అన్నను హత్య చేసిన తమ్ముడు | brother mudder | Sakshi
Sakshi News home page

అన్నను హత్య చేసిన తమ్ముడు

Published Thu, Jul 28 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

brother mudder

అరకులోయ:  భూ తగాదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఏకంగా అన్ననే ఓ వ్యక్తి బుధవారం హత్య చేశాడు. అరకులోయ సీఐ సింహాద్రి నాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.  అరకులోయ మండలం మాడగడ పంచాయతీ పరిధిలోని మంజగుడలో నలుగురు అన్నదమ్ములు నివసిస్తున్నారు. వీరిలో రెండో వాడైన సమర్థి మదన్‌సుందర్‌(40), మూడో వాడైన జలంధర్‌కు మధ్య పొలం గట్టు విషయవై గొడవ జరిగింది. తన పొలం గట్టులో కొంతభాగాన్ని  కలుపుకొని అన్న మదన్‌సుందర్‌ నాట్లు వేసుకున్నాడని జలందర్‌ గొవడకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.  జలందర్‌ పారతో మెడపై నరకడంతో మదన్‌సుందర్‌ అక్కడికక్కడే మతి చెందాడు.  మతుడి భార్య రాధ   చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, నింది తుడు పరారీ ఉన్నాడని సీఐ తెలి పారు. మత దేహాన్ని పోస్టుమార్టం పరీక్షల అరకులోయ ఏరి యా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement