
విజయవాడ శాటిలైట్ స్టేషన్ రాయనపాడు మీదుగా సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ శాటిలైట్ స్టేషన్ రాయనపాడు మీదుగా సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07193) 23వ తేదీ (నేడు) రాత్రి 11.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, రేపు ఉదయం 10.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌లలో ఆగుతుంది.
కాకినాడ టౌన్–సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07194) 24వ తేదీ (రేపు) రాత్రి 8.45 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట, మౌలాలీ స్టేషన్‌లలో ఆగుతుంది.