భోగాపురం : మన గ్రామాలు, భూములను మనమే రక్షించుకుందాం. అంతా కలిసికట్టుగా గ్రీన్‌ఫీల్డ్‌ను వ్యతిరేకిద్దామని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఆదివారం దల్లిపేట సమీప ంలో అఖిలపక్షం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం భూముల ధరలు పెర గడం, తీర ప్రాంతానికి, జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం, అలాగే విశాఖకు చేరువలో ఉండడంతో ప్రభుత్వం దృష్టి ఎప్పటికప్పుడు మన ప్రాంతంపై పడడం మన దురదృష్టకరమన్నారు. ఒకవైపు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సంతోషించాలో లేక మన భూము లు తీసుకుని మనల్ని నిరాశ్రయుల్ని చేస్తున్న విధానానికి బాధపడాలో అర్థం కావడం లేదని చెప్పారు.
2014 జనవరి 5న నావెల్‌డాక్ యార్డ్‌కి మన స్థలాలు సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను మనం ఏవిధంగా అడ్డుకున్నామో, ఇప్పుడు కూడా అదేవిధంగా ఎయిర్‌పోర్టు నిర్మాణా నికి వచ్చే అధికారులను అడ్డుకోవాలన్నారు. అప్పట్లో 2950 ఎకరాలు కావాలని కంచేరు, కంచేరుపాలెం, గూడెపువలస, బసవపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రామాలను, భూములను స్వాధీనం చేసుకునేందుకు అప్పటి యంత్రాంగం సిద్ధమైంది. దీనిపై 2014, జనవరి 26వ తేదీనహైకోర్టును ఆశ్రయించి ఇక్కడి ప్రజల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువెళ్లడంతో కోర్టు స్టేటస్‌కో ఇస్తూ రైతుల భూములు యధాతథంగా ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు సైతం ధిక్కరించి ఆ భూములతో పాటు అదనంగా మరో 13000 ఎకరాలు కావాలంటూ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావడం విచారకరమన్నారు. రైతులంతా గతంలోలా నిరసన తెలిపేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
న్యాయబద్దంగా పోరాటం చేసి మన భూములను, గ్రామాలను కాపాడుకోవాలన్నారు. అనంతరం పలువు రు నాయకులు, రైతులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒక్కటిగా ఉద్యమించేందుకు ప్రణాళిక రూపొందించారు. ముందుగా నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, కేంద్రమంత్రి అశోక్, మంత్రి మృణాళిని దృష్టికి సమస్యను వినతిరూపంలో తీసుకువెళ్లి, అనంతరం వారు సానుకూలంగా స్పందించకపోయినట్లయితే వెంటనే ఉద్యమాలు నిర్వహించేందుకు అంతా సిద్ధం కావాలని తీర్మానించారు.
టీడీపీ హయాంలోనే అభివృద్ధి
గతంలో నాగరికత లేని మా గ్రామాలను అభివృద్ధి చేసింది ఎన్‌టీఆర్. మా గ్రామాలకు విద్యుత్, తాగునీరు, పాఠశాలలు, రోడ్లు ఆయన హయాం లోనే వచ్చాయి. తిరిగి అదే ప్రభుత్వం మా గ్రామాలను ఎయిర్‌పోర్టు పేరున లాక్కోవడం అన్యాయం. అధికార పార్టీ చెందిన వార మైనా దీన్ని అడ్డుకుంటాం.
- దంతులూరి సూర్యనారాయణరాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్
రాజధాని, ఎయిర్ పోర్టు ఒక్కటి కాదు
తూళ్లురులో రాజధాని నిర్మాణానికి భూసేకరణ చేసినట్టు మన మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేయడం సరైన పద్దతి కాదు. మన భూముల ధరలతో పోలిస్తే అక్కడ భూముల ధర చాలా తక్కువ. అలాగే రాజధాని అంటే అందరికీ అవసరమైనది. ఎయిర్‌పోర్టు అంటే ప్రైవేటు సంస్థ. కాబట్టి మా భూములు ఇచ్చేది లేదు.
- ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, (కాంగ్రెస్), ఏఎంసీ మాజీ చైర్మన్
ప్రభుత్వం తీరు సరికాదు
హుద్‌హుద్ తుపాను తోటలు, పంటలను నాశనం చేస్తే, ప్రభుత్వం వచ్చి ఏకంగా గ్రామాలను, భూములను ఊడ్చుకుపోతుంది. ఇదెక్కడి న్యాయం. ముందు గా మన జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు మన సమస్యలపై విన్నవిద్దాం. వారు సానుకూలంగా స్పం దిస్తే సరేసరి, లేదంటే ఉద్యమాలు చేసైనా మన గ్రామాలను రక్షించుకుందాం.
- కర్రోతు బంగార్రాజు, ఎంపీపీ
‘గ్రీన్‌ఫీల్డ్’ను వ్యతిరేకిద్దాం!
Published Mon, Mar 23 2015 3:41 AM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
Advertisement
Advertisement