అబార్షన్‌.. కిరాయి హత్యే: పోప్‌ ఫ్రాన్సిస్‌ | Pope Francis compares abortion to hiring a hitman | Sakshi
Sakshi News home page

అబార్షన్‌.. కిరాయి హత్యే: పోప్‌ ఫ్రాన్సిస్‌

Published Thu, Oct 11 2018 5:20 AM | Last Updated on Thu, Oct 11 2018 5:20 AM

Pope Francis compares abortion to hiring a hitman - Sakshi

వాటికన్‌ సిటీ: గర్భవిచ్చిత్తి అంటే కిరాయి హత్యతో సమానమని పోప్‌ ఫ్రాన్సిస్‌ వ్యాఖ్యానించారు. అబార్షన్‌కు పాల్పడటమంటే కిరాయి హంతకుడి సాయంతో ఒకరిని అంతం చేయడమేనని పోప్‌ ఫ్రాన్సిస్‌ అన్నారు. బుధవారం వాటికన్‌ సిటీలో ప్రార్థనల సందర్భంగా భక్తులనుద్దేశించి ప్రసంగం సందర్భంగా పోప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధాలు, స్వార్ధంతో చేసే దారుణాలు, అబార్షన్లు ఇలాంటివన్నీ ఓకే తరహావి. అభంశుభం తెలియని ఓ పసి ప్రాణాన్ని చంపేస్తున్న అబార్షన్‌ను ఎలా మనం శాస్త్రీయమైన విధానంగా చెప్పగలం? ఏ ప్రాతిపదికన సమాజంలో, మానవీయతలో అబార్షన్‌కు చోటివ్వగలం? ’ అని పోప్‌ ప్రశ్నించారు. అర్జెంటీనాలో అబార్షన్‌ను చట్టబద్ధంచేస్తూ తెస్తున్న ఓ బిల్లును సైతం పోప్‌ ఇటీవల తీవ్రంగా వ్యతిరేకించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement