క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
Published Sat, Sep 17 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
నిడమనూరు : గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మండలంలోని ముకుందాపురంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 62వ జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 బాలబాలికల వాలీబాల్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముకుందాపురం ప్రభుత్వ పాఠశాల బాలబాలికలు జాతీయ స్థాయిలో ఆడుతుండడం సంతోషించ దగినదని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. పాఠశాలకు సంబంధించిన కాంపౌండ్‌వాల్, ఇతర అభివృద్ధి పనులకు సహకరిస్తానని అన్నారు. ఎంఈఓ బాలూనాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి పుల్లయ్య, డివిజన్ కార్యదర్శి మనోహరి, డిప్యూటీ ఈఓ పాండునాయక్, ఎంపీపీ దాసరి నర్సింహా, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఎంపీడీఓ ఇందిర, పీఏసీఎస్ చైర్మన్ రంగశాయిరెడ్డి, చేకూరి హన్మంతరావు, కత్తి లింగారెడ్డి, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, సర్పంచ్ శివరామకృష్ణ, వైఎస్ ఎంపీపీ మంజుల సీతారాములు, నూకల వెంకట్‌రెడ్డి, రామలింగయ్య, రాం అంజయ్య పాల్గొన్నారు.
Advertisement