9 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం
ఈ రోడ్ల మొత్తం పొడవు 216.9 కిలోమీటర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా 352 కి.మీ. మేర రూపు దిద్దుకోనున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు చేరుకొనేందుకు వీలుగా ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ ఆర్) నుంచి గ్రీన్‌ఫీల్డ్ రహదా రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనుంది.
రావిర్యాల టు ఆమన్‌గల్ వయా ఫ్యూచర్ సిటీ
సుమారు 14 వేల ఎకరాల విస్తీ ర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవి ష్యత్తులో ఈ మార్గంలో వాహనా ల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రతిపాదించింది. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్–13 రావిర్యాల నుంచి ఆర్‌ఆర్‌ఆర్ లో ని ఆమన్‌గల్ ఎగ్జిట్ నంబర్–13 వరకు 300 అడుగుల మేర గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనుంది. ఈ మార్గంమొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనుంది. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్డ్, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ, కందుకూరులోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్‌ఖాన్‌పేట్, ముచ్లెర్ల, యాచారంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమన్‌గల్ మండలంలోని ఆమన్‌గల్, ఆకుతోటపల్లి గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది.
916 ఎకరాల భూసమీకరణ..
గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. ఇందులో 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూములు ఉండగా 7 కిలోమీటర్లలో 156 ఎకరాలు టీజీఐఐసీ భూములు, కిలోమీటరులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 25.5 కిలో మీటర్ల మేర పట్టా భూములు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ మీదుగా కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డి మీదుగా 194 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment