tractor overturns
-
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడు నుంచి పొన్నూరు మండలం జూపూడి ఫంక్షన్ కి ట్రాక్టర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు..మిక్కిలి నాగమ్మ, మామిడి.జాన్సీరాణి, కట్టా.నిర్మల, గరికపూడి.మేరిమ్మ, గరికపూడి.రత్నకుమారి, గరికపూడి.సుహొసినిగా గుర్తించారు. చదవండి:ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి -
పంట అమ్ముకుని వస్తుండగా నదిలో పడ్డ ట్రాక్టర్.. 20మంది రైతులు..!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 20 మంది రైతులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ వంతెనపై నుంచి గర్రా నదిలో పడిపోయింది. ఈ ప్రమాందంలో ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. మరో 14 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన బాధితుడు ముకేశ్‌గా గుర్తించినట్లు తెలిపారు హర్దోయ్ జిల్లా మేజిస్ట్రేట్ అవినాశ్ కుమార్. ‘ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తున్న 20 మంది గర్రా నదిలో పడిపోయినట్లు సమాచారం అందింది. వారిలోంచి 14 మందిని సురక్షితంగా కాపాడారు. ముకేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలిస్తున్నా’మని తెలిపారు అవినాశ్ కుమార్. సంఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీఏసీ బలగాలను మోహరించినట్లు చెప్పారు. ట్రాక్టర్, ట్రాలీని స్వాధీనం చేసుకున్నామని, గల్లంతైన వారందరినీ వెలికితీసిన తర్వాతే ఆపరేషన్ పూర్తవుతుందన్నారు. ఏం జరిగింది? బెగ్రాజ్‌పుర్ గ్రామానికి చెందిన రైతులు తమ పంటను సమీపంలోని మార్కెట్లో విక్రయించి ట్రాక్టర్లో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పాలీ ప్రాంతంలో గర్రా నదిపై ఉన్న వంతెనపైకి రాగానే ట్రాక్టర్ టైర్ పేలింది. దీంతో అదుపు తప్పి ట్రాక్టర్ నదిలోకి దూసుకెళ్లింది. #UttarPradesh: Twenty people riding on a tractor-trolley fell into the #Garra river after the driver lost control of the vehicle and it fell off the bridge in #Hardoi on Saturday, officials said. Six people are missing in the tragedy. pic.twitter.com/sy5MYbfJmJ — Siraj Noorani (@sirajnoorani) August 27, 2022 ఇదీ చదవండి: భయానక రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి -
ట్రాక్టర్ ట్రక్ బోల్తా : 15 మహిళలకు గాయాలు
గూడూరు : బంధువు మృతి చెందటంతో చూసేందుకు ట్రాక్టర్ వెళ్లి తిరిగి వస్తుండగా ట్రక్ బోల్తాపడి 15 మంది మహిళలు గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కొండాగుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఓజిలి మండలం సగుటూరుకు చెందిన పలువురు మహిళలు గూడూరు రూరల్ మండలం చెన్నూరులో తమ బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా కొండాగుంట సమీపంలో చప్టా వద్ద ట్రాక్టర్ నుంచి ట్రక్ లింక్ విడిపోయి బోల్తాపడి పడింది. ఈ సంఘటనలో జీ చెంగమ్మ, మహాలక్ష్మమ్మ, కాంతమ్మ, చెంగమ్మ, అంకమ్మ, మస్తానమ్మతో పాటు మరో తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారు. రెండు 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ట్రాక్టర్ బోల్తా.. యువతి మృతి
ఆదిలాబాద్ : వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువతి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూరు మండలం భూతాయి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి వస్తున్న ట్రాక్టర్ గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కామ్లే జ్యోతి(19) అనే యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా: 10మందికి గాయాలు
బుచ్చయ్యపేట (విశాఖపట్నం) : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం విశాఖపట్నం జిల్లా బచ్చయ్యపేట మండలం బంగారమ్మ జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన పెళ్లి బృందం పెళ్లి కూతురికి సారె తీసుకెళ్తుండగా..ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
పొలంలో ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్ మృతి
వీణవంక (కరీంనగర్) : పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పల్టీ కొట్టి డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన లడిగె రాము(30) మండలంలోని కొండపాక గ్రామానికి చెందిన ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం పొలం దున్నటానికి వెళ్లాడు. నాటుదుక్కి చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వెనక్కి పల్టీ కొట్టింది. ట్రాక్టర్‌పై ఉన్న రాము పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా: పదిమందికి గాయాలు
సింహాద్రిపురం (వైఎస్సార్ జిల్లా) : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం రావలకొలను గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. తొండూరు నుంచి బానుకోటకు పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ రావలకొలను వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ బోల్తా: 8 మందికి గాయాలు
ఆత్మకూరు (నెల్లూరు జిల్లా) : ఆత్మకూరు మండలం బోగేరు వద్ద గురువారం ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లక్కరాజుపల్లి గ్రామానికి చెందిన 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రాక్టర్ బోల్తా : రైతు మృతి
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : దమ్ము చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గోల్‌యాతండాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బోడ భీమా(35) తన సొంత ట్రాక్టర్ సహాయంతో కిరాయిలు చేస్తూ తన పొలాన్ని సాగు చేస్తున్నాడు. కాగా గురువారం తన పొలంలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. కాగా ట్రాక్టర్‌ను బయటకు తీసే క్రమంలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న బోడ భీమా బురదలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బురదలో నుంచి వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించి సానుభూతి ప్రకటించారు. -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా
పెద్దదోర్నాల : ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం పరిధిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పారిశుద్ధ్య కార్మికులు మండలంలోని చింతల గ్రామంలో పారిశుద్ధ్య పనులు చూసుకుని మంగళవారం సాయంత్రం శ్రీశైలం వైపు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పెద్దమూల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్మికులు కిరణ్, రత్నం, వెంగళరావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ బోల్తా : ఏడో తరగతి విద్యార్థి మృతి
గుంటూరు (మంగళగిరి) : ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని చినకాకాని గ్రామానికి చెందిన గుమ్మా వలిరాజు(14) తన బంధువుల ట్రాక్టర్‌పై పొలానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాలువ గట్టు వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో దాని కింద పడి వలిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. వలి రాజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. -
ఇటుకల ట్రాక్టర్ బోల్తా : కూలీ మృతి
రామకుప్పం (చిత్తూరు) : సిమెంటు ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మండలంలోని శాంతిపురం నుంచి వీర్నమల గ్రామం వైపు వెళ్తున్న సిమెంట్ ఇటుకల ట్రాక్టర్ వీర్నమల వద్ద బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌పై ఉన్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కూలీ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
ట్రాక్టర్ బోల్తా: 10 మంది కూలీలకు గాయాలు
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రుబావి సమీపంలో మిరప కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బుధవారం ఉదయం బోల్తా పడింది. ఆ ఘటన 10 మంది కూలీలు గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ట్రాక్టర్ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. -
ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు కూలీలు మృతి
కర్నూలు జిల్లా గడివేముల మండలం ఇందుట్ల గ్రామ సమీపంలో శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడిన కూలీలలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. డ్రైవర్ వేగంగా ట్రాక్టర్‌ను నడపడం వల్లే ఆ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షలు వెల్లడించారు.