ్లను ఎంపిక చేసి ప్రత్యేక ‘స్పోకెన్ ఇంగ్లిష్’ తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. దశల వారీగా అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయనుంది. సాధారణ తరగతులతో పాటే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ‘స్పోకెన్ ఇంగ్లిష్’ నేర్పిస్తారు. బెండపూడి.. నిడమానూరులో సక్సెస్ తూర్పుగోదావరి జిల్లాలోని బెండపూడి, గన్నవరం సమీపంలోని నిడమానూరు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇచ్చిన స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణతో అద్భుత ఫలితాలొచ్చాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు బోధించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. (క్లిక్: బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?) -
కట్టె కాలేలోపు మరొకరు.. నిడమనూరుకు ఏమైంది?
సాక్షి, నల్గొండ: అయితే హత్యలు.. లేదంటే ప్రమాదాలు.. మరీ కాదంటే అనారోగ్య సమస్యలు.. కారణాలు ఏమైతేనేం రోజు లేదా గంటల వ్యవధిలోనే ఇద్దరు చొప్పున మృత్యువాత పడుతున్నారు. ఇది ఎక్కడో కాదు నల్లగొండ జిల్లా పాత తాలూకా కేంద్రమైన నిడమనూరులో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు గ్రామానికి చెందిన మరో వ్యక్తి రోజు వ్యవధిలో మృతిచెందడంతో చర్చ తెరపైకి వచ్చింది. ఒకరి కట్టె కాలుతుందంటే చాలు రెండో వ్యక్తి ఎవరు? అని గ్రామస్తుల్లో వణుకు పుడుతోంది. నిడమనూరుకు ఏమైంది? అని గ్రామస్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. 1990 దశకం నుంచి ఇప్పటి వరకు ఇదే తరహాలో పదుల సంఖ్యలో ఘటనలు చోటు చేసుకోవడం గ్రామస్తులను కలవరపెడుతోంది. తాజాగా.. నిడమనూరు గ్రామానికి చెందిన పిల్లి లింగయ్య, ఇదే గ్రామానికి చెందిన తన బంధువు సూరయ్యతో కలిసి హుజూర్‌నగర్‌లో బంధువులో ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు శుక్రవారం బైక్‌పై వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో వీరి బైక్‌ను హుజూర్‌నగర్‌లోనే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పిల్లి లింగయ్య శనివారం మృతిచెందాడు. మరుసటి రోజు ప్రభుత్వ ఉద్యోగి.. పెద్దవూర : నిడమనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ (50) కుటుంబంతో కలిసి హాలియాలో నివాసం ఉంటున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం నిడమనూరు సాయంత్రం ఇంటికి చేరుకున్న సయ్యద్ స్నేహితుడిని కలిసేందుకు బయలుదేరాడు. పెద్దవూర మండలం తెప్పలమడుగు స్టేజి సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. 1990నుంచి మచ్చుకు కొన్ని ఘటనలు ► 1990లో అప్పటి సర్పంచ్ మేరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ఉన్నం రామారావుల హత్యలు ఒకే రోజు గంటల వ్యవధిలో జరిగాయి. ► 1991లో మండల కేంద్రానికి చెందిన సత్యనారాయణ, మేరెడ్డి చలపతిరెడ్డిలు ఒకే రోజు మండలంలోని ముకుందాపురం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ► తదనంతరం గ్రామానికి చెందిన గుండెమెడ స్వరాజ్యం, ఆమె కుమారుడు వెంకటేశ్వరరావు(బాబ్జీ)లు సైతం ఒక రోజు తేడాతో అనారోగ్యంతో మృతిచెందారు. ► మండల కేంద్రానికే చెందిన పాల్వాయి నారాయణ ఆయన భార్య లలిత ఇంట్లో నిద్రిస్తుండగా వర్షానికి మిద్దె కూలి ఇద్దరూ నిద్రలోనే కన్నుమూశారు. ► 2018 జూలై 27న మండల కేంద్రానికి చెందిన నంబూరి రమాదేవితో పాటు ఆమె కుమారుడు రఘురామ్, కూతురు సునీత, మనుమడు అభిరామ్‌లు అక్షరాభ్యాసం చేయించేందుకు బాసరకు కా రులో బయలుదేరగా హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురూ మృతిచెందారు. -
నాన్న ఉత్తరం చూశాక కన్నీళ్లు ఆగలేదు..
సాక్షి, అమరావతి బ్యూరో: కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల కోసం ఒత్తిడిని భరించలేక పారిపోయి హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో తలదాచుకున్న ప్రతిభావంతుడైన విద్యార్థిని విజయవాడ పోలీసులు కాపాడి సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. గత ఏడాది నవంబరు 27వ తేదీన కళాశాల నుంచి అదృశ్యమైన విద్యార్థి తన ఆవేదనను ‘సాక్షి’కి వివరించాడు. ‘నాపేరు మాతూరి జగదీష్ సాయి. మాది ప్రకాశం జిల్లా మార్టూరు మండలం. నాన్న నాయీబ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు. నాకు పదో తరగతిలో 9.3 గ్రేడ్ వచ్చింది. నన్ను బాగా చదివించాలనే తపనతో విజయవాడ నిడమానూరులోని చైతన్య కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేర్పించారు. కానీ ఇక్కడి పరిస్థితులు, అధ్యాపకుల తీరు, ఫీజుల కోసం పదేపదే గుర్తు చేసే యాజమాన్యం తీరుతో నవంబర్ 27 తెల్లవారుజామున కళాశాల నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ చేరుకుని ఓ రిసార్టులో క్యాటరింగ్ పనిలో చేరా. కొద్ది రోజుల తరువాత తల్లిదండ్రులు గుర్తొచ్చారు. కానీ వారికి ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు. నాకు బావ వరుస అయ్యే సాయితేజ్‌ని డిసెంబరు 14న నా స్నేహితుడి ఫేస్బుక్ ఖాతా ద్వారా పలకరించా. అందులో మా నాన్న రాసిన ఉత్తరం చూశాక కన్నీళ్లు ఆగలేదు. నేను క్షేమంగానే ఉన్నా, నాకోసం వెతకొద్దని మెసేజ్ పెట్టా. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆదివారం పోలీసులతో కలసి నా వద్దకు వచ్చిన నాన్నను చూడగానే ఏడుపు ఆగలేదు. క్షమించమని కోరా. ఆయన అక్కున చేర్చుకుని ఓదార్చడం చూశాక ఇక ఎప్పుడూ ఇలాంటి పని చేయకూడదని నిర్ణయించుకున్నా’ అని జగదీష్ తెలిపాడు. విద్యార్థి అదృశ్యంపై నవంబరు 28న ఫిర్యాదు అందుకున్న విజయవాడ పటమట పోలీసులు పలు మార్గాలో కేసు దర్యాప్తు జరిపారు. ఫేస్బుక్ ఖాతాను విశ్లేషించి విద్యార్థి జాడను గుర్తించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు సమక్షంలో విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాగా చదువుకోవాలనుకున్నా. కానీ కళాశాల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఫీజు కట్టాలని పదేపదే ఒత్తిడి చేయడంతో మనస్తాపంతో కాలేజీ నుంచి పారిపోయా – జగదీష్ సాయి -
కట్టుకున్న భర్తే కాలయముడు
-
అనుమానంతో భార్యను చంపేశాడు..
సాక్షి, విజయవాడ రూరల్: భర్తే కాలయముడై భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన విజయవాడ రూరల్ మండలంలో జరిగింది. అనుమానమే పెనుభూతంగా మారింది. దీంతో కట్టుకున్న భార్యను రోకలి బండతో దారుణంగా హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం నిడమానూరు రామ్‌నగర్‌కు చెందిన సోమేలు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అతడికి భార్య అశ్విని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అశ్విని మరొకరితో సన్నిహితంగా ఉంటుందంటూ గత కొద్దిరోజులుగా సోమేలు గొడవ పడుతున్నాడు. ఇదే విషయంపై గతరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అతడు శనివారం ఉదయం తిరిగి వచ్చాడు. ఉదయం తలుపు తీసిన భార్యను చూడగానే సోమేలు పట్టరాని కోపంతో రోకలి బండతో తలపై బలంగా కొట్టాడు. దీంతో అశ్విని అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అనంతరం సోమేలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అంతేకాకుండా భార్య మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పోలీసులకు అందచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా అశ్వినిని చంపేశానంటూ అల్లుడు ఫోన్ చేసి చెప్పాడని, అయితే తాము నమ్మలేదని, కోపంలో అలా చెబుతున్నాడేమో అనుకున్నామంటూ మృతురాలి తల్లి విలపించింది. కూతురు, అల్లుడికి గొడవ జరిగిందని, ఇదే విషయం ఫోన్లో చెప్పారని, ఉదయం వచ్చి మాట్లాడతామని చెప్పామని, ఇంతలోనే ఈ దారుణం జరిగిందని ఆమె పేర్కొంది. -
క్షణాల్లో కారు దగ్ధం...తృటిలో బయటపడ్డారు..
సాక్షి, నిడమానూరు : కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద హైవేపై బుధవారం ఉదయం ఓ కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్నవారు ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. హైదరాబాద్ నుండి పాలకొల్లు వెళుతున్న ఐ-టెన్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారును డ్రైవ్ చేస్తున్న మల్లాది నరసింహ శాస్త్రి మంటలను గమనించి వెంటనే వాహనాన్ని పక్కకు తీశారు. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారంతా దిగగానే మంటలు ఒక్కసారిగా చెలరేగి, క్షణాల్లో కారు దగ్ధమైంది. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న నరసింహ శాస్త్రి పాలకొల్లులోని తమ బంధువులు ఇంటికి కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడంపై అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
అనుమానంతోనే అంతమొందించాడు
నిడమనూరు (నాగార్జునసాగర్) : ఎర్రబెల్లిలో పెదమాం రజనీకాంత్‌ను.. ముడి నాగయ్య అనుమానంతోనే హత్య చేశాడని మిర్యాలగూడ డీఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఎర్రబెల్లికి చెందిన ముడి నాగయ్య భార్య పార్వతమ్మకు గ్రామానికి చెందిన పెదమాం రజినీకాంత్‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు నాగయ్య అనుమానిస్తున్నాడు. ఈ విషయమై గతంలో ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో ఈ నెల 22న ఎర్రబెల్లికి చెందిన దాసరి వెంకన్న మొక్క తీర్చుకోవడానికి.. దామరచర్ల మండలం కల్లెపల్లి వెళ్లాడు. అక్కడికి ముడి నాగయ్య, పెదమాం రజినీకాంత్‌ను కూడా పిలిచాడు. అక్కడ రజినీకాంత్ ప్రవర్తన నచ్చని ముడి నాగయ్య తన భార్య పార్వతమ్మను కొట్టాడు. రజినీకాంత్‌ను పరోక్షంగా దూషించాడు. దీంతో ఆగ్రహించిన రజినీకాంత్ తనను నాగయ్య తిట్టాడని ఆరోపిస్తూ.. ఈ నెల 24న పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. తన కుటుంబాన్ని వేధిం చడమే కాకుండా.. తనను పంచాయితీకి పిలిచా డని.. ఆగ్రహించిన నాగయ్య రజినీకాంత్‌ను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. ఓ కత్తిని తన బొడ్లో దోపుకుని పంచాయితీ వద్దకు వెళ్లాడు. అక్కడి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. రజినీకాంత్ నాగయ్యపై దాడి చేశాడు. ఈక్రమంలో నాగయ్య వెంట తెచ్చుకున్న కత్తితో.. రజినీకాంత్ పొట్ట, పక్కటెముకల వద్ద పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన రజినీ కాంత్ అక్కడికక్కడే మృతిచెం దాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్పాప్తు చేశారు. నిందితుడు నాగయ్యను గురువారం రిమాండ్‌కు తరలించారు. పెద్ద మనుషులపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం రచ్చబండ వద్ద క్రిమినల్ పంచాయితీలు పరిష్కరించే పెద్దమనుషులపై కేసులు నమోదు చేస్తామని.. డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎర్రబెల్లికి చెంది న పెద్దమనుషులు మాతంగి భిక్షం, బరపటి దుర్గ య్య, వెంకన్నను గతంలో ఇలాంటి కారణంతోనే తహసీల్దార్ వద్ద రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేశామన్నారు. ముగ్గురిలో వెంకన్న తప్ప మిగిలిన ఇద్దరూ తిరిగి అదే రకంగా పంచాయితీలు చేసి హ త్య జరిగేందుకు కారణమయ్యారని.. అన్నారు. వా రు పెట్టిన పూచీకత్తు రూ.లక్ష చెల్లించాలని.. లేకుం టే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. భూ తగాదాలు, సివిల్ విషయాలు పెద్దమనుషులు పరిష్కరించవచ్చని.. క్రిమినల్ కేసులను రచ్చబండ వద్దకు లాగవద్దని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హాలియా సీఐ ధనుం జయ్గౌడ్, నిడమనూరు ఎస్ఐ యాదయ్య ఉన్నారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరాడని సర్పంచ్ కారును..
-
సర్పంచ్ కారును దగ్ధం చేశారు
నిడమనూరు: సర్పంచ్ ఇంటి వద్ద పార్క్ చేసిన కారును ఆర్థరాత్రి దుండగులు తగులబెట్టిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. నిడమనూరు సర్పంచ్ కోటేశ్వరరావు కారును గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి దగ్ధం చేశారు. కోటేశ్వరరావు ఇటీవలే టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మారడంతో టీడీపీ వర్గీయులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పడమట పీఎస్‌లో కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నిడమనూరు : ప్రత్యేకావసరాలుగల పిల్లల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను తల్లిదండ్రులు వారికి వినియోగించాలని ఐఈఆర్టీ కో–ఆర్డినేటర్ రవినాయక్ అన్నారు. నిడమనూరు ఎమ్మార్సీలో శనివారం ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వారంలో ఒక రోజు ఆయా మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీల్లో అలాంటి పిల్లలకు ఫిజియోథెరపీ చికిత్స అందిస్తుందన్నారు. వైకల్యాన్ని బట్టి వారికి కావలసిన పరికరాలను అందిస్తుందని, అవసరమైన వారికి ఉన్నత స్థాయిలో ఉచిత చికిత్స సైతం చేయిస్తున్నారని తెలిపారు. ఎంఈఓ బాలునాయక్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఐఈఆర్టీలు అనంతరాములు, వెంకటేశ్వర్లు, డాక్టర్ రమణారెడ్డి, 50మంది ప్రత్యేకావసరాలు గల పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు
నిడమనూరు : మండలంలోని ముకుందాపురంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అండర్–14, 17 బాలబాలికల వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అండర్ – 14, అండర్ – 17 బాల బాలికల విభాగాల్లో జరిగిన వాలీబాల్ పోటీల్లో మిర్యాలగూడ జట్లు మెుదటి స్థానం సాధించగా, సూర్యాపేట జట్లు ద్వితీయ స్థానం సాధించాయి. ఈ సందర్భంగా విజేతలకు డీఈఓ చంద్రమోహన్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య షీల్డు, వ్యక్తిగత బహుమతులు అందజేశారు. అనంతరం డీఈఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ముకుందాపురం ప్రభుత్వ పాఠశాల బాలికలు రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ పాఠశాల బాలికలు ఎన్నో టోర్నమెంట్లలో మెదటి స్థానం సాధించాలని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి జట్టుకు విద్యార్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలునాయక్, సర్పంచ్ శివరామకృష్ణ, వైఎస్ ఎంపీపీ సీతారాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నూకల వెంకటరెడ్డి, అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ అబ్బాస్, మాజీ సర్పంచ్ రామాంజయ్య యాదవ్, నిడమనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంసీ కోటిరెడ్డి, వంశీరెడ్డి, పీఈటీలు పాల్గొన్నారు. -
క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
నిడమనూరు : గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మండలంలోని ముకుందాపురంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 62వ జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 బాలబాలికల వాలీబాల్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముకుందాపురం ప్రభుత్వ పాఠశాల బాలబాలికలు జాతీయ స్థాయిలో ఆడుతుండడం సంతోషించ దగినదని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. పాఠశాలకు సంబంధించిన కాంపౌండ్‌వాల్, ఇతర అభివృద్ధి పనులకు సహకరిస్తానని అన్నారు. ఎంఈఓ బాలూనాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి పుల్లయ్య, డివిజన్ కార్యదర్శి మనోహరి, డిప్యూటీ ఈఓ పాండునాయక్, ఎంపీపీ దాసరి నర్సింహా, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఎంపీడీఓ ఇందిర, పీఏసీఎస్ చైర్మన్ రంగశాయిరెడ్డి, చేకూరి హన్మంతరావు, కత్తి లింగారెడ్డి, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, సర్పంచ్ శివరామకృష్ణ, వైఎస్ ఎంపీపీ మంజుల సీతారాములు, నూకల వెంకట్‌రెడ్డి, రామలింగయ్య, రాం అంజయ్య పాల్గొన్నారు. -
సాగుబడిపై ప్రదర్శన
శాఖాపురం(నిడమనూరు) : సాగుబడిపై బొమ్మలద్వారా ప్రదర్శనను ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు గురువారం మండలంలోని శాఖాపురంలో ఏర్పాటు చేశారు. వ్యవసాయ విద్యాలయంలో బీఎస్సీ 4వ సంవత్సరం విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా మండలంలోని శాఖాపురంలో మూడునెలల పాటు రైతులతో కలిసి పని చేయనున్నారు. ఇందులో భాగంగా గ్రామ స్పరూపం, పొలాలకు సంబంధించిన వివిధ అంశాలను అందులో చేర్చారు. కార్యక్రమంలో విద్యార్థులు శివ, సంతోష్, శివకుమార్, ప్రశాంత్, రాజేష్, నాగరాజు పాల్గొన్నారు. -
పలు చోట్ల భారీ వర్షం
నల్లగొండ అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని 52 మండలాల్లో విస్తారంగా వర్షం పడింది. సోమవారం సాయంత్రం కూడా నల్లగొండ పట్టణంలో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా నిడమనూరు మండలంలో 66.2 మి.మీ. వర్షం పడింది. అదే విదంగా దేవరకొండలో 53.0, అనుములలో 41.4, గుర్రంపోడులో 32.3, పెద్దవూరలో 30.1, పీఏపల్లిలో 30.0, త్రిపురారంలో 24.4, వేములపల్లిలో 23.8, చౌటుప్పల్‌లో 23.4, మోత్కూరులో 19.2, చండూరులో 18.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాంపల్లిలో 18.4, మేళ్లచెరువులో 18.4, డిండిలో 18.0, మునుగోడులో 16.4, శాలిగౌరారంలో 15.4, కనగల్‌లో 15.2, తిరుమలగిరిలో 13.8, నారాయణపురంలో 13.6, నల్లగొండలో 13.0, చందంపేటలో 12.6, నకిరేకల్‌లో 11.2, తిప్పర్తిలో 10.6, మఠంపల్లిలో 10.6 మిల్లీమీటర్లు కురిసింది. చిలుకూరులో 10.0, నార్కట్‌పల్లిలో 9.8, కోదాడలో 9.4, కట్టంగూరులో 8.8, తుర్కపల్లిలో 8.6, పోచంపల్లిలో 8.6, దామరచర్లలో 8.4, చింతపల్లిలో 8.2, రాజాపేటలో 6.4, మిర్యాలగూడలో 6.0, గుండాలలో 5.2, మర్రిగూడలో 5.2, ఆత్మకూరులో 4.6, రామన్నపేటలో 4.4, వలిగొండలో 4.2, కేతేపల్లిలో 4.0, ఆలేరులో 3.6, బి.రామారంలో 3.4, మునగాలలో 3.2, నడిగూడెంలో 2.4, బీబీనగర్, గరిడేపల్లి, హుజూర్నగర్, జాజిరెడ్డిగూడెంలలో 2.2, చిట్యాలలో 2.0, భువనగిరిలో 1.2, సూర్యాపేటలో 1.0, చివ్వెంలలో 0.6 మిల్లీమీటర్లు కురిసింది. సగటున 11.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. -
మౌనికను స్ఫూర్తిగా తీసుకోవాలి
నిడమనూరు : కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన గురుకుల పాఠశాల విద్యార్థిని వుగ్గె మౌనిక విద్యార్థులకు స్ఫూర్తినిచ్చిందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. నిడమనూరులో శుక్రవారం పర్వతోహకురాలు వుగ్గె మౌనిక సన్మాన సభలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిభ చూపిన వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మౌనిక అదే స్ఫూర్తితో చదువుతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభ చూపాలని కోరారు. లయన్స్కబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ –2 రామానుజాచార్యులు మాట్లాడుతూ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి రాజకీయ దార్శనికుడని అన్నారు. ఎంతో గర్వంగా ఉంది : మౌనిక మహామహుల సమక్షంలో స్టేజీ ఎక్కడం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినప్పటి కంటే ఎక్కువ సంతోషంగా ఉందని వుగ్గె మౌనిక అన్నారు. శుక్రవారం తన అభినందన, సన్మాన కార్యక్రమంలో మౌనిక మాట్లాడారు. డార్జిలింగ్ వెళ్లినప్పుడు ఎవ్వరూ గుర్తించలేదని, అప్పుడు తనకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. నిడమనూరు లయన్స్‌క్లబ్ వ్యవస్థాపకుడు చేకూరి హన్మంతరావు పర్వతాన్ని అధిరోహించిన విషయం పత్రికల ద్వారా తెలుసుకుని తనకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారని సంతోషం వ్యక్తం చేసింది. ఎప్పుడూ ముందడగు వేయాలని అప్పుడే విజయాలు వాటంతట అవే వస్తాయని మౌనిక అన్నారు. ఈసందర్భంగా మండలస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 22మందిని సన్మానించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్–1 చిలుకల గోవర్దన్, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఎంపీడీఓ ఇందిర, ఎంఈఓ బాలు నాయక్, జెడ్పీటీసీ అంకతి రుక్మిణిసత్యం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చేకూరి వంశీచరణ్, నిడమనూరు లయన్స్‌క్లబ్ బాధ్యులు ముంగి శివమారయ్య, అంకతి సత్యం, మెరుగు మధు, ఉన్నం చిన వీరయ్య, సర్పంచ్ రుద్రాక్షి ముత్తయ్య, కట్టెబోయిన గోవర్దన్, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శాఖపురంలో తాగు నీటి కష్టాలు
నిడమనూరు : మండలంలోని శాఖాపురంలో తాగు నీటి ఇబ్బందులు తీవ్రమయ్యాయి. స్కీం బోరులో నీటిలెవల్ తగ్గడం, గేట్ వాల్వ్ సక్రమంగా లేక పోవడంతో సమస్య తలెత్తింది. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇతరుల బోర్ల నుంచి తాగునీరు.. వర్షాలు లేక గ్రామంలో చేద బావులు అడుగంటాయి. బావుల్లో నీరు లేక పోవడంతో నివాస గృహాల్లో బోర్లు వేయించుకున్నారు. వాటిలో సైతం నీరు అందక మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంతో వ్యయం చేసి వేయించుకున్న బోర్లలో నీరు తగ్గడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు కార్లుగా సాగు నీటికి నీటి విడుదల చేయకపోవడంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. ఇతరుల బోర్ల నుంచి నీటిని తీసుకుంటున్నారు. గ్రామ కంఠంలో వ్యవసాయబోర్లు.. మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్లుగా గ్రామకంఠంలోనే వ్యవసాయాధారిత బోర్లను వేశారు. ఈ బోర్లను వ్యవసాయానికి వినియోగించుకుంటుండడంతో గ్రామంలో బావులు, బోర్లలో నీరు తగ్గిపోయాయి. గ్రామంలో సింగిల్ ఫేజ్ విద్యుత్‌తో బోర్లను నడిపించడంతో నిరంతరం నీటిని తోడుతున్నాయి. దీంతో ఇళ్లలో వేసుకున్న బోర్లలో మోటార్లకు నీరు అందకుండా పోతుంది. వ్యవసాయ బోర్లకు విద్యుత్ బిల్లులు సైతం లేక పోవడంతో విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇంట్లో వేసిన బోరులో నీరు తగ్గింది : చిన్నాల రామకృష్ణ, శాఖాపురం గ్రామం చుట్టూ వ్యవసాయ బోర్ల కారణంగా ఇళ్లలో తాగు నీటి కోసం వేసుకున్న బోర్లలో నీరు తగ్గింది. ఇళ్లలో వాడుకోవడానికి నీరు సైతం లేక ఇతరుల బోర్ల నుంచి తెచ్చుకుంటున్నాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలి. -
బండరాయితో మోది దారుణ హత్య
నిడమనూరు: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిడమనూరు మండలం వల్లభాపురంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏం.. కష్టమొచ్చిందో..!
రేకులగడ్డ (నిడమనూరు): కుటుంబ కలహాలో.. మరో కారణమో తెలియదు కానీ ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన రేకులగడ్డలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగులగడ్డకు చెందిన నాయినాని గంగరాజుకు అదే మండలం వల్లభాపురానికి చెందిన లక్ష్మితో 14సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రశాంత్(12), యమున(9) పిల్లలున్నారు. ఉన్నట్టుండి శనివారం సాయంత్రం 4,5 గంటల ప్రాంతంలో లక్ష్మి పురుగులమందు తాగి ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి గడియ వేసుకుంది. ఆమె మామ తలుపు తట్టి ఏమైందని అడిగితే చెప్పలేకపోయింది. అప్పుడే అపస్మారకస్థితిలోకి వెళుతున్న ఆమెను పిల్లలు ఏరి అని గట్టిగా అడిగితే బావిలో అంటూ.. ఆపై ఏమీ చెప్పలేకపోయింది. అనుమానం వచ్చి సమీపంలోని బావిలోకి వెళ్లి చూడగా చిన్నారుల మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. గ్రామస్తులు వెంటనే బావిలోకి దిగి మృతదేహాలను వెలికితీశారు. అపస్మారకస్థితిలోకి వెళ్తున్న లక్ష్మిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కన్నీటి పర్యంతమవుతున్న గ్రామస్తులు బావిలో నుంచి తీసిన చిన్నారుల మృతదేహాలు చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యం తమవుతున్నారు. ప్రశాంత్‌కు ఇటీవలనే గురుకుల పాఠశాలలో సీటు వచ్చినట్లు గ్రా మస్తులు తెలిపారు. ఏ కోపం, ఆవేశం ఉన్నా బడ్డలను చంపుకుని ఇప్పుడు ఏం సా ధిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని రాత్రి 9గంటలకు హాలియా సీఐ పార్థసారథి, నిడమనూరు ఎస్ఐ నర్సింహారాజు పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ.. లక్ష్మి గతంలోనూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే అప్పుడు కుటుంబ సమస్యలు కావని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం సంఘబంధానికి సంబంధించిన రూ.25వేలు బ్యాంక్ నుంచి తీసుకుని ఆటోలో వస్తుండగా ఎక్కడో పడిపోయాయి. పోయిన రూపాయలు ఆచూకీ దొరకకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స చేయించడంతోప్రాణాలతో ఇంటికి వచ్చిందని, ఇప్పుడేమో ఇద్దరి పిల్లల ప్రాణాలు తీసి, తను కూడా తీసుకోబోయిందని రోదిస్తూ కుటుంబసభ్యులు చెప్పారు. -
బస్టాండ్ టూ నిడమానూరు 20 నిమిషాల్లోనే..!
మెట్రో రైలు వస్తే ఈజీ జర్నీ బందరురోడ్డు, ఏలూరురోడ్డు కారిడార్లు24 మెట్రో స్టేషన్లు, ఐదు నిమిషాలకొక రైలు డీపీఆర్ సిద్ధంచేసిన డీఎంఆర్సీ విజయవాడ బ్యూరో : మెట్రో రైలు అందుబాటులోకి వస్తే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నిడమానూరుకు కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. బస్టాండ్ నుంచి పెనమలూరు వెళ్లేందుకూ అంతే సమయం పడుతుంది. 40 కిలోమీటర్ల సగటు, 75 కిలోమీటర్ల అత్యధిక వేగంతో నగరంలో మెట్రో రైళ్లు నడిచేలా డిజైన్లు తయారుచేశారు. డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్న డీపీఆర్ (సవివర నివేదిక)లో ఈ వివరాలను పొందుపరిచారు. ఏలూరు, బందరురోడ్డు కారిడార్లలో కిలోమీటరుకు ఒకటి చొప్పున ఏర్పాటుచేయనున్న 24 మెట్రో స్టేషన్లలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. రోడ్డుకు 14 నుంచి 17 మీటర్ల ఎత్తులో ఉండే కారిడార్ స్టేషన్లకు చేరుకునేందుకు లిఫ్టు, ఎస్కలేటర్, స్టెయిర్‌కేస్‌లను ఏర్పాటుచేస్తారు. బోగీల్లో అత్యాధునిక సదుపాయాలు మెట్రో రైలు బోగీల్లో అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. ఏసీ, సౌకర్యవంతమైన సీట్లు ఏర్పాటు చేస్తారు. స్టేషన్ రాగానే తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. రాబోయే స్టేషన్ ఎంత దూరంలో ఉంది, దగ్గరకు వచ్చిందా, లేదా అనే విషయాలను నిరంతరం ఆడియో ద్వారా ప్రయాణికులు వినే సౌకర్యం ఉంటుంది. స్టేషన్ రాగానే బోగి లోపల ఏర్పాటుచేసిన వీడియోలో ఆవరణ అంతా కనిపిస్తుంది. డ్రైవర్ లేకుండా నడిచే ఈ రైళ్లు కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధారంగా వాటంతట అవే పనిచేస్తాయి. కారిడార్ మధ్యలో ఎవరైనా వచ్చినా రైలు ఆగిపోతోంది. అడ్డు తొలగగానే మళ్లీ రైలు ముందుకెళుతుంది. బస్టాండ్‌లో ఆపరేషన్ యూనిట్ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో పండిట్ నెహ్రూ బస్టేషన్ అత్యంత కీలకం కానుంది. ఇక్కడ మెట్రో కారిడార్‌లో భాగంగానే ఐదంతస్తుల అత్యాధునిక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. బస్టాండ్ సమీపంలోనే తాత్కాలికంగా బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. రైల్వేస్టేషన్ వద్ద రెండు మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి బీసెంట్‌రోడ్డు వయా అలంకార్ సెంటర్ మీదుగా ఏలూరురోడ్డు వరకు కారిడార్ సాగుతుంది. డీఎంఆర్సీ సెప్టెంబర్‌లో డీపీఆర్ రూపకల్పన ప్రారంభించింది. విజయవాడలో 25 మంది డీపీఆర్ కోసం నిరంతరం పనిచేశారు. టోపోగ్రఫీ, ట్రాఫిక్, పర్యావరణ, జియోగ్రాఫిక్ సర్వేల ద్వారా మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన సమస్త సమాచారాన్ని తెలుసుకున్నారు. అనుకున్న గడువులోపే డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించేందుకు డీఎంఆర్సీ సిద్ధమైంది. -
అనుమానం పెనుభూతమై..
సూరేపల్లి(నిడమనూరు) : అనుమానం పెనుభూతమైంది.. ఆదమరచి నిద్రపోతున్న రెండో భార్యను రోకలితో మోది దారుణంగా హత్య చేశాడు.. ఓ భర్త. ఈ దారుణ ఘటన నిడమనూరు మండలం సూరేపల్లిలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇరుగంటి శ్రీను వ్యవసాయ బావి మోటార్లను మరమ్మతు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే గ్రామానికి చెందిన నాగేంద్రమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం కలగకపోవడంతో 11 ఏళ్ల క్రితం మొదటి భార్య చెల్లెలు రేణుక(30)ని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి శివకుమార్, ప్రియాంక ఇద్దరు సంతానం కలిగారు. భార్యలతో గొడవపడి.. శ్రీను మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఇద్దరు భా ర్యలతో గొడవపడ్డాడు. రెండో భార్య రేణుక మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను తీవ్రంగా కొట్టడడంతో అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందోనని చుట్టుపక్కల వారు అనుమానం వ్యక్తం చేయడంతో రేణుక కోసం గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. మొదటి భా ర్య నాంగేంద్రమ్మ ఇంట్లో పడుకోగా, శ్రీను బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి వచ్చి.. ఘాతుకానికి పాల్పడి.. కొద్దిసేపటి తరువాత రేణుక ఇంటికి వచ్చి మంచంలో పడుకుంది. అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు శ్రీను తప్పతాగి ఇంటికి వచ్చాడు. తలుపులు బాదడంతో కొద్ది సేపటి వరకు ఎవరూ తీయలేదు. ఆగ్రహానికి లోనైన శ్రీను పక్కనే ఉన్న రోకలితో తలుపు కొట్టడంతో నాంగేంద్రమ్మ వచ్చి తెరిచింది. బూతులు లంకించుకుని తలుపు గట్టిగా తోయడంతో నాగేంద్రమ్మ కిందపడిపోయింది. శ్రీను ఇంట్లోకి వెళ్లి మంచంపై పడుకున్న రేణుక తలపై విచక్షణా రహితంగా మోదడంతో నిద్రలోనే ప్రాణాలు విడిచింది. భయాందోళన చెందిన నాగేంద్రమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో శ్రీను అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన రేణుకను పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ హత్యోదంతం సమాచారం తెలుసుకుని బుధవారం ఉదయం మిర్యాలగూడ టూటౌన్ సీఐ పాండురంగారెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు. హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ ఆధ్వర్యంలో కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నిడమనూరు ఎస్ఐ శ్రీరాముల అయోధ్య తెలిపారు. -
నిరుపేద దళిత కుటుంబాలకే భూ పంపిణీ
గోపాలపురం (నిడమనూరు) :భూమిలేని నిరుపేలైన దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ యోగ్యమైన భూమి ప్రభుత్వం అందజేస్తుందని జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులను ఎంపిక చేసేందుకు ధర్మాపురం ఆవాసం గోపాలపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. భూమిలేకపోవడం వల్ల స్థిరం లేని మనుగడ సాగిస్తున్న దళితులను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిచోట, ప్రైవేటు భూముల అమ్మకంలో సహకరించాలని కోరారు. గోపాలపురంలో 25 మంది దళిత కుటుంబాలకు గాను 13మందిని మొదటి కేటగిరీలో, ఐదుగురిని రెండవ కేటగిరీలో, ఇద్దరిని మూడవ కేటగిరీలో అర్హులుగా నిర్ణయించారు. మొదటి కేటగిరీలో ఉన్న 13కుటుంబాలకు 39ఎకరాలు ఇవ్వా ల్సి ఉండగా అక్కడ ఎలాంటి ప్రభుత్వ భూమీ అందుబాటులో లేదు. దీంతో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధర్మాపురం గ్రామానికి చెందిన చింతరెడ్డి సైదిరెడ్డి వారి కుటుంబసభ్యుల 15ఎకరాల భూమిని జేసీ ప్రీతీమీనా పరిశీలించారు. గ్రామానికి దూరంగా ఉన్న భూముల వద్దకు రాళ్లబాటలో నడిచి వెళ్లారు. భూముల వద్ద విక్రయదారులతో జేసీ, ఆర్డీవో కిషన్‌రావు చర్చలు జరిపారు. వారు ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఇవ్వలేమని, కొంతసమయం ఇవ్వాలని కోరారు. కాగా, రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్డీఓను జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో దామోదర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్, తహసీల్దార్ అంబేద్కర్, ఎంపీపీ నర్సింహ, జెడ్పీటీసీ సభ్యురాలు అంకతిరుక్మిణి, మల్లయ్య పాల్గొన్నారు.