kakinada town
-
రేపు కాకినాడ టౌన్‌కు ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సెప్టెంబర్ రెండో తేదీన సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైలు (07071) నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు రెండో తేదీ రాత్రి 8.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07072) మూడో తేదీ రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, ఖాజీపేట, మౌలాలీ స్టేషన్లలో ఆగుతుంది. -
Summer Special Trains: హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చేవారికి అలర్ట్..
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/విజయనగరం టౌన్: వేసవి సెలవుల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–తిరుపతి–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 07433 నంబర్ హైదరాబాద్–తిరుపతి ప్రత్యేక రైలు ఈ నెల 17న సాయంత్రం 6.40 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07434 నంబర్‌తో ఈ నెల 19న రాత్రి 8.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. చదవండి: నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం రెండు మార్గాలలో ఈ రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. 07435 నంబర్ తిరుపతి – కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు ఈ నెల 18న సాయంత్రం 4.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07436 నంబర్‌తో ఈ నెల 19న ఉదయం 7.30 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 6.40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో ట్రాఫిక్ పవర్ బ్లాక్‌తో పాటు ఖరగ్‌పూర్–హిజ్లీ స్టేషన్ల మధ్య ఇంటర్‌లాకింగ్ పనులు, థర్డ్ లైన్ పనులు ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను ఆయా తేదీల్లో రద్దు చేశామని, మరికొన్నింటిని మిడ్నాపూర్ మీదుగా దారిమళ్లించినట్టు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్ 12703 హౌరా–సికింద్రాబాద్ 22న రద్దు చేశారు. 12704 సికింద్రాబాద్–ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 21న, 12864 యశ్వంత్‌పూర్–హౌరా 21న, 12863 హౌరా–యశ్వంత్‌పూర్ 22న రద్దు చేశారు. వీటితో పాటు 12245 హౌరా–యశ్వంత్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్ 22న, 12246 యశ్వంత్‌పూర్–హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ 24న రద్దు చేశారు. 18045 షాలీమార్–హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 22న, 18046 హైదరాబాద్–షాలీమార్ 21న, 22855 సంత్రగచ్చి–తిరుపతి 22న, 22856 తిరుపతి–సత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్ 23న రద్దు చేశారు. 12841 షాలీమార్–చెన్నై 22న, 12842 చెన్నై–షాలీమార్ ఎక్స్‌ప్రెస్ 21న రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
పార్టీలకే పట్టం.. స్థానికులంటే ఇష్టం
సాక్షి, కాకినాడ: నగరంలో మొత్తం 50 డివిజన్లు ఉండగా అప్పటిలో కాకినాడ సిటీ మొత్తం ఒకే నియోజకవర్గంగా ఉండేది. 2009 పునర్విభజనలో భాగంగా కాకినాడ సిటీలోని 7 డివిజన్లు కాకినాడ రూరల్ నియోజక వర్గంలో కలిపారు. ప్రస్తుతం 43 డివిజన్లు కాకినాడ సిటీ నియోజక వర్గంలో ఉన్నాయి. కాకినాడ నియోజకవర్గానికి సమీపంలో కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, రామచంద్రపురం నియోజకవర్గాలు నాలుగు వైపులా ఉన్నాయి. ఇక్కడి ఓటర్లు ఎక్కువగా పార్టీ అభ్యర్థులకే పట్టం గడతారు. అది కూడా స్థానికులకే ప్రాధాన్యం ఇస్తారు. బోట్‌క్లబ్: కాకినాడ నగరం తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణం. జిల్లా ప్రధాన పట్టణమే కాక భారతదేశ తూర్పు తీర ప్రాంతాల్లో ముఖ్యమైన రేవు పట్టణం. న్యూయార్క్ నగరం మాదిరిగా వీధులు రూళ్ల కర్రతో గీసినట్టుగా ఉండి, కూడళ్లు ఒక దానికొకటి సమానంగా ఉండడం నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో– కెనడాగా పిలిచేవారు. ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణంగా రెండవ మద్రాసుగాను, చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉండడంతో మినీ ముంబయిగా పిలుస్తుంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పేరడైజ్‌గా పేరొందింది. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రసాయనాల పెట్టుబడి ప్రాంతం కాకినాడను ఆనుకొని మొదలవుతుంది. హోప్ ఐలాండ్ కాకినాడ తీర ప్రాంతం హోప్ఐలాండ్ ద్వారా రక్షణ పొందుతోంది. సముద్రపు ఆటుపోట్ల నుంచి తీరం కోతకు గురికాకుండా ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడింది. ఈ హోప్ ఐలాండ్ 23 కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగర్ వేసినప్పుడు స్థిరంగా ఉంటున్నాయి. ఆధ్యాత్మిక నగరం కాకినాడ ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతోంది. కాకినాడలో దేవాలయంవీధిలోని అతిపురాతన శివాలయం, బాలాత్రిపుర సుందరి ఆలయం ఉంది. ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు, గరికిపాటి నరసింహారావు , సినీనటులు సూర్యకాంతం, రావుగోపాలరావుతోపాటు, ఎస్వీ రంగారావు, కవులు అద్దేపల్లి రామ్మోహనరావు, పుప్పాల సూర్యకుమారి, మాకినీడి సూర్యభాస్కర్ నగరానికి చెందినవారే. నియోజకవర్గం: కాకినాడ సిటీ ఏర్పడిన సంవత్సరం: 1952 నియోజకవర్గంలో డివిజన్లు: 43 పోలింగ్ స్టేషన్లు: 217 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 112 విస్తీర్ణం: 31.39 చదరపు కిలోమీటర్లు భౌగోళిక స్వరూపం (రెవెన్యూ డివిజన్ హద్దులు): నియోజకవర్గం చుట్టూ కాకినాడ రెవెన్యూ డివిజన్ హోదా: నగరపాలక సంస్థ మున్సిపల్ స్కూల్స్: 66 ప్రైవేట్ స్కూల్స్: 200 ప్రభుత్వ కళాశాలలు: 7 ప్రైవేట్ కళాశాలలు: 26 మొత్తం జనాభా: 3,11,103 స్త్రీలు: 1,62,083 పురుషులు: 1,48,890 మొత్తం ఓటర్లు: 2,30,165 స్త్రీలు: 1,18,468 పురుషులు: 1,11,559 ఇతరులు: 138 -
దసరా రద్దీ.. ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్–కాకినాడ మధ్య 4 సువిధ ప్రత్యేక రైళ్లు నడుపనుంది. హైదరాబాద్–కాకినాడ టౌన్ సువిధ స్పెషల్ (82709) అక్టోబర్ 18, 20 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 7.20కు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. కాకినాడ టౌన్–హైదరాబాద్ సువిధ స్పెషల్ (82710) అక్టోబర్ 19, 21 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 8.50కు హైదరాబాద్‌కు చేరుతుంది. సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట ప్రాంతాల్లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. ఏసీ టూ టైర్, త్రీ టైర్ సదుపాయాలున్నాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. యశ్వంత్‌పూర్–విశాఖ ప్రత్యేక రైళ్లు యశ్వంత్‌పూర్– విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. యశ్వంత్‌పూర్–విశాఖపట్నం ప్రత్యేక రైలు (06579) అక్టోబర్ 12, 19, 26, నవంబర్ 2, 9వ తేదీల్లో సాయంత్రం 6.35 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. విశాఖ–యశ్వంత్‌పూర్ రైలు (06580) అక్టోబర్ 14, 21, 28, నవంబర్ 4, 11 తేదీల్లో మధ్యాహ్నాం 1.45కి విశాఖలో బయలు దేరుతుంది. -
సికింద్రాబాద్, కాకినాడల మధ్య వారాంతపు రైలు
సంగడిగుంట(గుంటూరు), న్యూస్‌లైన్: గుంటూరు మీదుగా శుక్ర, శని, అది, సోమ వారాల్లో సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య జన్ సదరన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నారు. నంబరు 07101 సికింద్రాబాద్‌లో శుక్రవారం రాత్రి 22.40 గంటలకు బయలుదేరి శనివారం తెల్లవారుజాము 04.40 గుంటూరుకు వచ్చి 11.00 గంటలకు కాకినాడు టౌన్ స్టేషన్‌కు చేరుతుంది. అదే రైలు ఆదివారం సాయంత్రం 19.15 గంటలకు కాకినాడ టౌన్ స్టేషన్ నుంచి బయలు దేరి మరుసటిరోజు అర్ధరాత్రి 02.00 గంటలకు గుంటూరు వచ్చి అదేరోజు ఉదయం 09.45 గంటలకు సికింద్రాబాద్ చేరనుంది. ఈ రైల్లో 14 సాధారణ, రెండు స్లీపర్ క్లాస్ బోగీలుంటాయి. ఈ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సి.రామకృష్ణ తెలిపారు. రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ గుంటూరు - తెనాలి రైల్వేస్టేషన్ల మధ్య రైలు మార్గాన్ని పటిష్టపరిచే పనులను వాయిదా వేస్తున్నట్లు రామకృష్ణ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో గుంటూరు - తెనాలి రైలు స్టేషన్ల మధ్య మూడు నెలలపాటు రద్దు చేసిన నంబరు 77282 తెనాలి-గుంటూరు, నంబరు 67255 గుంటూరు-తెనాలి ప్యాసెంజరు రైళ్లను యధావిధిగా నడపనున్నట్లు పేర్కొన్నారు. నంబరు 77223 రేపల్లె-గుంటూరు, నంబరు 77224 గుంటూరు - రేపల్లె రైళ్లను గుంటూరు - రేపల్లెల మధ్య యధావిధిగా నడపనున్నట్లు తెలిపారు. జూన్ 15వరకూ కొనసాగనున్న అదనపు ఏసీ బోగీలు ప్రయాణికుల రద్దీ కారణంగా గుంటూరు - వికారాబాద్ - గుంటూరు నం : 12747/12748 పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో మే నెలాఖరు వరకూ ఏర్పాటు చేసిన రెండు ఏసీ అదనపు బోగీలను జూన్ 15 వరకూ కొనసాగిస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సి.రామకృష్ణ తెలిపారు.