Greenfield
-
భవిష్యత్ కరెన్సీ అవసరాలకు తగ్గ ప్రణాళిక
న్యూఢిల్లీ: కరెన్సీ నిర్వహణ సదుపాయాలను వచ్చే 4–5 ఏళ్లలో సంపూర్ణంగా పునర్నిర్మించాలని ఆర్బీఐ ప్రణాళికతో ఉంది. ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధితో భవిష్యత్తులో ఏర్పడే కరెన్సీ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, స్టోరేజ్ (నిల్వ) వసతులు మెరుగుపరుచుకోవాలని అనుకుంటోంది. గ్రీన్‌ఫీల్డ్ కరెన్సీ నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, నిల్వ కేంద్రాల ఆటోమేషన్, సెక్యూరిటీ, సరై్వలెన్స్ వ్యవస్థల ఏర్పాటు, ఇన్వెంటరీ నిర్వహణ విధానం, కేంద్రీకృత నిర్వహణ కేంద్రం ఇవన్నీ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్ అమలు కాలం 4–5 ఏళ్లుగా ఉంది. కరెన్సీ నిర్వహణ వసతుల ఆధునికీకరణకు సంబంధించి కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం ఆర్బీఐ ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)లకు ఆహా్వనించింది. ఈ డాక్యుమెంట్‌ను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి. ‘‘గడిచిన మూడేళ్లలో చలామణిలో ఉన్న నోట్ల పెరుగుదల మోస్తరుగా ఉన్నప్పటికీ, వచ్చే దశాబ్ద కాలంలో దాని వేగం మందగించే అవకాశం ఉంది. అయినా కానీ సమీప కాలంలో వృద్ధి సానుకూలంగా ఉంటుందని విశ్లేషణ తెలియజేస్తోంది. గడిచిన రెండు దశాబ్దాల్లో చలామణిలో ఉన్న నోట్లు చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. 2023 మార్చి 31 నాటికి 136.21 బిలియన్ పీసుల నోట్లఉండగా, 2024 మార్చి 31 నాటికి 146.88 బిలియన్ పీసులకు పెరిగాయి. కాయిన్ల చలామణి సైతం ఇదే కాలంలో 127.92 బిలియన్ పీసుల నుంచి 132.35 బిలియన్ పీసులకు వృద్ధి చెందింది’’అని ఆర్బీఐ టెండర్ డాక్యుమెంట్ పేర్కొంది. ఈ పెరిగే అవసరాలకు తగ్గట్టు సదుపాయాలను మెరుగుపరుచుకునే క్రమంలో భాగంగా ఆర్బీఐ ఈవోఐలకు ఆహా్వనం పలికింది. -
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా 352 కి.మీ. మేర రూపు దిద్దుకోనున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు చేరుకొనేందుకు వీలుగా ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ ఆర్) నుంచి గ్రీన్‌ఫీల్డ్ రహదా రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనుంది.రావిర్యాల టు ఆమన్‌గల్ వయా ఫ్యూచర్ సిటీసుమారు 14 వేల ఎకరాల విస్తీ ర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవి ష్యత్తులో ఈ మార్గంలో వాహనా ల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్–13 రావిర్యాల నుంచి ఆర్ఆర్ఆర్ లో ని ఆమన్‌గల్ ఎగ్జిట్ నంబర్–13 వరకు 300 అడుగుల మేర గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనుంది. ఈ మార్గంమొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనుంది. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్డ్, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ, కందుకూరులోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్, ముచ్లెర్ల, యాచారంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమన్‌గల్ మండలంలోని ఆమన్‌గల్, ఆకుతోటపల్లి గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది.916 ఎకరాల భూసమీకరణ..గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. ఇందులో 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూములు ఉండగా 7 కిలోమీటర్లలో 156 ఎకరాలు టీజీఐఐసీ భూములు, కిలోమీటరులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 25.5 కిలో మీటర్ల మేర పట్టా భూములు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ మీదుగా కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డి మీదుగా 194 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండటం తెలిసిందే. -
జహీరాబాద్‌లో ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండ్రస్టియల్ కారిడార్‌లో భాగంగా.. న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా రూ.2,361 కోట్ల వ్యయంతో ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. మొత్తం రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ – ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా..తొలిదశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం అవుతాయి. ఇది జాతీయ రహదారి–65కు 2 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే జహీరాబాద్ రైల్వేస్టేషన్‌కు 19 కిలోమీటర్లు, మెటల్‌కుంట రైల్వేస్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టుకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల స్థలంలో 3,100 (దాదాపు 80%) ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. రాష్ట్రానికి సంబంధించి షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్–మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం లభిస్తుంది. 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందాయి. తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. జహీరాబాద్‌కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో రెండు ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీలు దేశంలో మొత్తం 12 ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లులో రూ.2,786 కోట్ల వ్యయంతో, కొప్పర్తిలో రూ.2,137 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో 31 ఎఫ్ఎం స్టేషన్లు తెలంగాణలో 31, ఆంధ్రప్రదేశ్‌లో 68 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంంగాణలోని ఆదిలాబాద్ (3), కరీంనగర్ (3), ఖమ్మం (3), కొత్తగూడెం (3), మహబూబ్‌నగర్ (3), మంచిర్యాల (3), నల్లగొండ (3), నిజామాబాద్ (4), రామగుండం (3), సూర్యాపేట (3)ల్లో కొత్త ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. -
ఏపీలో రెండు గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు
సాక్షి, న్యూఢిల్లీ: వికసిత్ భారత్ దృష్టితో ఏపీలో రెండు గ్రీన్‌ఫీల్డ్ ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా దేశంలోని 10 రాష్ట్రాల్లో ఆరు ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లలో రూ.28,602 కోట్ల వ్యయంతో 12 ప్రపంచస్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీలో రూ.2,786 కోట్ల వ్యయంతో ఓర్వకల్లులో, రూ.2,137 కోట్లతో కొప్పర్తిలో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇదేకాకుండా ఏపీలో 68 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండూ కర్నూలు జిల్లాలోనే.. కర్నూలు జిల్లాలో కొప్పర్తి ఇండ్రస్టియల్ స్మార్ట్‌సిటీ కర్నూలు ఎయిర్‌పోర్టుకు 11 కిలోమీటర్ల దూరంలో 2,596 ఎకరాల్లో నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.2,137 కోట్లు కాగా, రూ.8,860 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఈ ప్రాజెక్టు ద్వారా పునరుత్పాదక రంగం, ఆటోమొబైల్ పరికరాలు, మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్ వస్తువుల రంగాల్లో 54,500 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా. కాగా.. కర్నూలు ఎయిర్‌పోర్టుకు 12 కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్లులో గ్రీన్‌ఫీల్డ్ ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీ 2,621 ఎకరాల్లో నిర్మాణం కానుంది. నాన్ మెటాలిక్ మినరల్స్, ఆటోమొబైల్ పరికరాలు, పునరుత్పాదక రంగం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏరో స్పేస్, డిఫెన్స్ హార్డ్‌వేర్, ఫార్మాస్యూటికల్స్, జెమ్స్ జ్యువెలరీ, వస్త్ర రంగాల ద్వారా 45,071 మందికి ఉపాధి కల్పించనున్న ఈ ప్రాజెక్ట్‌లో రూ.12 వేల కోట్ల పెట్టుబడికి అవకాశాలున్నాయి.కొత్త ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటు ఇలా..దేశంలోని మొత్తం 234 నగరాల్లో 730 ప్రైవేట్ ఎఫ్ఎం కేంద్రాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఆదోని, అనంతపురం, భీమవరం, చిలకలూరిపేట, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గుంతకల్లు, హిందూపురం, మచిలీపట్నం, మదనపల్లి, నంద్యాల, నరసరావుపేట, ఒంగోలు, ప్రొద్దుటూరు, శ్రీకాకుళం, తాడిపత్రి, విజయనగరం పట్టణాల్లో మూడేసి చొప్పున, కాకినాడ, కర్నూలు పట్టణాల్లో నాలుగు చొప్పున ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. -
గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఆఫీస్ కాల్చివేత
వేముల: వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేతలు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఆఫీసును శనివారం రాత్రి కాల్చివేశారు. టీడీపీ వారు తన ఆఫీసును కాల్చివేసినట్లు కాంట్రాక్టర్ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తాము ఇక్కడ 4 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఏప్రిల్‌లో చేపట్టామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పనులు ఆపివేయాలని, తమకు అప్పజెప్పాలని ఒత్తిడి తెచ్చారaన్నారు.రెండు కిలోమీటర్ల పనులు ఇస్తామని చెప్పినప్పటికీ, నాలుగు కిలోమీటర్లూ తామే చేసుకుంటామని పట్టుబట్టారన్నారు. ఇందుకు తాను ఒప్పుకోకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆదివారం నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా క్యాంప్ ఆఫీసును కాల్చివేశారని తెలిపారు. సుమారు రూ.30 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణలో 3 గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రహదారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్‌మాల పరియోజన–1 కింద గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ మీదుగా మూడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఐదు గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్– విశాఖపట్నం (222 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్, షోలాపూర్ – కర్నూల్ – చెన్నై (329 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఇండోర్–హైదరాబాద్ (525 కి.మీ) యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణం పాక్షికంగా పూర్తయిందని పేర్కొన్నారు. భారత్‌మాల పరియోజన –1 కింద తెలంగాణలో రూ.38,279 కోట్లతో 1,719 కి.మీ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.22,749 కోట్లతో 1,026 కి.మీ. పొడవైన రహదారుల నిర్మాణం జరుగుతోందని గడ్కరీ వివరించారు. -
ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య గ్రీన్‌ఫీల్డ్ రయ్.. రయ్!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది భూసేకరణతో కలిపి రూ.4,609 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను ఖరారు చేయగా.. ఏలూరు జిల్లా పరిధిలో రూ.1,281.31 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. భారతీమాల ప్రాజెక్టులో భాగంగా మంజూరైన ఈ రహదారి నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణతో కాకినాడ పోర్ట్ అనుసంధానం చేయడానికి ఈ ప్రాజెక్టు కీలకమైనదని కేంద్రానికి నివేదించి ఈ ప్రాజెక్ట్ మంజూరు చేయించింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల నుంచి జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.569.37 కోట్లు, గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు రూ.711.94 కోట్లను కేంద్రం కేటాయించింది. 53 కిలోమీటర్లు తగ్గనున్న దూరం ప్రస్తుతం ఖమ్మం–రాజమండ్రి నగరాల మధ్య దూరం 220 కిలోమీటర్లు. దీనిని 167 కిలోమీటర్లకు తగ్గించడానికి ఈ ప్రాజెక్టు కీలకంగా ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూర్తయితే ఖమ్మం–రాజమండ్రి మధ్య దూరం 53 కిలోమీటర్లు తగ్గుతుంది. ఏలూరు జిల్లాలో 72 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం నుంచి కల్లూరు మీదుగా వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నుంచి ఆంధ్రాలో జీలుగుమిల్లిలోకి ప్రవేశించి జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం గోపాలపురం, కొవ్వూరు మీదుగా రాజమండ్రి చేరుకోవాల్సి ఉంటుంది. నూతనంగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ రహదారి ఖమ్మం, సత్తుపల్లికి దూరంగా రేచర్ల నుంచి నేరుగా ఆంధ్రాలోని చింతలపూడి మండలంలో ఎండపల్లి నుంచి రా«ఘవాపురం, రేచర్ల మీదుగా టి.నరసాపరం, గుర్వాయిగూడెం మీదుగా దేవరపల్లి రహదారిలో కలుస్తుంది. భూసేకరణ పూర్తి ఈ రహదారి కోసం మొత్తం 1,411 ఎకరాల భూమి అవసరమవుతోంది. అందులో 114 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా.. 1,297 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఇప్పటికే భూసేకరణ పనులు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. 70 మీటర్ల వెడల్పుతో ఎకనామిక్ కారిడార్‌గా ఈ రహదారిని వర్గీకరించారు. గ్రీన్‌ఫీల్డ్‌తో జిల్లాకు ఉపయోగం గ్రీన్‌ఫీల్డ్ రహదారితో మెట్ట ప్రాంతంలో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. ఆంధ్రా–తెలంగాణ మ«ధ్య నూతన రహదారి వల్ల దూరం తగ్గడమే కాకుండా తెలంగాణ, కాకినాడ పోర్టు అనుసంధానానికి ఉపయోగపడుతుంది. –కోటగిరి శ్రీధర్, ఏలూరు ఎంపీ -
‘మేఘా’కు మంగోలియా ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ మౌలిక సదుపాయాల దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియా మార్కెట్లో అడుగుపెట్టింది. దేశీయంగా తొలి గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని నిర్మించే భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. దీని విలువ 790 మిలియన్ డాలర్లు. మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్వోఏ (లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ)ను అందుకున్నట్లు ఎంఈఐఎల్ తెలిపింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) ప్రాతిపదికన ఈ కాంట్రాక్టు కింద ఓపెన్ ఆర్ట్ యూనిట్లు, యుటిలిటీలు, ప్లాంటు భవంతులు, క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు మొదలైనవి నిర్మించాల్సి ఉంటుందని వివరించింది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ రిఫైనరీలో రోజుకు 30,000 బ్యారెల్స్, ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేయవచ్చు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) తలపెట్టిన భాగస్వామ్య అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో మంగోలియా ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించనుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు, హైడ్రోకార్బన్స్ రంగంలో తమ వ్యాపార విస్తరణ వ్యూహాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా ఉండగలదని కంపెనీ తెలిపింది. దీనితో రష్యన్ ఇంధనంపై మంగోలియా ఆధారపడటం తగ్గుతుందని, అలాగే తమ పెట్రోలియం ఉత్పత్తుల అవసరాలను స్వయంగా తీర్చుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. స్థానికంగా చిన్న పరిశ్రమలు, ప్రజల ఉపాధి అవకాశాల వృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది. -
గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణలో ఉద్రిక్తత
దామెర: నాగపూర్– విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపట్టిన సర్వేలో ఉద్రిక్తత నెలకొంది. తమ భూములను లాక్కోవద్దంటూ ఇద్దరు రైతులు ఆత్మహత్యకు యత్నించారు. హను మకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ, దుర్గంపేట్ రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులు వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా, రైతులు ఆం దోళనలకు దిగుతూ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. శనివారం ఉదయం అధికారులు ఊరుగొండ, దుర్గంపేట్ రెవెన్యూ గ్రామాల్లో తిరిగి సర్వే ప్రారంభించారు. ఏసీపీ శివరా మయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రైతులు పొలాల వద్దకు వెళ్లకుండా 163 జాతీయ రహదారి వద్ద అడ్డుకున్నారు. ఆందోళనలు చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఇతరమార్గాల ద్వారా కొందరు రైతులు అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఊరుగొండకు చెందిన చెల్పూరి అశోక్ అనే రైతు ఉరేసుకోవడానికి యత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఓదెల రజిత అనే మరో మహిళారైతు ఆత్మహత్యే శరణ్యమని, ఇంటిల్లిపాది పురుగులమందు తాగి చనిపోతామంటూ రోదించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, అధికారులు వారికి నచ్చజెప్పి సర్వే కొనసాగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిసరాల్లోని వ్యవసాయబావుల వద్ద, ఎస్సార్ఎస్పీ కెనాల్ వద్ద, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు రెండు 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. -
హరిత ‘హాయి’ వే
సాక్షి, హైదరాబాద్: బీజాపూర్ జాతీయ రహదారిలో భాగంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో కొంతభాగం గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌గా రూపొందనుంది. అంటే.. ఉన్న రహదారిని విస్తరించడం కాకుండా పూర్తిగా కొత్త రోడ్డును నిర్మిస్తారన్న మాట. ఇది దాదాపు 12 కి.మీ.మేర ఉండనుంది. బైపాస్‌లలో భాగంగా ఈ కొత్త రోడ్డు నిర్మాణం జరగనుంది. సాధారణంగా బైపాస్‌లు తక్కువ నిడివి తో ఉంటాయి, కానీ ఇక్కడ రెండు భారీ బైపాస్‌ల ను కిలోమీటర్ల మేర నిర్మిస్తుండటంతో, అంత మేర గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌గా మారనుంది. ఈ ఆలోచన మొయినాబాద్, చేవెళ్లలను నగర శివారు టౌన్‌షిప్‌లుగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిర్మాణాలు తొలగించాల్సిన పని లేకుండా.. నగరం నుంచి మొయినాబాద్, చేవెళ్ల మీదుగా సాగే బీజాపూర్ రోడ్డును భారత్‌మాల పరియోజన పథకంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందు లో 46 కి.మీ. మేర అంటే.. అప్పా కూడలి నుంచి వికారాబాద్ రోడ్డులోని మన్నెగూడ వరకు ఎన్హెచ్ఏఐ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో నాలుగు వరసలుగా విస్తరించనుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు పిలిచింది. నవంబరు 30న వాటిని తెరవాల్సి ఉంది. కానీ మరిన్ని బిడ్లు దాఖలుకు వీలుగా టెండర్ల గడువును మరో నెల పెంచారు. అయితే నగరం నుంచి అప్పా కూడలి వరకు విశాలంగానే ఉన్న రోడ్డు ఆ తర్వాత 25 మీటర్లు, కొన్నిచోట్ల 30 మీటర్లు వెడల్పుతో ఉంది. దాన్ని 60 మీటర్లకు విస్తరించనున్నారు. ప్రధాన రోడ్డు 45 మీటర్లు కాగా, రెండు వైపులా విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ఇతర అవసరా ల కోసం 15 మీటర్ల (రెండువైపులా కలిపి) స్థలం ఉంటుంది. దీన్ని రూ.897 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్నారు. ఇక్కడే రెండు భారీ బైపాస్‌లకు ప్లాన్ చేశారు. ఇప్పటికే మొయినాబాద్ ప్రాంతం బాగా విస్తరించింది. దీంతో ఉన్న రోడ్డును వెడల్పు చేయాలంటే భారీగా నిర్మాణాలను తొలగించాల్సి వస్తుంది. పక్కనుంచే బైపాస్ నిర్మిద్దామంటే కావాల్సినంత స్థలం లేదు. దీంతో నాలుగు కి.మీ. దూరంగా దాదాపు నాలుగున్నర కి.మీ. మేర నాలుగు లైన్ల ప్రధాన క్యారేజ్‌వేను కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుగా నిర్మించాలని నిర్ణయించారు. చేవెళ్ల పట్ట ణం వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పట్టణానికి దూరంగా దాదాపు ఆరున్నర కి.మీ. మేర మరో భారీ బైపాస్‌ను గ్రీన్‌ఫీల్డ్ అలైన్మెంట్ తరహాలో నిర్మించబోతున్నారు. అలాగే మరోచోట చిన్న బైపాస్ రానుంది. ఇలా 46 కి.మీ ఎక్స్‌ప్రెస్ వేలో 12 కి.మీ. మేర పూర్తిగా కొత్త రోడ్డు రాబోతోంది. రెండు పట్టణాలకు మహర్దశ! నగర శివారు ప్రాంతాల్లో కొంతకాలంగా ఆధునిక కాలనీలు వెలుస్తున్నాయి. నగరానికి చేరువగా ఉన్న మొయినాబాద్, చేవెళ్లల్లో ఇప్పటికే ఫామ్‌హౌస్‌ల ఏర్పాటుతో నగరవాసుల మకాం మారుతోంది. ఈ కొత్త రోడ్డుతో ఈ దిశగా పురోగతి మరింత వేగంగా సాగుతుందని భావిస్తున్నారు. పాత రోడ్డు, కొత్త రోడ్డు మధ్య కాలనీల అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది. -
ప్రగతికి ప్రతిబింబంగా అయోధ్య
న్యూఢిల్లీ: ఆలయ నగరి అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై ప్రధాని మోదీ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మన మహోన్నత సంప్రదాయాలు, ఆధునికత మేళవించిన నగరంగా అయోధ్యను తీర్చిదిద్దాలని ఆదేశించారు. మనం సాధిస్తున్న ప్రగతిని అయోధ్య ప్రతిబింబించాలని అన్నారు. వర్చువల్‌గా నిర్వహించిన సమీక్షా సమావేశంలో యూపీ సీఎం యోగి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రతి భారతీయుడి సాంస్కృతిక చైతన్యంలో అయోధ్య నిక్షిప్తమై ఉందని మోదీ గుర్తుచేశారు. ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా, స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయాలని చెప్పారు. అయోధ్యను జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలని భావి తరాలు కోరుకునేలా నగర అభివృద్ధి ప్రణాళిక ఉండాలన్నారు. అన్ని వసతులతో గ్రీన్‌ఫీల్డ్ టౌన్షిప్ అయోధ్య సర్వతోముఖాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను వివరిస్తూ ఉత్తరప్రదేశ్ అధికారులు ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు ప్రతిపాదిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మోదీకి తెలియజేశారు. విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, రోడ్లు, జాతీయ రహదారుల విస్తరణ గురించి వెల్లడించారు. అయోధ్యలో భక్తుల కోసం అన్ని వసతులతో కూడిన గ్రీన్‌ఫీల్డ్ టౌన్షిప్, ఆశ్రమాలు, మఠాలు, హోటళ్లు, వివిధ రాష్ట్రాలకు భవనాల నిర్మాణంపై సమీక్షా సమావేశంలో చర్చించారు. పర్యాటకులను ఆకర్శించే దిశగా టూరిస్టు ఫెసిలిటేషన్ సెంటర్, ప్రపంచ స్థాయి మ్యూజియం నిర్మించాలని నిర్ణయించారు. సరయు నదీ తీరంలో, ఘాట్లలో మౌలిక సదుపాయాలను కల్పనను వేగవంతం చేయాలని, నదిలో పడవ విహారాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయోధ్యలో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనలో యువశక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. శనివారం సమీక్షా సమావేశం అనంతరం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ నగరం ప్రాచీన, ఆధునికతల కలబోతగా మారాలని ఆకాంక్షించారు. -
‘మా సమాధులపై రోడ్డు వేయండి’
సాక్షి, ఖమ్మం: మా భూములు లాక్కుంటే చావుకూడా వెనకాడం, మా శవాలను పూడ్చి సమాధులపై నుంచి రహదారి నిర్మించండి అంటూ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బాధిత రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణకు గాను అధికార యంత్రాంగం చింతకాని మండలం బస్వాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని రైతులతో శుక్రవారం ఉదయం నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలుత రైతులు తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. దీంతో బస్వాపురానికి చెందిన దొబ్బల వెంగళరావు మాట్లాడుతూ.. తమ ప్రాంతం నుంచి గతంలో సాగర్ కాల్వను తీశారని, ఈ క్రమంలో అనేక మంది రైతులు తమ భూములు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకి సైతం అవే రైతులకు సంబంధించిన భూములు కోల్పోవాల్సి వస్తుందని, దీంతో తాము భవిష్యత్తులో ఏమి చేయాలో అర్థంకావటం లేదన్నారు. గతంలో చేసిన అలైన్‌మెంట్‌ను రాజకీయ నాయకులు వారివారి స్వార్థం కోసం మార్చారని ఆరోపించారు. రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా భూములను లాక్కునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం మరికొంతమంది రైతులు మాట్లాడి, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. సామరస్యంగా పరిష్కరించుకుందాం రైతులు అధైర్యపడొద్దని అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు తమవంతుగా ప్రయత్నం చేస్తామని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు. అనంతరం ఎన్హెచ్ఏఐ డిప్యూటీ మేనేజర్ జానకిరామ్ మాట్లాడారు. గతంలో 70మీటర్లు ఉన్న రహదారిని 60మీటర్లకు కుదించటం జరిగిందన్నారు. సాయంత్రం కొదుమూరు గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో ఖమ్మం ఆర్డీఓ రవీంధ్రనా«థ్, చింతకాని తహసీల్దార్ తిరుమలచారి, భూ సేకరణ విభాగం డిప్యూటీ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు. – మధుసూదన్, అదనపు కలెక్టర్ -
ఒక్క సర్వే రాయి వేసినా ఊరుకోం
కొయ్యలగూడెం: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ సర్వే పనుల్లో ఒక్క సర్వే రాయి పడినా సహించేది లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం రాజవరం స మీపంలో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే సర్వే పనుల వద్ద నిరవధిక ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపి వారి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. వందల ఎకరాల్లోని పచ్చని పంటలు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన మద్దతు ధరను ఇవ్వమనడం కూడా ప్రభుత్వానికి తప్పుగా కనిపిస్తోందని, రైతుల కడుపుకొట్టి చంద్రబాబు సర్కార్ కడుతున్న కట్టడాలు కూల్చివేస్తామని బాలరాజు పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం ప్రస్తుత మార్కెట్ విలువను అమలు చేసి దానికి రైతులు కోరుతున్న విధంగా నష్టపరిహారాన్ని అందజేయడానికి ప్రభుత్వానికి ఎందుకు అంత బాధ కలుగుతుందని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులు అధికంగా జీవనాధారమైన భూములు కోల్పోతే వారి బతుకులు, కుటుంబాలు అధోగతిపాలవుతాయని బాలరాజు ఆందోళన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతులు సైతం తమ బాధలను బాలరాజు వద్ద మొరపెట్టుకున్నారు. అనంతరం బాలరాజు జాయింట్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు రావాల్సిందిగా కోరారు. దీంతో ఈనెల 16న రాజవరానికి వచ్చి బాధిత రైతులతో బహిరంగ చర్చావేదికను నిర్వహిస్తామని జేసీ పేర్కొన్నారు. మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మట్టా శ్రీను, దాసరి విష్ణు, మైనార్టీసెల్ జిల్లా కార్యదర్శి ఎస్కే బాజీ, మాజీ సర్పంచ్ పాముల నాగ మునిస్వామి, వైఎస్సార్సీపీ నాయకులు కె.సూరిబాబు, బల్లె నరేష్, చింతలపూడి కిషోర్, గద్దే సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
అన్నను హత్య చేసిన తమ్ముడు
అరకులోయ: భూ తగాదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఏకంగా అన్ననే ఓ వ్యక్తి బుధవారం హత్య చేశాడు. అరకులోయ సీఐ సింహాద్రి నాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అరకులోయ మండలం మాడగడ పంచాయతీ పరిధిలోని మంజగుడలో నలుగురు అన్నదమ్ములు నివసిస్తున్నారు. వీరిలో రెండో వాడైన సమర్థి మదన్‌సుందర్(40), మూడో వాడైన జలంధర్‌కు మధ్య పొలం గట్టు విషయవై గొడవ జరిగింది. తన పొలం గట్టులో కొంతభాగాన్ని కలుపుకొని అన్న మదన్‌సుందర్ నాట్లు వేసుకున్నాడని జలందర్ గొవడకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. జలందర్ పారతో మెడపై నరకడంతో మదన్‌సుందర్ అక్కడికక్కడే మతి చెందాడు. మతుడి భార్య రాధ చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, నింది తుడు పరారీ ఉన్నాడని సీఐ తెలి పారు. మత దేహాన్ని పోస్టుమార్టం పరీక్షల అరకులోయ ఏరి యా ఆస్పత్రికి తరలించారు. -
‘గ్రీన్‌ఫీల్డ్’ను వ్యతిరేకిద్దాం!
భోగాపురం : మన గ్రామాలు, భూములను మనమే రక్షించుకుందాం. అంతా కలిసికట్టుగా గ్రీన్‌ఫీల్డ్‌ను వ్యతిరేకిద్దామని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఆదివారం దల్లిపేట సమీప ంలో అఖిలపక్షం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం భూముల ధరలు పెర గడం, తీర ప్రాంతానికి, జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం, అలాగే విశాఖకు చేరువలో ఉండడంతో ప్రభుత్వం దృష్టి ఎప్పటికప్పుడు మన ప్రాంతంపై పడడం మన దురదృష్టకరమన్నారు. ఒకవైపు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సంతోషించాలో లేక మన భూము లు తీసుకుని మనల్ని నిరాశ్రయుల్ని చేస్తున్న విధానానికి బాధపడాలో అర్థం కావడం లేదని చెప్పారు. 2014 జనవరి 5న నావెల్‌డాక్ యార్డ్‌కి మన స్థలాలు సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను మనం ఏవిధంగా అడ్డుకున్నామో, ఇప్పుడు కూడా అదేవిధంగా ఎయిర్‌పోర్టు నిర్మాణా నికి వచ్చే అధికారులను అడ్డుకోవాలన్నారు. అప్పట్లో 2950 ఎకరాలు కావాలని కంచేరు, కంచేరుపాలెం, గూడెపువలస, బసవపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రామాలను, భూములను స్వాధీనం చేసుకునేందుకు అప్పటి యంత్రాంగం సిద్ధమైంది. దీనిపై 2014, జనవరి 26వ తేదీనహైకోర్టును ఆశ్రయించి ఇక్కడి ప్రజల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువెళ్లడంతో కోర్టు స్టేటస్కో ఇస్తూ రైతుల భూములు యధాతథంగా ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు సైతం ధిక్కరించి ఆ భూములతో పాటు అదనంగా మరో 13000 ఎకరాలు కావాలంటూ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావడం విచారకరమన్నారు. రైతులంతా గతంలోలా నిరసన తెలిపేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. న్యాయబద్దంగా పోరాటం చేసి మన భూములను, గ్రామాలను కాపాడుకోవాలన్నారు. అనంతరం పలువు రు నాయకులు, రైతులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒక్కటిగా ఉద్యమించేందుకు ప్రణాళిక రూపొందించారు. ముందుగా నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, కేంద్రమంత్రి అశోక్, మంత్రి మృణాళిని దృష్టికి సమస్యను వినతిరూపంలో తీసుకువెళ్లి, అనంతరం వారు సానుకూలంగా స్పందించకపోయినట్లయితే వెంటనే ఉద్యమాలు నిర్వహించేందుకు అంతా సిద్ధం కావాలని తీర్మానించారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి గతంలో నాగరికత లేని మా గ్రామాలను అభివృద్ధి చేసింది ఎన్టీఆర్. మా గ్రామాలకు విద్యుత్, తాగునీరు, పాఠశాలలు, రోడ్లు ఆయన హయాం లోనే వచ్చాయి. తిరిగి అదే ప్రభుత్వం మా గ్రామాలను ఎయిర్‌పోర్టు పేరున లాక్కోవడం అన్యాయం. అధికార పార్టీ చెందిన వార మైనా దీన్ని అడ్డుకుంటాం. - దంతులూరి సూర్యనారాయణరాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రాజధాని, ఎయిర్ పోర్టు ఒక్కటి కాదు తూళ్లురులో రాజధాని నిర్మాణానికి భూసేకరణ చేసినట్టు మన మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేయడం సరైన పద్దతి కాదు. మన భూముల ధరలతో పోలిస్తే అక్కడ భూముల ధర చాలా తక్కువ. అలాగే రాజధాని అంటే అందరికీ అవసరమైనది. ఎయిర్‌పోర్టు అంటే ప్రైవేటు సంస్థ. కాబట్టి మా భూములు ఇచ్చేది లేదు. - ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, (కాంగ్రెస్), ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రభుత్వం తీరు సరికాదు హుద్‌హుద్ తుపాను తోటలు, పంటలను నాశనం చేస్తే, ప్రభుత్వం వచ్చి ఏకంగా గ్రామాలను, భూములను ఊడ్చుకుపోతుంది. ఇదెక్కడి న్యాయం. ముందు గా మన జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు మన సమస్యలపై విన్నవిద్దాం. వారు సానుకూలంగా స్పం దిస్తే సరేసరి, లేదంటే ఉద్యమాలు చేసైనా మన గ్రామాలను రక్షించుకుందాం. - కర్రోతు బంగార్రాజు, ఎంపీపీ -
చేజారిన గిరిజన వర్సిటీ !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నవ్యాంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు ప్రకటించిన పది హామీల్లో ఒక్కొక్కటి చే జారిపోతున్నాయి.నేతల చేతగాని తనం, పలువురి స్వార్థ ప్రయోజనాలకు జిల్లాకొచ్చే అరుదైన అవకాశాలు దూరమవుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రభుత్వ వైద్య కళాశాల....ఈ రోజు గిరిజన యూనివర్సిటీ జిల్లాకు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలయ్యేంతవరకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తామన్న చంద్రబాబునాయుడు ప్రైవేటు వైద్య కళాశాలతో సరిపుచ్చారు. జిల్లా ప్రజల ఏళ్ల నాటి గిరిజన యూనివర్సిటీ కలను సాకారం చేస్తామని గొప్పగా చెప్పిన టీడీపీ సర్కార్ ఇప్పుడేమో ప్రతిపాదిత స్థలం సానుకూలంగా లేదని పొరుగు జిల్లాకు తరలించనుంది. దీనికి స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల వైఫల్యమే కారణంగా తెలుస్తోంది. శాసనసభలో చంద్రబాబు ప్రకటించిన వరాలు జిల్లాకు అందకుండా పోతున్నాయి. ఇప్పటికే రెండు చేజారిపోగా మిగతా ఎనిమిదిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చేతిలోకి వచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, గిరిజన యూనివర్సిటీయే చేజారిపోయిందంటే కష్టసాధ్యమైన స్మార్ట్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఫుడ్ పార్క్, పారిశ్రామి నగరం, నౌకాశ్రయం, లలిత కళల అకాడమీ ఏర్పాటు అంత సులువా అనే సంశయం అందరిలో ఏర్పడింది. సర్కార్ చిన్నచూపు ఒకటైతే, మన నేతల వైఫల్యం మరో కారణంగా నిలిచింది. ఒక ట్రస్టుకు కట్టబెట్టేందుకు గాను ప్రభుత్వ వైద్య కళాశాల బదులు ప్రైవేటు కళాశాలను కేటాయించగా, మాన్సాస్ స్థలంలోనే ఏర్పాటు చేయాలన్న ఏకైక లక్ష్యం, మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేయకపోవడంతో గిరిజన యూనివర్సిటీ జిల్లాకు దూరమైన దుస్థితి చోటు చేసుకుంది. దేశంలోనే ప్రతిష్టాత్మక గిరిజన యూనివర్సిటీని జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని, దక్షిణ భారతదేశంలోనే గిరిజన విద్యార్థుల కోసం నిర్మిస్తున్న తొలి విశ్వవిద్యాలయంగా గొప్పలు పలికారు. ఆ మేరకు పాచిపెంట మండలం వేటగానివలస సమీపంలో గల కన్నయ్యవలస, చాపరాయివలస మధ్యలో ఉన్న మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక్కడ సుమారు 3,370 ఎకరాల భూమి ఉండగా, అందులో 500 ఎకరాల వరకు కేటాయించడానికి సుముఖత చూపారు. ఆమేరకు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన కేంద్ర బృందం వచ్చి పరిశీలన కూడా చేసింది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.పి.సిసోడియా, నీలం సహాని,రామ బ్రహ్మం బృందం పూర్తిగా పరిశీలించాక గిరిజన యూనిర్సిటీ ఏర్పాటుకు అనుకూల ప్రాంతంగా తమ అభిప్రాయాన్ని కూడా ఆ సందర్భంలో వ్యక్తం చేసింది. దీంతో గిరిజన యూనివర్సిటీ జిల్లాకే దక్కుతుందని సంతోషించారు. అయితే, ఆ ఆశ అడియాసైంది. పరిశీలించిన వెళ్లిన కేంద్రబృందం తమ అభిప్రాయం మార్చుకుంది. ఇక్కడి స్థలం గిరిజన యూనివర్సిటీకి సానుకూలం కాదని తేల్చి చెప్పేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం జరిగిన ఒక సమావేశంలో వెల్లడించారు. అంతటితో ఆగకుండా విశాఖ జిల్లాలోని సబ్బవరంలో ఉన్న స్థలాన్ని ప్రతిపాదిస్తున్నట్టు తెలియజేశారు. పాచిపెంట మండలంలో ప్రతిపాదించిన స్థలానికి కనెక్టవిటీ లేదని, జిల్లా కేంద్రానికి దూరంగా ఉందని, అన్నీ రకాలుగా సానుకూలమైనది కాదని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు జల్లినట్టుయింది. దీనికీ మన ప్రజాప్రతినిధుల ప్రయత్నం, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేయకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఆరోజే మరో కొన్ని ప్రతిపాదనలు చేసి ఉంటే ఒకటి కాకపోతే మరొకటైనా పరిశీలనలోకి తీసుకునేది. వాస్తవానికైతే, బొండపల్లి, గుర్ల, నెల్లిమర్ల మండలాల్లో అనుకూల స్థలాలున్నా వాటిని ప్రతిపాదించకుండా కేవలం పాచిపెంట మండలంలో ఉన్న మాన్సాస్ భూములను చూపించి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడిదే కొంప ముంచింది. ఆ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించడమే కాకుండా మరో ప్రతిపాదన పంపించే వెసులుబాటును కూడా ఇవ్వలేదు. ఈ సమయంలోనైనా మన కేంద్ర, రాష్ట్ర మంత్రులు , ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్ తదితరులంతా గట్టిగా ఒత్తిడి చేసి ఉంటే ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు అవకాశం ఇచ్చేది. దీంతో జిల్లాలో ఉన్న వేలాది మంది గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మన పాలకులు మేల్కొని మరో ప్రతిపాదనకు అవకాశం ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సి ఉంది.