మౌనికను స్ఫూర్తిగా తీసుకోవాలి
మౌనికను స్ఫూర్తిగా తీసుకోవాలి
Published Fri, Sep 9 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
నిడమనూరు : కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన గురుకుల పాఠశాల విద్యార్థిని వుగ్గె మౌనిక విద్యార్థులకు స్ఫూర్తినిచ్చిందని సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. నిడమనూరులో శుక్రవారం పర్వతోహకురాలు వుగ్గె మౌనిక సన్మాన సభలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిభ చూపిన వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మౌనిక అదే స్ఫూర్తితో చదువుతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభ చూపాలని కోరారు. లయన్స్‌కబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ –2 రామానుజాచార్యులు మాట్లాడుతూ సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి రాజకీయ దార్శనికుడని అన్నారు.
ఎంతో గర్వంగా ఉంది : మౌనిక
మహామహుల సమక్షంలో స్టేజీ ఎక్కడం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినప్పటి కంటే ఎక్కువ సంతోషంగా ఉందని వుగ్గె మౌనిక అన్నారు. శుక్రవారం తన అభినందన, సన్మాన కార్యక్రమంలో మౌనిక మాట్లాడారు. డార్జిలింగ్ వెళ్లినప్పుడు ఎవ్వరూ గుర్తించలేదని, అప్పుడు తనకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. నిడమనూరు లయన్స్‌క్లబ్ వ్యవస్థాపకుడు చేకూరి హన్మంతరావు పర్వతాన్ని అధిరోహించిన విషయం పత్రికల ద్వారా తెలుసుకుని తనకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారని సంతోషం వ్యక్తం చేసింది. ఎప్పుడూ ముందడగు వేయాలని అప్పుడే విజయాలు వాటంతట అవే వస్తాయని మౌనిక అన్నారు. ఈసందర్భంగా మండలస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 22మందిని సన్మానించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్–1 చిలుకల గోవర్దన్, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఎంపీడీఓ ఇందిర, ఎంఈఓ బాలు నాయక్, జెడ్పీటీసీ అంకతి రుక్మిణిసత్యం, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు చేకూరి వంశీచరణ్, నిడమనూరు లయన్స్‌క్లబ్ బాధ్యులు ముంగి శివమారయ్య, అంకతి సత్యం, మెరుగు మధు, ఉన్నం చిన వీరయ్య, సర్పంచ్ రుద్రాక్షి ముత్తయ్య, కట్టెబోయిన గోవర్దన్, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, పీఆర్‌టీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement