ఇటుకల ట్రాక్టర్ బోల్తా : కూలీ మృతి | One dies as Tractor overturns | Sakshi
Sakshi News home page

ఇటుకల ట్రాక్టర్ బోల్తా : కూలీ మృతి

Published Mon, Aug 3 2015 5:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

One dies as Tractor overturns

రామకుప్పం (చిత్తూరు) : సిమెంటు ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

మండలంలోని శాంతిపురం నుంచి వీర్నమల గ్రామం వైపు వెళ్తున్న సిమెంట్ ఇటుకల ట్రాక్టర్ వీర్నమల వద్ద బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌పై ఉన్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కూలీ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement