![festival season: vijayawada- secbad special train](/styles/webp/s3/article_images/2017/09/29/train.jpg.webp?itok=NQUpDD6S)
సాక్షి, విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ–సికింద్రాబాద్–విజయవాడ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్ ఇన్‌చార్జ్ పీఆర్వో జె.వి.ఆర్కే రాజశేఖర్ తెలిపారు. విజయవాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (నెంబరు 07207) అక్టోబర్ 1 తేదీ రాత్రి 10 గంటలకు విజయవాడలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
రైలు నెంబరు 07208 సికింద్రాబాద్–విజయవాడ ప్రత్యేక రైలు అక్టోబర్ 2వ తేదీ సికింద్రాబాద్‌లో రాత్రి 11.55కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడ చేరుతుందని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పీఆర్వో కోరారు.