డోన్‌ ఎమ్మెల్యే దుశ్చ‌ర్య‌.. యువకుల్ని చితకబాదిన కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి | Valmiki Sanghas Slams On Tdp Dhone Mla Kotla Surya Prakash Reddy | Sakshi
Sakshi News home page

డోన్‌ ఎమ్మెల్యే దుశ్చ‌ర్య‌.. యువకుల్ని చితకబాదిన కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి

Published Tue, Aug 6 2024 9:54 AM | Last Updated on Tue, Aug 6 2024 9:59 AM

Valmiki Sanghas Slams On Tdp Dhone Mla Kotla Surya Prakash Reddy

కూటమి ప్రభుత్వంలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయనేది అనే సంఘటనలు రుజువు చేశాయి. చేస్తూనే ఉన్నాయి. తాజాగా, కర్నూలులో ఎమ్మెల్యే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇద్దరు యువకుల్ని కర్రలతో చితకబాదిన వీడియో వైరల్‌గా మారింది.

పంచాయితీ పేరుతో డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు యువకుల్ని చితకబాదారు. తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని దూషిస్తూ కర్రతో కొట్టారు.

వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులు తప్పు చేశారంటూ పంచాయితీ పెట్టి వారిని కొట్టారు ఎమ్మెల్యే. వాల్మిక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకుల్ని ఇంత దారుణంగా అవమానించడం పట్ల కులసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు,న్యాయ వ్యవస్థ ఉండగా ఇలా ఎమ్మెల్యేనే తీర్పు చెప్పి దండించడం ఏంటని కులసంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement