![Two Farmers Commit For End Life In Hanamkonda District - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/6/05PRKL251-330139_1_31.jpg.webp?itok=muOsAOTy)
భూములు లాక్కోవద్దంటూ రోదిస్తున్న రైతులు
దామెర: నాగపూర్– విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపట్టిన సర్వేలో ఉద్రిక్తత నెలకొంది. తమ భూములను లాక్కోవద్దంటూ ఇద్దరు రైతులు ఆత్మహత్యకు యత్నించారు. హను మకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ, దుర్గంపేట్ రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులు వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా, రైతులు ఆం దోళనలకు దిగుతూ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు.
శనివారం ఉదయం అధికారులు ఊరుగొండ, దుర్గంపేట్ రెవెన్యూ గ్రామాల్లో తిరిగి సర్వే ప్రారంభించారు. ఏసీపీ శివరా మయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రైతులు పొలాల వద్దకు వెళ్లకుండా 163 జాతీయ రహదారి వద్ద అడ్డుకున్నారు. ఆందోళనలు చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఇతరమార్గాల ద్వారా కొందరు రైతులు అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఊరుగొండకు చెందిన చెల్పూరి అశోక్ అనే రైతు ఉరేసుకోవడానికి యత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఓదెల రజిత అనే మరో మహిళారైతు ఆత్మహత్యే శరణ్యమని, ఇంటిల్లిపాది పురుగులమందు తాగి చనిపోతామంటూ రోదించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, అధికారులు వారికి నచ్చజెప్పి సర్వే కొనసాగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిసరాల్లోని వ్యవసాయబావుల వద్ద, ఎస్సార్‌ఎస్పీ కెనాల్ వద్ద, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు రెండు 108 వాహనాలను అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment