
సాక్షి, నల్గొండ : పరువు కోసం తన భర్తను హత్య చేయించిన తండ్రి స్టేటస్ పోయిందని, అదే సమయంలో ప్రేమ కోసం ప్రాణ త్యాగం చేసినందుకు ప్రణయ్ వ్యాల్యూ ఎంతో పెరిగిందని భార్య అమృత వర్షిణి పేర్కొంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘పరువు పిచ్చి, కుల పిచ్చి ఉన్నవాళ్లకు మానవత్వం ఉండదు. అలాంటి వాళ్లను క్షమించి వదిలేస్తారని నేను అనుకోవటం లేదు. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేయటానికి.. ముఖ్యంగా ప్రణయ్ ఆశయమైన క్యాస్టిజంపై పోరాటం చేయటానికి నేను స్ట్రాంగ్‌గా ఉండాలి.
ప్రణయ్ నన్ను స్ట్రాంగ్‌గా ఉండమని చెబుతూ ఉండేవాడు. తనను చంపేస్తారని తెలిసికూడా.. కొద్దిరోజులైనా నీతో కలిసి ఉండొచ్చు కదా! అని అన్నాడు. తనెప్పుడు డేరింగ్‌గానే ఉండేవాడు. ప్రణయ్ లాగే ఉందామనుకుంటున్నాను. అత్తగారింట్లోనే ఉండాలని డిసైడ్ అయ్యాను. ప్రణయ్ బేబీకి జన్మనిచ్చి తనలో ప్రణయ్‌ని చూసుకుంటాను. మిర్యాలగూడ సెంటర్‌లో ప్రణయ్ విగ్రహం పెట్టాలి. ఎవరెవరివో పెడుతున్నారు. చనిపోతానని తెలిసి కూడా ప్రేమ కోసం తన ప్రాణాలు వదిలాడు. ఒక వేళ ప్రణయ్ గాయాలతో బయటపడి బతికుంటే నా గురించే ఆలోచించేవాడ’’ని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment