
కోట్లా.. ఇదెట్ల?
కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి ఓ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి చెప్పులు తొడుగుతున్న వ్యవహారం చర్చనీయాంశమైంది.
కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి ఓ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి చెప్పులు తొడుగుతున్న వ్యవహారం చర్చనీయాంశమైంది. మంత్రి బుధవారం కర్నూలు జిల్లా గుడిపాడులో ఒక ఉత్సవంలో భాగంగా ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్త ఇంటివద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పక్కనే ఉన్న చనుగొండ్ల పంచాయతీ సర్పంచ్ సుజాతమ్మ భర్త జి.రంగనాయకులు.. మంత్రి చెప్పులు దుమ్ముపట్టి ఉండటాన్ని గమనించారు. వాటిని శుభ్రం చేసి ‘కోట్ల’ పాదాలకు తొడిగారు. అయినా మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు అడ్డు చెప్పకుండా చూస్తుండిపోయారు.
- న్యూస్‌లైన్, గూడూరు