
సాక్షి, నెల్లూరు : రూరల్ పరిధిలోని పోటుపాళెం జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గూడూరుకు చెందిన శశిధర్, గణేష్‌లు బైక్‌పై నెల్లూరు నుంచి గూడూరుకు వస్తున్నారు. కూడలి వద్ద మలుపు తిరిగే క్రమంలో చెన్నై నుంచి నెల్లూరు వైపునకు వెళుతున్న కంటైనర్ బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ కంటైనర్ కిందికి వెళ్లి దెబ్బతింది. ఈ ప్రమాదంలో శశిధర్, గణేష్‌లకు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో శశిధర్ ఒక్కసారిగా భీతిల్లిపోయాడు. సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment