Guduru
-
పార్టీ కోసం కష్టపడే వారిని జగన్ గుర్తుపెట్టుకుంటారు..
-
తిరుపతి జిల్లా గూడూరులో దారుణం
-
చంద్రబాబుకు తమ ఉసురు తగులుతుందంటున్న పెన్షనర్లు
-
ఏమైంది తల్లీ? కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ..
సాక్షి, తిరుపతి: తుపాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం గూడూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఆయన ఏరియల్ సర్వే చేశారు. ఆపై క్షేత్ర స్థాయిలో పర్యటించి వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. బాధితుల కష్టాలు విని చలించిపోయారు. అన్నదాతల కన్నీళ్లు తుడుస్తూ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. వాకాడు మండలంలోని తొమ్మిది గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా స్వర్ణముఖి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలు తిరిగి వేసుకునేందుకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీఎం ప్రకటనపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాళెం పరిధిలో కోతకు గురైన స్వర్ణముఖి నది లోలెవల్ కాజ్వే, వరి పంటలను పరిశీలించి ఆవేదనకు లోనయ్యారు. కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే వరప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షులు నేదురమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వాకాడు మాజీ ఏఎంసీ చైర్మన్ కొడవలూరు దామోదర్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బారులుదీరిన అభిమానం! ముఖ్యమంత్రి వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు విద్యానగర్ నుంచి బాలిరెడ్డిపాళెం వరకు బారులు తీరారు. తమ రాకకోసం నిరీక్షిస్తున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి వారిని ఆప్యాయంగా పలకరించారు. రైతుల ఆవేదనను స్వయంగా విని చలించిపోయారు. వృద్ధురాలి కన్నీటిని తుడుస్తూ.. ‘ఏడ్వకవ్వా.. నేనున్నాను’ అంటూ భరోసానిచ్చారు. మానవత్వంతో స్పందించిన తీరుని చూసి వృద్ధురాలు సీఎం ముఖాన్ని పట్టుకుని ‘నువ్వ చల్లంగా ఉండాలి నాయనా’ అంటూ దీవెనలందించారు. అక్కడే ఉన్న స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ‘జగన్ మామయ్యా.. జగన్ మామయ్యా’ అంటూ దీనంగా తనవంక చూసి అరుస్తున్న చిన్నారుల వద్దకు వెళ్లి బుగ్గలు నిమిరారు. ‘బాగా చదువుకో’ అంటూ ముందుకు కదిలారు. ముఖాముఖి సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తీసుకుని వాటి పరిష్కరించాలని కలెక్టర్‌ని ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. శరవేగంగా సాగుతున్న సహాయక చర్యలపై సీఎం నేరుగా ప్రజలతో మాట్లాడి వారి నుంచి వివరాలు తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు అందించే నిత్యావసర సరుకుల పంపిణీపైనా ఆరా తీశారు. విద్యుత్, రహదారులు, తాగునీటి సౌకర్యం పునరుద్ధరణ, పంట నష్టం అంచనాకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగిన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య తమ నియోజకవర్గాల్లో జరిగిన నష్టాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎంకు ఘన స్వాగతం.. వాకాడు మండలం, బాలిరెడ్డిపాళెం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి కోట మండలం, విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి తానేటి వనిత ఉన్నారు. కాగా హెలీప్యాడ్ వద్ద మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు ఎమ్మెల్యేలు వరప్రసాద్‌రావు, సంజీవయ్య, మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, బల్లి కల్యాణచక్రవర్తి, వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఇవి చదవండి: అపోహలొద్దు.. ఆదుకుంటాం -
మనుబోలు–గూడూరు మధ్య రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/మనుబోలు: విజయవాడ డివిజన్లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు–తిరుపతి జిల్లా గూడూరు మధ్య మూడవ రైల్వే లైను పనుల్లో భాగంగా గూడూరు సమీపంలోని పంబలేరు నదిపై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) నిర్మించిన పొడవైన రైల్వే ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించారు. మనుబోలు–గూడూరు మధ్య సుమారు 10 వరకూ కాలువలు, ఏర్లు ఉన్నాయి. వీటిలో గూడూరు సమీపంలోని పంబలేరు పెద్దది. దీంతో పాటు సమీపంలోని కొన్ని కాలువలను కలుపుకుని 2.2 కిలోమీటర్ల దూరంతో అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ రైల్వే ఫ్లైఓవర్ దక్షణ మధ్య రైల్వేలో 7వ పెద్ద ఆర్వోఆర్గా నిలిచిందని రైల్వే అధికారులు తెలిపారు. జోన్లో అతి పొడవైన ఆర్వోఆర్ కూడా ఇదేనని పేర్కొన్నారు. దీని నిర్మాణంలో హైగ్రేడ్ కాంక్రీట్, స్ట్రక్చరల్ స్టీల్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ సింగిల్ లైన్ వంతెన రెండు దిశలలో రైళ్ల కదలికల కోసం రూపొందించారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను సులభతరం చేయడానికి ఈ ఫ్లైఓవర్ ఉపకరిస్తుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల గూడూరు స్టేషన్ మీదుగా విజయవాడ నుంచి రేణిగుంట, చెన్నై మధ్య ఏకకాలంలో నడిచే రైళ్ల రాకపోకలకు ఇక అంతరాయం ఉండదు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే ఫ్లైఓవర్‌ను నిరి్మంచడంలో కృషి చేసిన రైల్వే అధికారులు, ఆర్వీఎన్ఎల్ సంస్థ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. -
పేదరికంతో పోరాడి.. వైకల్యంతో ఎదురీది.. విజేతగా నిలిచిన భాగ్య
ఆమె పేరులో భాగ్యం ఉంది. ఆ భాగ్యం జీవితంలో కొరవడింది. ఆమె పేదరికంతో పోరాడింది. శారీరక వైకల్యంతో ఎదురీదింది. సమాజంలో విజేతగా నిలిచింది. అభినందనలు అందుకుంటోంది. తమిళనటి, నర్తకి సుధాచంద్రన్ ఒక అద్భుతం. నాట్య మయూరిగా పేరు తెచ్చుకుంది. నెమలిలా నాట్యం చేసే ఆమెతో విధి వింత నాటకం ఆడింది. ఒక కాలిని తీసుకెళ్లింది. ఆమె నిర్ఘాంతపోయింది. నడవడమే కష్టం అనుకున్న స్థితి నుంచి కోలుకుని కృత్రిమ కాలితో నాట్యం చేసింది. మన తెలుగు నాట్య మయూరితో విధి మరింత ఘోరంగా ఆటలాడుకుంది. ఆమెను ఒక్క కాలితోనే భూమ్మీదకు పంపించింది. డాన్స్ చేయాలంటే రెండు కాళ్లు ఉంటే మంచిదే... కానీ లేదని ఊరుకోవడమెందుకు? ఒక కాలు లేకపోతేనేం... మరో కాలుందిగా... అంటూ డాన్స్ చేస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం గెలిచాయి. తెలంగాణ జానపద కళలంటే ప్రాణం పెట్టే భాగ్య అందులోనే ఎం.ఏ చేస్తోంది. తన విజయగాధను సాక్షితో పంచుకుంది. బస్సులు మారలేక... ‘‘మాది మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామం. అమ్మ కూలిపనులకు వెళ్తుంది. నాన్న మేకలు కాస్తాడు. అన్న, నేను ఇద్దరం పిల్లలం. నేను పుట్టడమే ఒక విచిత్రం. బిడ్డ ఒక కాలు లేకుండా పుట్టిందని ఊరంతా వచ్చి చూశారట. ఆ తర్వాత నేను పెరగడం, చదువు, డాన్స్ నేర్చుకోవడం... అన్నీ విచిత్రంగానే గడిచాయి. సెవెన్త్ క్లాస్ వరకు వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, పెద్ద కొర్పోల్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత హన్మకొండలో సాగింది. ఇంటర్ ప్రైవేట్ కాలేజ్‌లో చదివించడం డబ్బుండి కాదు. ప్రభుత్వ కాలేజ్‌కి రెండు బస్సులు మారి వెళ్లాల్సి ఉండింది. నేనలా వెళ్లలేనని ప్రైవేట్ కాలేజ్‌లో చేర్చారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్‌లో డిగ్రీ చేసి, ఇప్పుడు హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎం.ఏ. చేస్తున్నాను. ఇంతకీ నేను డాన్సర్‌గా మారిన వైనం మరీ విచిత్రం. బాలెన్స్కి నెల పట్టింది నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు జరిగిందా విచిత్రం. ప్రముఖ డాన్సర్ లారెన్స్ మాస్టారి ఆలోచన నన్ను డాన్సర్‌ని చేసింది. ఆయన దగ్గర పని చేసిన ప్రశాంత్ మాస్టారు స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకు డాన్స్ నేర్పించడానికి మేమున్న హాస్టల్‌కి కూడా వచ్చారు. అలా అప్పుడు వాళ్లు పదిమందికి పైగా స్టూడెంట్స్‌ని సేకరించి డాన్స్ క్లాసులు మొదలు పెట్టారు. వారిలో స్టేజ్ మీద ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరింది ముగ్గురమే. అప్పటివరకు కర్ర లేకుండా నిలబడగలమనే ఊహ కూడా లేని వాళ్లమే అందరం. మొదట ఒక కాలి మీద దేహాన్ని బాలెన్స్ చేయడం సాధన చేశాం. బాలెన్స్ సాధించడానికి నెల పట్టింది. సినిమా పాటలు, జానపద నృత్యం, బతుకమ్మ పాటలు ప్రాక్టీస్ చేశాను. ఆ కోర్సు తర్వాత కూడా సొంతంగా కొన్ని పాటలకు సాధన చేశాను. టీవీ ప్రోగ్రామ్‌లలో కూడా డాన్స్ చేశాను. దసరా ఉత్సవాలు, వినాయక చవితి, ఇతర సమావేశాల్లో అవకాశాలను వెతుక్కుంటూ నాట్యం చేస్తున్నాను. శివరాత్రికి వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడిలో కూడా నాట్యం చేశాను. ఇక్కడ మరో విచిత్రం... ఏమిటంటే, సిట్టింగ్ వాలీబాల్ ఆడే అవకాశం వచ్చింది. ఈ ఆటకు మన దగ్గర పెద్దగా ఆదరణ లేదు. రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్నాటకల్లో జరిగిన పోటీలకు హాజరయ్యాను. థాయ్‌లాండ్‌లో జరిగే పోటీలకు ఎంపిక ప్రక్రియలో నెగ్గాను. మనదేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ కరోనా కారణంగా వెళ్లలేకపోయాను. తెలంగాణ ఆట పాట ఫోక్ ఆర్ట్స్ కోర్సులో భాగంగా డప్పు, జానపదగేయాలు, కర్రసాము, చెక్క భజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకున్నాను. బతుకమ్మ పాటలను సేకరించి పాడాను. ఇతర పాటలు పాడే అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డాన్స్‌లో కూడా నిరూపించుకుంటాను. నాకు సీటు ఇచ్చేటప్పుడు సీటు వృథా అవుతుందేమోనని సందేహించిన యూనివర్సిటీనే ఇప్పుడు నాకు అండగా నిలిచింది. నేను ఎవరికీ భారం కాకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను ఇంతవరకు నడిపించింది’’ అని చెప్పింది భాగ్య. సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యం ఆమె సొంతం. ఆడపిల్లలకు ధైర్యం ఒకింత ఎక్కువగా ఉండాలని చెప్తోంది. బాలికలకు కర్రసాము నేర్పించి ధీరలుగా మలవాలనే ఆమె ఆశయం, జానపదానికి సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష నెరవేరాలి. కొత్త అడుగులు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శన నా జీవితాన్ని కొత్తగా రాసింది. డిసెంబర్ మూడవ తేదీ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్’. ఆ సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో నాలుగు రోజుల ముందు నుంచి ఆటలు, డాన్స్ ప్రోగ్రామ్‌లు జరిగాయి. నా డాన్స్ ఫొటోలు పేపర్లో వచ్చాయి. ఆ పేపర్ చూసి మా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కిషన్‌రావు సర్ నన్ను పిలిచి మాట్లాడారు. మా ఆర్థిక పరిస్థితి, గవర్నమెంట్ పెన్షన్‌తో హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నానని తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలియదు, వీసీ సర్, రిజిస్ట్రార్ సర్ కలిసి మూడు లక్షల నిధులు సేకరించి, జర్మనీ నుంచి డాన్స్ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్ లెగ్‌ను తెప్పించి పెట్టించారు. ఇప్పుడు ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేస్తున్నాను. నడక మీద పట్టు వచ్చిన తర్వాత డాన్స్ చేస్తాను. – వాకా మంజులారెడ్డి -
కాలేజీ యాజమాన్యం వేధించి చంపేసింది..
గూడూరు: ‘మా బిడ్డ సౌమ్యుడు. ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదు. ఫీజుల విషయంలోనే యాజమాన్యం వేధించి చంపేసింది..’ అంటూ తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విద్యార్థి ధరణేశ్వర్‌రెడ్డి (21) బంధువులు, తల్లిదండ్రులు ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం నారేపల్లి గ్రామానికి చెందిన ఓబుల్‌రెడ్డి వెంకటకృష్ణారెడ్డి, గంగమ్మ కుమారుడు ధరణేశ్వర్‌రెడ్డి శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం కళాశాల వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డను కళాశాల యాజమాన్యమే చంపేసిందంటూ కళాశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువుల రోదన అందరినీ కలచివేసింది. కళాశాల యాజమాన్యమే తమ బిడ్డను పొట్టనబెట్టుకుందంటూ విలపించారు. తాము గూడూరు వచ్చేవరకు కూడా ఆగకుండానే మృతదేహాన్ని హాస్టల్ గది నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డను చంపేసి, కుటుంబకలహాల కారణంగానే అంటూ కట్టుకథ అల్లి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో యాజమాన్యం వేధించిందని, తమవద్ద సీసీ కెమెరాల పుటేజీ ఆధారాలున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మృతుడి బంధువులు సమీపంలోనే ఉన్న హాస్టల్లోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. 1వ పట్టణ ఎస్ఐ పవన్‌కుమార్, సిబ్బంది వారిని అడ్డుకున్నారు. విచారించి న్యాయం చేస్తామని సర్దిచెప్పారు. నారాయణ విద్యాసంస్థల్లో బలైన ఎందరో విద్యార్థుల్లో తమ బిడ్డ కూడా ఒకడయ్యాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు పేర్కొన్నారు. తమకు పోలీసులపై నమ్మకం ఉందన్నారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. నారాయణ కళాశాల యాజమాన్యంపై కేసు గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థి ఓబులరెడ్డి ధరణేశ్వర్‌రెడ్డిది అనుమానాస్పద మృతి అని ఆదివారం విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి విలేకరులకు చెప్పారు. కళాశాల హాస్టల్లో ఉరేసుకుని చనిపోయిన విద్యార్థి ధరణేశ్వర్‌రెడ్డి చాలా సౌమ్యుడని, చదువులో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్నాడని, విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని తల్లిదండ్రులు గూడూరు 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విద్యార్థి మృతికి కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
మనసుకు నచ్చిన పని.. పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో..
ఈనెల 6 నుంచి 18 వరకు ఫ్రాన్స్‌లోని ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’లో ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సు జరిగింది. ఆదివాసీల సంస్కృతి, సంగీతం గురించిన సమగ్ర పరిశోధనకు ఉపకరించే ఆ కార్యక్రమానికి ఆహ్వానితులుగా హాజరైన ప్రొఫెసర్ గూడూరు మనోజ ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది వరంగల్‌లో. మా నాన్న డీపీఓ. ఆయన బదలీల రీత్యా నా ఎడ్యుకేషన్ తెలంగాణ జిల్లాల్లో ఏడు స్కూళ్లు, నాలుగు కాలేజీల్లో సాగింది. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర, నాందేడ్‌కి వెళ్లాను. అక్కడే ఇరవై ఏళ్లు నాందేడ్‌లోని స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్’లో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నిజామాబాద్‌లో కొంతకాలం చేసి, మహబూబ్‌నగర్ పాలమూరు యూనివర్సిటీ నుంచి 2021లో రిటైరయ్యాను. సంగీతసాధనాల అధ్యయనం ఫ్రాన్స్ సమావేశం గురించి చెప్పడానికి ముందు నేను ఎందుకు ఈ పరిశోధనలోకి వచ్చానో వివరిస్తాను. నా ఉద్దేశంలో ఉద్యోగం అంటే రోజుకు మూడు క్లాసులు పాఠం చెప్పడం మాత్రమే కాదు, యువతకు వైవిధ్యమైన దృక్పథాన్ని అలవరచాలి. నా ఆసక్తి కొద్దీ మన సంస్కృతి, కళలు, కళా సాధనాల మీద అధ్యయనం మొదలైంది. అది పరిశోధనగా మారింది. ఆ ప్రభావంతోనే పాలమూరు యూనివర్సిటీలో నేను ఫోర్త్ వరల్డ్ లిటరేచర్స్ని పరిచయం చేయగలిగాను. మన సాహిత్యాన్ని యూరప్ దేశాలకు పరిచయం చేయడం గురించి ఆలోచన కూడా మొదలైంది. విదేశీ సాహిత్యానికి అనువాదాలు మన సాహిత్యంలో భాగమైపోయాయి. అలాగే మన సాహిత్యాన్ని, సాహిత్యం ద్వారా సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలని పని చేశాను. వీటన్నింటినీ చేయడానికి నా మీద సామల సదాశివగారు, జయధీర్ తిరుమల రావు గారి ప్రభావం మెండుగా ఉంది. తిరుమలరావుగారు ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పరిశ్రమలో భాగస్వామినయ్యాను. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ధ్వనికి మూలకారణమైన సాధనాలను తెలుసుకోవడం, సేకరించడం మొదలుపెట్టాం. ఇల్లు, పిల్లలను చూసుకోవడం, ఉద్యోగం చేసుకుంటూనే దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాను. చెంచు, కోయ, గోండ్లు నివసించే గ్రామాలకు నెలకు ఒకటి –రెండుసార్లు వెళ్లేవాళ్లం. గోండ్ లిపికి కంప్యూటర్ ఫాంట్ తయారు చేయగలిగాం. గోంద్ భాష యూనికోడ్ కన్సార్టియంలోకి వెళ్లింది కాబట్టి ఇక ఆ భాష అంతరించడం అనేది జరగదు. ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా 250 సంగీత సాధనాల వివరాలను క్రోడీకరించాం. మూలధ్వని పేరుతో పుస్తకం తెచ్చాం. అందులో క్రోడీకరించిన సంగీతసాధనాలు, 27 మంది కళాకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి 2020లో ప్రదర్శనలివ్వడంలోనూ పని చేశాను. దేశంలో తెలంగాణ కళలకు మూడవస్థానం వచ్చింది. ఆద్యకళకు ఆహ్వానం ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’ ఈ ఏడాది నిర్వహించిన ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సుకు మా ఆదిధ్వని ఫౌండేషన్ నిర్వహించే ‘ఆద్యకళ’కు ఆహ్వానం వచ్చింది. అందులో పని చేస్తున్న వాళ్లలో నేను, జయధీర్ తిరుమలరావుగారు సదస్సుకు హాజరయ్యాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే అంశంపై మీద పత్రం సమర్పించాం. మనదేశంలో ఆదివాసీ సంస్కృతి మీద పరిశోధన చేసిన ఫ్రెంచ్ పరిశోధకులు డేనియల్ నాజర్స్తోపాటు అనేక మంది ఫ్రెంచ్ ప్రొఫెసర్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే వారంతా మనదేశంలో మూల సంస్కృతి, సంగీతవాద్యాలు అంతరించి పోయాయనే అభిప్రాయంలో ఉన్నారు. మేము వారి అపోహను తొలగించగలిగాం. అంతరించి పోతోందనుకున్న సమయంలో చివరి తరం కళాకారులను, కళారూపాలను ఒడిసి పట్టుకున్నామని చెప్పాం. కాటమరాజు కథ, పన్నెండు పటాలకు సంబంధించిన బొమ్మలు, కోయ పగిడీలను ప్రదర్శించాం. ఆఫ్రికాలో కళారూపాలు ఒకదానికి ఒకటి విడిగా ఉంటాయి. మన దగ్గర కథనం, సంగీతవాద్యం, పటం, గాయకుడు, బొమ్మ అన్నీ ఒకదానితో ఒకటి ముడివడి వుంటాయి. పారిస్‌లో ‘నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్’, ఆంథ్రోపాలజీ మ్యూజియాలను కూడా చూశాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే మా పేపర్‌కి సదస్సులో మంచి స్పందన లభించింది. ఇండియాలో మరో పార్శా్వన్ని చూసిన ఆనందం వారిలో వ్యక్తమైంది. యునెస్కో అంబాసిడర్, మనదేశానికి శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ కూడా ప్రశంసించారు. (క్లిక్ చేయండి: ఉందిలే మంచి టైమ్ ముందు ముందూనా...) చేయాల్సింది ఇంకా ఉంది ఆది అక్షరం, ఆది చిత్రం, ఆది ధ్వని, ఆది లోహ కళ, ఆది జీవనం, పరికరాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి. మ్యూజియం ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించాలి. మ్యూజియం హైదరాబాద్ నగర శివారులో ఉంటే భావి తరాలకు మ్యూజియంకు సంబంధించిన పరిశోధనకి ఉపయోగపడుతుంది.రిటైర్ అయిన తర్వాత మనసుకు నచ్చిన పని చేయాలని నమ్ముతాను. ‘ఆదిధ్వని’ ద్వారా ఐదు మ్యూజియాల స్థాపనకు పని చేశాను. నా జీవితం ఆదిధ్వనికే అంకితం’’ అన్నారీ ప్రొఫెసర్. హైదరాబాద్‌లోని ఆమె ఇల్లు ఆదివాసీ సంస్కృతి నిలయంగా ఉంది. – వాకా మంజులారెడ్డి శబ్దం– సాధనం ప్రస్తుతం ‘ఆది చిత్రం’ పుస్తకం తెచ్చే పనిలో ఉన్నాం. ఇదంతా ఒక టీమ్ వర్క్. మన దగ్గర ఆదివాసీ గిరిజనులు, దళిత బహుజనుల దగ్గర నిక్షిప్తమై ఉన్న సంస్కృతిని వెలికి తీయడానికి మొదటి మార్గం శబ్దమే. ఆదివాసీలు తమ కథలను పాటల రూపంలో గానం చేసే వారు. కొన్ని కథలు తాటాకుల మీద రాసి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం మౌఖికంగా కొనసాగేవి. మౌఖిక గానంలో ఇమిడి ఉన్న కథలను రికార్డ్ చేసుకుని, శ్రద్ధగా విని అక్షరబద్ధం చేశాం. ‘గుంజాల గొండి అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో ఐటీడీఏతో కలిసి చేశాం. ఓరల్ నేరేటివ్‌కి అక్షర రూపం ఇవ్వడాన్ని ‘ఎత్తి రాయడం’ అంటాం. ఆది కళాకారులను వెలికి తెచ్చే మా ప్రయత్నంలో భాగంగా సమ్మక్క– సారక్క కథను ఆలపించే పద్మశ్రీ సకినె రామచంద్రయ్యను పరిచయం చేశాం. ఆ కథను ఎత్తిరాసిన పుస్తకమే ‘వీరుల పోరుగద్దె సమ్మక్క సారలమ్మల కథ – కోయడోలీలు చెప్పిన కథ’. ఈ ప్రయత్నం రీసెర్చ్ మెథడాలజీలో పెద్ద టర్నింగ్ పాయింట్. – ప్రొఫెసర్ గూడూరు మనోజ, సభ్యులు, ఆదిధ్వని ఫౌండేషన్ -
రూ.75 లక్షల లాటరీ తగిలింది.. చిన్న ప్రక్రియ అంతే! రూ.34 లక్షలు స్వాహా!
గూడూరు: ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. చిన్న ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేస్తాం...’ అంటూ అజ్ఞాత వ్యక్తి ఫోన్ ద్వారా నమ్మబలికి గూడూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి విడతల వారీగా రూ.34లక్షలు స్వాహా చేశాడు. పది నెలల నుంచి గుట్టుగా సాగుతున్న ఈ మోసం గురించి బాధితుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది జనవరిలో అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. ఆ మొత్తాన్ని మీ అకౌంట్లో జమ చేసేందుకు కొన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేయాల్సి ఉంది’ అని ఫోన్ చేసిన వ్యక్తి నమ్మబలికాడు. దీంతో అతను అడిగిన పత్రాలను బాధితుడు ఆన్లైన్లో పంపించాడు. ఆ తర్వాత ‘మీకు మేము అందజేసే డబ్బులకు ఇన్కమ్ ట్యాక్స్ రూ.5.75లక్షలు ముందుగా కట్టాలి. అప్పుడే ఆ మొత్తాన్ని మీ అకౌంట్‌కు బదిలీ చేయగలం...’ అని చెప్పాడు. దీంతో అంత మొత్తం తన వద్ద లేదని బాధితుడు చెప్పగా, కాస్త సమయం ఇస్తున్నామని, ఎలాగైనా డబ్బులు చెల్లించి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అజ్ఞాత వ్యక్తి నమ్మబలికాడు. ఎట్టకేలకు బాధితుడు రూ.5.75లక్షలను అజ్ఞాత వ్యక్తి చెప్పిన బ్యాంక్ అకౌంట్లో జమ చేశాడు. మళ్లీ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఆదాయపన్ను చెల్లించామని, జీఎస్టీ కోసం కొంత మొత్తం పంపాలని చెప్పగా, అకౌంట్లో బాధితుడు డబ్బులు వేశాడు. ఇలా పలుమార్లు డబ్బులు జమ చేశాడు. చివరిగా ఇటీవల అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ‘ఇక ప్రాసెస్ మొత్తం పూర్తయింది. రూ.4.5లక్షలు చెల్లిస్తే రూ.75లక్షలు మీ అకౌంట్లో జమ అవుతుంది’ అని చెప్పాడు. దీంతో అంత డబ్బు తన వద్ద లేవని బాధితుడు చెప్పగా, రూ.50వేలు పంపాలని, మిగిలినవి తామే జమ చేస్తామని నమ్మబలికాడు. బాధితుడు మళ్లీ రూ.50వేలు అకౌంట్లో వేశాడు. ఈ విధంగా వివిధ పేర్లు చెప్పి విడతల వారీగా రూ.34లక్షలు అజ్ఞాత వ్యక్తి తన అకౌంట్లలో జమ చేయించుకున్నాడు. అయినా బాధితుడికి లాటరీ డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గూడూరు వన్‌టౌన్ ఎస్ఐ హజరత్‌బాబు తెలిపారు. గతంలోనూ మహిళకు టోకరా... అదే విధంగా గతంలోనూ గూడూరు రూరల్ పరిధిలోని కంభంపాటి లక్ష్మీదేవి అనే మహిళకు లాటరీ వచ్చిందని గుర్తుతెలియని వ్యక్తులు నమ్మబలికి ఆమె నుంచి రూ.5.9లక్షలు స్వాహా చేశారు. ఈ మేరకు జనవరిలో గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. -
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): చెన్నై–గూడూరు సెక్షన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, దారి మళ్లించి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. నెల్లూరు–సూళ్లూరుపేట మధ్య నడిచే మెమూ రైళ్లను (06746/06745) ఈ నెల 22న పూర్తిగా రద్దు చేశారు. విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712) రైళ్లను ఈ నెల 22న గూడూరు–చెన్నై సెంట్రల్ మధ్య, హైదరాబాద్–తాంబరం (12760) రైలును ఈ నెల 26న చెన్నైబీచ్–తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు.. ► పుదుచ్చేరి–న్యూఢిల్లీ (22403) ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16న చెంగల్పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట స్టేషన్ల మీదుగా దారి మళ్లింపు. ► ఇండోర్–కొచువేలి ఎక్స్‌ప్రెస్ (22645) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి స్టేషన్ మీదుగా మళ్లింపు. ► ధన్‌బాద్–అలప్పుజ ఎక్స్‌ప్రెస్ (13351) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా దారి మళ్లింపు. ► కాకినాడ–చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ (17644) ఈ నెల 26న పెరంబూర్, అరక్కోణం మీదుగా మళ్లింపు. ► కాకినాడ–చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ (17652) ఈ నెల 26న అరక్కోణం, కాంచీపురం మీదుగా దారి మళ్లింపు. ► చెన్నై ఎగ్మోర్–ముంబై సీఎస్టీ ఎక్స్‌ప్రెస్ (22158) ఈ నెల 27న తాంబరం, చెంగల్పట్టు మీదుగా దారి మళ్లింపు. -
‘మీ కాళ్లు మొక్కుతా.. మేం దళితులం.. మా పంట పాడు చేయకండి’
గూడూరు: ‘కాళ్లు మొక్కుతా.. దళితులం.. పంట నాశనం చేయకండి’.. అంటూ ఓ పోడు రైతు అటవీ అధికారి కాళ్లు మొక్కాడు. అయినా కనికరం చూపకుండా అటవీ అధికారులు పంటను ధ్వంసం చేసేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొల్లెపల్లి శివారు పోడు భూముల్లో శుక్రవారం జరిగింది. కొన్ని నెలలుగా బొల్లేపల్లి శివారులోని సర్వే నంబర్ 1 నుంచి 30 గల పోడు భూముల్లో స్థానిక దళిత, గిరిజన రైతులు 1985కు ముందు నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ఆ భూమి అటవీ శాఖది పేర్కొంటుండడంతో ఏడాదిగా అధికారులు, రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి జోక్యం చేసుకోవడంతో నాటి గొడవలు సద్దుమణిగాయి. దీంతో రైతులు వారి భూముల్లో పంటలు సాగు చేసుకున్నారు. అయితే శ్రీను అనే రైతు మిర్చి పంట వేసుకోగా శుక్రవారం డీఎఫ్ఓ కిరణ్ సమక్షంలో మానుకోట అటవీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అటవీ భూమిగా పేర్కొంటూ పంటను ధ్వంసం చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. ఓ రైతు ఏకంగా డీఎఫ్ఓ కాళ్లపై పడి వేడుకున్నా కనికరం చూపకుండా పంటను నాశనం చేసి వెళ్లిపోయారు. చదవండి: నేను గెలిస్తే కేసీఆర్ రోడ్డుమీదకు: ఈటల రాజేందర్ -
రాళ్లతో కొట్టి భిక్షగాడి దారుణ హత్య
సాక్షి, గూడూరు: గుర్తుతెలియని వ్యక్తులు ఓ భిక్షగాడిని రాళ్లకొట్టి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రెండో పట్టణంలోని జీఎస్ రాయులు కూడలిలో శుక్రవారం రాత్రి జరిగింది. రెండో పట్టణ ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించే ప్రయత్నించారు. భిక్షగాడి హత్య మిస్టరీగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు.. హతుడు ఏడాదికిపైగా ఇక్కడే ఉంటున్నాడు. అతనికి తెలుగు రాదు, హిందీలోనే మాట్లాడుతుంటాడని తెలుస్తోంది. అతను పగటి వేళల్లో బయటకు వెళ్లి భిక్షాటన చేసుకుని రాత్రి వేళ స్థానికంగా రేకుల షెడ్డు కింద వండుకొని తిని, నిద్రపోతుంటాడు. అయితే భిక్షగాడ్ని హతమార్చే అవసరం ఎవరికొచ్చింది, దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. డబ్బుల కోసమే అతన్ని హత్య చేశారా? అనుకుంటే అతని జేబులో రూ.2 వేల నగదు ఉంది. అయితే భిక్షగాడి వద్ద భారీగా నగదు ఉండొచ్చని, ఈ నగదు కాజేసే ప్రయత్నంలో ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వేసుకున్న జేబులో డబ్బులు గుర్తించలేక వదిలేసి వెళ్లి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అర్బన్ సీఐ నాగేశ్వరమ్మ మాట్లాడుతూ కేసును ఛేదించేందుకు డాగ్ స్క్వాడ్‌తో ప్రయత్నం చేశామన్నారు. జాగిలం ఘటనా స్థలం వద్ద కలియ తిరిగి అక్కడి నుంచి విందూరు వైపు వెళ్లే రోడ్డు వద్దకు వచ్చి ఆగిపోయిందన్నారు. సీసీ ఫుటేజీలను సేకరించి, నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. రెండో పట్టణ ఎస్సై ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులు వెళ్తేనే.. మేమెళ్తాం!
గూడూరు : రైల్వే గేట్ వేస్తే ఈ వాహనదారులు ఇలా రోడ్డుపై నిల్చున్నారు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరబడినట్లే. మహబూబాబాద్ జిల్లా గూడూరు నుంచి నెక్కొండ వైపు వెళ్లే రోడ్డులో పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. అన్ని పత్రాలు పరిశీలించి ఏదీ లేకున్నా జరిమానా విధించడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అటుగా వచ్చే వాహనదారులు పోలీసులు తనిఖీలు ముగించాకే అక్కడి నుంచి వెళ్లాలని ఇలా రోడ్డుపై వాహనాలను నిలిపి రోడ్డుపై వేచి ఉండటం గమనార్హం. ఉధృతంగా గోదావరి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తడంతో వరద నీరు గోదావరి నదిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం బాసర వద్ద నది నిండుగా కనిపించింది. మంజీర, గోదావరితోపాటు ఉప నదుల నీరంతా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద కలుస్తుంది.ఈ నీరంతా గోదావరిలో కలవడంతో ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం బాసర వద్ద నదిలోని కొత్తనీటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. – భైంసా (ముధోల్) -
Covid Vaccination: వ్యాక్సిన్ కోసం ఇంత పేద్ద లైనా..!
గూడూరు: ఇంతకాలం వ్యాక్సిన్ అంటే భయపడిన వారు కూడా కరోనా కేసులు పెరుగుతుండడంతో ముందుకొస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కు బుధవారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం 9 గంటలకే తరలివచ్చారు. టీకా ఆవశ్యకతపై గ్రామాల్లో అధికారులు ప్రచారం చేస్తుండడంతో వ్యాక్సిన్ కోసం తరలివచ్చిన ప్రజలు ఇలా బారులు తీరి కనిపించారు. క్యూలో నిలుచున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం. అయితే, కరోనా భయంతో టీకా కోసం వచ్చిన వారిలో చాలా మంది మాస్క్ ధరించకపోగా, భౌతిక దూరాన్ని విస్మరించి దగ్గరదగ్గరగా నిల్చోవడం గమనార్హం. ప్రజలందరు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలని, భౌతిక దూరంపాటించాలని.. వైద్యారోగ్యశాఖ విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఇంకా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. మరోవైపు కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్లకు అదనంగా, మరో 25 శాతం పెంచాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇక్కడ చదవండి: స్పుత్నిక్–వి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? తెలంగాణకు 3.60 లక్షల వ్యాక్సిన్లు -
పాచిపోయిన లడ్డూలు పవన్‌కు రుచిగా ఉన్నాయా?
నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి సినిమా టికెట్లు తప్ప.. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు కనపడట్లేదని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు బడుగు, బలహీన వర్గాలంటే చిన్నచూపని అన్నారు. మంత్రి అప్పలరాజు ఆదివారం గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారికి డాక్టర్లంటే గౌరవంలేదని, అందుకే వారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు రుచిగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. విభజన హమీలపై కేంద్రం మాటతప్పితే పవన్ ఇప్పుడేందుకు నోరు మూసుకున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందిస్తొందని అన్నారు. తాము 22 నెలల పాలనకాలాన్ని రెఫరెండంగా భావించి ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. టీడీపీకి ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొన్నారు. తాము తిరుపతి ఉపఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామని అన్నారు. ఒకవేళ ‘ మేం ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు.. టీడీపీ ఓడిపోతే నలుగురు ఎంపీలూ రాజీనామా చేస్తారా?’’ అంటూ పెద్దిరెడ్డి చేసిన సవాల్‌ను చంద్రబాబుకు స్వీకరించే దమ్ముందా! అని తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. -
గురుమూర్తి ఫై నారాలోకేష్ వ్యాఖ్యలు దారుణం
-
ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మరికొన్ని రోజుల్లో వివాహ బంధంతో జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిద్దామనుకున్న ఆ యువతిని విధి చిన్నచూపు చూసింది. పెళ్లి బట్టలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహంగా వెళ్తున్న ఆ కుటుంబంపైకి ట్రెయిలర్ లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాబోయే వధువుతోపాటు ఆమె తల్లి, సోదరుడు, బాబాయి, పిన్ని, ఆటో డ్రైవర్ కన్నుమూశారు. – సాక్షి, మహబూబాబాద్ ఏం జరుగుతుందో ఆలోచించే లోగానే... సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంట తండాకు చెందిన జాటోతు కస్నానాయక్–కల్యాణి (45) దంపతుల కుమార్తె ప్రమీల అలియాస్ మరియమ్మ (23) వివాహం డోర్నకల్ మండలం చాంప్లా తండా గ్రామ పరిధిలోని ధరావత్ తండాకు చెందిన ధరావత్ వెంకన్న–లలిత దంపతుల ప్రథమ కుమారుడు వినోద్‌తో నిశ్చయమైంది. వచ్చే నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి బట్టల కొనుగోలు కోసం వరంగల్‌కు శనివారం వెళ్దామని చెప్పిన ప్రమీల తండ్రి కస్నా నాయక్ పనికి వెళ్లగా శుక్రవారమే బట్టలు కొంటే బాగుంటుందనే ఆలోచనతో ప్రమీల, ఆమె తల్లి కల్యాణి, సో దరుడు ప్రదీప్ (25), బాబాయి జాటోతు ప్రసాద్ (42) చిన్నమ్మ లక్ష్మి (39) కలసి జాటోతు రాములు నాయక్ (33) ఆటోలో శుక్రవారం ఉద యం 10 గంటలకు గూడూరు మీదుగా వరంగల్ బయలుదేరారు. సుమారు 40 నిమిషాల ప్రయాణం అనంతరం మర్రిమిట్ట–భూపతిపేట మధ్యలో జాతీయ రహదా రి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు చెందిన ట్రెయిలర్ లారీ ఎదురుగా వస్తూ అతివేగంగా ఆటోను ఢీకొట్టడమే కాకుండా దాన్ని సుమారు 150 మీటర్లు తోసుకెళ్లింది. దీంతో ఏం జరిగిందో తెలిసేలోపే ఆటోలోని వారు విగత జీవులుగా మారారు. ఫలితంగా మల్లంపెల్లి–సూర్యాపేట జాతీయ రహదారి రక్తపు మడుగుగా మారింది. లారీ డ్రైవర్ ధరావత్ కిషన్ అతివేగంగా నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదవార్త తెలియగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లోకి ఎక్కించారు. మృతదేహాలను ట్రాక్టర్లో తరలిస్తుండగా అడ్డుకుంటున్న స్థానికులు స్థానికుల ఆందోళన... రోడ్డు ప్రమాద వార్త తెలుసుకొని ఎర్రకుంట తండావాసులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకొని రోడ్డుపై ధర్నాకు దిగారు. తక్షణమే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఏరియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించే ప్రయత్నం చేయడం, చర్చల పేరుతో కాలయాపన చేస్తుండటంపై గ్రామస్తులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో రాత్రి వరకు మృతదేహాల తరలింపులో జాప్యం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. చివరకు విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ఘటనాస్థలికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎన్‌హెచ్ కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని సూచించారు. చివరకు కాంట్రాక్టర్ ద్వారా రూ. 5 లక్షల చొప్పున, ప్రభుత్వం నుంచి రూ. లక్ష చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో తండావాసులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయమే చంపేసింది! నేషనల్ హైవే నిర్మాణ కాంట్రాక్టర్‌కు మొరం ఇచ్చేందుకు ఎవరూ సహకరించలేదు. దీంతో జాటోతు కస్నా నాయక్ తనకు సంబంధించిన మూడెకరాల బంజరు భూమి నుంచి మొరం తీసుకెళ్లేందుకు సమ్మతించాడు. ఈ మేరకు భూమిలో మొరం తీసేందుకు వినియోగించే ప్రొక్లెయిన్ తీసుకురావడానికి లారీతో డ్రైవర్ భూపతిపేట నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలోనే కస్నానాయక్ కుటుంబ సభ్యులు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో సాయం చేయాలని ముందుకు రావడమే తన కుటుంబీకులను పొట్టన పెట్టుకుందంటూ కస్నా నాయక్ రోదించాడు. మర్రిమిట్ట ప్రమాదంపై గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు వెంటనే అందించాలని ఆదేశించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
గూడూరు: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ - ఆటో ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులంతా గూడూరు మండలం ఎర్రకుంట్ల తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు. దుస్తుల కొనుగోలు కోసం వరంగల్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న ఆటో గూడూరు శివారుకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఇటీవల పెళ్లి కుదిరిన యువతి కూడా ఉన్నట్టు తెలిసింది. ఆమె పెళ్లికి బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. కాగా, ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. లారీ కింద కూరుకుపోయిన ఆటోను పోలీసులు అతికష్టమ్మీద బయటకు తీశారు. లారీని ప్రొక్లెయిన్‌తో పక్కకు నెట్టారు. అయితే ప్రమాదానికి లారీ అతివేగంగా రావడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
నాద నిలయంలో వేదం పలకాలని..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు(బృందావనం): నెల్లూరు నగరంలోని తిప్పరాజు వారి వీధిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల స్వార్జితంతో నిర్మించుకుని నివసించిన ఇంటిని ఈ ఏడాది ఫిబ్రవరిలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్రసరస్వతి స్వామికి అప్పగించారు. ఆ ఇంట్లో వేదం పలకాలన్న ఆకాంక్షతో రూ. కోట్లు విలువైన తన తల్లిదండ్రుల జ్ఞాపికను ఆ పీఠానికి అప్పగిస్తున్నట్లుగా అప్పట్లో బాలు వివరించారు. తాను తరచూ నెల్లూరుకు వచ్చి వేదనిలయం అభివృద్ధికి సహకారాన్ని అందిస్తానని కూడా చెప్పారు. ఈ ఇల్లు అంటే బాలు తల్లి శకుంతలమ్మకు మమకారం. తాను చనిపోయేంత వరకు ఇక్కడే ఉన్నారు. బాలు ప్రతి నెలా వచ్చి తల్లితో గడిపి వెళ్తుండేవాడు. నాద నిలయంగా ఉన్న ఇల్లు వేద నిలయంగా కూడా మారాలనే తల్లి కోరికతో ఆ ఇంటిని కంచి పీఠానికి అప్పగించారు. తండ్రి తొలిగురువు.. 2015 అక్టోబర్ 3న సాంబమూర్తి విగ్రహావిష్కరణ నెల్లూరులోని శ్రీకస్తూర్బా కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో బాలు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి తన తొలిగురువని, ఆయన తనను నాటక రంగానికి పరిచయం చేయడంతో పాటు నేపథ్య గాయకుడిగా మారడానికి ప్రోత్సాహించారని చెప్పారు. జీవితంలో సర్వస్వం అయిన నాన్నకు విగ్రహం పెట్టి జన్మ ధన్యం చేసుకున్నానని తెలిపారు. తొలిమెట్టు గూడూరులో.. గూడూరు: ఎస్పీ బాలు గాన ప్రస్థానానికి తొలిమెట్టు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకాళిదాస కళానికేతన్. సంగీత పోటీలు నిర్వహించడానికి షేక్ గౌస్‌బాషా, ప్రభాకర్‌రావు తమ మిత్ర బృందంతో కలిసి ఈ సంస్థను స్థాపించారు. 1962లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న బాలుకు మొదటి బహుమతి లభించింది. 1963లో జరిగిన పోటీలకు న్యాయనిర్ణేతగా గానకోకిల జానకి వచ్చారు. ఈ పోటీల్లో బాలుకు 2వ బహుమతి వచ్చింది. సంస్థ ఆనవాయితీ ప్రకారం ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందినవారితో పాటలు పాడించేవారు. ఈ క్రమంలో బాలు పాడిన పాట ఆహూతులను మంత్రముగ్దుల్ని చేసింది. ‘‘నీలాంటి వారు సినిమాల్లో పాడాలి’’ అంటూ జానకి బాలును ప్రోత్సహించారు. 1964లో భానుమతిని కలసిన సందర్భంలో బాలు పాడిన పాట ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. దేశం గర్వించదగ్గ గాయకుడిగా ఎదుగుతావంటూ ఆమె బాలును దీవించారు. నిగర్వి అయిన బాలు వంటి మహానుభావుని పోగొట్టుకోవడం ఎంతో బాధాకరమని శ్రీకాళిదాస కళానికేతన్ వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ షేక్ గౌస్‌బాషా కన్నీటి పర్యంతమయ్యారు. -
పట్టుకోండి చూద్దాం!
గూడూరు తహసీల్దార్ ఏసీబీ అధికారులనే ముప్పుతిప్పలు పెడుతోంది. ఓ రైతు నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటూ తన బినామీ చిక్కిన వెంటనే అప్రమత్తమైన ఆమె.. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆపై స్థావరాలు మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతోంది. బుధవారం అనంతపురంలో చిక్కినట్లే చిక్కి చాకచక్యంగా తప్పించుకుంది. ఎలాగైనా అరెస్ట్ చేసి బోనులో నెలబెట్టేందుకు ఏసీబీ అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులోభాగంగానే ఆశ్రయమిచ్చిన కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్యపై కేసు నమోదు చేసి, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కోడుమూరు/కర్నూలు సిటీ: కోర్టు వివాదంలో ఉన్న భూమికి వెబ్‌ల్యాండ్‌లో డిజిటల్ సిగ్నేచర్ తొలగింపు కోసం రూ.4లక్షలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడిన గూడూరు తహసీల్దార్ హసీనాబీ కోసం ఏసీబీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నెల 7న గూడూరు తహసీల్దార్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకొని హసీనాబీ పరారీలో ఉన్నారు. నిందితురాలిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారు. బుధవారం అనంతపురంలో తమ బంధువుల వద్ద ఆశ్రయం పొందినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లేలోగా, విషయం గమనించిన నిందితురాలు పరారైనట్లు సమాచారం. కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్యపై కేసు నమోదు గూడూరు తహసీల్దార్ హసీనాబీ, కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్య గతంలో కలెక్టరేట్లోని రెవెన్యూ సెక్షన్లో పని చేశారు. అప్పటి నుంచే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇతడి సహకారంతోనే తప్పించుకు తిరుగుతున్నట్లు గ్రహించిన ఏసీబీ అధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ నెల 8న ఎంపీడీఓ గిడ్డయ్య కూడా సెలవు పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుసుకుని అతడు నివాసం ఉంటున్న సీక్యాంపు సెంటర్ సమీపంలోని ప్రభుత్వ క్వార్టర్‌కు వెళ్లారు. తాళం వేసి ఉండటంతో కల్లూరు తహసీల్దార్ రవికుమార్ సమక్షంలో తాళం పగులగొట్టి సోదాలు నిర్వహించారు. తహసీల్దారు, ఎంఈడీఓ కలిసి దిగిన ఫొటోలు, కీలక పత్రాలు, తహసీల్దారు ఊత కర్ర, గుర్తింపు కార్డు లభ్యమయ్యాయి. దీంతో ఎంపీడీఓపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. ఆరు హాస్టళ్లలో నివాసం.. గూడూరు తహసీల్దార్‌పై కేసు నమోదైన అనంతరం ఏసీబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. కర్నూలులోని వివిధ ప్రాంతాల్లోని ఆరు హాస్టళ్లలో నివాసముంటున్నట్లు ఏసీబీ పోలీసులు గుర్తించారు. ఆరు ప్రాంతాల్లో నిందితురాలికి సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరు హాస్టళ్లకు నెలనెలా అద్దె చెల్లిస్తున్నట్లు ఏసీబీ అధికారులకు హాస్టళ్ల యజమానులు తెలియజేశారు. ఒకే వ్యక్తి ఆరు చోట్లా నివాసముండేందుకు హాస్టళ్లలో ఎందుకు అద్దె కడుతుందనే విషయం అంతుపట్టడం లేదు. కాగా కొత్తపల్లి గిడ్డయ్య కేసు నుంచి బయటపడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. సీనియర్ అడ్వకేట్లను సంప్రదించి కేసు నుంచి ఎలా బయటపడాలి, నేరుగా కోర్టుకు హాజరైతే బాగుంటుందా అనే విషయాలపై అడ్వకేట్లను అమరావతిలో కలిసి చర్చించినట్లు సమాచారం. -
అదనంగా ఒక్క రూపాయి ఇవ్వనన్నాడని..
-
బీరు సీసాలతో విచక్షణారహిత దాడి
సాక్షి, మహబూబాబాద్ : జిల్లాలోని గూడూరు జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రవి అనే వ్యక్తి గాయపడటంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి కారణమైన బాలుపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. వివరాలు.. మంగళవారం రాత్రి రవి మద్యం కొనేందుకు దుకాణం వద్దకు వెళ్లాడు. ఈ క్రమం బ్రాందీ సీసాను కొనుగోలు చేసి ఎమ్మార్పీ ప్రకారం 120 రూపాయలు చెల్లించాడు. అయితే ఎమ్మార్పీపై పది రూపాయలు అదనంగా ఇవ్వాలని మద్యం దుకాణం సిబ్బంది రవిని డిమాండ్ చేశారు. తాను అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించనని రవి తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో సహనం కోల్పోయిన దుకాణ సిబ్బంది రవిపై మద్యం సీసాతో విచక్షణా రహితంగా దాడి చేశారు. కాగా విషయం గమనించిన స్థానికులు రవిని ఆస్పత్రితో చేర్పించగా.. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మానవత్వం చాటిన గూడూరు సబ్‌కలెక్టర్
సాక్షి, నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైవే పక్కన నిస్సహాయ స్థితిలో పడిఉన్న ఓ మహిళను అదే మార్గంలో వస్తున్న గూడూరు సబ్‌కలెక్టర్ గోపాలకృష్ణ గమనించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన మనుబోలు మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..ఇందుకూరుపేటకు చెందిన ఇటుకల ప్రసన్న తన తమ్ముడు చందుతో కలిసి మోటార్‌బైక్‌పై గూడూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో మనుబోలు పోలీస్‌స్టేషన్ సమీపంలో మోటారుసైకిల్‌పై వెనకగా కూర్చుని ఉన్న ప్రసన్న అదుపుతప్పి కింద పడిపోయింది. ఇది గమనించని సోదరుడు ముందుకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత అదే మార్గంలో నెల్లూరు నుంచి గూడూరు వస్తున్న సబ్‌కలెక్టర్ గోపాలకృష్ణ హైవే పక్కన పడిపోయి ఉన్న ప్రసన్నని గమనించి వాహనం ఆపారు. గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ప్రసన్నను తన సిబ్బంది సాయంతో వాహనంలో మనుబోలు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో సబ్‌కలెక్టర్ నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వెంటనే మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అంతకుముందే సమాచారం అందుకున్న తమ్ముడు పీహెచ్‌సీకి చేరుకుని అక్క వెంట వెళ్లాడు. కళ్ల ముందే ప్రమాదం జరిగినా మనకెందుకులే అని చేతులు దులుపుకొని వెళ్లే రోజుల్లో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్న సబ్‌కలెక్టర్‌ను పలువురు అభినందించారు. -
బాబాయ్ ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో..
సాక్షి, కర్నూలు : స్థానిక కటిక వీధికి చెందిన షంషావలి ఇంటిలో చోటు చేసుకున్న చోరీ ఘటన అతని అన్న కుమారుడి పనేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకుని చోరీ చేసిన సొమ్మును రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోడుమూరు సీఐ పార్థసారథిరెడ్డి మంగళవారం విలేకరులకు వెల్లడించారు. గత నెల 28వతేదీ షంషావలి.. కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న షంషావలి అన్న కొడుకు అనిఫ్ ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. బీరువాలోని రూ. 5 లక్షల విలువైన పది తులాల బంగారు బిస్కెట్, 6 గ్రాముల బంగారు ఉంగరం ఎత్తు కెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఏ పని లేకుండా తిరుగుతున్న నిందితుడు జల్సాల కోసం రూ. 5 లక్షలు అప్పు చేశాడని, రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడని సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ విజయభాస్కర్, ఏఎస్ఐ గోపాల్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
కిడ్నాపర్‌ను పట్టుకున్న గ్రామస్తులు
సాక్షి, గూడూరు(వరంగల్) : చిన్న పిల్లలను అపహరించబోతున్న కిడ్నాపర్‌ను గ్రామస్తులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని గుండెంగలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం మండల కేంద్రంలోని కట్టుకాల్వకు చెందిన తూరాల రాజు, లక్ష్మి దంపతులు ప్రతీ సంవత్సరం సంచార జీవనం గడుపుతూ పెరిగే చెట్లకు మందులు సరఫరా చేస్తుంటారు. ప్రతీ సంవత్సరం వాళ్లు గుండెంగ వస్తుంటారు. వారికి ఇద్దరు పిల్లలు జీవన్(4), రమేష్(3). కాగా, భార్య లక్ష్మి చనిపోగా ఇద్దరు చిన్నారులతో 4 రోజుల క్రితం గుండెంగకు చేరుకున్న రాజును భార్య ఎక్కడికి పోయిందంటూ గ్రామానికి చెందిన హోటల్ యజమానులు దేవా, వాసు అడిగారు. తన భార్య లక్ష్మి చనిపోయిందని పిల్లలు నాతో పాటు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆ ఇద్దరు హోటల్ యజమానులకు మగపిల్లలు లేకపోవడంతో ఆ ఇద్దరిని పెంచుకుంటామని చెప్పి నాలుగు రోజులుగా వారి వద్ద ఉంచుకుంటున్నారు. కాగా, చెన్నారావుపేట మండలం బోజెర్వుకు చెందిన అంగడి సమ్మయ్య, సరోజన దంపతులు హైదరాబాద్‌లో కూలీ చేసుకుంటూ ఉంటారు. వారిద్దరు సాయంత్రం 4 గంటలకు గతంలో పరిచయస్తుడైన తూరాల రాజు వద్దకు చేరుకుని ఇద్దరు చిన్న పిల్లలను తాము హైదరాబాద్‌కు తీసుకెళ్తామని చెప్పి రూ.1 లక్ష ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు. ముందుగా ఇస్తేనే పిల్లలను ఇస్తానని రాజు చెప్పగా, వారు తర్వాత ఇస్తామన్నారు. అయినా రాజు వినకపోవడంతో అంగడి సమ్మయ్య.. రాజుకు మద్యం తాగించాడు. అనంతరం సమ్మ య్య భార్య సరోజన వారికి కొద్దిదూరంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను పట్టుకొని ఓ కిరాణ షాపు పక్కన ఉన్న ఆటో వద్దకు బలవంతంగా తీసుకెళ్తోంది. దీంతో పిల్లలు భయపడి ఏడ్వడం మొదలుపెట్టారు. గమనించిన సమీపంలోని హోటల్ యజమాని భార్య వచ్చి చిన్నారులను ఎటు తీసుకెళ్తున్నావని అడగ్గా ఆమెను నెట్టివేసింది. వెంటనే పిల్లలను ఎత్తుకెల్లే వ్యక్తిగా గుర్తించిన ఆ మహిళ అరిచింది. దీంతో సరోజన పిల్లలను వదిలేసి పారిపోయింది. ఆ తరువాత అక్కడకు చేరుకున్న సమ్మయ్య ఆమె తన భార్యగా చెప్పడంతో అసలు విషయం తెలిసిపోయింది. ఆ తరువాత రాజు వారిద్దరు పిల్లలను ఇస్తే రూ.1 లక్ష ఇస్తామన్నారని, డబ్బులు ముందు ఇస్తే ఇస్తానన్నానని, తాను మద్యం మత్తులో ఉండగా పిల్లలను పట్టుకెళ్తున్నారన్నారు. వెంటనే వారు ఆ వృద్ధుడిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సంఘటనా వివరాలు తెలుసుకొని వృద్ధుడు, ఇద్దరు పిల్లలతో పాటు వారి తండ్రి రాజును స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్సై ఎస్కే.యాసిన్ వివరణ అడగ్గా, ఫిర్యాదు ఏమీ రాలేదని, పిల్లల తండ్రి, కిడ్నాపర్ మద్యం మత్తులో ఉన్నారని, ఐసీడీఎస్ వారిని రప్పించి పిల్లలను వారికి అప్పగిస్తామని, అతనిపై కేసు నమోదు చేస్తామన్నారు.