
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్‌చార్జి పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడటౌన్–తిరుపతి ప్రత్యేక రైలు (07210) మే 11, 13, 18, 20, 25, 27, జూన్ 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29వ తేదీల్లో రాత్రి 6.45కు కాకినాడటౌన్‌లో బయలుదేరుతుంది. తిరుపతి–కాకినాడ టౌన్ రైలు (07209) మే 12, 14, 19, 21, 26, 28, జూన్ 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది.
నర్సాపూర్–హైదరాబాద్ ప్రత్యేక రైలు (07258) మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో సాయంత్రం 6.00 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. హైదరాబాద్–విజయవాడ రైలు (07257) మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.20కు హైదరాబాద్‌లో బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాక పోకలు సాగిస్తాయని రాజశేఖర్ తెలిపారు.