
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వరుస పండుగల నేపథ్యంలో పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్‌చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సిల్‌చార్–బెంగళూరు కాన్ట్ ప్రత్యేక రైలు (02552) డిసెంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సిల్‌చార్‌లో బయలుదేరి రెండో రోజు ఉదయం 10.00కి బెంగళూరు కాన్ట్ చేరుకుంటుంది.
కాగా, హైదరాబాద్–తిరుపతి రైలు (07441) 27న సాయంత్రం 6.00కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.00కు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి–హైదరాబాద్ రైలు (07442) 28న మధ్యాహ్నం 2.15కు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30కు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–కాకినాడ పోర్ట్ రైలు (07447) 29న సాయంత్రం 6.50కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment