17,18,19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు
విజయవాడ: రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి ఈ నెల 17, 18,19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ డివిజన్ రైల్వే ఇన్‌చార్జ్ పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్ తెలిపారు.
17వ తేదీ...
*రైలు నంబరు 02760 సికింద్రాబాద్-చెన్నై ప్రత్యేక రైలు ఈ నెల 17వ తేదీ రాత్రి 8.45కు సికింద్రాబాద్‌లో బయలదేరి అదే రోజు అర్ధరాత్రి 1.50కు విజయవాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 2.05కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.30కు చెన్నైకి వెళుతుంది.
* రైలు నంబరు 07076 కాకినాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు సాయంత్రం 4.45కు కాకినాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 10.10కి విజయవాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 10.30కు బయలదేరి మరుసటి రోజు ఉదయం 5.50 సికింద్రాబాద్ వెళుతుంది.
* రైలు నంబరు 00640 తాడేపల్లిగూడెం-సికింద్రాబాద్ సువిధ రైలు మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లిగూడెంలో బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3.10కు విజయవాడ చేరుకొని రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ వెళుతుంది.
* రైలు నంబరు 07049 మచిలీపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు మచిలీపట్నంలో రాత్రి 10.05కు మచిలీపట్నంలో బయలుదేరి 11.50కు విజయవాడకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 12.10కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45కు సికింద్రాబాద్ వెళుతుంది.
*రైలు నంబరు 07155 మచిలీపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు రాత్రి 9.25కు మచిలీపట్నంలో బయలుదేరి రాత్రి 1.30కు విజయవాడ చేరుకుంటుంది. 1.45కు ఇక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.15కు సికింద్రాబాద్ వెళుతుంది.
* రైలు నంబరు 00849 షాలిమార్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 12.10కు షాలిమార్‌లో బయలుదేరి రెండో రోజు ఉదయం 8.30కు విజయవాడ చేరుకుంటుంది. 8.50కు ఇక్కడి నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ వెళుతుంది.
* రైలు నంబరు 07011 సికింద్రాబాద్-కాకినాడ ప్రత్యేక రైలు రాత్రి 7.15కు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు అర్ధరాత్రి 1.30కు విజయవాడ చేరుకుంటుంది. 1.45కు ఇక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15కు కాకినాడ వెళుతుంది.
* రైలు నంబరు 02722 గుంటూరు-కాచిగూడ ప్రత్యేక రైలు రాత్రి 11 గంటలకు గుంటూరులో బయలదేరి 11.55కు విజయవాడ చేరుకుంటుంది. 12 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.25కు కాచిగూడ వెళుతుంది.
* రైలు నంబరు 07156 సికింద్రాబాద్-మచిలీపట్నం ప్రత్యేక రైలు రాత్రి 7.15కు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు అర్ధరాత్రి1.50కు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి రెండు గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.25 మచిలీపట్నం వెళుతుంది.
18వ తేదీ...
* రైలు నంబరు 07012 కాకినాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 9.50కు విజయవాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 10.05కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ వెళుతుంది.
*రైలు నంబరు 07050 సికింద్రాబాద్-మచిలీపట్నం ప్రత్యేక రైలు ఈ నెల18వ తేదీ రాత్రి 11.35కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.05 కు విజయవాడకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 7.20కు బయలుదేరి 9.30కు మచిలీపట్నం వెళుతుంది.
* రైలు నంబరు 00641 సికింద్రాబాద్-తాడేపల్లిగూడెం ప్రత్యేకై రెలు సాయంత్రం 4.25కు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 9.50కు విజయవాడకు చేరుకొని రాత్రి 11.30 కు తాడేపల్లిగూడెం వెళుతుంది.
* రైలు నంబరు 00850 సికింద్రాబాద్-షాలిమార్ ప్రత్యేక రైలు రాత్రి 9.40కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.55కు విజయవాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 4.15కు బయలుదేరి తరువాత రోజు తెల్లవారుజామున 3 గంటలకు షాలిమార్ వెళుతుంది.
*రైలు నంబరు 07941 కాకినాడ-తిరుపతి ప్రత్యేక రైలు కాకినాడలో ఉదయం ఏడు గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10కు విజయవాడ చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 7.30 గంటలకు తిరుపతి వెళుతుంది.
*రైలు నంబరు 02764 సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10కు విజయవాడ చేరుకుంటుంది. 5.25కు ఇక్కడి నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 12.05కు తిరుపతి వెళుతుంది.
* రైలు నంబరు 02121 గుంటూరు-కాచిగూడ ప్రత్యేక రైలు రాత్రి 11 గంటలకు గుంటూరు చేరుకొని 11.50కు విజయవాడకు వస్తుంది. 11.55కు ఇక్కడి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.25కు కాచిగూడ వెళుతుంది.
19వ తేదీ..
*రైలు నంబరు 07011 సికింద్రాబాద్-కాకినాడ ప్రత్యేక రైలు రాత్రి 7.15 కు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు అర్ధరాత్రి 1.30కు విజయవాడ చేరుకుంటుంది. 1.45కు ఇక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు 5.15కు కాకినాడ వెళుతుంది.