ట్రాక్టర్ ట్రక్ బోల్తా : 15 మహిళలకు గాయాలు
గూడూరు : బంధువు మృతి చెందటంతో చూసేందుకు ట్రాక్టర్ వెళ్లి తిరిగి వస్తుండగా ట్రక్ బోల్తాపడి 15 మంది మహిళలు గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కొండాగుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఓజిలి మండలం సగుటూరుకు చెందిన పలువురు మహిళలు గూడూరు రూరల్ మండలం చెన్నూరులో తమ బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా కొండాగుంట సమీపంలో చప్టా వద్ద ట్రాక్టర్ నుంచి ట్రక్ లింక్ విడిపోయి బోల్తాపడి పడింది. ఈ సంఘటనలో జీ చెంగమ్మ, మహాలక్ష్మమ్మ, కాంతమ్మ, చెంగమ్మ, అంకమ్మ, మస్తానమ్మతో పాటు మరో తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారు. రెండు 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.