రేపు కాకినాడ టౌన్‌కు ప్రత్యేక రైలు | Special train to Kakinada town tomorrow | Sakshi
Sakshi News home page

రేపు కాకినాడ టౌన్‌కు ప్రత్యేక రైలు

Published Fri, Sep 1 2023 4:39 AM | Last Updated on Fri, Sep 1 2023 4:39 AM

Special train to Kakinada town tomorrow - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సెప్టెంబర్‌ రెండో తేదీన సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైలు (07071) నడ­పనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు రెండో తేదీ రాత్రి 8.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. కాజీపేట, వరంగల్, మహ­బూబాబాద్, ఖమ్మం, రాయన­పాడు, గుడివాడ, కైకలూరు, ఆకి­వీడు, భీమ­వరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్ల­కోట స్టేషన్ల­లో ఆగుతుంది.

తిరుగు ప్రయా­ణంలో ఈ రైలు (07072) మూడో తేదీ రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రో­జు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. సా­మ­ర్లకోట, రాజమండ్రి, నిడదవో­లు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, ఖాజీ­పేట, మౌలాలీ స్టేషన్లలో ఆగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement