రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): చెన్నై–గూడూరు సెక్షన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, దారి మళ్లించి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
నెల్లూరు–సూళ్లూరుపేట మధ్య నడిచే మెమూ రైళ్లను (06746/06745) ఈ నెల 22న పూర్తిగా రద్దు చేశారు. విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712) రైళ్లను ఈ నెల 22న గూడూరు–చెన్నై సెంట్రల్ మధ్య, హైదరాబాద్–తాంబరం (12760) రైలును ఈ నెల 26న చెన్నైబీచ్–తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
దారి మళ్లించిన రైళ్లు..
► పుదుచ్చేరి–న్యూఢిల్లీ (22403) ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16న చెంగల్‌పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట స్టేషన్‌ల మీదుగా దారి మళ్లింపు.
► ఇండోర్–కొచువేలి ఎక్స్‌ప్రెస్ (22645) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి స్టేషన్ మీదుగా మళ్లింపు.
► ధన్‌బాద్–అలప్పుజ ఎక్స్‌ప్రెస్ (13351) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా దారి మళ్లింపు.
► కాకినాడ–చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ (17644) ఈ నెల 26న పెరంబూర్, అరక్కోణం మీదుగా మళ్లింపు.
► కాకినాడ–చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ (17652) ఈ నెల 26న అరక్కోణం, కాంచీపురం మీదుగా దారి మళ్లింపు.
► చెన్నై ఎగ్మోర్–ముంబై సీఎస్‌టీ ఎక్స్‌ప్రెస్ (22158) ఈ నెల 27న తాంబరం, చెంగల్‌పట్టు మీదుగా దారి మళ్లింపు.
Comments
Please login to add a commentAdd a comment